The girl I love is Anna. in Telugu Love Stories by M Nagaraj books and stories PDF | ప్రేమించిన అమ్మాయి అన్నా అంటే

Featured Books
Categories
Share

ప్రేమించిన అమ్మాయి అన్నా అంటే

రైలు పట్టాల మధ్యలో, ఒక 22 ఏళ్ల యువకుడు బోరుమని వెక్కీ.. వెక్కీ.. ఏడుస్తున్నాడు... చుట్టుపక్కల ఎవరూ లేరు.. ఆ యువకుడు చూడటానికి నల్లగా ఉండి. అమాయకత్వం అతని ముఖంలో స్పష్టంగా కనిపిస్తుంది..! వాడు యమలోకానికి ప్రయాణం చేయాలని రైలు కోసం ఎదురు చూస్తు.. ఇలా అనుకుంటాడు..! 
                    
ఆ యువకుడు ; (తనలోతానే) ఈ రైలు వచ్చేంత వరకు.. ఈ బాధను నేను మోస్తూనే ఉండాలి.. అప్పటిదాకా నేను క్షణక్షణం చస్తూనే ఉండాలి..! అసలు పేపర్లో, ప్రేమ విఫలమై ఆత్మహత్య చేసుకున్న యువకుడు. అని చదివేటప్పుడు.. ఈ మాత్రం దానికి ఎందుకు చనిపోతున్నారు అని అనుకునేవాడిని..!  ఇప్పుడు అర్థమవుతుంది వాళ్ళు ఎందుకు చనిపోతున్నారు అని. ఈ బాధ భరించడం కంటే చావడం ఎంతో మేలు..!!! ఈ ట్రైన్ త్వరగా వస్తే బాగుండును.. అని అనుకుంటూ తన గతాన్ని తలుచుకుంటూ..! (ఫ్లాష్ బ్యాక్)

                        రెండు నెలల క్రితం గవర్నమెంట్ డిగ్రీ కాలేజీలో, డిగ్రీ ఫైనల్ ఇయర్ చదువుతున్నాను..! నా పేరు రవి.. రవి కుమార్... కానీ నన్ను ఎవరు ఈ పేరుతో పిలిచే వాళ్లే లేరు..! నా ఫ్రెండ్స్, కాలేజీ లో కొంతమంది నన్ను ఎలా పిలుస్తారో తెలుసా..? కర్రోడా.. అరె కర్రీ... కర్రీ రవి గా... కర్రీ రవి కుమార్... ఇలాగే పిలుస్తారు.. ఇలా పిలిచిన ప్రతిసారి నాకు బాధ, వాళ్ళ పైన కోపం, రెండూ వచ్చేవి. నా ఫ్రెండ్స్ కి ఎన్నిసార్లు చెప్పినా వినిపించుకునే వాళ్ళు కాదు.. నన్ను అలాగే పిలిచేవాళ్ళు..! ఎందుకంటే నా బ్యాచ్ అలాంటిది. మొత్తం చిల్లర బ్యాచ్..! ఇందులో నలుగురు అమ్మాయిలు కూడా ఉన్నారు.. వాళ్లు నవ్వు కోవడం కోసం నాకు సినిమా చూపించేవారు..! పైగా నేను అమాయకుడిని. అంతేకాదు అమ్మాయిలంటే కొంత భయం కూడా ఉంది. వాళ్లతో సరిగ్గా మాట్లాడను.. అందుకోసమే నన్ను అందరూ అన్న అని పిలుస్తారు.. నాకు వరసకి మరదలు అయ్యే వాళ్లు కూడా అన్నా అని అంటారు..  ఒక్క పంచ్ వేయడానికి కూడా సరిగ్గా రాదు.. అందుకే అందరూ నన్ను టార్గెట్ చేస్తారు.. ఇంత జరిగినా నేను వాళ్ళని వదిలే వాడిని కాదు. ఎందుకంటే వాళ్ళు అంతా నా ఫ్రెండ్స్..! 
  
