He is alive... - 22 in Telugu Love Stories by vasireddy varna books and stories PDF | తనువున ప్రాణమై.... - 22

Featured Books
Categories
Share

తనువున ప్రాణమై.... - 22

ఆగమనం.....

పొట్టిది వెళ్ళిపోతున్న సిక్స్ ఫీట్ ని...
అక్కడే నిలబడి నవ్వుతూ చూస్తుంది.

అంతకుముందు తను మాట్లాడిన... 
నడి వయసు ఆవిడ దగ్గరికి వెళ్లి... 
కొన్ని నిమిషాలు ఆవిడతో, వాళ్ళ పాపతో గడిపి... 
అక్కడి నుంచి నేరుగా, కళ్యాణ మండపానికి వెళుతుంది!!

తన సిక్స్ ఫీట్ ని, అలాగే మిగతా ఇద్దరు ఫ్రెండ్స్ ని, వాళ్లతో పాటు మండపం మీద ఉన్న ప్రతి ఒక్కరిని జాగ్రత్తగా చూసుకుంటూ ఒక కార్నర్ లో సెటిల్ అవుతుంది.

పొట్టిది అలా కూర్చున్న రెండు నిమిషాలకే, 
జీలకర్ర బెల్లం పెట్టిస్తూ పురోహితుడు పురమాయించగా గట్టి మేళంతో మండపం అంతా ప్రతిధ్వనిస్తూంది.


మధ్యన ఉన్న అడ్డు తెర తొలగగా... 
పీటల మీద ఉన్న వధూవరులు...
తన మీద జీలకర్ర బెల్లంతో... 
తొంగి చూస్తున్న తెలియని తపనతో... 
ఇరువురి చూపులు కలిసినాయి!


వరుడు కనులు మైమరుపుతో, పెద్దవి కాగ!
వధువు కనులు చిలికిన సిగ్గుతో చిన్నవైనాయి!!
పెదవులలో చేరిన చిరునవ్వుతో ఇరువురి...
బుగ్గలలో, కెంపులు పూయ సాగాయి!!


చూస్తున్న అందరికన్నులలో...
సంతోషాలు విరియాసాగాయి!!
పసుపు చందన సుగందాలు...
రంగారించుకున్న, అక్షితలు!!
అందరి మనసులు మురిసిన వేళ...
ఆ భావోద్వేగాన్ని తమలో బంధించి!!
కోటి ఆశలతో కొంగుముడి వేసుకోబోతున్న...
ఆ కొత్త జంట తలల మీద దీవెనలుగా...
మారి కురియసాగాయి!!


ఒక్కొక్కరిగా, మరి కొంతమంది జంటలుగా... 
అందరూ వెళ్లి వధూవరుల మీద... 
అక్షింతలు వేసి వస్తున్నారు!!

మన పొట్టిది కూర్చున్న చోటు నుంచి లేగవకుండా... సైలెంట్ గా తన హాట్ సిక్స్ ఫీట్ ని... 
అండ్ ఫ్యామిలీని కల్లప్పగించి చూస్తుంది..!!

అందరి మోఖాలలో, సంతోషం!! 
ఒకరితో ఒకరు మాట్లాడుకుంటూ... 
స్టేజ్ మీదకు వచ్చిన వారిని మాట్లాడిస్తూ... 
మాటలతో సంతోషాన్ని పంచుతూ...
ఏ ఒక్కరు కూడా కాళీ లేకుండా... 
అందరూ బిజీ బిజీగా ఉన్నారు!!

ఒరే బావ ఆ అమ్మాయి వచ్చింది. 
ఎవరితో మాట్లాడకుండా, ఆ మూల కూర్చుంది!! 
అసలు ఎటు కదలడం లేదు!! 
వచ్చినట్టు మన మామ చూసాడా?? 
లేదంటే వెళ్లి చెబుదాం రా!!
నాకెందుకో కొంచెం టెన్షన్ గా ఉందిరా!!
అని, బక్కోడు పక్కోడిని తినేస్తున్నాడు.

వీళ్ళిద్దరూ మండపం స్టెప్స్ దగ్గర నిలబడి... 
అక్షింతలు వేయడానికి, పైకొచ్చే వాళ్ళని...
రిసీవ్ చేసుకుంటూ, ఒకరితో ఒకరు మన పొట్టి దాని గురించి, నెమ్మదిగా మాట్లాడుకుంటున్నారు!!


