మొక్కజొన్న చేనుకు మందు కొట్టిన రాత్రి ఒక్కటే భారీ వర్షం..నా వొళ్లుకు అట్టుకొని వున్న మందు మొత్తం పోయింది.
అయ్యో మా రాము కష్టపడిన పని అంతా వృధా అయిపోయింది అని నాకు ఎంతో బాధగా అనిపించిదీ.
వాన పడక పోతే..మందు పవర్ కనీసం 3,4 రోజులు అయిన వుండేది.అపుడు కొద్దిగా చనిపోని పురుగులు నా దగ్గరకి వచ్చి నా ఆకులను తిన్నా అవి చనిపోయేవి.
కానీ ఇప్పుడు  చనిపొని  పురుగులు కొంచం కొంచంగా  నా దగ్గరికి వస్తూ వుంటాయి.
వాన పడిన తెల్లారి నా పక్కన నుంచి చాలా వరద నీరు పోయింది.అందుకని నాకు బలాన్ని ఇచ్చే మట్టి ఆ వరదకు కొట్టుకు పోయింది.
ఆ మట్టి పోవడం తో నాకు బలం లేక నేను అటు ఇటు పడుతున్నాను.
నా కింద వున్న  నా సోదరుల దగ్గర చాలా నీళ్లు ఆగి వున్నాయి ..మా రాము వచ్చి వాటిని కిందికి పోయేలా ఒడ్డును నరికి కిందికి పోయేలాగా చేశాడు.
మొత్తానికి బాగా వర్షం పడడం తో మేము చాలా బలహీనంగా అయిపోయాము.
ఈ రోజు వర్షం ఎంత పడిందో... ఎండ కూడా అంతే కొడుతుంది.
సూర్యుడి వేడికి భూమి త్వరగా నీటినీ పీల్చుకుంటుంది.
రెండు రోజులలో మొత్తం నీరు అంత పోయి భూమి ఆరిపోయింది.
భూమి ఆరిపోయింది కానీ నాకంటే త్వరగా నా పక్కకు గడ్డి పెరిగిపోతుంది.
అందుకే అంటారు కదా మనుషులు..మంచి కంటే చెడు త్వరగా అందరికీ చేరుతుంది అని
వెంటనే మా రాము ఆ గడ్డిని చూసి తన ఎడ్లను తీసుకొని వచ్చి..నాగలి కట్టి మా మధ్యలో వున్న గడ్డిని ఏమి లేకుండా దున్నాడు.
ఆ నాగలి తాగి...అలాగే కొన్ని ఏడ్లు తొక్కి మా సోదరుల నడుములు విరిగిపోతునాయి.
మా రాము వాటిని చూస్తూ కొంచం కొంచం గా వాటికి పక్కకు మట్టిని పెట్టీ వెంటనే లేపుతున్నాడు.కానీ వాటికి బతికే ఛాన్స్ వుంటే బతుకుతాయి.
నెమ్మది నెమ్మదిగా సాయంత్రం వరకు చెలక మొత్తం ధున్నాడు.
సాయంత్రం వరకు ఎడ్లు అలసి పోయాయి..రాము కూడా అలసిపోయాడు.
దున్నడం మొత్తం అయిపోయిన తరువాత ఎడ్లు విడిచి..న పక్కకు ఓడ్డు మీద వున్న పచ్చ  గడ్డిని మెపుతున్నాడు.
వాటికి కడుపారా తిండిని పెడితేనే కదా అవి మనకు పని చేసేవి.
రాము ముందుగా అన్నం తినకుండా వాటీ కడుపు నిండే వరకు ఎడ్లను మెపాడు.
 పనికి రాని గడ్డి కూడా మనిషికి ఏదో విధంగా గా ఉపయోగ పడుతుంది .
ఇంతలో  రాము వాళ్ళ అమ్మ వచ్చి నేను ఎడ్లను మెపుత కానీ నువు ఇంటికి వెళ్లి అన్నం తిని రా అని చెప్పింది.దానితో రాము ఎడ్లను వాళ్ళ అమ్మ కు ఇచ్చి ఇంటికి వెళ్ళాడు.
కొడుకు ఆకలి కేవలం తల్లికే మాత్రమే తెలుస్తుంది కదా..