                    వీళ్లందరి లోకెల్లా నాకు చిన్నప్పటి నుంచి. బెస్ట్ ఫ్రెండ్ ఒకడు ఉన్నాడు.. వాడే "రాహుల్" నాకు కంప్లీట్ ఆపోజిట్ విడు. ఎందులో అంటే అందంలో.. చాలా హ్యాండ్ సమ్ గా, చాలా స్టైలిష్ గా, ట్రెండ్కు తగ్గట్టు ఉంటాడు..!అమ్మాయిలతో కూడా చాలా ఈజీగా కనెక్ట్ అవుతాడు.. వాళ్ల ఫాలోయింగ్ కూడ ఎక్కువ.. మా బ్యాచ్ లో నెంబర్ వన్ వీడే. కామెడీ టైమింగ్ చాలా ఎక్కువ..! ఒక్క ముక్కలో విడి క్యారెక్టర్ గురించి చెప్పాలంటే.. 11 మంది ఉంటే, అందులో 10 మందిని బాగా నవ్విస్తాడు.. ఆ మిగిలిన ఒక్కడిని, ఏడుపిస్తాడు.. నా బ్యాడ్ లక్ ఏమిటంటే, ఆ ఒక్కడి నేనే అవుతాను ప్రతిసారి..! పదిమందిలో ఉన్నప్పుడు.. ముఖ్యంగా అమ్మాయిలు ఉన్నప్పుడు.. నా మీద కుల్లు జోక్స్,  ఎక్కువ వేస్తాడు. అందర్నీ నవ్విస్తాడు.. అయినా సరే నాకు వీడు అంటే చాలా ఇష్టం. ఎందుకంటే నేను సింగల్ గా ఉన్నప్పుడు, మంచి మంచి సలహాలు ఇస్తాడు.. మార్చడానికి ట్రై చేస్తాడు.. అందుకే వీడు నా బెస్ట్ ఫ్రెండ్ అయ్యాడు..! 

                     రోజు నా బ్యాడ్ లక్, ఎలా స్టార్ట్ అవుతుందో తెలుసా..? కాలేజ్ కి రెడీ అయ్యే సమయంలో, అద్దం ముందు నిల్చున్నాపుడు. నా ముఖాన్ని అందులో చూసినప్పుడు.. ఎవడ్రా ఈ అద్దాన్ని కనిపెట్టింది అని అనిపిస్తుంది..! దానికి తోడు ఈ పౌడర్ ఒక్కటి. దీన్ని చూస్తే నాకు ఎక్కడలేని కోపం వస్తుంది.. ఎందుకంటే  నల్లగా, పుట్టడం వల్ల. దీన్ని కొట్టుకుంటే ఒక బాధ.. కొట్టకపోతే ఇంకో బాధ..! 
పౌడర్ కొట్టుకున్నాను అనుకో.. రేయ్ మీ ముఖానికి ఎంత పౌడర్, పూసిన వేస్ట్ అలాగే ఉంటావు లెరా.. అంటారు..! కొట్టక పోతే, ఒరేయ్ నీ ముఖాన్ని  చూడలేక చస్తున్నాం. ఆ పౌడర్ కొంచెం కొట్టుకొని సాయ్.. అంటారు. ఎలా అయినా నాకు కౌంటర్ మాత్రం తప్పదు..! ఇలా రోజు డిసప్పాయింట్ తో కాలేజ్ డేస్ ని అనుభవిస్తున్నాను..! 

                   ఇదిలా ఉంటే ఒక రోజు మా కాలేజ్ కి ఒక కొత్త అమ్మాయి జాయిన్ అయింది.. అందరూ సూపర్ గా ఉందిరా అంటూ ఉంటే.. నాకు వెనక్కి తిరిగి చూడాలనిపించింది. చూస్తే నిజంగాంటే సూపర్ అనే పదం కూడా సరిపోదు.. ఆ వైట్ డ్రెస్ లో అంతే వైట్ గా.. ఏంజెల్ లా ఉంది. నాకు ఫస్ట్ టైం, ఈ అమ్మాయిని ఏకంగా పెళ్లి చేసుకోవాలి అని అనిపించింది.. నా ముందు నుంచి అలా వెళ్తుంది.. నేను మంచి ఫీల్ తో అలా చూస్తూ.. కొంచెం పక్కకు చూసాను.. అప్పుడు నాకు ఒక దారుణం.. కనిపించింది..! అది బైక్ అద్దం లో నా మొఖం.. చీ... నా ముఖానికి ఈ అమ్మాయి కావాలా ఏంటి.. అని నాకే అనిపించింది.. వెంటనే నా మనసు కు అంత సీన్ లేదు.. ఇక్కడే డ్రాప్ ఐపొ అనుకున్నాను..! 
  
