Love letter..? - 6 in Telugu Love Stories by vasireddy varna books and stories PDF | ప్రేమలేఖ..? - 6

Featured Books
Categories
Share

ప్రేమలేఖ..? - 6

నాలుగు రోజులకు లీల కు జ్వరం తగ్గింది, వారానికి కాస్త లేచి తిరుగుతుంది కానీ మనిషి ఇది వరకులా లేదు. 

ఆనంద్ దూరంగా ఉన్న చిన్ననాటి నుంచి భద్రంగా దాచుకున్న ఆ జ్ఞాపకాల సావాసంతో రోజులు గడిపేస్తున్నారు ఇప్పుడు అది కూడా దూరం అవ్వడం.. భరించలేక పోతుంది. 

ముఖ్యంగా ఆనంద్ ఇచ్చిన ప్రేమలేఖ. కనీసం ఓపెన్ చేసి కూడా చూడలేదు. నీ ప్రేమ ఎలా ఉంటుందో నాకు తెలుసు, కానీ నువ్వు దానిని ఎలా నాకు చెప్తావో తెలుసుకోకుండానే పోగొట్టుకున్నాను. 

నీతో బ్రతుకులేని నేను నీ జ్ఞాపకాలతో బ్రతికే అర్హతను కూడా కోల్పోయాను అని తనలో తానే తలడిల్లిపోతున్న లీల నెమ్మదిగా కృశించిపోతుంది.

రోజులు అందరికీ మామూలుగానే నడుస్తున్నాయి. లీలాకు మాత్రం చాలా కష్టంగా భరించలేనంత భారంగా క్షణాలు కదులుతున్నాయి. 

అదంతా అండలమ్మ గారికి తెలిసిన కఠినంగా ఉంటే మార్పు సాధ్యమని లీల కన్నీళ్లను చాటుగా గమనిస్తూ ఉండిపోయారు. 

ఒకరోజు సాయంత్రం బయటి నుంచి వచ్చిన బసవయ్య గారు అరుగు మీదే ఉన్న తల్లి పక్కన కూర్చుని.. వచ్చేవారం అబ్బాయి తలుపు వాళ్ళు వస్తామంటున్నారు అమ్మ. 

లీల ఆరోగ్యం చూస్తే నాకు ఏం చెప్పాలో అర్థం కావడం లేదు అన్నారు దిగులుగా.

నాలుగు రోజులు ఉంటే అన్ని సర్దుకుంటాయి. తర్వాతి మాసం మంచిది అప్పుడు పెట్టుకుందాం లే అని ఆవిడ కూడా సమయం పొడిగించడంతో సరే అన్నారు బసవయ్య. 

వారం గడిచింది, మాసం మారింది.. విలువైనది పోగొట్టుకున్న లీల ఆరోగ్యం క్షమించింది ఆ బెంగతో. 

ఆనంద్ ఎప్పటిలా ఫోన్ చేశాడు. 

ఎలా ఉన్నారు అని తల్లిదండ్రులతో మాట్లాడిన తర్వాత తండ్రిని ప్రత్యేకంగా అడిగాడు లీల గురించి.

కొడుకు దగ్గర దాయడం ఇష్టం లేని రంగనాథ్ గారు లీల అసలు బయటకు రావడంలేదని, హాస్పిటల్లో అడ్మిట్ చేశారని చెప్పడంతో ఆనంద్ షాక్ అయ్యాడు. 

అలాగే ఫోర్ మంత్స్ నుంచి బాగోకపోతే ఇప్పటివరకు ఎందుకు చెప్పలేదు అని తండ్రి మీద చాలా సీరియస్ అయ్యాడు.

నీ ప్రేమ గురించి నాకు తెలుసు, ఆ పెద్దావిడకి కూడా తెలుసు. గుడికి వచ్చిన లీలాను పలకరిస్తే మీ అమ్మని కోపంతో దూరం పెట్టారు. అప్పటికే లీలా బాగా వడిలిపోయి ఉంది. 

ఇంకా తనకి పెళ్లి సంబంధాలు కూడా చూస్తున్నారు. ఇన్నింటి మధ్య నీకు చెప్పినా చేయగలిగేది ఏమీ లేదు ఆనంద్. ఆవిడ కఠినమైన చాదస్తాలకు, రాతి మనసుకి మీ ప్రేమలు అర్థం కావు.  

అందుకే నేను కూడా నువ్వు బాధపడకూడదు అని చెప్పలేదు అని వివరించారు రంగనాథ్. 

లీల హాస్పిటల్ లో ఉంది అని వినడమే ఇంక ఒక్క క్షణం కూడా ఉన్నచోట ఉండలేకపోయాడు వెంటనే బయలుదేరి ఊరికి వచ్చి లీల ఏ హాస్పిటల్లో ఉందో కనుక్కొని తల్లిని తీసుకొని  డైరెక్ట్ గా హాస్పిటల్ కి వచ్చాడు. 

