Adhuri's story - 5 in Telugu Love Stories by surya Bandaru books and stories PDF | అధూరి కథ - 5

Featured Books
Categories
Share

అధూరి కథ - 5

జ్యోతి ని తీసుకుని కోపంగా వెళ్తున్న అర్జున్ దగ్గరకి కౌసల్య, ప్రియ తో పాటు అందరూ పరిగెత్తుకుని వెళ్తారు. ప్రియ అర్జున్ ని ఆపడానికి try చేస్తుంటే, అర్జున్ కోపంగా "ప్రియ పక్కకి తప్పుకో ఇది నీకు సంబంధం లేని విషయం" అన్నాడు.

ప్రియ కోపంగా అర్జున్ ఎదురుగా వెళ్ళి "ఇది మా ఆడవాళ్ళ కి సంబంధించిన విషయం. ప్రతి రోజు ఎంత మంది ఆడవాళ్ళు ఇలాంటి problem face చేస్తూన్నారో తెలుసా నీకు? అంతెందుకు నాతోనే ఎంతో మంది, ఏదో ఒక time లో చాలా అసభ్యంగా ప్రవర్తిస్తూ ఉంటారు, వెళ్ళి వాళ్ళందర్నీ కూడా కొట్టేస్తావా"? 

అర్జున్ కోపంగా చూస్తూ ఉన్నాడు. 

విషయం పెద్దది అయ్యేలా ఉంది అని గమనించిన ఆనందరావు అర్జున్ దగ్గరకి వెళ్ళి, "అర్జున్ ముందు ఇంట్లోకి పద ఏం చేయాలని ఆలోచిద్దాం" అన్నాడు.

అర్జున్ కోపంగా ఆనందరావు వైపు కోపంగా చూస్తూ " బాబాయ్ తను చిన్నప్పట్నుంచి ఈ ఇంట్లో పెరిగిన అమ్మాయ్,  తనకి ఇలా జరిగితే ఏం జరగనట్లు చూస్తూ ఉండడం నా వల్ల కాదు" అన్నాడు. 

ప్రియ కోపంగా "తను నీ చెల్లి లాంటిది కాబట్టే తన గురించి ఆలోచించు, ఇప్పుడు ఈ విషయం పెద్దది అయ్యి media కి తెలిస్తే ఆ presure జ్యోతి handle చేయగలదా"? ఈ విషయం బయటకి తెలిస్తే తన మీద జాలి చూపిస్తారు అనుకుంటున్నావా? తనని మానసికంగా tourcher చేస్తారు".  తను నీకు చిన్నప్పటినుంచి తెలుసు కదా, నువ్వే చెప్పు తను ఇదంతా handle చేయగలదా"? 

అర్జున్ కోపంగా సుభద్ర వైపు చూసి "ఏం మాట్లాడుతుంది అత్త ఇది? ఇదేం చిన్న teasing case కాదు వాడికి వార్నింగ్ ఇచ్చి వదిలేయడానికి, నువ్వు సరిగ్గా వినలేదు అనుకుంట వాళ్ళు, తన ఫాంట్ విప్పి",  అంటుండగా 

ప్రియ గట్టిగా అరుస్తూ "అవును తన పాంట్ విప్పి అక్కడ ఒకడి తర్వాత ఒకడు చేతులు పెట్టారు. ఈ విషయం బయటికి తెలిస్తే ఇదే మాట, ప్రతి రోజు తను వింటూ ఉండాలి, తను ప్రతి రోజు నరకం అనుభవించాలి అర్థం అవుతుందా నీకు? ఆ presure తట్టుకోలేక తను ఏమైనా చేసుకుంటే! వాళ్ళని ఏం చేయొద్దు అనట్లేదు, వీలైతే చంపెయ్ కాని ముందు, తను ఏమనుకుంటుందో  తెలుసుకుని అప్పుడు వెళ్ళి చంపెయ్" అని అర్జున్ వైపు కోపంగా చూసి, జ్యోతి చేయి పట్టుకుని లోనికి తీసుకుని వెళ్ళిపోయింది.

