గాంధీ
పోరు బందరున జనియించి సత్యమే సైన్యముగా
అహింసా మార్గమున స్వాతంత్రపు పోరు సల్పి
కొల్లాయి గట్టి చేత కర్రను బట్టి దండి మార్చ్ నడిపి
ఎర్రకోట పై త్రివర్ణ పతాకము రెపరెపలాడించి
భరతజాతికి పితగా వెలుగొంది అమరుడయ్యాడు మన గాంధీ.
ఇనుముడించినది భారతజాతిఖ్యాతి గాంధీ పుట్టిన దేశముగా
విశ్వమునకు ఆదర్శమయినది గాంధీ సత్యాగ్రహపు బాట
వీధులన్నీ ఊడ్చి స్వచ్ఛభారతకు నాoది పలికిన బాపూ
మాకు మహాత్ముడైనావు ఎటుల తీర్చుకొoదము నీ ఋుణము.
ఊరిలో మూల నున్న జనులను హరి జనులని కీర్తించి
అంటరాని తనమును తరిమి కొట్టి అజ్ఞానమును తొలగించి
భరతజాతి కీర్తి పతాకస్థాయిని పెంచి పడరాని పాట్లు పడి
భరతజాతి దాస్య విముక్తిని కలిగించిన బాపూ మరల జన్మించు.
అంటరానితనము మాటే మరిచితిమి
మద్యపానమును మరువలేకుంటమి
విశాల భారతావనిని స్వచ్ఛభారత్ గా చేసుకొంటిమి
గాంధీ మరల పుట్టి నువ్వు ప్రజల మత్తును పారద్రోలూ
అల్లరి చేసేటి బిడ్డను అమ్మ మరిపించినట్లు
మత్తులో మునుగుతున్న బాబులను మంచి త్రోవలో నడిపించు
రథసారధివై మత్తు పై రణభేరి మోగించు.
బాపూ మరల పుట్టి మా ప్రజలను రక్షించు.
రచన మధునాపంతుల చిట్టి వెంకట సుబ్బారావు
కాకినాడ 9491792279