ఆగమనం.....
సిక్స్ ఫీట్ ముఖంలో, సంతోషం వచ్చేసింది!!
అక్కని సైడ్ హాగ్, చేసేసుకుంటాడు!!
ఈ హగ్స్ ఏమీ అవసరం లేదు గానీ...
ఇంతకీ ప్లాన్ ఏంటో చెప్పు??
బయటికి వెళ్ళాలి అక్క!!
పొట్టిదానికి నాతో కలిసి బయట, తిరగాలని ఉంది!! కాసేపు దానితో, బయట తిరిగి వస్తాను!!
నీ తమ్ముడు కోసం మేనేజ్ చేసుకో!!
ఉమ్... తనతో కలిసి బయటికి వెళ్తాను అంటావు!!
హా..... అని సాగదీస్తూ... చూస్తుంది!!
అక్క నాతో ఆడుకోవాలని చూడకు!!
తెలిసి కూడా చేస్తున్నావు!!
ఆ పొట్టిది నాకు ఫోన్ నెంబర్...
పంపిందని, నీకు తెలియదా??
ఉక్రోషంతో టెన్షన్ గా చూస్తున్నాడు!!
తమ్ముడు ఫేస్ చూసి...
బిగించిన పెదవులు వదిలేసి...
ఒక్కసారిగా నవ్వేస్తుంది!!
సరే వెళ్ళు..!!
ప్రాబ్లమ్ ఏం లేదు!!
నేను, మేనేజ్ చేసుకుంటాను!!
ఇంతకీ ఎక్కడికి వెళ్తారు??
తిరిగి, నువ్వు ఏ టైం కి వస్తావు??
అసలు ఏమీ తెలియదు..!!
వెళ్లాలి అంతే!!
నేను నీకు ఫోన్ చేసి చెప్తా!!
ఓకే నా...!!
ఉమ్... అర్థమైంది ఓకే!!
ఇంతకీ, తను ఎక్కడుంది??
థాంక్యూ అక్క!! థాంక్యూ సో మచ్!!
పొట్టిది, బయట ఎక్కడో చోట ఉంటుంది!!
నేను, చూసుకుంటాలే!!
బాయ్ అక్క.... బాయ్...
అక్క, రెండు చంపల మీద గట్టిగా...
ముద్దులు పెట్టేసి, మన హీరో బయలుదేరాడు!!
వెంటనే ఫోన్ తీసుకొని...
పొట్టి దానికి, ఫోన్ చేసాడు!!
ఇలా చూసి అలా పడేసాడు!!
ఫోన్ నెంబర్ ఎక్కడిది, అనుకుంటున్నారా!!
మన హీరో బ్రెయిన్, సూపర్ బ్రెయిన్!!
చూడగానే పొట్టి దాని, నెంబర్ బ్రెయిన్ లో...
అలా రిజిస్టర్ అయిపోయింది!!
హలో... సిక్స్ ఫీట్!!
వస్తున్నావా... 6 ఫీట్??
ఐ లవ్ యువ్ సిక్స్ ఫీట్!!
చాలా హ్యాపీగా వినిపిస్తుంది!!
అటు నుంచి పొట్టి దాని గొంతు!!
ఏ మెంటల్ ఫోన్ లిఫ్ట్ చేయగానే...
ఐ లవ్ యు చెప్పాడమేనా!!
నేనే చేస్తానా??
ఇంకెవరూ చేయరా??
బుర్ర ఉందా??
అసలు నీకు...
బ్రెయిన్ మొత్తం డిస్టబెన్స్ తో ఉంది కదా!!
పొట్టి దాన్ని తిట్టేస్తూ, రిఫ్రెష్ చేసుకుంటున్నాడు!!
రిఫ్రెష్ తో పాటు, హ్యాపీనెస్ కూడా వచ్చింది!!
అయ్యో, సిక్స్ ఫీట్!!
ఇది నువ్వే అని, నాకు తెలుసు!!
ఐ లవ్ యువ్ సిక్స్ ఫీట్!!
