He is alive... - 25 in Telugu Love Stories by vasireddy varna books and stories PDF | తనువున ప్రాణమై.... - 25

Featured Books
Categories
Share

తనువున ప్రాణమై.... - 25

ఆగమనం.....

చెవులకు వినిపిస్తున్న గట్టి మేళం కానీ...
చుట్టూ జరుగుతున్న వేడుక కానీ...
అతని గమనించలేకపోయాడు!!
అంతగా తనని తాను మరిచిపోయి... 
పొట్టి దాని ఆలోచనలు మునిగిపోయాడు!!

పొట్టి దానిని మనసులో 100 తిట్టుకుంటూ... 
తన చెల్లి సంతోషంగా ఉండాలని కోరుకుంటూ...
ఎందుకో, ఏమిటో, తెలియని ఒక గందరగోళంతో... వధూవరుల మీద అక్షింతలు వేస్తాడు!!

ఏంటి తమ్ముడు, ఇక్కడ కూర్చున్నావు??
అందరూ మండపం మీద ఉంటే నువ్వు...
ఒక్కడివే, ఇక్కడ ఏం చేస్తున్నావు??

పొట్టిదాని ఆలోచనతో బుర్ర హీటెక్కి... 
దేనిమీద కాన్సెంట్రేట్ చేయలేక... 
అంతక ముందు పొట్టిది కూర్చున్న, 
ఆ కార్నర్ లోకి వచ్చి సెటిల్ అయ్యాడు!!

సైలెంట్ గా పక్కన కూర్చున్న అక్క ని ఒక క్షణం చూసి, దిగులుగా మండపం వైపు తల తిప్పేస్తాడు!! 

అందరి మధ్య సంతోషంగా వరమాలలు మార్చుకుంటున్న, వధూవరులను ఫోటోగ్రాఫర్స్ డిఫరెంట్ యాంగిల్స్ లో ఫొటోస్ తీస్తూ ఉంటే, మిగిలిన వాళ్ళంతా... వాళ్లని చూసి నవ్వుకుంటూ, సరదాగా ఆటపట్టిస్తూ, ఈ యాంగిల్ కాదు ఆ యాంగిల్ అని సలహాలు ఇస్తూ, అల్లరి చెయ్యొద్దు అని పెద్దవాళ్ళు వాళ్లని ఖండిస్తూ..... అంతా సందడి సందడిగా ఉంది.

తమ్ముడు నాకు అర్థమైంది రా!! 
నీ మనసు అక్కడ ఉంది!! 
అందుకే నువ్వు ఇక్కడ కూర్చున్నావు!! 
అవును కదా!!

నువ్వు అన్నది నిజం అక్క!! 
ఎంత డైవర్ట్ చేద్దామన్న కుదరడం లేదు!!
నాకెందుకులే అని, వదిలేద్దాం అనుకుంటాను!!
అలా అనుకున్న ఆ క్షణం, నాకు నేనే నచ్చడం లేదు!!
ఎంత ప్రయత్నించినా సరే.... 
అది నా మైండ్ లో నుంచి పోవడం లేదు...
అంతకంతకు ఇంకా నన్ను చాలా డిస్టర్బ్ చేస్తుంది!!
ఏం చేయమంటావ్ అక్క!!
చాలా డల్ గా వాళ్ళ అక్కని, చూస్తున్నాడు!!

తమ్ముడు నువ్వు ఇలా డల్ గా ఉండకు రా!! 
నాకు అస్సలు నచ్చదు!! 
ఎప్పుడూ నవ్వుతూ, నవ్విస్తూ... 
అన్ని పనుల్లో యాక్టివ్ గా దూసుకుపోతావు!! 
నిన్ను ఇలా చూడలేకపోతున్నాను రా!! 
ఈ విషయం చెప్పు ముందు..?? 
తను నీకు నచ్చిందా..?? 
నువ్వు తనని ప్రేమిస్తున్నావా..??

తమ్ముడు చేతిని తన చేతిలోకి తీసుకొని వత్తి పట్టుకుంది! అసలు తమ్ముడు మనసులో ఏముందో... తెలుసుకోవడానికి ప్రయత్నిస్తుంది!

అక్క ప్రశ్నకి, కొన్ని క్షణాలు డైలమాలో పడిపోయాడు!
ఆపరేషన్ కి సమాధానం అతని దగ్గర లేదు!! 
ఏదో తెలియని ఒక ఫీలింగ్, 
అతనిలో ప్రతిక్షణం కలుగుతుంది! 
కానీ, అది ఏమిటంటే? 
అసలు తెలియడం లేదు!!

