దంతపురం లొ ప్రత్యెక దర్యాప్తు బృందం (Special Investigation Team) వాళ్ళు వాళ్ళ దర్యాప్తు (Investigation) ని వేగవంత చేసారు. ఆ దర్యాప్తు బృందం అధికారి (Investigation Team officer) ధనుంజయ్ వివరాలన్నీ సేకరిస్తున్నాడు.
అలా తాను సేకరించిన వివరాలను తన తోటి బృందం సబ్యుల (Team Mates) తొ చర్చిస్తున్నాడు (Discussion). అప్పుడు ధనుంజయ్ కి మంత్రి ఆనంద రాజు నుంచి కాల్ వస్తుంది.
ధనుంజయ్ : హెలొ సర్.
మంత్రి : హలో ధనుంజయ్. ఎంత వరకు వచ్చింది మీ దర్యాప్తు ?
ధనుంజయ్ : మనం దగ్గరికి వచ్చేసాము సార్. మాకు ఒక ఆధారం దొరికింది. ఇంకా కొన్ని రొజుల లొ ఈ కేస్ ఓ కొలిక్కి వచ్చేస్తుంది.
మంత్రి : అంటె ఇవన్నీ ఎందుకు జరుగుతున్నాయి అనేది మీరు కనిపెట్టారా?
ధనుంజయ్ : అవును సార్. ఎందుకు? ఎవరు? అనే వివరాలు మీకు త్వరలోనె తెలియజేస్తాను సార్.
మంత్రి : సరే అయితె. ఆ అన్నట్టు చెప్పడం మర్చిపొయా. నేను కాల్ చేయడానికి కారణం ఇంకోటి ఉంది.
ధనుంజయ్ : ఎంటి సార్?
మంత్రి : నీకు దంతపురం లొని మహేంద్ర వర్మ తెలుసు కదా.?
ధనుంజయ్ : తెలుసు సార్?
మంత్రి : ఆయన ఉదయం విశాఖపట్టణం వచ్చి నన్ను కలిసారు.
ధనుంజయ్ : దేనికి సార్?
మంత్రి : ఏం లేదు ఊరి మద్యలొ ఆ విరగిపోయిన విరఘాతకుడి విగ్రహం ఉంది కదా. దాని చోటు లొ మరొ కొత్త విగ్రహం పెట్టి ఏదొ హోమం చెయ్యాలి అనుకుంటున్నారు.
ధనుంజయ్ : దానికి మీరు ఏమన్నారు.?
మంత్రి : ఇంకా ఏమి అనలేదు. నువ్వు చెప్పినదానిబట్టి ఆయనకి అనుమతి ఇవ్వాలొ లేదు చూస్తాను. నువ్వు చెప్పు ఏం చెయ్యాలి
ధనుంజయ్ : నాకు ఒక్క గంట సమయం ఇవ్వండి మళ్ళి మీకు కాల్ చేస్తాను.
అని చెప్పి కాల్ కట్ చేసి కాసేపు అందిరిని ఆ గది నుంచి బయటకు పంపించి తరువాత తాను తన మొబైల్ లొ నుంచి ఒక రహస్య పొలీసు అధికారి (Undercover Police Officer) కి కాల్ చేస్తాడు
అవతల ఆ వ్యక్తి ఫోన్ మోగుతుంది. అతను తీసి మాట్లాడతాడు.
అవతలి వ్యక్తి : చెప్పండి సార్.
ధనుంజయ్ : ఎంత వరకు వచ్చింది నీ పని?
అవతలి వ్యక్తి : ఈ రాత్రికె పని పూర్తి అయిపోతుంది సార్.
ధనుంజయ్ : అయితె మమల్ని ఎప్పుడు రమ్మంటావు?
అవతలి వ్యక్తి : సమయం రాగానె చెప్తాను సార్. మీరంత సిద్దంగా ఉండండి
ధనుంజయ్ : సరే. ఇంకో విషయం ఆ మహేంద్ర వర్మ. దంతపురం ఊరి మద్యలొ వీరఘాతకుడి కొత్త విగ్రహం పెట్టాలి అనుకుంటున్నాడు దాంతొ పాటు ఏదొ హోమం అంటా. మంత్రి గారిని అనుమతి అడగాడు. ఆయన మనల్ని అడుగుతున్నారు.
