కోపంగా బయటికి వచ్చిన విక్రమ్ చూసిన ధనుంజయ గారు ఏమైంది అల్లుడుగారు అని అడుగుతుంటే... సీరియగా చూసి డ్రైవర్ని కారు తీయమని తను మాన్షన్ కి వెళ్ళిపోతాడు.
సత్యవతి, భార్గవి శిల్ప దగ్గరికి వెళ్లి ఏమైంది అని అడుగుతారు. దానికి శిల్ప తెలియదమ్మా అని చెబుతుంది.
సరే నువ్వు రెస్ట్ తీసుకో.. రేపు వెళ్లి అసలు ఏం జరిగిందో అని అల్లుడు గారిని అడుగుదామని భార్గవి ని శిల్ప కి తోడుగా ఉండమని చెప్పి, సత్యవతి బయటకు వస్తుంది.
ఏమైందమ్మా అని ధనుంజయ్ అడగగానే, శిల్పకు ఏమీ తెలియదు అంటుంది.
రేపు వెళ్లి మాట్లాడితే గాని, విషయం ఏమిటో తెలియదు అని చెబుతుంది.
విక్రమ్ తన మాన్షన్ లో కారు దిగి సీరియస్గా లోపలికి వస్తాడు. విక్రమ్ చూసి అక్కడ అందరూ ఆశ్చర్యపోతారు.
ఏమైంది విక్రమ్.. ఈ టైంలో ఇక్కడికి వచ్చావు, అక్కడ శిల్ప ని ఒంటరిగా వదిలేసి అని లలిత గారి అడుగుతారు.
దానికి విక్రమ్ అమ్మ అని గట్టిగా అరుస్తూ సోఫాలో కూర్చుంటాడు. ఏమైంది విక్రమ్ అని కళ్యణ్ గారు, రమేష్ గారు చెరో పక్కన కూర్చుని అడుగుతారు.
దానికి విక్రమ్ బాధగా కళ్ళు మూసుకుని చాలా మోసం జరిగిందమ్మా అని చెబుతాడు.
మోసం ఏమిటి నాన్న అని...ఇందిరాగారు అడిగితే..
నేను తాళి కట్టింది ఒకరికి, ఇప్పుడు గదిలోకి వచ్చింది ఇంకొకరు అని చెబుతాడు.
ఏంటి అని అందరూ గట్టిగా అరుస్తారు. ఒక్క నిమిషం అందరికీ ఏమి మాట్లాడాలో అర్థం కాక సైలెంట్ అయిపోతారు.
విక్రమ్ మేనత్తయిన మాధవి గారు ముందుగా తేరుకుని నువ్వు అమ్మాయిని గదిలోనే కదా చూడడం.. నీకు ఎలా తెలిసింది అని అడుగుతారు.
దానికి అత్తయ్య పెళ్లి సమయంలో గానీ, వ్రతం జరుగుతున్నప్పుడే గాని తన స్పర్శ నాకు పాజిటివ్ ఫీలింగ్ వచ్చింది.
కానీ ఇప్పుడు గదిలో ఉన్న అమ్మాయి చేయి తగలగానే నెగటివ్ ఫీలింగ్ వచ్చింది.
అంతేకాదు అత్తయ్య, నేను తాళి కట్టిన అమ్మాయికి గోరింటాకు అరచేతిలో మాత్రమే ఉంది. కుడి చేతి మణికట్టు మీద పుట్టుమచ్చ ఉంది.
కానీ గదిలోకి వచ్చిన అమ్మాయి మోచేతి వరకు మెహందీ ఉంది. నేను వ్రతం అయిన తర్వాత నల్లపూసలు, ఒక రింగు గిఫ్టుగా ఇచ్చాను అని చెబుతాడు.
అందరికీ ఫ్యూజులు ఎగిరిపోతాయి. అసలు ఇలా ఎలా అని?? భరత్ ఆలోచిస్తూ బావ మెహేంది ఏమైనా మళ్లీ పెట్టుకుందేమో!! ఇప్పుడు ఇన్స్టంట్ మెహందీలు వస్తున్నాయి కదా అలాగా అని..
