ఇంకా ఎంత దూరం ఉంది అడవి అని తనలో తాను మాట్లాడుకుంటే వేగంగా వెళ్తుంది అంజలి. అసలు ఎందుకు అని పాము న వెనకాల వస్తుంది? ఈరోజు నన్ను కాపాడానికి కూడా ఇక్కడ ఎవరు లేరు ఎం చేయాలి? అని ఆలోచిస్తూ వెళ్తూ ఉండగా సడన్ గా తను వెళ్తున్న దారిలో కొన్ని స్టెప్స్ కనిపిస్తాయి. ఆ స్టెప్స్ పైన ఎదో చిన్న గుడి ఉంది. గుడి చిన్నదే కానీ చుట్టూ చీకటి ఎదో పాతకాలం లో కట్టించిన గుడి లా ఉంది. ఫాస్ట్ గా నడుస్తూ ఆ స్టెప్స్ ఎక్కడానికి ప్రయతినిస్తుంది కానీ, ఆ లోపు కింద పడిపోతుంది. పాము తన దెగ్గరికి వస్తుంది. ఎం చేయాలో అర్థం అవ్వదు. చాల కాష్టం మీద లేచి స్టెప్స్ మొత్తం ఎక్కేస్తుంది. మళ్లీ అక్కడ కింద పడిపోతుంది. ఈసారి ఇంకా తనని ఎవరు కాపాడలేరు అని అర్థం అయిపోతుంది. ఎందుకు అంటే ఈసారి పాము తనకి చాల దెగ్గర లో ఉంది. ఆలా భయపడ్తూ ఉండగా అనుకోని విధంగా ఒక గద్ద వచ్చి ఆ పాము ని తీస్కొని వెళ్ళిపోతుంది. ఒక్కసారిగా తనకి ప్రాణం పోయినంత పని అయింది అని తలచుకుంటు ఇంటికి వెళ్ళిపోదాం అని అనుకుంటూ ఉండగా ఆ గుడి గురించి గుర్తు వస్తుంది. ఒకసారి చూద్దాం అని వెళ్తుంది. కానీ, పాతకాలం ది కాబట్టి పైగా పూజలు ఏమి లేకపోవడం వాళ్ల చాల రోజులు నుంచి ఆ గుడి మూసేసి ఉంది. వేసిన తాళం కూడా అంత బలం గా లేదు రాయి తీస్కొని ఆ తాళం పగలకొడుతుంది. డోర్స్ ఓపెన్ చేసిన వెంటనే తనకి ఆదిశేషుడి నీడ లో ఉన్న వెంకటేశ్వర స్వామి ని చూస్తుంది. అది చూసి ఆశ్చర్యపోతుంది. నేను ఎప్పుడు కూడా ఇటువంటి గుడి ని చూడడలేదు. స్వామి ఎప్పుడు కూడా ఆదిశేషుడి నీడలో నిలబడి ఉండడం అని అనుకొనే లోపే అక్కడ నుంచి ఒక వెలుగు వస్తుంది. ఆ కాంతి కి తన కళ్ళకి ఏమి కనిపించడం లేదు. ఆ కాంతి లో ఆదిశేషుడు కదులుతూ ఉన్నట్టు కనిపిస్తుంది.ఆ వెలుగు వాళ్ళ తాను అంతగా గమినించలేకపోయింది. ఆ దృశ్యం చూసి ఒక్కసారిగా బయపడి గట్టిగ అరుస్తుంది.
ఇంత లోపు వాళ్ళ అమ్మ వచ్చి ఎం అయింది నిద్ర లో ఆలా అరుస్తున్నావ్ అని మాట్లుడుతూ ఉండగా. అంజలి తన లో తాను, "ఏంటి ఇది అంత నా కళ ఆ? అని అనుకుంటుంది". వాళ్ళ అమ్మ పేరు సంధ్య.
అంజలి: ఏమి లేదు అమ్మ చిన్న కళ ఆంతే. ఇంకా ఏమి లేదు అందుకు ఏ భయపడి అరిచాను అంతే.
సంధ్య : పగలు అంత ఆ దెయ్యాల సినిమాలు ఇంకా మిస్టరీ థ్రిల్లెర్స్ అంటూ చూస్తావ్ రాత్రి అయితే భయపడ్తావ్. అంటూ అక్కడి నుండి వెళ్ళిపోతుంది.
ఇప్పుడు నా కళ గురించి అమ్మకి చెప్పాలా? వద్దా? నిజంగా ఎక్కడ అయినా స్వామి ఆలా ఆ రూపం లో ఆదిశేషుడు తో కలిసి దర్శనం ఇస్తారా? సరే, వెళ్లి నానమ్మ ని అడుగుదాం.
అంజలి: నానమ్మ నాకు ఒక చిన్న డౌట్. ఇప్పుడు ఆదిశేషుడి తో కలిసి వెంకటేశ్వర స్వామి ఎక్కడా అయినా ఉన్నారు. ఒక వేళా ఉంటే ఎక్కడ ఉన్నారు.
పొద్దునే నీకు ఇంత పెద్ద సందేహం వచ్చిందా? సరే చెప్తా విను. వేంకటేశ్వరుడు, విషుణువు యొక్క అవతారం కాదు. ఆయనే ఏ స్వయం గా భూమి పైకి వచ్చారు. వచ్చిన తర్వాత శ్రీనివాసుడి గా పద్మావతి ని పరిణయం ఆడి తిరుమల కొండ పైన నివాసము ఉంటున్నారు. విషుణువు వైకుంఠం లో ఆదిశేషువు పైన పావళిస్తుడు కదా. ఆ విషుణువు ఏ భూమి పైకి శ్రీనివాసుడు గా వచ్చి ఉన్నపుడు ఆదిశేషుడు కూడా వచ్చి అయన కి తోడు ఉంటాడు అది ఏ రూపం లో ఐన కావచ్చు. తిరుమల లో ఆదిశేషుడూ, శేషాద్రి కొండగా మారగా శ్రీనివాసుడు ఆ కొండ పైన ఆనందానిలయం లో వుంటారు ఎలాగా అయితే పాము తలా పైన నాగమణి ఉంటుందో ఆలా కొండా పైన స్వామి ఉన్నారు.
ఆ కథ విని అంజలి అంత ఓకే. కానీ, నిజంగా నాకు కలలో వచ్చి అటువంటి టెంపుల్ ఎక్కడ ఉంది? నేను చిన్నప్పటి నుంచి ఈ ఊరిలో నే ఉంటున్న ఒకసారి కూడా చూడలేదు. ఈ ఊరిలో ఉందా? లేకపోతే వేరే ఎక్కడ ఐన ఉందా? తన కప్బోర్డు సర్దు తు ఉంటే ఒక తాళం కింద పడుతుంది. ఈ తాళం ఎందుకుని నాకు తాతయ్య ఇచ్చాడు. ఏంటి? ఉపయోగం. నాకు 5 ఇయర్స్ ఉన్నప్పుడు ఇచ్చారు. ఏమి ఉపయోగం లేదు. కేవలం గుర్తు కోసం మాత్రం ఏ పెట్టుకున్న. నాకు ఇచ్చి లాస్ట్ థింగ్ ఇది.
ఉపోయోగమే లేదు అనుకున్న ఓక తాళం తన జీవితాన్ని మారుస్తే............
TO BE CONTINUED...........