                  తర్వాత క్లాస్ రూం లోకి వెళ్లాను.. నా బ్యాడ్ లక్ కో, గుడ్ లక్ కో, తెలియదు గానీ, ఆమె నా క్లాస్ లోనే ఉంది.. రాహుల్ గాడు ఆమెను పరిచయం చేసుకొని. మా బ్యాచ్ లో కూడా కలిపేసాడు.. అందరినీ పరిచయం చేస్తున్నాడు. నన్ను పరిచయం చేస్తాడు. అనే భయంతో వెనక్కి తిరిగి మెల్లగా వెళ్తున్నాను.. అంతలో వాడు...

rahul ; రేయ్.. ravi.. ఇలా రా రా.. మనకు కొత్త ఫ్రెండ్ వచ్చింది..!
               (నేను భయంతో వినిపించి వినిపించకుండా.. మెల్లగా అలా వెళ్తునె ఉన్నాను.. ఇంకో ఫ్రెండు శీనుగాడు..) 

శీను గాడు ; (గట్టిగా) రెయ్.. కర్రోడా... ఇలా రా.. రా...  
           
                 నేను చిరాగ్గా వాడిని రెయ్... అని వెనక్కి తిరిగాను.. వాడి మాటకు ఆమెతో సహా అందరూ నవ్వారు..! 

శీనుగాడు ; (రాహుల్ తో) వాడిని పేరుతో పిలవద్దని ఎన్నో సార్లు చెప్పాలి రా..?  ఇప్పుడు చూడు. కర్రోడా అన్నందుకు ఎంత చక్కగా తిరిగాడో.. ఇలా రా.. రా.. కర్రోడ..! 

(వాళ్ళందరూ ఇంకా బాగా నవ్వుతూనే ఉన్నారు ఆమె కూడా) 

రవి ; (మనసులో) నీ యబ్బ.. ఫస్ట్ సీన్ లోనే నా పరువు మొత్తం తీసేసావు కదరా..! రాహుల్ గాడు. పేరుతో పిలిచినప్పుడు, తిరిగి ఉంటే బాగుండేది.. అనుకుంటూ అవమానంతో అక్కడికి వెళ్లాను..!

రాహుల్ ; (ఆమెతో) వీడి పేరు.. రవి.. రవి కుమార్..! 

శీనుగాడు ; కాదు.. కర్రీ.. కర్రీ రవికుమార్..! అలా పిలిస్తే పలుకుతాడు.. చూశారు కదా ఇంతకుముందే.. (మళ్లీ అందరూ బాగా నవ్వుతారు) 

రవి ;  (వాడి మీద కోపంతో) రెయ్.. నువ్వు నోరు ముయ్యి రా..! 

ఆమె ; (నవ్వు ఆపుకుని) ఏయ్.. ఎందుకు అలా అంటున్నారు.. నల్లగా ఉండటం.. అతని తప్ప.. అతను అది స్వయంగా చేసుకునింది కాదు కదా..! సో అలా పిలవడం తప్పు.. నేను మాత్రం రవి అనే పిలుస్తాను.. హాయ్ రవి.. ఐయామ్ శ్రుతి.. (అని షేక్ హ్యాండ్ ఇస్తుంది)

               నేను సెకండ్ ఇస్తూ.. మనసులో ఆహా..! అందానికి అందం.. అంతే అందమైన మనసు.. నా గుండెల్లో అయితే ఒక గంట కొట్టింది.. 

రాహుల్ ; చాల్లేరా ఎంతసేపు పడుకుంటావు.. (అనగానే రవి హ్యాండ్ వదులుతాడు..) శృతి వీడివల్ల మనకు మంచి ఎంటర్టైన్మెంట్ దొరుకుతుంది...! 

శృతి ; నైస్ గాయ్.. (అని నా వైపు చూసి స్మైల్ ఇచ్చింది ఇక నేను అవుట్)

             ఇక తర్వాత టీచర్ వచ్చి క్లాస్స్ చెప్తుంది.. నేను అది వినకుండా శృతినే చూస్తూ ఉన్నాను..! కొద్ది సేపటికి నా మనసు ఇలా చెప్పింది. ఇది వర్కౌట్ కాదు లేరా.. అనవసరంగా ఆమె పైన ఆశలు పెట్టుకోకు.. నువ్వు భూమి అయితే తను ఆకాశం. ఎప్పటికీ ఒకటి కాదు. కొంచెం బాధతో డ్రాపౌట్ అనుకుని క్లాసు విన్నాను..!