లేదు భరత్ అది ఇప్పటికిప్పుడు పెట్టుకున్నది కాదు అంటాడు. అంతలో నివి కి కూడా ఒక డౌట్ వస్తుంది.
నైట్ టైం అని గోల్డ్ తీసి ఉండొచ్చు కదా అనగానే,
దానికి విక్రమ్ నల్లపూసలు అంటే నువ్వు చెప్పింది నిజం అనుకోవచ్చు. బట్ రింగ్ అలా కాదు.
అది నేను స్పెషల్ గా డిజైన్ చేయించాను. నేనే స్వయంగా తన చేతికి పెట్టి ఫిక్స్ చేశాను.
ఆ ఉంగరం ఎప్పుడు తన చేతికి ఉండాలని ఒక కోడితో ఫిక్స్ చేశాను. అది తీయాలి అంటే ఆ కోడ్ యూస్ చేయాలని చెబుతాడు.
ఇప్పుడు ఏం చేయాలి అని ఆలోచిస్తారు. ఆ టైంకి సర్వెంట్స్ అందరూ సర్వెంట్ క్వార్టర్స్ కి వెళ్ళిపోవడం వలన ఈ విషయం బయటికి వెళ్లలేదు.
వెంటనే ఇంద్ర గారు మనకి ఈ విషయం తెలిసినట్టు ధనుంజయ్ ఫ్యామిలీకి తెలియకూడదు. అసలు ఏం జరిగిందో తెలిసే వరకు అంటారు.
దానికి లలితగారు రేపు శిల్ప ను అందరికీ చూపించాలి కదా! అత్తయ్య. పైగా రెండు రోజుల్లో రిసెప్షన్ కూడా ఉంది కదా అనగానే, ఇంద్ర గారు ఆలోచనలో పడతారు.
ఆ రాత్రి ఎవరి ఆలోచనలో వాళ్ళు ఉంటారు. అందరికీ ఆ రాత్రి చాలా భారంగా గడుస్తుంది.
ఉదయం లలిత గారు పరధ్యానంగా పూజ చేసి వస్తారు. ఇంటి మొదటి వారసుడు పెళ్లిలో ఇలా జరిగింది ఏమిటి అని...
ఇందిరాగారు కోడల్ని చూసి ఎందుకు లలిత అంత డల్ గా ఉన్నావ్ అని అంటారు.
దానికి లలిత అంతా తెలిసి కూడా అలా అడుగుతున్నారు ఏంటి అత్తయ్య అని అంటే....
అది నిజమే కానీ రాత్రి ఏం చెప్పాను. మనకు తెలిసినట్టుగా వాళ్ళకి తెలియకూడదని చెప్పాను కదా! పైగా సర్వెంట్స్ అందరూ ఉన్నారు.
నలుగురు వచ్చి పోయే ఇల్లు ఇది. మనం ఏమాత్రం అజాగ్రత్తగా ఉన్న ఇంటి ప్రతిష్ట దెబ్బతింటుంది అని చెబుతారు.
అంటే ఏంటి అత్తయ్య అమ్మాయిని ఒప్పుకోవాలా అని అడుగుతారు. ఒప్పుకోవాలి అని చెప్పడం లేదు.
అసలు ఏం జరిగిందో తెలుసుకుందాము .మన విక్కీ చేసుకుంది వేరే అమ్మాయిని అయితే అమ్మాయిని కనిపెడదాం అంటారు.
కానీ అత్తయ్య అరోజు మనం చూసి వచ్చిన అమ్మాయి శిల్ప నే కదా అంటే,, కంగారు పడకు లలిత.
ధనుంజయ్ ఫ్యామిలీ వచ్చాక మాట్లాడదాం. వాళ్ళు వచ్చాక నేను మాట్లాడతాను.
అందరూ సైలెంట్ గా ఉండండి. ముఖ్యంగా విక్కీ ని అని చెబుతారు. దానికి సరే అని కిచెన్ లోకి వెళ్లి హెడ్ కుక్కకి ఏం చేయాలో చెబుతారు.
విక్రమ్ రాత్రి లేటుగా పడుకోవడం వల్ల, చాలా లేటుగా లెగుస్తాడు.
