He is alive... - 16 in Telugu Love Stories by vasireddy varna books and stories PDF | తనువున ప్రాణమై.... - 16

Featured Books
Categories
Share

తనువున ప్రాణమై.... - 16

ఆగమనం.....


ఏంటి, ఒక రౌండ్ కంప్లీట్ చేసి వస్తారా!! 
పెళ్లి అయ్యేవరకు ఇటు పక్కకి, ఎవరైనా వచ్చారో కాళ్లు విరిగిపోతాయి!! ఒక్క ఐస్ క్రీమ్ కూడా మీకు ఇవ్వను!! అని అందరిని బెదిరించేస్తూ... మొత్తాన్ని, హడావిడిగా లేపేస్తున్నాడు!!

తల్లి వెళ్దాం పదవే!! పెళ్లి అయ్యాక వచ్చి తీరిగ్గా తిందురు గాని!! పదండి, పదండి... అంటూ, అతని మేనత్త, కూడా సపోర్ట్ చేస్తుంది!!

మన హీరో గోల పడలేక, హీరో ఫ్రెండ్స్ తప్ప మిగిలిన మొత్తం... అక్కడ నుంచి బయలుదేరారు!!

హీరో ఇద్దరి ఫ్రెండ్స్... మన హీరో వైపు, బేలా ముఖం వేసుకొని చూస్తున్నారు.

మన హీరో వాళ్ళ ఎదురుగా నిలబడి, ఇద్దరినీ సీరియస్ గా చూస్తున్నాడు.

మామ ఎందుకురా, అలా చూస్తున్నావు? 
నీకు అసలు విషయం చెప్తాను విను! 
అప్పుడు, నువ్వు ఇలా కోపంగా ఉండవు.
అరేయ్, డిన్నర్ అయితే చివరి వరకు ఉంటుంది. 
స్టార్టర్స్, స్నాక్స్ అలా ఉండవు రా మామ!!
స్టార్టర్స్ అంటే స్టార్టింగ్ లోనే ఉంటాయి!!
స్నాక్స్ ని స్టార్టింగ్ లోనే తినేయాలి!!
అందుకనే ముందుగా వచ్చి స్టార్ట్ చేశాము!! 
ఇప్పుడు స్టార్టర్స్ పని అయిపోయింది కదా...
తర్వాత వచ్చి మళ్ళీ డిన్నర్ చేద్దాం!! 
దీనికే, ఎందుకు ఇంత కోపం నీకు?? 
ఏదో ప్రపంచంలోనే, మొట్టమొదటి సారిగా...
కొత్త విషయాన్ని, కనుక్కున్న గొప్పవాడిలాగా...
బక్కోడు, తిక్క తిక్కగా వాగుతున్నాడు.

రెండోవాడు ఇద్దరిని చాలా ఎక్సైట్మెంట్ తో, చూస్తున్నాడు! 
ఈ బక్కోడికి పొద్దున పడింది సరిపోలేదు.... 
వీడి నోటి దూలకి కచ్చితంగా, ఇంకో రౌండ్ పడితే గాని...
వీడు సెట్ అవ్వడు! అని లోపల ఇన్నర్ వేసుకుంటున్నాడు.

బక్కోడు వాగిన వాగుడికి, వాడిని ఉతకడానికి... మన హీరో ఒక్కో అడుగు ముందుకు వెళుతున్నాడు. బక్కోడు మాత్రం, ఒకటికి... రెండు అడుగుల చొప్పున వెనక్కి వెళ్తున్నాడు!

ఒరేయ్ బక్కోడా, పెళ్లి దగ్గర ఉండాల్సిన వాళ్ళు ఉండలేదేంటిరా... అని అడిగితే, స్టార్టర్స్ గురించి ఇంటర్నేషనల్ లెవెల్ లో స్పీచ్ ఇచ్చావు కదా!! నువ్వు మర్యాదగా నిలబడు లేదనుకో స్టార్టర్స్ గురించి నువ్వు ఇచ్చిన స్పీచ్ నిజం చేస్తూ... స్టాటర్స్ తోనే, చంపేస్తా!!

ఏంటి రా నీ రుబాబు!! నీకు స్పీచ్ నచ్చితే, 
ఇంకోసారి చెప్పమని అడుగు. 
అంతేగాని ఉండమని అడుగుతావేంటిరా... 
నాకు మాత్రమే మస్తు నాలెడ్జ్ ఉంది!! 
అందుకే స్పీచ్ ఇచ్చాను..!! 
ఇప్పుడు నీకు తెలిసింది కదా..?? 
ఇంక నేను పెళ్లికి వెళ్తాను..!! 
నువ్వు.....ఉండమంటే...ఉండాలా, ఏంటి?? 
అని ముక్క ముఖ్ఖిగా, మాట్లాడుతూ.... 
ముందుకు పరిగెత్తుతాడు.