తెలియదు అక్క..!!
అదేమిటో, తెలియడం లేదు అక్క!!
చాలా డిస్టబెన్స్ గా ఉంది!! 
అసలు క్లారిటీ లేదు!! 
అది...అసలు... ఎలా... ఎలా చెప్పాలో!! 
నాకు అర్థం కావడం లేదు అక్క!!
దాని మాటలు, అది చేసే పనులు!! 
అన్ని... అన్ని... ప్రతిక్షణం నన్ను...
చాలా అంటే, చాలా ఇబ్బంది పెట్టేస్తున్నాయి!!

తమ్ముడు ఒక్క మాట అడుగుతాను!! 
బాగా ఆలోచించి ఆన్సర్ చెప్పు!! 
ఆ పిల్ల నిన్ను ముద్దు పెట్టుకుంది కదా!! 
అలాగే కౌగిలించుకుంది అని కూడా, చెప్పావు!! 
ఈ ప్రాసెస్ లో... తన బిహేవియర్, తన టచ్... 
ఇదంతా నిన్ను, డిస్టర్బ్ చేస్తుందా!! 
అదే అయితే, కొన్ని రోజులు!! 
ఆ తర్వాత వుండదు రా!! 
అంతకుమించి అయితే... 
మ్....మ్...మ్..,.... అది,
నువ్వే ఆలోచించుకోవాలి!!

తమ్ముడు తను ఉన్న అయోమయపు, 
గందరగోళం నుంచి బయటపడి.. 
ఒక నిర్ణీత ఆలోచన అందుకోవాలనేది, ఆమె ఆశ. 
ఆమెకు, తెలుసు ఒకరకంగా తన తమ్ముడి... 
ఆలోచనను, డైవర్ట్ చేయడానికి కూడా... 
ఈ ప్రశ్న, తన వంతు పాత్ర పోషిస్తుందని!!

ఒక్క క్షణం కూడా ఎటువంటి ఆలోచన.. 
లేకుండా సిక్స్ ఫీట్ వెంటనే నవ్వేశాడు!!

బలే అడిగావు అక్క!! మంచి పాయింట్!! 
నాకు తెలుసు అక్క, నువ్వు ఎందుకు అడిగావొ!! 
బట్ నీకు తెలుసు కదా!! యూఎస్ లో ఉన్నప్పుడు...
ఇలా హగ్గు, కిస్, నైట్ అవుట్స్ ఇవన్నీ కామన్!! 
నీకు, తెలుసు కదా ప్రతిదీ షేర్ చేసుకునే వాడిని!! 

మన హీరో చెబుతుంటే... అవునని తల ఊపుతూ, 
వాళ్ల అక్క ప్రశాంతంగా వింటుంది.

ఎవరితో ఫిసికల్ రిలేషన్ అయితే లేదుగానీ... 
మిగతావన్నీ.,... అసలు అది కాదు కానీ... 
అది కిస్ చేసినప్పుడు, నన్ను నేను మిస్ అయ్యాను!! అంతవరకు నిజం!! అంతకుముందు దాని తర్వాత... దాంతో మాట్లాడింది, కొట్టాలనుకున్నది, తిట్టింది, అసలు చంపేద్దామన్నంత కోపం వచ్చింది!! కానీ అసలు అదంతా దాని దగ్గర పని చేయలేదు!! 

పొట్టి దాని ఆలోచనలను, కంట్రోల్ చేయలేని, 
తన తమ్ముడి అసహాయత... 
అతని కళ్ళల్లో మెరిసిపోతూ... 
సన్నటి నీటి తెరల కనిపిస్తుంది.

అస్సలు ఎక్కడ తగ్గింది లేదక్కా! 
నన్ను అసలు... అది... దాని ముందు నేను ఉంటే...
ఒక్క నిమిషం అలా దూరంగా ఉండదు!! 
వచ్చి పట్టేసుకుందామా!! ఎక్కేద్దామా!! ముద్దు పెట్టేసుకుందామా!! లేదంటే ప్రేమ, ప్రేమించు... 
అంటూ వాగడం!! ఇదే గొడవ!! 
దాని కన్నా నీ కూతురే బెటర్!! 
కాసేపన్న కుదురు ఉంటుంది!! 
మనం, చెప్పేది మన బుడ్డ దానికి, 
అర్థం అవుతుంది!! 
అసలు ఇటువంటి పొట్టి దాన్ని... 
నేను ఎక్కడ చూడలేదు!!
అస్సలు ఎక్కడ... ఎక్కడ... చూడలేదు!!