ఎడ్లను పట్టుకొని అటు ఇటు తిరిగి గడ్డిని చాలా సేపు మెపారు.
అన్నం తిని రాము వచ్చి ఎడ్లను తీసుకొని కొట్టం దగ్గరికి వాటిని తీసుకొని వెళ్ళాడు.
చిన్న పిల్లలుగా వాటిని చూసుకుంటేనే అవి మనకు పని చేస్తాయి..
మాటలు రావు కదా అని వాటిని రైతు ఏప్పుడు వదిలెయ్యాడు.
రైతు ఒక పూట తినకుండా అయిన వుంటాడు కానీ వాటిని మాత్రం పస్తులు వుంచడు.
ఎడ్లను కొట్టంలో జాగర్తగా కట్టేసి..వర్షం వచ్చిన అవి తడవకుండా వుండేలా అలాగే..తాడును వుడాగొట్టుకొని పక్క వాళ్ళ చెనును పాడు చెయ్యకుండా జాగర్తగా కట్టేసి..చీకటి పడిన తరువాత ఇంటికి చేరుకున్నాడు.
ఆ చీకట్లో కూడా దేనికి భయపడకుండా ..అన్నిటికీ ఆ మైసవ తల్లి చూసుకుంటుంది అనే ధైర్యంతో అన్నిటిని సరిగా చక్కబెట్టి ఇంటికి చేరుకున్నాడు.
తను ఇంటికి క్షేమంగా వెళ్ళాడు అనే సంతోషం తో నేను కంటి నిండా నిద్ర తీసాను.
ఇలా పడుకున్నానో లేదో అలా తెల్లారింది అనిపించింది.
 ఉదయం 4 గంటల నుంచే వూరిలో కోడి కూతలు వినిపిస్తున్నాయి.
అవి చేసే సౌండ్స్ కి నేను నిద్ర లేచి కొద్దిగా పైకి పెరిగి వాటిని చూస్తునాను.
పూర్తిగా తెల్లవారిన తరువాత మా రాము కొన్ని యూరియా సంచులు తెచ్చి నా చెలాక దగ్గర వేసి వెళ్ళాడు.
వాడిని చూడగానే "హమ్మయ్య నాకు మంచి బలం వచ్చే గ్లోకోస్ తెచ్చాడు" అనిపించింది.
కొదిసేపటి తరువాత రాము భార్య వచ్చి ఒక డబ్బాలో యూరియా తీసుకొని కొంచం కొంచం గా మా వెర్ల దగ్గర వేస్తూ వెళ్తుంది.
మా రాము దూరం నుంచి చూస్తూ ఎక్కడయినా కొంచం ఎక్కువ పడితే తనని తిడుతున్నారు.
చూసి వెయ్ ఎక్కువ వేస్తే చిన్న మొలకలు కదా చనిపోతాయి అని.
సరే! ఎప్పుడో ఒకసారి కొంచం ఎక్కువ పడుతుంది కానీ మంచిగానే వేస్త తీీ  అని రాము భార్య అంటుంది.
"సరే నేను పత్తి దున్నటానికి వెళ్తున్న జాగ్రత్తగా చూసి వెయ్యి" అని చెప్పి వెళ్ళాడు.
తను కొంచం కొంచం యూరియా వేస్తూ చాలా వేగం గా త్వరగా యూరియా వేస్తుంది.
అలా వేస్తూ వేస్తూ మధ్యానం వరకు చెలాక మొత్తం యూరియా వేయడం పూర్తి చేసింది.
మా రాము కంటే తినే ఇంకా స్పీడ్ గా పని చేస్తుంది అనిపించింది నాకు.
ఎందుకంటే తను పని అయిపోయే దాకా 5 నిమిషాలు కూడా కూర్చోలేదు.
తను వంగుకుంట చెలక మొత్తం యూరియా వేసింది కానీ ఒక్కసారి కూడా అలసిపోయి ఆగలేదు.
నిజంగా మగవారి కంటే ఆడవారికి ఓపిక ఎక్కువ వుంటుంది అంటారు ఇందుకే కావచ్చు..అనిపించింది.
ఇంక వుంది...