ఒరేయ్ ముందు ఈ పిసకడం ఆపు!! 
అంటూ, టెన్షన్ లో బక్కోడు పట్టి... 
పిసికేస్తున్న చేతిని వెనక్కి గుంజుకుంటాడు.

నీ చూపులు ఎంతసేపు నీ సీతాకోకచిలుకల... 
మీద ఉంటాయి! మిగతాది నీకు కనబడదు!! 
వాడు, తను రాగానే చూశాడు!! 
ఓవర్ యాక్షన్ ఆపి, మూసుకొని నిలబడు!!



ఒరేయ్ బావా ఆ అమ్మాయి ఎటు చూస్తుందిరా?? 
ఆ అమ్మాయికి మైండ్ అంతా బానే ఉందిగా?? 
కచ్చితంగా పెళ్లి మాత్రం చూడట్లేదు రా!! 
ఇంకా, ఏదో..... చూస్తుంది!! అని, సాగదీస్తూ... 
మళ్లీ పక్కోడిని, కెలుకుతున్నాడు.


మన పొట్టిది తన సిక్స్ ఫీట్... 
ఎటు వెళితే అటు దాని చూపులు తిప్పేస్తూ... 
పిచ్చిపిచ్చిగా తన సిక్స్ వీటికి సైట్ కొట్టుకుంటుంది.


అందుకే బక్కోడికి పొట్టి దాని చూపులు చూసి... 
డౌట్ వచ్చింది. బక్కోడు మధ్యలో పడిపోయి... 
పొట్టి దాని గురించి, పూర్తిగా తెలుసుకోలేకపోయాడు!! కానీ, తెలుసుకుంటే నేరుగా మెంటల్ హాస్పిటల్ కి పోయేవాడేమో. అందుకే వాడికి క్లారిటీ లేక, 
కన్ఫ్యూషన్ తో డౌట్స్ వస్తున్నాయి.


రెండవవాడు మన పొట్టి దాన్ని, 
ఒకసారి గమనించి కోపంగా.... 
బక్కోడిని భుజం మీద గుద్దుతాడు!!

నువ్వు నీ సీతాకోకచిలుకలని చూస్తున్నట్టే!? 
తను కూడా తనకు కావలసిన 
వాడిని చూసుకుంటుంది!! 
ఈ ఎగస్ట్రాలే ఆపమన్న!!


నువ్వు మరీ రా బావ!!
నాకు పెళ్లి తో పాటు మిగతావి కూడా!!
తను వచ్చింది పెళ్లికి కదరా?? 
అదేమీ, పట్టించుకోకుండా... 
వాడిని మాత్రమే చూస్తుంది ఏంటిరా??
బక్కోడు మన పొట్టి దాని మైండ్ సెట్ ని...
అర్థం చేసుకోలేక తెగ వాపోతున్నాడు!!

పోనీ ఒక పని చేయ్యరా!! 
నువ్వు వెళ్లి తనకి చెప్పు!! 
నన్ను ఇక్కడ తినడం మానేసి... 
అక్కడికి వెళ్లి చెప్పు, పెళ్లి మాత్రమే చూడమని!! 
పోరా పో!!


ఏంటి నేనా?? వద్దురా బాబు!!


ఏరా భయపడుతున్నావా??


ఏంటి బావ భయమా నాకా?? 
అటువంటిది మనకి... 
తెలియనే తెలియదు!!
బక్కోడు మళ్ళీ బీరాలు పలుకుతున్నాడు!!


అయితే ఇంకే, వెళ్ళరా!! 
వెళ్లి పెళ్లి మాత్రమే చూడమని...
చెప్పి రా పో!!


రెండవ వాడి మాటలకి బక్కోడు 
నీళ్లు నములుతూ... 
గుటకలు మింగుతున్నాడు!!

రెండవవాడు ఓరగా చూస్తూ... 
వెళ్ళు అని కళ్ళతోనే సైగ చేస్తున్నాడు!!


అది కాదు రా బావ!! చెప్పడానికి ఏమీ లేదు!! 
కానీ, దగ్గరికి వెళ్లాలంటేనే భయంగా ఉంది రా!! 
నా సిక్స్ ఫీట్ కి మూడ్స్ ఇచ్చి ...
మోరల్ సపోర్ట్ చేశారంటు!! 
అందరి ముందు కౌగిలించుకొని...
ఒక థాంక్స్ లేదా ఒక అప్రిసియేషన్... 
నా ముఖాన పడేసింది అనుకో?? 
అందరూ కలిసి కుమ్మేస్తారు రా బావ!



