Lunar Eclipse - 1 in Telugu Love Stories by umadevi books and stories PDF | పాణిగ్రహణం - 1

The Author
Featured Books
Categories
Share

పాణిగ్రహణం - 1

ఈ కథ పూర్తిగా కల్పితం..

కళ్యాణ మండపం...

ఈ సిటీ లోనే పెద్ద పెద్ద బడా బాబుల్ని భరించే అతిపెద్ద కళ్యాణ మండపం.

రాష్ట్రంలోనే రెండు పెద్ద బిజినెస్ కుటుంబాల మధ్య జరుగుతున్న వివాహ వేడుక ఇది.అంగరంగ వైభవంగా అలంకరించి ఉంది ఎటు చూసినా రెండు కుటుంబాల వైభోగం కనబడుతుంది.కళ్యాణ మండపం చుట్టూ ఫుల్ గా సెక్యూరిటీ ఉంది.ప్రతి ఒక్కరినే బాగా చెక్ చేసి గాని లోపలికి పంపడం లేదు.

        పెళ్ళికొడుకు మండపంలో కూర్చుని వర పూజ చేస్తున్నాడు. పెళ్ళికొడుకుని చూడడానికి రెండు కళ్ళు సరిపోవడం లేదు.

  ఆరడుగుల అందగాడు, చురకత్తుల లాంటి చూపులు, సమ్మోహనపరిచే చిరునవ్వు, సిల్కీ హెయిర్, చుక్కల్లో చంద్రుడు వలె మెరిసిపోతున్నాడు.

    పెళ్లికి వచ్చిన బంధువు వర్గం అంతా ఈ సంబంధం మాకు ఎందుకు కుదరలేదు అని బాధపడుతూ, పెళ్లికూతురు తండ్రి అదృష్టానికి ఈర్షపడ్డారు .

  పెళ్ళికాని అమ్మాయిలు అయితే తమ కలల రాకుమారుడు వేరొకరి సొంతం అవుతున్నందుకు తెగ బాధ పడిపోయారు.

ఇంతలో పూజారి గారు పెళ్ళికూతురుని తీసుకురండి అని చెబుతారు. పెళ్ళికూతురని ఆమె స్నేహితులు తీసుకు వస్తూ ఉంటారు. వారి ఆచారం ప్రకారం ముసుగు వేసుకుని ఉంటుంది.

    పెళ్లి కూతుర్ని పీటల మీద కూర్చోబెడతారు.ఇద్దరి మధ్యన తెర అడ్డుగా ఉంటుంది. పూజారి గారు వధువుతో పూజ చేయిపిస్తూ మంత్రాలు చెప్పిస్తుంటే, వధువు తల్లి అయిన భార్గవి వచ్చి అమ్మాయి రెండు రోజులు మౌనవ్రతం లో ఉంది అండి.

     పెళ్లి ఎటువంటి ఆటంకాలు లేకుండా జరగాలి అని అమ్మవారికి మొక్కుకుంది అని చెబుతుంది. అందరూ వధువు భక్తికి మురిసిపోతారు వధువు తండ్రి అయిన ధనుంజయ్ గారు కూతురిని చూసి పొంగిపోతారు.

  ధనుంజయ కళ్ళు ఎవరినో వెతుకుతాయి కానీ అతనికి నిరాశ ఎదురవుతుంది. ఒక్క నిమిషం బాధ అనిపించినా కూతురు కోసం మళ్ళీ నవ్వుతూ కార్యక్రమాలు చేస్తూ ఉంటారు.

కన్యాదాన పూజలో వధువు కుడి చేతి మణికట్టుపై ఉన్న పుట్టుమచ్చ చూసి వరుడికి రకరకాల ఫీలింగ్స్ వస్తూ ఉంటాయి.ఆ పుట్టుమచ్చ పెసరబద్ధంత పెద్దగా ఉంటుంది.కన్యాదానం పూర్తయిన తర్వాత జీలకర్ర బెల్లం పెట్టేస్తారు.

తరువాత తాళి కట్టినప్పుడు వరుడు ఎంతో సంతోషంగా కడుతూ ఉంటే, వధువు కంటలో నుండి నీళ్లు జలజలా కారుతాయి..