బావ వదిలేయ్ రా వాడిని!! 
వాడి నాలెడ్జ్ మనకి తెలిసింది కదా!! 
వెళదాము రారా!! అంటూ.. రెండవవాడు, మన హీరోని 
ఆపేలోపే, మన హీరో బక్కోడి వెంట పడతాడు....

బక్కోడు, మన హీరోకి అందకూడదని, 
అటు ఇటు వంకరగ, పరిగేడుతున్నాడు... వాడ్ని పట్టుకోడానికి, మన హీరో కూడా వాడి వెనకాలే... 
అలాగే పరిగెడుతున్నాడు..!! వీళ్ళిద్దరిని, చూస్తూ నవ్వుకుంటూ రెండవవాడు నెమ్మదిగా వస్తున్నాడు.

బక్కోడికి అప్పటికే, రెండుసార్లు వీపు పగిలింది!! దొరకకుండా ఒకసారి, దొరికాక వదిలించుకొని... మరొకసారి, మన హీరో దగ్గర నుంచి.. వేడివేడి బొబ్బట్లు తీసుకుని, మళ్ళీ పరిగెడుతున్నాడు.

బక్కోడి, వెంటపడి పరిగెత్తుతున్న... 
మన హీరో, సడన్ గా ఆగిపోయాడు.

స్టాప్ వచ్చిందని డ్రైవర్ బ్రేక్ వేసినప్పుడు... 
ఆగిన సిటీ బస్సు, ఆగిన తర్వాత కూడా..... 
దగ్, దగ్, అంటూ.. షేక్ అవుతుంది, చూడండి... 
ఎక్సాట్ గా మన హీరో కూడా అలాగే... 
జర్క్ లు ఇస్తూ, ఆగాడు!!

మన హీరో ఆగిపోవడంతో, పరిగెడుతున్న వాడు.. "అందనని తెలిసి ఆగిపోయావురా" అని అరుస్తూ... వెనక్కి తిరిగి నవ్వుతున్నాడు! వెనక వస్తున్న వాడు, "సడన్గా బ్రేక్ వేశాడు ఏంటా?" అని అనుమానంగా చూస్తూ దగ్గరికి వస్తున్నాడు.

మన హీరో మాత్రం... అవునా, కాదా అనే సందేహంతో.. తను బ్రేక్ వేయడానికి కారణమైన... వైపుకి నెమ్మదిగా తలతిప్పి, చూస్తున్నాడు!

కలివిడి గందరగోళంలో కమనీయ రాగంలా 'అవును' అని అనిపించగానే... ఆశ్చర్యన్నంత కళ్ళల్లో నింపేసి, సంతోషము, కోపము, అసహనము, అనుమానము అన్నింటినీ కలగలిపిన కళ్ళతో... నడుము మీద ఒక చెయ్యి, తల మీద ఒక చెయ్యి వేసుకుని, సావధానంగా చూస్తున్నాడు.

ఏంటిరా? ఏమయింది? అంటూ... ఆశ్చర్యాన్ని నింపుకున్న స్నేహితుడు ముఖాన్ని చూస్తూ... పక్కకి వచ్చి చేరాడు!

ఒరే బావ అక్కడ... హెయిర్ మొత్తం వదిలేసి, నావి బ్లూ లెహంగా వేసుకుని, ఫ్రూట్ సలాడ్ తీసుకుంటున్న.... పొట్టి పాప నీకు కనిపిస్తుందా? లేక, నాకు మాత్రమే కనిపిస్తుందా? అని తన కళ్ళను నమ్మలేక, క్లారిటీ కోసం అడుగుతున్నాడు.

హా..!! కనిపిస్తుంది! పొట్టిగా ఉంది కానీ, కలర్ సూపర్ ఉంది రా! అయినా, పొట్టి పాప ఏంటిరా? ఎప్పుడూ లేనిది, కొత్తగా మాట్లాడుతున్నావు!!

ఒరేయ్ బావ వా కనిపించిందా అని అడిగాను.. కనిపించింది, అని మాత్రమే చెప్పు..!!
కలర్ గురించి, ఫిగర్ గురించి మాట్లాడావో, చంపుతా!!అయిన పొట్టి దాన్ని, పొట్టిది అనకుండా ఏమంటారు రా?

ఒరేయ్ ఒరేయ్ ఆగాగు... ఏమన్నావు??
కలర్ గురించి ఫిగర్ గురించి మాట్లాడానా..?? 
నీయబ్బ అరేయ్.. కోపంలో ఏం వాగుతున్నావ్ అర్థం అవుతుందా?? ఆ పొట్టి దాని కలర్ గురించి, ఫిగర్ గురించి నాకెందుకురా..?? నాకు ఎంచక్క, నా మరదలు ఉంటేనే!! నువ్వు అడిగావని చెప్పాను రా!!

ఒరేయ్ ఇంకొక్కసారి పొట్టిది, గిట్టిది అన్నావో, నా చేతిలో చచ్చేవే!!  దాన్ని అంటే, అది నేనే అనాలి!! 