నీ, ఐ లవ్ యువ్ ఇంకెవరికైనా...
చెప్పేస్తానని, భయపడుతున్నవా??
అది నీకు మాత్రమే సొంతం!!
ఐ లవ్ యువ్ మై హాట్ సిక్స్ ఫీట్!!
అయినా ఈ టైంలో నువ్వు తప్ప...
నాకు, ఇంకెవరూ ఫోన్ చేయరు!!
ఐ నో దట్!!
పొట్టి దాన్ని మాటలు...
6 ఫీట్ కి నచ్చుతున్నాయి!!
అలా నవ్వుకుంటూనే...
కళ్యాణ్ మండపం దాటి,
బయటికి వస్తాడు!!
ఈ పిచ్చి వాగుడాపి ఎక్కడున్నావు చెప్పు??
ఇక్కడ ఒక అందమైన కారు ఉందంట!!
ఆ అందమైన కారు మీద బజ్జుని, ఉన్నానంటా!!
ఏయ్, కారు మీద పడుకోవడం ఏంటే??
పిచ్చా, నీకు బుర్ర పని చేస్తుందా??
ఆ కారు వాళ్ళు, చూశారంటే తిడతారు!!
కిందకి, దిగు ముందు!!
హో... సిక్స్ ఫీట్!!
నీకు నేనంటే చాలా ఇష్టం!!
అందుకే కదా ఎవ్వరు నన్ను...
తిట్టకూడదని, నువ్వు కేర్ తీసుకుంటున్నావు!!
అయినా, నేను కారు పైన ఎక్కి పడుకోలేదు!!
కార్ బ్యానెట్ మీద బజ్జున్నాను!!
ఒసేయ్ పొట్టి దాన!!
కార్ ఎంత బాగుంటే మాత్రం..
అలా బ్యానెట్ మీద పడుకుంటారా??
దిగు ముందు!!
నిజంగా సిక్స్ ఫీట్!!
ఈ కారు చాలా బాగుంది!!
ఎంత బాగుందో తెలుసా??
ఈ కార్లో మనం ఈ నైట్...
మన ఫస్ట్ నైట్ చేసేసుకుందాం!!
అంత బాగా దీన్ని, డెకరేట్ చేశారు!!
పార్కింగ్ వైపు వస్తున్న వాడికి...
రెడ్ లైట్ చూసి ఆగిపోయిన...
కార్ లాగే బ్రేక్ పడింది!!
డెకరేట్ చేసిన కార్!! ఫస్ట్ నైట్!!
దీనికి, మామూలుగా లేదుగా!!
మెంటల్, మొహం దానా!!
ఆ కార్ బావది గాని...
చెల్లిని తీసుకొచ్చిన...
కారు గాని, అయ్యుంటుంది!!
ఇది! దీని పిచ్చా వాగుడు!!
ఇప్పుడు, దీనిని అసలు ఏమనాలి??
ఏమన్నా అన్న యూస్ ఉందా..??
ఇంకా రెట్టిస్తది!!
దీనికి చెప్పడం కన్నా...
మూసుకొని ఉండడమే, బెటర్!!
హలో సిక్స్ ఫీట్!!
ఏంటి ఫోన్ కట్ చేసావా??
వచ్చేసావా, సిక్స్ ఫీట్!!
నువ్వు చాలా ఫాస్ట్, సిక్స్ ఫీట్!!
ఫోన్ కట్ చేయడం కాదే!!
వస్తున్నాను ఉండు నీ నాలుక కట్ చేసేస్తాను!!
అసలు అక్కడ పడుకొని ఏం చేస్తున్నావే నువ్వు!!
హయ్యో, సిక్స్ ఫీట్!!
నువ్వు అలా అడుగుతుంటే!!
నాకు సిగ్గేస్తుంది, సిక్స్ ఫీట్!!
సిగ్గేస్తుందా? ఇదేంటే కొత్తగా??
ఓయ్, బ్రెయిన్ లెస్ పొట్టి మేడం!?
ఆ సిగ్గు కాస్త పక్కన పెట్టి...