అవతలి వ్యక్తి : పరవలేదు సార్ ఒప్పుకోండి. మనకు కూడా అది ఉపయోగ పడుతుంది.
ధనుంజయ్ : సరే ఏర్పాట్లు చేసుకోమని చెబుతా.
అవతలి వ్యక్తి : ఉంటా సార్.
అని చెప్పి కాల్ కట్ చేయగానె. "వంశి.." అని గురుముర్తి పిలుస్తాడు.
"వస్తున్నా పెద్దనాన్న..." అని చెప్పి వంశి తన ఫోన్ ని స్విచ్ ఆఫ్ చేసి దానిని దాచి ఇంకొ ఫోన్ ని తన జేబులొ పెట్టుకొని వెళతాడు
............................................................
విశాఖపట్టణం లొ మంత్రి ఆనందరాజు ని కలిసిన మహేంద్ర వర్మ తిరిగి దంతపురానికి వస్తాడు. వస్తున్న దారి లోనె మహేంద్ర వర్మ కి మంత్రి నుంచి కాల్ వస్తుంది వీరఘాతకుడి విగ్రహ పెట్టుకోమని అనుమతి ఇస్తాడు.
తరువాత దంతపురం లొని తన బంగళాకి ఊరి పెద్దలను పిలిచి. వీరఘాతకుడి కొత్త విగ్రహం ఆవిష్కరణకు మరియు హోమానికి ఏర్పాట్లు చేయమని చెబుతాడు.
తరువాత అందిరిని పంపించి బంగళాలోని తన గది లోకి వెళ్ళి తన కొడుకు కి కాల్ చేస్తాడు.
మహేంద్ర వర్మ : ఏరా. ఎంత వరకు వచ్చింది? ఏమైన తెలిసిందా?
కొడుకు : ఇంకా ఏం లేదు నాన్న.?
మహేంద్ర వర్మ : ఏం లేదంటె.? ఇంకెన్ని రొజులు కావాలి? మనకి చాలా తక్కువ సమయమె ఉంది. ఈ లోపు ఎలాగైన కనుక్కొ.
కొడుకు : ఎక్కువ రోజులు ఏం వద్దు నాన్న. ఒక్క 2 రోజులు చాలు.
మహేంద్ర వర్మ : సరే. ఉంటా
కొడుకు : సరె నాన్న ఉంటా
అని చెప్పి కాల్ కట్ చెస్తాడు. తరువాత వెనక నుండి ఒకరు తన భుజం పై చెయ్య వేసి.
"ఎమైంది విక్రమ్? ఎవరు కాల్ చేసింది? " అని నదీర్ విక్రమ్ ని అలియాస్ విక్రమ దేవ వర్మ ని అడుగుతాడు.
"నాన్న కాల్ చేసారు. ఆ మహేష్ చేత నిజం చెప్పించడానికి ఇంక ఎన్ని రోజులు పడుతుంది అని అడుగుతున్నారు" అని విక్రమ్ నదీర్ కి చెబుతాడు.
............................................................
అనుమతి వచ్చిన కొన్ని రోజుల కె దంతపురం ఊరి నడి బొడ్డు లొ వీరఘాతకుడి కొత్త విగ్రహం ప్రతిష్టించి. పెద్ద శాంతి హోమం చేయించారు.
ఆ కార్యక్రమాలొ ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు (unexpected events) జరగకుండా పొలిసులు గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు.
అక్కడె ఉన్న వంశి చుట్టు ఉన్న జనాన్ని చూస్తూ వాళ్ళందరి కదలికలని గమనిస్తున్నాడు. అక్కడ జరుగుతున్నవన్ని తన వీడియొ కేమరాలొ రికార్డ్ చేస్తున్నాడు.