పెళ్లి జరిగిన సంతోషం లేదు. ఎవరైనా తొలిరాత్రి జాగారం చేసి, ఉదయం లేటుగా లెగుస్తారు.
కానీ నా పరిస్థితి దానికి విరుద్ధంగా ఉంది. అసలు నా పెళ్లి ఎవరితో జరిగిందో తెలియక, ఆలోచిస్తూ నిద్రకు దూరం అయి లేటుగా లేచాను.
నా పెళ్ళిలో గోల్మాల్ చేసిన ఎవరిని వదలను అనుకుంటూ బాత్రూంలోకి వెళతాడు. షవర్ కింద నుంచి జరిగిందంతా ఆలోచిస్తూ ఉంటాడు.
వధువు కంగారు పడటం, తాళి కట్టేటప్పుడు తన కాళ్లపై కన్నీళ్లు పడడం, తన చెయ్యి గట్టిగా పట్టుకోవడం, ఏదో చెప్పాలని ప్రయత్నించడం అన్నీ గుర్తు వస్తూ ఉంటాయి.
వధువు మాట్లాడడానికి ప్రయత్నించినప్పుడల్లా...భార్గవి తీసుకువెళ్ళడం. పెళ్ళిలో మౌనవ్రతం అని చెప్పడం చాలా డౌట్స్ వస్తూ ఉంటాయి.
ముఖ్యంగా భార్గవి మీద. వధువును తలుచుకుంటూ నువ్వు ఎక్కడ ఉన్నా, ఎలా ఉన్నా నిన్ను వదలను.
నువ్వు ఏం సమాధానం చెబుతావో నేను వినాలి. నా కుటుంబ పరువు ప్రతిష్టలతో, నా మనసుతో ఆడుకున్న ఎవ్వరిని వదలను అని గట్టిగా కళ్ళు మూసుకుంటాడు.
ఈ విక్రమ్ ఆట ఆడితే ఎలా ఉంటుందో నీకు చూపిస్తాను అని వధువుని తలుచుకుని కోపంతో కళ్ళు తెరిస్తాడు. అక్కడ ఒక గదిలో కూర్చుని ఏడుస్తున్న ఒక అమ్మాయికి ఆగకుండా ఎక్కుళ్ళు వస్తూ ఉంటాయి.
విక్రమ్ డ్రెస్సింగ్ రూమ్ కి వెళ్లి రెడీ అయ్యి కిందికి వస్తాడు. ఫ్యామిలీ మొత్తం కూడా హాల్లోనే ఉంటారు.
కానీ... అందరూ సైలెంట్ గా ఉంటారు. విక్రమ్ వచ్చి ఏమైంది ఇప్పుడు?? ఏం చేయాలో నాకు తెలుసు.
ఇదే ఆలోచిస్తూ అందరూ టైం వేస్ట్ చేసుకోకండి అని చెబుతాడు.
అప్పుడే గుమ్మం ముందు కారు ఆగుతుంది. ఎవరి వచ్చి ఉంటారో అర్థమయ్యే లేని నవ్వుని తెచ్చుకుని లలిత, మాధవి ఎదురు వెళ్లి స్వాగతం చెబుతారు.
ధనుంజయ్ ఫ్యామిలీ గుమ్మం దగ్గర నిలబడి ఉంటారు. శిల్ప ముసుగులోనే ఉంటుంది.
ఇందిరా గారు లలితని పిలిచి కోడలకి హారతి ఇచ్చి లోపలికి తీసుకురామనీ చెబుతారు.
లలిత హారతి ఇచ్చి. లోపలికి తీసుకువస్తుంది. అందరికీ మర్యాదలు చేస్తారు. శిల్ప కి చాలా టెన్షన్ గా ఉంటుంది.
విక్రమ్ ఫేసులో ఎటువంటి ఫీలింగ్స్ కనపడవు. అసలు ఏం జరుగుతుందా అని...
ఈ సమస్య నుంచి జై సింహ ఫ్యామిలీ ఎలా బయటపడతారు??
కథ కొనసాగుతుంది...