Akhira - A tale of presence - 2 in Telugu Drama by Sangeetha Pushpa books and stories PDF | అఖిరా – ఒక ఉనికి కథ - 2

Featured Books
Categories
Share

అఖిరా – ఒక ఉనికి కథ - 2

ఎపిసోడ్ – 2

అఖిరా హాస్పిటల్ కి చేరుకుంది.
కంగారుగా రిసెప్షన్ లో ఇలా అడిగింది –
“ఎక్స్క్యూస్ మీ, ఎక్స్క్యూస్ మీ మామ్… పేషెంట్ పేరు సువర్ణ. అడ్మిట్ అయ్యారు. ఏ వార్డ్ లో ఉన్నారు?” అని అడిగింది.

రిసెప్షన్ లో ఉన్న అమ్మాయి,
“పైన ఫస్ట్ ఫ్లోర్, రూమ్ నంబర్ 4 లో చూడండి,” అని చెప్పింది.

అఖిరా, “ఓకే, థ్యాంక్స్,” అని చెప్పి పరుగెత్తింది.

డోర్ తేసి చూసింది — సువర్ణ పడుకుని ఉంది, పక్కనే నిక్కి కూర్చుంది.

అఖిరా, “నిక్కి, పిన్నికి ఇప్పుడు ఎలా ఉంది?” అని అడిగింది.

నిక్కి, “అక్కా, ఇప్పుడు పరవాలేదు. మళ్లీ అదే ప్రాబ్లం… కిచెన్ లో పని చేస్తూ స్పృహ తప్పి పడిపోయింది. ఈరోజు టెస్ట్ క్యాన్సిల్ అయ్యిపోయింది. ఇంటికి తొందరగా వచ్చాను. అమ్మని అలా చూడగానే వెంటనే హాస్పిటల్ కి తీసుకువచ్చా,” అని చెప్పింది.

అఖిరా కొంచెం రిలాక్స్ అయ్యింది.
“సరే, ఎప్పుడు డిశ్చార్జ్ చేయొచ్చు అన్నారు డాక్టర్?” అని అడిగింది.

నిక్కి, “ఇప్పుడే డ్రిప్స్ వేశారు అక్కా. ఈరోజు పూర్తిగా కోలుకుంటే రేపు డిశ్చార్జ్ చేస్తామని చెప్పారు,” అని చెప్పింది.

అఖిరా, “సరే, నువ్వు ఇక్కడే ఉండు. నేను కింద బిల్ పే చేసి వస్తాను,” అని చెప్పి కిందకి వచ్చింది.

కౌంటర్ లో బిల్ పే చేసి పక్కనే సీట్లో కూర్చుంది. కళ్లలో నీళ్లు మెరుస్తున్నాయి.
చేతి చెయ్యి కళ్ల దగ్గర పెట్టుకుని, కళ్ళు మూసుకుని తన తండ్రిని తలచుకుంది.

“నాన్నా…” అని ఏడుస్తూ పిలుస్తుంది అంతలోనే.

డాక్టర్, “అఖిరా!” అని పిలిచింది.

అది విని అఖిరా కళ్ళు తుడుచుకుని వచ్చింది.
“Yes, doctor,” అని చెప్పగా డాక్టర్,
“అఖిరా, నీకు తెలుసు కదా నీ పిన్నీ కండిషన్ ఎలా ఉందో. మూడు నెలలుగా ట్రీట్మెంట్ డిలే అవుతోంది. ఇప్పుడు ఉన్న కండిషన్ లో ఎలాగైనా ట్రీట్మెంట్ చేయాలి అఖిరా,” అని అనగా—

అఖిరా, “I know doctor, నేనూ ఫండ్స్ అరేంజ్ చేయడానికి ట్రై చేస్తున్నాను. ఇంకొంచెం టైం ఇవ్వండి,” అని చెప్పగా,

డాక్టర్, “నాకు అర్థమవుతోంది అఖిరా, నువ్వు ఏ పొజిషన్ లో ఉన్నావో. కానీ ఇంకా ఒక నెల మాత్రమే టైం ఉంది. ఒక నెలలో డబ్బులు అరేంజ్ చేయలేకపోతే నేను అనుకున్నది ఏమీ చేయలేను,” అని చెప్పింది.

అఖిరా, “Ok, I will do something,” అని చెప్పి రూమ్ కి వచ్చింది.

నిక్కి, “డాక్టర్ ఏమన్నారు అక్కా?” అని అడిగింది.