ఏం చేస్తున్నావో, చెప్పు ముందు!!
మరేమో, మరేమో నన్ను ఒకడు చూస్తున్నాడు!!
నేను కూడా వాడిని, అలాగే చూస్తున్నాను సిక్స్ ఫీట్!! వాడు నన్ను ఎందుకు చూస్తున్నాడు, నాకు తెలియదు!! నేను వాడిని ఎందుకు చూస్తున్నానో, వాడికి తెలియదు!! కాలు నొప్పిగా ఉంటే, కారు మీద బజ్జున్నాను సిక్స్ ఫీట్!!
ఈసారి రెడ్ లైట్ కాదు!!
ఒక పెద్ద బాంబ్ పడినట్టు..
మన హీరోకి, బ్రేక్ పడిపోయింది!!
కూల్ గా కారు మీద బజ్జోని...
నాకు సైట్ కొట్టే వాడికి...
నేను సైట్ కొడుతున్నాను...
అని చెబితే, బాంబ్ కాకుండా,
ఇంకేం పడింది!!
ఒసేయ్ పొట్టి దాన!!
నీకు మామూలు మెంటల్ కాదే!!
మహా మెంటల్..!!
కాదు, కాదు అసలు బ్రెయిన్ లేదు!!
కూల్ గా కార్ మీద పడుకొని...
నాటకాలు ఆడుతున్నావా??
వస్తున్నాను ఉండు..??
వచ్చి నీ రెండు పిర్రలు...
పగల గొడితే గాని, నీకు బుద్ధి రాదు!!
ఫోన్ కట్ చేసేసి... ఫాస్ట్ గా...
పార్కింగ్ వైపుకి, దూసుకుపోతున్నాడు!!
రావడం అయితే రెండు నిమిషాలలో...
పార్కింగ్ ఏరియాకి వచ్చాడు!!
కానీ, రావడమే మళ్లీ బ్రేక్ పడిపోయింది!!
ఈసారి బాంబ్ వల్ల లేకపోతే...
స్టాప్ రెడ్ లైట్ వల్ల కాదు!!
మరి ఎందుకో, మీరే చూడండి!!
పొట్టిది ఆరామ్ గా, కార్ మీద బోర్లా బజ్జుంది!!
పొట్టిది చూసే వైపు కాస్త లైట్ తక్కువగా ఉంది!!
అక్కడ పార్క్ చేసిన కార్ కి రెండో సైడ్...
ఒక అతను నిలబడి ఉన్నాడు!!
సరిగ్గా గమనిస్తే, అతని పక్కనే...
కనిపించి, కనిపించకుండా మరొక...
అమ్మాయి, తల కనపడుతుంది!!
అతను నెర్వస్ గా ఫీల్ అవుతూ...
పొట్టి దానిని చూస్తున్నాడు!!
మధ్య, మధ్యలో ఆ పక్కన ఉన్న...
అమ్మాయి వైపు కూడా, చూస్తున్నాడు!!
ఆ అమ్మాయి కూడా ముందుకు వంగి...
చెక్ చేస్తూ.. మళ్ళీ వెనక్కి వెళ్ళిపోయి...
కనిపించకుండా, దాక్కుంటుంది!!
సిక్స్ ఫీట్ కి కొంచెం కన్ఫ్యూజ్ గా ఉంది!!
ఏదైనా ప్రాబ్లమా? అని, డౌట్ గా అంతా చూస్తూ...
పొట్టి దాని దగ్గరికి వచ్చాడు!!
@@@@@@@@@
తదుపరి భాగం... మీ కోసం, వెయిట్ చేస్తూ ఉంది.
హాయ్ ఫ్రెండ్స్, ప్లీజ్ సపోర్ట్ మీ!!
డోంట్ ఇగ్నోర్!!
లేటెస్ట్ అప్డేట్స్ కోసం నన్ను అనుసరించండి!!
5 స్టార్ రేటింగ్, మీ కామెంట్, మీ కాంప్లిమెంట్!!
మళ్లీ కలుద్దాం.
థాంక్యూ.
వర్ణ.