బక్కోడి భయానికి చెప్పిన కాన్సెప్ట్ కి... 
రెండోవాడు వస్తున్న నవ్వును బిగబట్టి...
పూర్తిగా, ఆపుకోలేక చిన్నగా నవ్వుతూన్నడు!


ఎందుకురా అలా నవ్వుతావు?? 
ఇందాక నువ్వు కూడా ఉన్నావు కదా!! 
నాకు థాంక్స్ చెప్పే లోపలే పడిపోయాను కదా!! 
నీది కంప్లీట్ అయింది కదా!! నాది కాలేదు!!

అది ఇప్పుడు కంటిన్యూ చేస్తే... 
నా పరిస్థితి ఏంటా?? అని ఆగిపోతున్నాను రా!!
బిక్క మొఖం వేసుకొని, భయపడుతూ... 
మాట్లాడుతున్న బక్కోడిని చూసి... 
రెండవ వాడు అక్కడ ఆగలేక...
పక్కకు వెళ్లిపోయి మరి, నవ్వేస్తున్నాడు!!



కంటిన్యూస్గా ఏమాత్రం బ్రేక్ ఇవ్వకుండా... 
పొట్టిది తన పని తను చేసుకుంటూ పోతుంది!! 
తన చూపులు నిలిపిన తన సిక్స్ ఫీట్!! 
తన దగ్గరికి రావడం చూసి... 
కూర్చున్న చోటు నుంచి లేచి... 
ఎవ్వరూ లేని, కార్నర్ కి వెళ్ళిపోతుంది.

అక్షింతలు వేసిన బంధువులు...
బంధువులతో వచ్చిన మిగతావారు... 
బంధు వర్గం కానివారు!! 
ఇలా అందరిలో కొందరు...
పెళ్లి చూడాలి అనుకున్న వాళ్ళు... 
తిరిగి కూర్చోగా, మిగతావారు...
ఒక్కొక్కరిగా భోజనాలకి వెళ్ళిపోతున్నారు!!

తనని చూసి కార్నర్ కి ప్లేస్ మార్చిన... 
పొట్టి దాని దగ్గరికి వెళ్తాడు సిక్స్ ఫీట్!!

ఏంటి పొట్టి? మెక్కడానికి, వెళతాను అన్నావు!! 
వచ్చి ఇక్కడ కూర్చున్నావు??

పొట్టిది మాత్రం కళ్ళు తిప్పకుండా... 
సిక్స్ ఫీట్ ని అలాగే చూస్తుంది.

అక్షింతలతో పాటు పడిన పూరెమ్మలు...
అక్కడక్కడ 6 ఫీట్ తల మీద ఉండి... 
పొట్టి దాని కళ్ళకి, చాలా అందంగా కనిపిస్తున్నాడు.

సిక్స్ ఫీట్ నువ్వు చాలా బాగుంటావు!! 
మండపం మీద లైటింగ్ లో ఇంకా బాగున్నావు!! 
ఇప్పుడు నా కోసమే నా దగ్గరికి వచ్చావు... 
చూడు చాలా చాలా బాగున్నావు!! 
నాకు పిచ్చెక్కిచ్చేస్తున్నావు, సిక్స్ ఫీట్!!

మత్తుగా, మిరిమిట్లు గోలుపుతున్న కళ్ళతో, క్యూట్ గా మాట్లాడుతున్న పొట్టిదాని మాటలకి సిక్స్ ఫీట్ ఒక రకమైన ప్రౌడ్ ఫీలింగ్ ని ఎంజాయ్ చేస్తున్నాడు!!

@@@@@@@@@

తదుపరి భాగం... మీ కోసం, వెయిట్ చేస్తూ ఉంది.

హాయ్ ఫ్రెండ్స్, ప్లీజ్ సపోర్ట్ మీ!!
డోంట్ ఇగ్నోర్!!
లేటెస్ట్ అప్డేట్స్ కోసం నన్ను అనుసరించండి!!
5 స్టార్ రేటింగ్, మీ కామెంట్, మీ కాంప్లిమెంట్!!
మళ్లీ కలుద్దాం.
థాంక్యూ.
వర్ణ.