                 ఇక ఆ తర్వాత ఆమె మా బ్యాచ్ లో బాగా కలిసిపోయింది.. రాహుల్ గాడు నా  గతంలో జరిగినవన్నీ, జోక్ గా చెబుతుంటే.. ఆమె పగలబడి నవ్వింది.. ఆమె ఒకటే కాదు అందరూ... ఇలా ఎవరూ నవ్వినా. కోపం, బాధ, వచ్చేవి. కానీ ఆమె నవ్వుతుంటే ఈ నవ్వుకి ఒక రకంగా కారణం నేనే కదా.. అని లోలోపల సంతోషపడె వాన్నీ..! 

శృతి ; (అందరితో) ఓ మై గాడ్ టైం అయింది.. ఓకే బాయ్.. అని. నా వైపు చూసి బాయ్ రవి, రేపు కలుద్దాం..! (అంది..) 

రవి ; ( ఆశ్చర్యంతో టాటా చెబుతూ) ఓకే బాయ్.. 

నా మనసులో అదేంటి అందరికీ ఒకేసారి బాయ్ చెప్పి. నాకు మాత్రం రవి బాయ్ అంది ఏంటి.. రేప్ కలుద్దాం అని చెప్పింది. ఇలా అనుకోగానే నా గుండెల్లో గంటలు మోగయి అంతలో మళ్ళీ ఇది 'వర్కౌట్ కాదు' డ్రాప్ అవుట్.. అనుకుని అక్కడి నుండి వెళ్ళి పోతున్నాను.. రాహుల్ గాడు వెనక నుంచి నా దగ్గరికి వచ్చి..

రాహుల్ ; ఏంట్రా అందరికీ మామూలుగా బాయ్ చెప్పి.. నీకు మాత్రం స్పెషల్గా బాయ్ చెప్పింది ఏంటి..? 

రవి ; (మనసులో అమ్మని వీడి కి కూడా ఇలాగే అర్థమైందా..?  నేను ఏమీ తెలియని వాడిలా ) ఏమో రా... నాకేం తెలుసు..? 

రాహుల్ ; సంథింగ్... సంథింగ్... ఏదో ఉన్నట్లు ఉంది..?

రవి ; రేయ్ ఏం మాట్లాడుతున్నావ్ రా...!

రాహుల్ ; నువ్వు కూడా శృతిని కన్నార్పకుండా చూస్తున్నావు.. చెయ్యి వదలటం లేదు.. క్లాసులో దొంగ చూపులు చూస్తున్నావ్.. ఏంటి విషయం... Love ఆ..!

రవి ; రేయ్ నా ముఖానికి అంత సీనుందా..?  పోనీ నేను ఇదే మాట నీతో చెబితే.. కలర్ టీవీ చూస్తున్నాము.. నువ్వు మళ్ళీ మాకు బ్లాక్ అండ్ వైట్ కాంబినేషన్ చూపిస్తే చంపేస్తా.. అనే వాడివి.. నీ గురించి నాకు తెలియదా.. పొరా.. (అని నేను వెళ్ళిపోయాను...!)

                ఇక ఆ తరువాత రోజు నుండి ఎందుకో తెలీదు. శృతి నాతో కొంచెం స్పెషల్ గానే ఉండేది.. తనే ముందు మాట్లాడేది.. గుడ్ మార్నింగ్ చెప్పేది.. గుడ్ ఆఫ్టర్నూన్ చెప్పేది.. హాయ్.. బాయ్... ఫోన్ లో చాటింగ్.. మా ఫ్రెండ్స్ ముందు నాకు సపోర్ట్ గా రావడం చదువులో హెల్ప్ చేయడం. ఇలా అన్నీ నాకు స్పెషల్ గానే అనిపించేవి.. ఇలా జరిగినప్పుడల్లా.. నా గుండెల్లో గంటలు కొట్టే వి..! ఇలా కొట్టిన ప్రతిసారి నా మనసుకి సర్ది చెప్పుకుని వాడిని.. ఇది వర్కౌట్ అవ్వదు... నేను ఆ అమ్మాయికి సూట్ అవ్వను.. అని నా ఫీలింగ్స్ ని కంట్రోల్ చేసుకునే వాడిని..! 