ఆ సమయం లొ అక్కడున్న ఆ ఊరి గుడి పూజారి చేతికి మెరుస్తున్న కడియం వంశి కి కనిపిస్తుంది.
............................................................
ప్రత్యేక దర్యాప్తు బృందం అధికారి (SIT Officer) ధనుంజయ్ తనకు వంశి నుంచి వచ్చిన సమాచారం ప్రకారం తన బృందం (team) తొ కలిసి ఈ రోజు రాత్రి కోసం సర్వం సిద్దం చేసి వంశి కాల్ కోసం ఎదురు చూస్తాడు.
ఆ రోజు రాత్రి ప్రజలందరు ఇంక ఈ విరఘాతకుడి వల్ల ఎటువంటి చావులు జరగవని ప్రశాంతంగా నిద్రపోతున్నారు.
ఆ రాత్రి వంశి తన గది నుంచి బయటకి వచ్చి పెద్దనాన్న గురుమూర్తి గదికి వెళ్ళి చూస్తె అక్కడ తను ఉండడు. వెంటనె తన గదికి వెళ్ళి కావలసిన వస్తువులు తీసుకొని బయటికి వస్తాడు.
తరువాత పూజారి ఇంటికి వెళ్ళి ఆ ఇంటి కిటికీ లోంచి లోపల చూస్తాడు. ఇంట్లొ పూజారి కూడా ఉండడు.
అప్పుడు ప్ర.ద.బృ అధికారి (SIT officer) ధనుంజయ్ కి వంశి తన సెల్ఫోన్ ద్వారా సమాచారం అందిస్తాడు. తరువాత తను నేరుగా ఊరి చివర మఱ్ఱి చెట్టు వద్ద కు బయలుదేరుతాడు.
ఊరి దాటాక మార్గ మద్యలొ తన పెద్ద నాన్న గురుమూర్తి మరియు ఆ ఊరి గుడి పూజారి ఇద్దరు ఆ మఱ్ఱి చెట్టు వద్దకు నడుచుకుంటు వెళుతుండడం చూస్తాడు.
నెమ్మదిగా వాళ్ళ వెనకే వెళతాడు. కాసేపిటికి వాళ్ళు ఆ మఱ్ఱి చెట్టు వద్దకు చేరుకుంటారు. వంశి ఇంతకు ముందు లాగె ఇప్పుడు కూడా తాను కొంచెం దూరంగా నించోని చూస్తుంటాడు.
గురుమూర్తి మరియు పూజారి ఆ మఱ్ఱి చెట్టును అలా చూస్తూ నించుటారు. కాసేపటికి ఆ చెట్టు వెనుక నుంచి పొగ రావడం ప్రారంభం అవుతుంది. ఆ పొగ మొత్తం కమ్ముకొనె సమయానికి ఒక పెద్ద గాలి వచ్చి ఆ పొగ ని తొలగిస్తుంది.
ఆ గాలి వచ్చె వైపు వంశి చూస్తె ఆక్కడ ప్ర.ద.బృ అధికారి (SIT officer) ధనుంజయ్ తన బృందం తొ కలిసి పెద్ద పెద్ద ఫాన్ల తొ (fans) ఆ పొగ ని తొలగిస్తు కనిపించారు.
ఆ పొగ పోగానె మఱ్ఱి చెట్టు వద్ద ఆ నల్ల ని ఆకారంలొ ఉన్న వ్యక్తి కనిపిస్తాడు. అతను అక్కడ ఉన్న వంశి మరియు పొలీసుల ను చూసి ఖంగారు పడి పారి బొతుంటె. వెనుక నుంచి ఇద్దరు పొలీసులు వచ్చి పట్టుకుంటారు.
తరువాత వంశి బాధపడతూ ఆ వ్యక్తి వద్దకు వచ్చి.
"ఇలా ఎందుకు చేశావు? ఎందుకు ఇంత మంది ని చంపుతున్నావు నాన్నా ? " అని అడుగుతాడు.
నారాయణమూర్తి తన కొడుకు వంశి వైపు ని చూసి నవ్వతాడు.