కోపంలో ఉన్న అర్జున్ కోపం ఐతే తగ్గలేదు కాని ప్రియ అన్న మాటలు తనకే తెలియకుండా తన కోపాన్ని తగ్గిస్తూ ప్రియ చెప్పింది నిజమే కదా అని ఆలోచిస్తోంది అని అర్ధం అయిన అర్జున్ ఏం మాట్లాడకుండా మౌనంగా గా ప్రియ వైపు చూసాడు. 

ఇంతలో ఆనందరావు అర్జున్ భుజం మీద చేయి వేసి, "అర్జున్ నీకు కోపం రావడంలో తప్పు లేదు కానీ ఆ కోపం వల్ల జ్యోతి బాధపడే పరిస్థితి తీసుకు రాకూడదు, ప్రియ చెప్పింది 100% correct ముందు జ్యోతి ని కాస్త కుదుటపడని అప్పుడు తను ఎలా కావాలి అనుకుంటే అలా చేద్దాం, ఇక లోనికి పద" అన్నాడు. 

అర్జున్ dull face తో ఆనందరావు వైపు చూసాడు. ఆనందరావు బ్రతిమాలుతూ "పద రా" అన్నాడు. 

అర్జున్ silent గా లోనికి వెళ్తున్నాడు, అతని వెనకే అందరూ లోపలికి వెళ్ళారు..


మరుసటి రోజు ఉదయం:

మరుసటి రోజు ఉదయం అందరూ జ్యోతి పక్కన hall లో కూర్చుని జ్యోతి నిర్ణయం కోసం ఎదురు చూస్తూ ఉన్నారు. 

ముందు రోజు రాత్రి జరిగిన సంఘటన నుంచి ఇంకా బయటికి రాని జ్యోతి మాట్లాడాడనికి ఇబ్బంది పడడం గమనించిన సుభద్ర జ్యోతి భుజం మీద చేయి వేసి 

"జ్యోతి నువ్వు ఎవరి గురించి ఆలోచించకు ఇది నీ జీవితం. నువ్వు ఏ నిర్ణయం తీసుకున్నా ఇక మీద వాడు నీ వైపు కూడా చూడకుండా ఏం చేయాలో మేం చేస్తాం, ఎవరో ఏదో అనుకుంటారు అని నీకు కష్టం అనిపించే నిర్ణయం తీసుకోవద్దు" అంది. 

వ్యక్తిగతంగా ఎంతో sensitive అయిన జ్యోతి ఇబ్బందిగా కిందకి తల వంచుకుని అమాయకంగా "నేను case పెట్టినా, పెట్టకపోయినా వాడు ఇంకెప్పుడు వేరే అమ్మాయితో ఇలా ప్రవర్తించకుండా చేస్తారు కదా madam" అంది సుభద్ర వైపు చూసి, 

ఎంత sensitive అమ్మాయి అయినా వేరే అమ్మాయికి తన లాంటి పరిస్థితి రాకూడదు అని జ్యోతి ఆలోచిస్తున్నందుకు గర్వ పడుతూ, 

"తప్పకుండా వాడు ఇంకెప్పుడు ఏ అమ్మాయి వైపు కన్నెత్తి చూడటానికి కూడా భయపడేలా నేను చేస్తాను" అంది. 

జ్యోతి silent గా అందరి వైపు చూసి ఐతే case పెట్టి జరిగిన విషయాన్ని మళ్ళీ, మళ్ళీ గుర్తు చేసుకుంటూ దైర్యం గా బ్రతికెంత దైర్యం నాకు లేదు madam" అని ఏడుస్తూ "నేను case పెట్టలేను" అని "అర్జున్ వైపు చూసి sorry అన్నయ్య" అంది.

