స్వగతం....నేను జీవితంలో చాలా మందిని కలిశాను,కొంత మంది పేర్లు నాకు తెలుసు, కొంత మందివి తెలియవు, కొన్ని మర్చిపోయానుకొన్ని పరిచయాలు నాకు చేదు అనుభవాల్ని మిగిలిస్తే, మరి కొన్ని ఒక తీపి జ్ఞాపకల్ని వదిలేసి వెళ్లాయి, మరికొన్ని మాత్రం నాలో కలిసిపోయి నా జీవితంలో భాగం అయిపోయాయి. అందుకేనేమో అంతమంది నా చుట్టూవున్నా నాకు కావాల్సిన ఆ కొంత మంది కోసం మనసు ఎప్పుడూ ఆరాటపడుతూ ఉంటుంది. అందుకేనేమో నేను ఈ మధ్య మాటలు తగ్గించేసా, నవ్వు తగ్గించేసా అలానే బాధని కూడా తగ్గించేస. అలా అని నా మనసు మొద్దుబారిపోలేదు, అది క్రమంగా తెలుసుకుంటోంది ఏమని అంటే మనవి అన్నవి కొన్నే ఉంటాయి అని. ఏదొక రోజు ఆ కొన్ని కూడా లేవు ఉన్నది నేనే అన్నది అర్థం అవుతుంది. అందుకేనెమో ఒక కవి అన్నాడు జగమంత కుటుంబం నాది, ఏకాకి జీవితం నాది అని.కానీ నేను చేసిన ఒక మంచి
స్వగతం - 1
స్వగతం....నేను జీవితంలో చాలా మందిని కలిశాను,కొంత మంది పేర్లు నాకు తెలుసు, కొంత మందివి తెలియవు, కొన్ని మర్చిపోయానుకొన్ని పరిచయాలు నాకు చేదు అనుభవాల్ని మిగిలిస్తే, కొన్ని ఒక తీపి జ్ఞాపకల్ని వదిలేసి వెళ్లాయి, మరికొన్ని మాత్రం నాలో కలిసిపోయి నా జీవితంలో భాగం అయిపోయాయి. అందుకేనేమో అంతమంది నా చుట్టూవున్నా నాకు కావాల్సిన ఆ కొంత మంది కోసం మనసు ఎప్పుడూ ఆరాటపడుతూ ఉంటుంది.అందుకేనేమో నేను ఈ మధ్య మాటలు తగ్గించేసా, నవ్వు తగ్గించేసా అలానే బాధని కూడా తగ్గించేస. అలా అని నా మనసు మొద్దుబారిపోలేదు, అది క్రమంగా తెలుసుకుంటోంది ఏమని అంటే మనవి అన్నవి కొన్నే ఉంటాయి అని. ఏదొక రోజు ఆ కొన్ని కూడా లేవు ఉన్నది నేనే అన్నది అర్థం అవుతుంది. అందుకేనెమో ఒక కవి అన్నాడు జగమంత కుటుంబం నాది, ఏకాకి జీవితం నాది అని.కానీ నేను చేసిన ఒక మంచి ...Read More
స్వగతం - 2
ఎదుగుతున్న ప్రతీ మనిషికి తపన పడేది గుర్తింపు కోసం. అది చాలా మంది చాలా రకాలుగా పొందాలని ఆశపడతారు. అలా ఆశపడిన వాళ్లలో నేనూ ఒకడిని. కోసం , మెప్పు కోసం ఎప్పుడూ పరితపించేవాడ్ని. దానికోసం అవతలి వాళ్లకి నచ్చినట్టు మసలుకోవటం ఒక అవసరంగా మారిపోయింది. దానికి తగట్టు జీవన శైలిలో ఎన్నో మార్పులు తెచ్చుకున్నా. నా తెలివితో, పనితో, చదువుతో, వాక్పటిమతో అవతల వాళ్ళతో అద్భుతం అనిపించుకున్న సన్నివేశాలు ఎన్నో చూశా. కానీ ఒకసారి అవతల వాళ్ళ చెప్పట్లు చూసిన కళ్ళు, అవతల వాళ్ల మెప్పు విన్న చెవులు, ఆ ప్రశంసలు ఆగిపోతే తట్టుకోలేవు. అలా అని మనల్ని మెచ్చే జనాలు కదా మనం ఏం చేసినా నడుస్తుందిలే అనుకుంటే, అది తప్పు. జనాలకి మన మీద ఆ ఆశ ఎప్పటికీ ఉంటుంది. అదే ఒక రోజు నాకు తట్టింది. ఆ ఆలోచన నా జీవితంలో ఎంతో మార్పు ...Read More