అసలు తన మనసులో ఏముందో?? తనకే క్లారిటీ లేదు! ఫ్రెండ్ పొట్టి దాన్ని... పొట్టిది అనగానే, ఇంత ఎత్తు లెగుస్తున్నాడు!! మన హీరో..!!

బావ ఏంటి అన్నావు..?? నువ్వు మాత్రమే అనాలా!! అంటే, ఆ పిల్ల నీకు ముందే తెలుసా..??

అనుమానంగా... మన హీరోని, పొట్టి దాన్ని... మార్చి, మార్చి చూస్తూ.. క్లారిటీ కోసం, వెయిట్ చేస్తున్నాడు!!

వీళ్ళిద్దరి డిస్కషన్ ఇలా సాగుతుండగానే... బక్కోడు వెనక్కి వచ్చి వీళ్ళిద్దరితోపాటు, జాయిన్ అయ్యాడు!! అంతా వింటూనే... బక్కోడు, తన బ్రెయిన్ కి పని చెప్పాడు!!

మన హీరో ముఖంలో కనిపిస్తున్న... ఫ్రస్టేషన్, పొజిసివ్ నెస్, మాటల్లోని మీనింగ్ ని బట్టి, ఒక క్లారిటీ కి వచ్చేసాడు!!

ఒరే బావ మన మామని ముద్దు పెట్టుకున్న ఆ షాపింగ్ మాల్ పొట్టి పిల్ల... ఈ పొట్టిదేరా!! అందుకే మామకి నచ్చడం లేదు!! వాడి లవర్ ని పొట్టిది అని అంటే! వాడే కదరా అనుకోవాలి!! తన బ్రెయిన్ లో వచ్చిన క్లారిటీని, బయటకు కక్కేస్తాడు!!

వెంటనే... బక్కోడికి, మన హీరో దగ్గర నుంచి... నెత్తి మీద ఒక నిమ్మకాయ బహుమతిగా వచ్చింది!!

ఏంటి మామ నువ్వు..!! ఎప్పుడు నిజం చెప్పిన ఒప్పుకోకుండా కొడతావు!! నువ్వు చెప్పు..!! నేను చెప్పిన నిజం నిజం కాదని!! ఆ పొట్ట అమ్మాయి, నీ గర్ల్ ఫ్రెండ్ కాదని!! ఇచ్చిన నిమ్మకాయ సరిపోక, స్పీకర్ ఆన్ చేసిన సెల్ ఫోన్ లాగా వాగేస్తున్నాడు!!

ఒరేయ్ నువ్వు చెప్పిన దానికి కాదు, ఇంకోసారి దాన్ని పొట్టిది అన్నావో చచ్చేవే!! నీయబ్బ, వినబడలేదా... వాడికి చెప్పింది!! 

బావ అంటే బక్కోడి చెప్పింది నిజమెనా!? అంటే ఆ అమ్మాయి.... అంటూ, అనుమానంగా చూస్తున్నాడు.

ఒరేయ్ నీకు ఇంకా అర్థం కాలేదా!? నేను ఎప్పుడూ నిజమే చెబుతాను, వీడె, ఎప్పుడు ఒప్పుకోడు!! ఒప్పుకోవాల్సి వస్తుందని.. ఇలా కొట్టి, నా నోరు మూయిస్తున్నాడు!!
అంటూ, బక్కోడు ఉక్రోషంతో ఊగిపోతున్నాడు!!

అహే, ఆపు! నువ్వు నీ గోలా!! అని బక్కోడిని విసుక్కుంటూ... ఒరేయ్ బావ, నువ్వు చెప్పరా!! ఆ అమ్మాయి తనేనా?? అవునా? కాదా? మన బక్కోడు చెప్పింది నిజమేనా!!

అవును రా!! 
ఆ పొట్టిదే, ఈ పొట్టిది!!
పిచ్చ పొట్టిది!!
పిచ్చి పొట్టి వాగుడు కాయ!!
అది, దాని డబ్బా వాగుడు!!
అసలు, ఈ పొట్టిది ఇక్కడ ఏం చేస్తుంది??

అంటే పొట్టిది పెళ్లిలోకి వచ్చేసింది, అన్నమాట!! కానీ, ఎందుకు వచ్చింది?? ఏమో చూద్దాం..!!

@@@@@@@@@

తదుపరి భాగం... నీ కోసం, వెయిట్ చేస్తూ ఉంది.

నీ రేటింగ్, సమిక్ష, స్టిక్కర్ కోసం నేను వెయిట్ చేస్తున్నాను.
నేనే కదా అని ఇవ్వకుండా వదిలేయకు!
నీకు కూడా విలువ ఉంది ఇక్కడ!
నీవు కూడా నాకు, అమూల్యమే!
మళ్లీ కలుద్దాం.
థాంక్యూ.
వర్ణ.