సుభద్ర తనని హత్తుకుని "నువ్వేం తప్పు చేయలేదు sorry చెప్పడానికి" అని రెండు క్షణాలు అలా హత్తుకుని ఉండి "నువ్వు వెళ్ళి rest తీసుకో, కొన్ని రోజులు collage కి వెళ్ళకు" అని జ్యోతి ని పైకి లేపింది. జ్యోతి అర్జున్ వైపు చూసి silent గా building బయట వాళ్ళు ఉండే ఇంటి వైపు వెళ్ళింది. తన వెనుకే రాధిక కూడా వెళ్ళింది. 

సుభద్ర ఆనందరావు దగ్గరకు వచ్చి అన్నయ్య నీ friend sp కి phone చేసి వాడ్ని, వాడి friends ని drugs case లో లోన వేసేయమని చెప్పు 10 సంవత్సరాలు jail లో ఊచలు లెక్కపెడతారు, నిన్న రాత్రి enquiry చేస్తే తెలిసింది వాడు, వాడి friends collage లో drugs అమ్ముతున్నారు అంట, అలాంటి వాళ్ళ మీద జాలి చూపించకూడదు. ఒక Collector గా నేను మాట్లాడొచ్చు కాని నువ్వు మాట్లాడితేనే correct నీ friend కదా" అంది 

ఆనందరావు సరే అన్నట్లు తల ఊపాడు. 

"ఇక ఈ విషయం గురించి తన దగ్గర మాట్లాడకండి. కొన్ని రోజులు rest తీసుకుని తనకి వెళ్ళాలి అనుకున్నప్పుడు తనే collage కి వెళ్తుంది లే" అని 

ఏదో గుర్తు వచ్చినట్లు అర్జున్ వైపు చూసి "అవును రా మీరు కాకినాడ లో ఉండబోతున్నారు కదా! జ్యోతి ని కూడా అక్కడే collage join చెయ్, తనకి కూడా ఈ విషయం త్వరగా మర్చిపోవడానికి అవకాశం ఉంటది" అంది. అర్జున్ 2 seconds ఆలోచించి "సరే అత్త" అన్నాడు. 

"సరే ఐతే నేను sp దగ్గరకి వెళ్ళి మాట్లాడి వస్తాను" అని ఆనందరావు వెళ్తూ ఉంటే "ఆగు అన్నయ్య నేను కూడా వస్తాను" అని 

నాకు urgent work ఉంది ప్రియ ఇప్పటికే late అయింది నేను వెళ్తాను మీరు కాకినాడ రాగానే నాకు call చేయ్, నేను వెళ్ళొస్తా కౌసల్య" అని చెప్పి, ఆనందరావు  తో కలిసి బయటకు వెళ్ళారు, ఆనందరావు వాళ్ళు రావడం చూసిన ఆనందరావు draiver నాగరాజు speed గా car దగ్గరకి వెళ్ళి car doors open చేసి వాళ్ళు ఎక్కిన తర్వాత driver seat లో కూర్చుని car start చేసాడు. లోన కూర్చున్న సుభద్ర, అక్కడే car పక్కన నుంచుని ఉన్న తన driver రాజు తో "మా వెనక follow అవ్వు" అని చెప్పింది. 

రాజు "సరే madam" అని సుభద్ర car దగ్గరకి వెళ్ళాడు. ఆనందరావు Car start అయ్యి దూరంగా వెళ్ళింది, దాని వెనకే సుభద్ర car కూడా follow అవుతూ వెళ్ళింది...


అర్జున్, ప్రియ కాకినాడ వెళ్లిన తర్వాత కధ ఎలాంటి మలుపులు తిరగబోతుంది అని రానున్న episodes లో తెలుసుకుందాం......

దయచేసి మీ అభిప్రాయాలను తెలియచేస్తూ ఉండండి నా writing లో ఏమైనా problems ఉంటే improve చేసుకోవడానికి ఉపయోగపడుతుంది..

సూర్య బండారు...