అఖిరా ఆమెకి ఏం చెప్పకుండా, “ఏం లేదు,” అని తల ఊపింది.

నిక్కి, “సరే, నువ్వు కాలేజ్ కి వెళ్ళు. ఇక్కడ నేను చూసుకుంటాను,” అని చెప్పింది.

అఖిరా, “లేదు, నేను ఉంటాను లే,” అనగా నిక్కి,
“అక్కా, నేను చెబుతున్నానుగా నువ్వు వెళ్ళు. నేను ఉన్నాను కదా. కాంటీన్ లో ఎమైనా తింటాను లే, ఈవెనింగ్ ఎలాగూ వస్తావు కదా. వెళ్ళు, ఏమైనా అవసరం ఉంటే నేను కాల్ చేస్తాను. ఫోన్ కూడ చార్జ్ చేసుకున్నా. నువ్వు వెళ్ళు,” అని చెప్పింది.

అఖిరా, “పక్కా నా?” అని మళ్లీ అడిగింది.

నిక్కి, “Yes, please, వెళ్ళు,” అని చెప్పగా,
“సరే, జాగ్రత్త,” అని చెప్పి అఖిరా వెళ్లిపోయింది.

మళ్లీ క్లాస్ అటెండ్ చేసి బయటికి వస్తుంది.
వాచ్ చూస్తే 3PM అయ్యింది.
“సత్య కాంటీన్ లోనే ఉంటుంది,” అని అనుకుంటూ కాంటీన్ వైపు వెళ్తుంది.

ఎవరో వ్యక్తి చాలా కోపంతో తన చేతిలో ఉన్న ప్రాజెక్ట్ ని కింద వేసి వెళ్లిపోయాడు.
అఖిరా చూసి, “Hey mister, hello!” అని పిలిచినా వినకుండా అతను వెళ్లిపోయాడు.

అఖిరా చేతిలో తీసుకుని చుట్టూ చూసింది.
“Thank God, ఎక్కడా డ్యామేజ్ అవ్వలేదు,” అని చెప్పుకుంటూ,
“పేరేదైనా ఉందేమో చూద్దాం,” అనుకుంది — కానీ ఏ పేరు లేదు.

కాంటీన్ కి వచ్చి కూర్చుంది.

సత్య, “ఏమైంది?” అని అడిగింది.

అఖిరా, “తెలిసిందే కదా, she fainted again. డాక్టర్ చెప్పారు — ఒక నెలలో డబ్బులు అరేంజ్ చేయలేకపోతే ఏమీ చేయలేమని,” అని చెప్పింది.

సత్య, “కంగారు పడకు, ఏదో ఒకటి ట్రై చేద్దాం,” అని సానుభూతిగా చెప్పింది.

పక్కనే ఉన్న మోడల్ చూసి, “ఇది ఎక్కడ నుండి తెచ్చావు?” అని అడిగింది.

“కింద ఎవరో వేసి వెళ్లారు,” అని చెప్పగా సత్య,
“మంచి టైం కి నీకు ఇది దొరికింది. వెళ్ళి దీన్ని సబ్మిట్ చేయి,” అని చెప్పింది.

అఖిరా, “Hey no! ఎవరో చేసిందానికి నన్ను క్రెడిట్ తీసుకోమంటావా? ఏమి వద్దు,” అని చెప్పింది.

సత్య, “ఇప్పుడు నీ దగ్గర వేరే ఆప్షన్ ఉందా?” అని అడగగా,
అఖిరా, “లేదు,” అని అడ్డంగా తల ఊపింది.

సత్య, “మరి చూడు, పేరు కూడ రాయలేదు. అనవసరం అని అనుకున్నాడేమో వేసి వెళ్లిపోయాడు. అది నీకు పనికొచ్చింది అంతే ఇంకేమీ ఆలోచించకు — వెళ్ళి సబ్మిట్ చేయి,” అని చెప్పింది.

అఖిరా కూడా వేరే దారి లేక, “సరే,” అని చెప్పి లైబ్రరీకి వెళ్లి దానికి సంబంధించిన రికార్డ్ మొత్తం తయారు చేసి సబ్మిట్ చేసింది.

“Thank you దేవుడా, atleast ఒక ప్రాబ్లం అయినా సాల్వ్ అయ్యింది,” అనుకుంది.
“5 లోపే సబ్మిట్ చేశాను,” అని తనలో తానే అనుకుంది.

---

ముందుకు కొనసాగుతుంది…

---