               కానీ రాహుల్ గాడు మాత్రం సింగిల్ గా ఉన్నప్పుడు.. తనతో జరిగినవన్నీ రివైండ్ చేస్తూ.. సమ్ థింగ్.. సమ్ థింగ్.. అనే వాడు... వాడి ముందు పట్టించుకొన్నట్లు ఉండి. లోలోపల పొంగి పోయే వాడిని..! ఒకరోజు వాడితో..

రవి ; నువ్వే చెప్పరా.. తన్ను నన్ను లైక్ చేయడానికి ఒక రీజన్ చెప్పారా... నేను నల్లగా ఉంటాను.. అంతగా మెచ్యూరిటీ లేదు... ప్రతి దాంట్లో నేను zero ను. అన్ని విషయాల్లో అఫ్ హర్ హ్యాండ్ లో వుండే తను.. ఎందుకు లైక్  చెస్తుంది..? 

రాహుల్ ; అరే అమ్మాయిల అంతేరా. తనకన్నా.. తక్కువ తెలిసిన వాళ్ళనీ.. తక్కువగా ఉన్న వాళ్ళని ఎక్కువగా లైక్ చేస్తారు.. ఎందుకంటే అప్పుడే వాళ్ళు చాలా హైప్ లో ఉన్నాం.. అని బాగా ఫీల్ అవుతారు.. అమ్మాయికి జాలి కలిగింది అంటే, అది ఎప్పుడైనా ప్రేమగా మారవచ్చు.. నీ పైన జాలి తనకి కొన్ని వందల సార్లు కలిగింది తెలుసా..? అందుకని నేను కొన్ని ట్రిక్స్ చెప్తాను.. అది నువ్వు ఒక విషయంలో నన్ను ఫాలో కా...! నేను నిన్ను తన ముందు బాగా fool చెస్తాను.. తను బాగా నవ్వుతుంది.. అందుకు కారణం నువ్వే అని తెలిసి, నిన్ను లైక్ చేస్తుంది.. అలా నెను అన్నందుకు నువ్వు పట్టించుకోకు..! 

రవి ; ఏ రోజు పట్టించుకున్ననాని.. ఈరోజు కొత్తగా చెప్తున్నావ్..! 

రాహుల్ ; సరేలేరా ఇప్పటినుంచి నేను చెప్పినట్టు ఫాలో అవ్వు...!

ఇలా వీడు నాకు ఏదేదో చెప్పి. నా మనసుని గెలికే వాడు.. అయినా సరే ఇది వర్కౌట్ కాదు... అని నా మనసుకు సర్ది చెప్పుకునే వాడిని... ఆ తర్వాత నుండి వాడి చెప్పినట్టు ఫాలో అయ్యాను.. రోజులా కాకుండా డిఫరెంట్ గా రెడీ అవ్వడం.. కొంచెం ఇంగ్లీష్ మాట్లాడటానికి.. ట్రై చేసేవాడిని.. ఇలా కొన్ని వాడు చెప్పినట్లు నడుచుకున్నను.. దీన్ని వాడు జోకులు గా మలచి తన ముందు నన్ను.. fool నీ చేసి.. అందరినీ బాగా నవ్వించే వాడు.. వాడు హీరో అయ్యేవాడు.. కానీ శృతి ఫస్ట్ బాగా నవ్వి.. ఇలా కాదు రవి. ఇలా అని నాకు సపోర్ట్ గా ఉండేది... నాకు ఇంకా ఏవేవో నేర్పించేది.. అప్పుడు శృతి నాకు బాగా క్లోజ్ అయ్యింది... అలాగే శృతి ఏ చిన్న సహాయం కావాలన్నా నన్నె అడిగేది.. నేను మనస్ఫూర్తిగా తను ఏది అడిగితే అది చేసేవాడిని. ఇది చాలా బాగా అనిపించింది నాకు...! ఇలా కొన్ని రోజులు అయ్యాక...

రాహుల్ ; ఇప్పుడేమంటావ్ రా.. తను నిన్ను ప్రేమిస్తుంది అంటే నమ్ముతున్నావ్ కదా..?

రవి ; పోరా.. తను ప్రేమిస్తుంది అంటే నాకు భయంగా ఉంది.. (గట్టిగా) ఇది వర్కౌట్ అవదు.. వదిలేయ్... నేను తనకి సూట్ కాను..!

