నీ ప్రేమలో ప్రపంచాన్ని మర్చిపోయేలా చేయగలిగావు అనుకుంటున్నావ్ కదా.. ప్రపంచం చాలా పెద్దది.. ఒక్కసారి నీకు దూరంగా వెళ్ళనివ్వు.. నువ్వు గుర్తులేనంతగా నిన్ను మర్చిపోయేలా చేస్తుంది...
************
అజయ్ ప్రేమిస్తుంది మిత్రాని.
రోజు చూస్తున్నాం కదా, ఆకాశం మన సొంతం అనుకుంటే ఎలా?
రోజు కనిపిస్తుంది కదా, చందమామ మనదే అనుకుంటే ఎలా?
అజయ్ ప్రేమ విషయం తెలిసాక... నేను ఎంత దూరం ఆలోచించానో అనిపించింది. పిచ్చి మనసు.. స్నేహానికి, ప్రేమకి వ్యత్యాసం తెలుసుకోలేకపోయింది.
అయిన అజయ్ నన్ను నిజంగా ప్రేమిస్తున్నాను అని చెప్తే .. నేను తిరిగి ప్రేమించే పరిస్థితి మా ఇంట్లో లేదు.. ఒక విధంగా ఇలా జరగడం కూడా నా మంచికే..
ఎప్పటిలానే కాలేజీకి వెళ్ళాను.
అందరూ ఫ్రెషర్స్ డే హడావిడిలో మునిగిపోయి ఉన్నారు. రేపే ఫ్రెషర్స్ డే.. అప్పుడే నేను కాలేజీ జాయిన్ అయ్యి 2 మంత్స్ ఐపోయాయి అంటే ఇంకా నమ్మకం కలగడం లేదు.
"ధీర, ఏం ఆలోచించావ్?" దివ్య అడిగింది.
"దేని గురించి దివ్య" ముందు వాళ్ళు ఎం మాట్లాడుకుంటున్నారో కూడా వినలేదు నేను.
"ఫ్రెషర్స్ డే కోసం"
"ఆలోచించడానికి ఏం వుంది. నాకు వేరే పని ఉంది. ముందే చెప్పగా"
"ఎప్పుడో ఒకసారి వస్తుంది ఇలాంటి ఈవెంట్స్. వాటికి రాకపోతే ఎలా. రావొచ్చు కదా . బ్రతిమిలాడలా ఇప్పుడే నిన్ను"
"అదేం లేదు"
"మేము అంతా శారీస్ కట్టుకుందాం అనుకుంటున్నాం. నువ్వు శారీలో వస్తె చూడాలని ఉంది."
"సరే ఆలోచిస్తాను"
ఎవరి కోసం రావాలి? ఎంత బాగా రెడీ అయినా చూసి పొగడడానికి ఎవరు లేరు కదా.
క్లాసెస్ అంతంత మాత్రంగానే అవుతున్నాయి. అందరూ ఫ్రెషర్స్ డే బిజీలోనే ఉంటున్నారు.
బ్రేక్ టైంలో అజయ్ చాలా ట్రై చేశాడు నాతో మాట్లాడడానికి. గానీ తన వైపు చూసే ధైర్యం కూడా మనసు చేయలేకపోయింది.
ఇంటికి వెళ్దాం అని పార్కింగ్ కి వచ్చాను. అజయ్, సిడ్ నా సైకిల్ దగ్గర నిలబడ్డారు.
వాళ్ళతో మాట్లాడేంత ఓపిక లేదు అనిపించింది.
"ధీర .. "
"ఏంటి సిడ్? ఏం సమస్య తీసుకొచావ్ ఈ సారి. పోన్లే కదా అని ఉరుకుంటుంటే నన్ను చేతగాని దానిలా ఉపయోగించుకోవాలని చూస్తారు ఎందుకు అందరు?" నా కళ్ళలో కోపంతో పాటూ కన్నీరు కలిసి వచ్చింది.
అజయ్క్ అర్ధం అయింది. నేను మాట్లాడింది తన గురించే అని. తను తల దించుకొని సిడ్ పక్కగా వెళ్ళాడు.
"ఎందుకు ధీర .. ఎప్పుడూ కోపంగానే ఉంటావ్?"
"నా ముఖమే ఇంత. ఐన ఎం కావాలి ఇప్పుడు? నాకు టైమ్ అవ్తుంది."
"రీతు.. ఇలా రా" సిడ్ కొంచెం దూరంగా ఉన్న అమ్మాయిని పిలిచాడు.
బలే అందంగా , నాజూకుగా , మోడర్న్గా ఉంది అమ్మాయి. ఎప్పుడు చూడలేదు తినని. కొత్త మొఖం. నవ్వుతూ మా వైపు వచ్చిందా. ఇప్పుడు ఏం పెంట పని చేశారో వెళ్ళు.