ఆనంద వచ్చిన టైంలో ఆండాలమ్మ గారు లేరు. పూర్ణేశ్వరి గారే పెద్ద కోడలితో ఉండడం, ఆనంద్ మదర్ సుభాషిణి గారితో కలిసి రావడం వలన  పరామర్శిస్తూ కూర్చున్నారు. 

స్పృహలో లేని లీల ను సిలైన్ సూదుల మధ్య చూస్తున్న ఆనంద్ గుండె రంపపు కోత పెడుతుంది.

నాలుగు రోజుల నుంచి మూసిన గన్ను తెరవడం లేదండి, ఏ దిష్టి తాకిందో ఏంటో ఉత్సాహంగా ఉండే పిల్ల ఇలా అయిపోయింది అని కన్నీరు పెట్టుకుంటున్న పూనేశ్వరి గారిని సంబాలిస్తున్నారు సుభాషిని. 

ఆనంద్ ఆలోచన అంతా ఒకటే సాగుతుంది తనను దాటి మరొక వ్యక్తితో అడుగు వేయాలన్న కష్టం కత్తిలా గుండెల్లో గుచ్చుతుంటే భరించలేని లీల ఇలా అయిపోయిందని. 

లీల ను అలా చూస్తూ దూరంగా నిలవడం చాలా కష్టంగా ఉంది ఆనంద్ కి. గట్టిగా గుండెని ఎవరో పట్టుకొని అతని నుండి బయటకి లాగేస్తున్న ఫీలింగ్.

కన్నీళ్లు నిండిన కళ్ళతో నెమ్మదిగా లీలా దగ్గరికి వెళ్లి తన పక్కనే కూర్చున్నాడు ఆనంద్. సున్నితంగా లీలా చేతుల్ని తన చేతుల్లోకి తీసుకుంటూ..

వయసులో ఉన్న పిల్ల పక్కన అలా కూర్చోవడంతో ఆనంద్ ఏం చేస్తున్నారు మీ??రు అంటూ వచ్చింది పెద్దకోడలు.

అప్పుడు చూశారు సుభాషిని పూర్ణేశ్వరి గారు. 

సుభాషిని గారికి కూడా ఆనంద్ ప్రేమ వ్యవహారం ఇంకా తెలియదు. 

ఆనంద్ లీల తల మీద చేయి పెట్టి నెమ్మదిగా పిలుస్తుంటే.. ఆశ్చర్యంతో కూడిన ఒక రకమైన షాక్ లో కూరుకు పోయారు వాళ్ళు. 

లీల నేను చెప్పింది మర్చిపోయావా ఎందుకు ఇలా చేస్తున్నావు..?? నా ప్రాణం నీతోనే ఉంది, నువ్వు ఇలా మంచనా పడితే నేను ఏమైపోవాలి.. నా గురించే ఆలోచించావా నువ్వు..??? 

అని లీల చెంపల మీద చేతిని ఉంచి
ఒక్కొక్క పదం తీసుకొని కష్టంగా అడుగుతున్న ఆనంద్ ప్రతి అక్షరంలో కొట్టొచ్చినట్టు కనిపిస్తుంది ప్రేమ. 

లీల హాస్పిటల్ లో ఉంది అని వినడమే ఇంక ఒక్క క్షణం కూడా ఉన్నచోట ఉండలేకపోయాడు వెంటనే బయలుదేరి ఊరికి వచ్చి లీల ఏ హాస్పిటల్లో ఉందో కనుక్కొని తల్లిని తీసుకొని  డైరెక్ట్ గా హాస్పిటల్ కి వచ్చాడు. 

ఆనంద వచ్చిన టైంలో ఆండాలమ్మ గారు లేరు. పూర్ణేశ్వరి గారే పెద్ద కోడలితో ఉండడం, ఆనంద్ మదర్ సుభాషిణి గారితో కలిసి రావడం వలన  పరామర్శిస్తూ కూర్చున్నారు. 

స్పృహలో లేని లీల ను సిలైన్ సూదుల మధ్య చూస్తున్న ఆనంద్ గుండె రంపపు కోత పెడుతుంది.

నాలుగు రోజుల నుంచి మూసిన గన్ను తెరవడం లేదండి, ఏ దిష్టి తాకిందో ఏంటో ఉత్సాహంగా ఉండే పిల్ల ఇలా అయిపోయింది అని కన్నీరు పెట్టుకుంటున్న పూనేశ్వరి గారిని సంబాలిస్తున్నారు సుభాషిని. 

ఆనంద్ ఆలోచన అంతా ఒకటే సాగుతుంది తనను దాటి మరొక వ్యక్తితో అడుగు వేయాలన్న కష్టం కత్తిలా గుండెల్లో గుచ్చుతుంటే భరించలేని లీల ఇలా అయిపోయిందని. 

**************************

కామెంట్స్ మస్ట్ బేబీస్...💞

__Varna.