తన మాటలకి తనని తీక్షణంగా చూస్తున్న... 
అక్కను చూసి, డీప్ బ్రీత్ తీసుకుంటాడు!!
తిరిగి ప్రశ్నార్ధకంగా, తనలో తానే నవ్వుకుంటాడు!!

ఏంటక్కా అలాగే చూస్తున్నావు?? 
నీ తమ్ముడు పిచ్చోడిలాగే కనిపిస్తున్నాడు కదా?? 
నాకు నేను, చెప్పేది అర్థమవుతుంది!! 
కానీ, ఎందుకు ఇంతగా తన గురించే... 
చెబుతున్నానో, అర్థం కావడం లేదు!! 
కనీసం నీ కన్నా  అర్థమవుతుందా??

అనుమానంగా, తనవైపే పిచ్చి చూపులు... 
చూస్తున్న, తమ్ముడిని దగ్గరికి తీసుకొని...
ప్రేమగా నుదురు మీద ముద్దు పెట్టుకుంటుంది!! 

నాకు అర్థమైంది రా!! 
నువ్వు ఏం చెప్తున్నావో... 
అంత పూర్తిగా అర్థమైంది!! 
ఈ కన్ఫ్యూషన్ అందరికీ ఉంటుంది!!

నువ్వు ఇందాక అన్నట్టు, చిన్న డిస్టబెన్స్ కాదక్క!! 
అదైతే రెండు, మూడు నిమిషాల్లోనే పోయేది!! 
అక్కడే వదిలేసే వాడిని..!! 
కానీ, అంతకుమించి ఇంకేదో ఉంది!! 
అదేంటో, అర్థమే చావట్లేదు!! 
చాలా కష్టంగా ఉందక్క!!

సరే రా!! మరి ఇప్పుడు, ఏం చేద్దాం అనుకుంటున్నావు?? నువ్వు ఇలా డల్ గా ఉంటే, నా వల్ల కాదురా!!

అక్క, ఇప్పుడు!! ఇక్కడ!! ఇంతకు మించిన పని.. 
నాకు ఏమన్నా ఉందా??

తమ్ముడు అడిగినదానికి, 
కళ్ళు చిన్నవి చేసి, డౌట్ గా చూస్తుంది!!

అక్క చెప్పొచ్చు కదా!! 
ఎందుకలా చూస్తావు??

ముందు తినడం, తర్వాత ఫొటోస్, ఆ తర్వాత అప్పగింతలు!! వెరసి అటు ఇటుగా...
ఒక మూడు గంటల దాకా పనుంది!!

అక్క ఇదిగో ఇదే, నాతో ఆడుకోవద్దు!! 
నేను అడిగిందే నేను ఉండి, చేయవలసిన పని...
ఏంటి అని, సరిగ్గా చెప్పు అక్క??

మన హీరో, ఏదో ప్లాన్ చేసుకున్నాడు!! 
అందుకే, ఎంక్వయిరీ చేసుకుంటున్నాడు!!

ఒరేయ్ నేను సరిగ్గానే చెప్పాను!! 
నువ్వు ఉన్న, లేకపోయినా... 
మొత్తం జరిగేది ఇదే!! 
నువ్వున్న లేకపోయినా...
అస్సలు ప్రాబ్లం లేదు!!
సరేనా...!!

సిక్స్ ఫీట్ ముఖంలో, సంతోషం వచ్చేసింది!! 
అక్కని సైడ్ హాగ్, చేసేసుకుంటాడు!!

ఈ హగ్స్ ఏమీ అవసరం లేదు గానీ... 
ఇంతకీ ప్లాన్ ఏంటో చెప్పు??

బయటికి వెళ్ళాలి అక్క!! 
పొట్టిదానికి నాతో కలిసి బయట, తిరగాలని ఉంది!! కాసేపు దానితో, బయట తిరిగి వస్తాను!!
నీ తమ్ముడు కోసం మేనేజ్ చేసుకో!!

@@@@@@@@@

తదుపరి భాగం... మీ కోసం, వెయిట్ చేస్తూ ఉంది.

హాయ్ ఫ్రెండ్స్, ప్లీజ్ సపోర్ట్ మీ!!
డోంట్ ఇగ్నోర్!!
లేటెస్ట్ అప్డేట్స్ కోసం, నన్ను అనుసరించండి!!
5 స్టార్ రేటింగ్, మీ కామెంట్, మీ కాంప్లిమెంట్!!

మళ్లీ కలుద్దాం.
థాంక్యూ.
వర్ణ.