ఒక కన్నీటి బొట్టు వచ్చే వరుడు పాదాలపై పడుతుంది.వరుడు అర్థం కాక వధువు వంక అనుమానంగా చూస్తూ ఉంటే, భార్గవి వచ్చి మీతో వివాహానికి తను చాలా సంతోషంగా ఉంది అని వరుణ్ణి డైవర్ట్ చేస్తుంది.

తలంబ్రాల ఘట్టంలో కూడా వధువు వణుకుతూ ఉంటుంది. పెళ్లి ఘట్టాలు అన్నీ పూర్తి అయ్యాక అప్పగింతల అప్పుడు వధువు తన నానమ్మ అయిన సత్యవతి గారికి దగ్గరికి వెళుతూ ఉంటే భార్గవి వచ్చి వధువును హత్తుకుని భయపడకు మేమందరం నీ వెనకాల వస్తున్నాము అని చెప్పి సాగనంపుతుంది.

 పెళ్లి కారు అందమైన పువ్వులతో ముస్తాబై ఉంటుంది. ఆ కారు వధూవరులు ముందుకు వచ్చి  ఆగుతుంది. పెళ్లికొడుకు తల్లి పెళ్ళికొడుకుతో మీరిద్దరూ సపరేటుగా ఈ కారులో వెళ్ళండి. మేము వెనకాల వస్తాము అని చెబుతుంది.

   వధువు,  వరుడు ఒక కారులో,  మిగిలిన వాళ్ళందరూ ఎవరి కారులో వారు బయలుదేరతారు.

కార్ స్టార్ట్ అవ్వగానే వరుడు,,  తమకు డ్రైవర్ కి మధ్య ఉన్న డోర్ వేసేస్తాడు.  ఆ కారు చాలా లగ్జరీస్ కారు. అన్ని రకాల హంగులు ఉంటాయి.

   వెంటనే వరుడు వధువు చేయి పెట్టకు పట్టుకుని నీకు ఈ పెళ్లి ఇష్టమే కదా!! ఎవరి బలవంతం మీద నువ్వు ఒప్పుకోలేదు కదా అని గంభీరంగా అడుగుతాడు.

   అతని మాటలోనే గంభీరానికే భయపడుతుంది. వధువు భయం అర్థం అయ్యి కూల్ గా మాట్లాడతాడు భయపడకు నిజం చెప్పు అని...

దానికి వధువు ఇష్టమే అని తల ఊపుతుంది. మౌనవ్రతం ఎన్ని రోజులు అని అడుగుతాడు??  రెండు రోజులు అని తన వేళ్ళు చూపిస్తుంది.

  వధువు చేతి వేళ్ళు చాలా చిన్నగా ఉంటాయి. వరుడు తన చేయి పక్కన వధువు చేయి పెట్టి చూసి చిన్నగా నవ్వుకుంటాడు. చేయి ఏమిటి ఇంత చిన్నగా బుజ్జిగా ఉంది.

 నా చుట్టూ చేతులు వేసి బంధించాలి అంటే నా భార్యకి కష్టమే అని తన ఊహకి తానే నవ్వుకుంటాడు 

  ఇంతలో కార్ ఒక అందమైన మాన్షన్ ముందు ఆగుతుంది. అది జై సింహా మాన్షన్. పెళ్లి గురించి మాన్షన్ మొత్తం అందమైన పువ్వులతో అలంకరించబడి ఉంటుంది .

  జై సింహా ఫ్యామిలీ తరతరాల నుంచి చెయ్యని బిజినెస్ అంటూ లేదు. స్కూల్స్ దగ్గర నుంచి హాస్పిటల్స్ వరకు,  వ్యవసాయ ఉత్పత్తుల దగ్గర నుంచి ఎక్స్పోర్ట్ వరకు అన్ని రకాల బిజినెస్ లు చేస్తున్నారు.

   చారిటీస్ కూడా రన్ చేస్తున్నారు. కంపెనీ ప్రాఫిట్ లో 25% చారిటీస్కు ఉపయోగిస్తున్నారు.

ఇద్దరినీ గుమ్మం ముందు ఆపి పేర్లు చెప్పి లోపలికి రమ్మంటారు. వధువుకి చాలా టెన్షన్ గా ఉంటుంది.వరుడు వధువు వంక చూసి చిన్నగా నవ్వుతాడు. వధువు ఆలోచిస్తుంది ఇప్పుడు ఎలా తను మాట్లాడేది అని...

కథ కొనసాగుతుంది.....