రాహుల్ ; నీకు ఎలా చెప్పాలి రా..! సరే ఫైనల్ గా నీకు ఒకటి చెప్తాను.. అది చెయ్ తను లవ్ చేస్తుందో లేదో, అని నీకే ఒక క్లారిటి వచ్చేస్తుంది..! 

రవి; ఏమిటది...?

రాహుల్ ; నువ్వు, తను మన కాలేజ్ మెట్లపై నుండి వస్తున్నప్పుడు.. కావాలని ఆ మెట్ల పై నుండి కింద పడు.. కొంచెం దెబ్బలు తగిలే లా.. కిందపడు.. అప్పుడు తను నీ పైన చూపించే అటెన్షన్ ఎలా ఉంటుందో.. నువ్వే చూడు.. అవతల వాళ్ళు మనల్ని ఎంతగా ప్రేమిస్తున్నారో తెలియాలిసెది.. ఇలాంటి సందర్భాల్లోనే.. 

           సరే ఈ ఐడియా ఏదో బాగుంది.. ఒకసారి ట్రై చేసి చూద్దాం అనుకున్నాను.. మార్నింగ్ కాలేజ్ లో సెకండ్ ఫ్లోర్లో మెట్లపై ఉన్నాను.. శృతి వస్తుంది. మెట్లు ఎక్కడం స్టార్ట్ చేసింది.. నేను స్పీడ్ గా దిగుతూ.. కొద్దిగా వెళ్లగానే కింద పడదాం అనుకున్నాను.. కానీ అంతలోనే శృతి. 

శృతి ; (గట్టిగా) ఏ రవి... నిధానం.. జాగ్రత్తగా రా..! క్రింద పడొచ్చు..?  
              అలా అనగానే నేను స్లో అయ్యాను తను నా దగ్గరికి వచ్చి.. 
శృతి ; ఎక్కడికి ఎంత స్పీడ్ వెళ్తున్నావ్..

రవి ;  కొంచెం పని ఉంది కిందకు వెళ్ళొస్తా..!

శృతి ; సరే క్రిందకు దిగేటప్పుడు నిదానంగా దిగి.. పొరపాటున స్లిప్ అయితే దెబ్బలు తగులుతాయి.. నిదానంగా వెళ్ళీ రా..!  
  
          అప్పుడు నేను సరే అని నిదానంగా కిందకు వెళ్తున్నాను.. అప్పుడు తన పై చాల మంచి అభిప్రాయం కలిగింది నాకు.. ఈ సారి గుండెల్లో గంట కాదు..  నా non stop గా బెల్ మోగుతూనే ఉంది..! తరువాత నేను కాలేజ్ టెర్రస్ పైన ఒంటరిగా బాగా దీర్ఘంగా ఆలోచిస్తూ ఉన్నాను.. అప్పుడు అక్కడికి రాహుల్ వచ్చాడు..

రాహుల్ ; ఏరా... కింద పడలేదు ఏంటి..?

రవి ; తను అలా మాట్లాడ గానే.. నేను ఆగిపోయాను..

రాహుల్ ; తెలుసు చూశాను.. విన్నాను..! తన మాటల్ని బట్టి నీకేం అర్థం అయింది..?

రవి ; (మంచి ఫీల్ తో) కింద పడిన తర్వాత.. మెల్లగా రావచ్చు కదా... చూసుకోవాలి కదా.. జాగ్రత్తగా ఉండాలి కదా.. చూడు ఎలా దెబ్బలు తగిలాయి.. అని ఎవరైనా అంటారు.. చెబుతారు.. కానీ కింద పడుతున్నాను అనే టెన్షన్ తో.. ముందే జాగ్రత్తలు చెప్పి.. నాకు ఏం కాకూడదని కోరుకుంది అంటే.. నామీద.....

రాహుల్ ; ఎంతో ప్రేమ ఉంది అన్నట్లు కదా..! 

ఈమాట వాడు అనగానే వెనక్కి తిరిగాను.. కళ్ళల్లో నుంచి నీళ్లు అలా వస్తూనే ఉన్నాయి..

రాహుల్ ; చెప్పాను కదా రా.. తను నిన్ను ప్రేమిస్తుంది అని. నువ్వే అర్థం చేసుకోవడం లేదు...! 

ఇక నా వల్ల కాలేదు బాగా ఏడ్చేశాను అది వాడు గమనించి.. 