"ధీర. ఈ అమ్మాయి పేరు రీతిక. చాలా కష్టపడి కన్నిపెట్టం తినని"
"ఎందుకు కనిపెట్టడం. నాకు తిను ఎవరో కూడా తెలీదు. నేను తనకి తెలుసా?" ఆశ్చర్యంతో అడిగాను.
"హా హా.. కాదు ధీర.. నువ్వు ఒకదానివే పాపం కష్టపడి వెళ్తున్నావ్ అంట కదా నైట్ టైం ఇంటికి. మా ఇల్లు కూడా అటు వైపే .. నీకు తోడు కోసం చాలా ట్రై చేసి నన్ను కనిపెట్టారు. మా ఇల్లు కూడా మీ ఇంటి దగ్గరే. బై ద వే.. నేను బై.పి.సి. "
"హాయి రీతిక. వీళ్ళు ఎప్పుడూ ఏదో ఒక పిచ్చి పని చేస్తూనే ఉంటారు. అందుకే కొంచెం హర్ష్గా ఉంటాను వీళ్ళతో."
"కూల్ " బలే పోష్ గా అనింది.
"రేపు ఫ్రెషర్స్డేకి వస్తున్నావ్ కదా?" అజయ్ మాటలు ఎప్పటిలా ఆసక్తిగా లేవు. ఎవరో తెలియని వ్యక్తి అడుగుతున్నాడు అనిపించింది.
తల పైకి లేపి చూస్తే ఎక్కడ ఫీలింగ్స్ తనకి తెలిసిపోతాయో అనే భయం ఒక పక్క.....చూడకుండా ఉంటే మళ్ళీ ఎప్పుడు కనిపిస్తాడో అనే ఆలోచన ఇంకో పక్క... ఈ రెండుటి మధ్యలో పాపం సిడ్, తనతో నిజం చెప్పేస్తే బాగున్ను అనే ఫీలింగ్...
"మీ బ్యాచ్ అందరూ చీరలు కట్టుకుంటున్నారంట, మిత్ర చెప్పింది. నువ్వు వస్తె బాగుంటుంది కదా" అజయ్ నోట్లో మిత్ర పేరు చాలా సార్లు విన్నా ఈ సారి కొత్తగా అనిపించింది.
"ఏమో నాకు అవ్వదు అనుకుంటా" తల ఎత్తకుండానే చెప్పాను.
"ధీర, రావొచ్చు కదా... నా కోసం" సిడ్ మాటలకు తల పైకి ఎత్తి చూసాను. నన్ను ఎంత ఆశతో చూస్తున్నాడో... ఇదే ప్రేమా? నా కళ్ళలో అజయ్క్ ఇలానే కనిపిస్తూ ఉండేదా? ఐన నన్ను ప్రేమిస్తున్నోడిని కదా నేను ప్రేమించాలి... నేను ఎందుకు ఎవరినో ప్రేమిస్తున్న అబ్బాయి కోసం ఆరాటపడాలి.
"వస్తాను సిడ్. థాంక్స్ నా కోసం ఆలోచించి రీతూని పరిచయం చేసినందుకు" బ్లుష్ అవుతూ చెప్పాను.. లోపల జరుగుతున్న ఆలోచనలు బయటకి కనపడనివ్వకుండా.
"నువ్వు చీర కట్టుకోబోతున్నావా?" అజయ్ మళ్ళీ అటెన్షన్ గ్రబ్ చేయడానికి ట్రై చేశాడు.
"వెళ్దామా" రీతు వైపు చూస్తూ అన్నాను.
"ధీర, నువ్వు చీర కట్టుకోబోతున్నావా?" ఈ సారి సిడ్ అడిగాడు.
అజయ్ చూపు నా మీదే ఉంది, కొంచెం ఇబ్బందిగా అనిపిస్తుంది. ఈ చూపు చూసే కదా ప్రేమిస్తున్నాడు అని తప్పుగా అనుకున్నాను. నేను అంటే ఇష్టం లేకపోతే ఎందుకు అలా చూడడం. ఆ చూపు నా మనసుకి గుచ్చుకుంటుంది. నేను అంటే ఎందుకు ఇష్టం లేదు అని ప్రశ్నలతో నన్ను వేధిస్తుంది.
"లేట్ అవ్తుంది సిడ్... మెసేజ్ చేస్తా నైట్" వెళ్దాం పద రీతూ.
"మళ్ళీ కలుద్దాం ధీ....... ర" అజయ్ మాటలు గాల్లో వుండగానే సైకిల్ మీద ఎక్కేసాను..
***
రచయిత్రి మాట:
ఈ సారి చాలా పెద్ద చాప్టర్ రాయబోతున్న... నెస్ట్ చాప్టర్ లో ఫ్రెషర్స్ డే తో కలుద్దాం..