తెల్లవారుజామున నాలుగు గంటలు. బయట ప్రపంచం ఇంకా నిద్రలోనే ఉందేమో కానీ, ఈ నగరానికి మాత్రం నిద్ర లేదు. అద్వైత్ గదిలో చిమ్మచీకటిగా ఉంది. ఆ చీకటిని చీలుస్తూ అతని ఎడమ మణికట్టు లోపల అమర్చిన సెమీకండక్టర్ చిప్ నుండి ఒక నీలిరంగు హోలోగ్రామ్ వెలుగు విరజిమ్మింది. ఆ వెలుగు నేరుగా అతని కళ్లలోకి ప్రసరించింది. "శుభోదయం అద్వైత్. నీ ప్రస్తుత కర్మ స్కోర్: 45%. హెచ్చరిక: నిన్న రాత్రి నిద్రలో నీ మెదడులో కలిగిన అనవసర ఆలోచనల వల్ల 0.01% డేటా నష్టం వాటిల్లే అవకాశం ఉంది. మళ్ళీ ఇలా జరిగితే నీ సోషల్ యాక్సెస్ పరిమితం చేయబడుతుంది." అలా ఆ యాంత్రిక స్వరం వినిపించగానే అద్వైత్ కళ్లు తెరిచాడు. అతని ముఖంలో లేవగానే వచ్చే ఉత్సాహం స్థానంలో, కేవలం ఒక అలవాటైన విసుగు మాత్రమే ఉంది. ఆ స్వరం ధర్మ-X AI అల్గారిథమ్‌ది. ప్రస్తుత ప్రపంచంలో దేవుడూ లేడు.. దెయ్యమూ లేదు..

1

ధర్మ-X - 1

తెల్లవారుజామున నాలుగు గంటలు. బయట ప్రపంచం ఇంకా నిద్రలోనే ఉందేమో కానీ, ఈ నగరానికి మాత్రం నిద్ర లేదు.అద్వైత్ గదిలో చిమ్మచీకటిగా ఉంది. ఆ చీకటిని అతని ఎడమ మణికట్టు లోపల అమర్చిన సెమీకండక్టర్ చిప్ నుండి ఒక నీలిరంగు హోలోగ్రామ్ వెలుగు విరజిమ్మింది. ఆ వెలుగు నేరుగా అతని కళ్లలోకి ప్రసరించింది. శుభోదయం అద్వైత్. నీ ప్రస్తుత కర్మ స్కోర్: 45 . హెచ్చరిక: నిన్న రాత్రి నిద్రలో నీ మెదడులో కలిగిన అనవసర ఆలోచనల వల్ల 0.01 డేటా నష్టం వాటిల్లే అవకాశం ఉంది. మళ్ళీ ఇలా జరిగితే నీ సోషల్ యాక్సెస్ పరిమితం చేయబడుతు ...Read More

2

ధర్మ-X - 2

ఆఫీసులోని ఆ నిశ్శబ్దాన్ని చీలుస్తూ మోగుతున్న సైరన్ శబ్దం అద్వైత్ చెవుల్లో సీసం పోసినట్లుంది. గాలిలో గస్తీ తిరుగుతున్న రెండు సెక్యూరిటీ డ్రోన్లు అతని ముఖానికి దూరంలో ఆగి, తమ ఎర్రటి లేజర్ కళ్ళతో అతని కనుపాపలను స్కాన్ చేస్తున్నాయి. ఆ ఎర్రటి కాంతి అద్వైత్ ముఖంపై పడినపుడు, అతను ఏదో ఒక భయంకరమైన నేరం చేసిన వాడిలా కనిపిస్తున్నాడు.అది చూడగానే చుట్టూ ఉన్న సహోద్యోగులు తమ తమ సీట్ల నుండి లేచి, ఏదో అంటువ్యాధి సోకిన వాడిని చూసినట్లు అద్వైత్ వైపు భయంగా చూస్తున్నారు. సరిగ్గా అదే సమయంలో ఆఫీస్ హెడ్ రాఘవ అడుగుల శబ్దం వినిపించడంతో, అతని షూస్ ఆ గాజు నేలపై చేస్తున్న శబ్దం ఒక మృత్యుఘంటలా మారుమోగుతోంది. రాఘవ తన మణికట్టుపై ఉన్న ప్రీమియం హోలోగ్రాఫిక్ ప్యానెల్‌ను గాలిలో ట్యాప్ చేయగా, అద్వైత్ ప్రొఫైల్ అందరికీ కనిపించేలా పెద్దగా ప్రత్యక్షమైంది. 45 ... కేవలం నలభై ఐదు ...Read More