రాహుల్ ; ఏమైంది రా.. ( వాడి వైపు తిప్పుకొని) ఎందుకు ఇలా ఏడుస్తున్నావు..?

రవి ;( ఏడిస్తు) అది కాదురా.. నేను తనని చూసిన మొదటి రోజే ప్రేమించాను.. కానీ నా ఫేస్ నీ తలచుకుని.. తనకి నేను సరిపోను అని.. ఇది వర్కౌట్ అవదు.. ఇది వర్కౌట్ అవదు.. అని ప్రతిసారి ఇది వర్కౌట్ అవ్వదు.. (బాగా ఏడుస్తూ) ఇది వర్కౌట్ కాదు.. అని కొన్ని లక్షల సార్లు... అనుకుని.. (ఇంకా ఏడిస్తు) ప్రేమిస్తున్న నా మనసుని. ఇన్నాళ్లు అదుపులో పెట్టి వచ్చాను రా... కానీ ఈరోజు నువ్వు తను ప్రేమిస్తోంది.. అని చెబుతుంటే.. ఇక నా మనసు ఆగడం లేదు రా.. తనపై ఉండే ప్రేమ కట్టలు తెంచుకుని.. ఇలా కన్నీళ్ళ రూపంలో బయటకు వచ్చేస్తుంది... రా.. (అని రాహుల్ ని గట్టిగా కౌగలించుకుని ఇంకా ఏడుస్తాడు...) అవున్రా.. నేను శ్రుతిని లవ్ చేస్తున్నాను.. నా ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమిస్తున్నాను రా..! తను లేకపోతే బ్రతకలేను ఏమో..? అనిపిస్తుంది.. (అన్ని బాగా ఏడుస్తాడు)

రాహుల్ ; (రవిని విడిపించుకుని తనని చూస్తూ) ఏంట్రా.. ఇంత ప్రేమ నీ. ఇన్ని రోజులు ఎలా దాచుకున్నావు రా... ముందు ఆ ఏడుపు ఆపు..!( అని కన్నీళ్లు తుడుస్తూ) ముందు నువ్వు cool అవ్వరా.. 
(కొద్దిసేపు ఇద్దరు సైలెంట్ అవుతారు.. Rahul  అటు ఇటు తిరిగి సిగరెట్ కాలుస్తూ..) రెయ్ నీకు ఎక్కువైంది రా... చాలా ఎక్కువైంది.. ఇలాగే ఉంటే పిచ్చోడు అయిపోవచ్చు.. నేను ఒక సలహా ఇస్తాను.. అది చేస్తావా...? 

రవి ; తప్పకుండా..! 

రాహుల్ ; ముందు తనకు ప్రపోస్ చెయ్యి..

రవి ; రేయ్ నాకు అంత... (అంతలో) 

రాహుల్ ; రెయ్ ఎందుకు చెప్తున్నానో అర్థం చేసుకో.. నువ్వు చాలా డేంజర్ జోన్లో ఉన్నావు.. నా మాట విను.. రేపే తనకి ప్రపోజ్ చెయ్.. తను ఖచ్చితంగా ఎక్సెప్ట్ చేస్తుంది... ఇంత ప్రేమని ఎప్పుడూ మనస్సులో దాచుకోకుడాదు.. చెప్పేయాలి.. రేపు చెబుతావు కదూ..

రవి ; (కొద్దిసేపు ఆలోచించి) చెబుతాను.. రేపు చెప్తాను...

రాహుల్ ; గుడ్... ఇలాంటి టైం లోనే చాలా ధైర్యంగా ఉండాలి.. ఆల్ ద బెస్ట్.. 

                    నెక్స్ట్ డే కాలేజీలో నేను మెట్లు దగ్గర తన కోసం వెయిట్ చేస్తూ ఉన్నాను.. చాలా టెన్షన్ గా ఉంది.. ఎవరు మాట్లాడినా మాట్లాడే పరిస్థితిలో లేను.. అప్పుడు శృతి అటు నుంచి వస్తుంది.. అది చూసి నా గుండెల్లో వేగం పెరిగింది.. తను నా ముందు నుంచి. నన్ను చూడకుండా పైకి వెళుతుంది.. నేను ధైర్యం చేసి... 

రవి ; హాయ్ శృతి... 
శృతి ; ( తిరిగి సింపుల్ గా)  హాయ్.. 

రవి ; శృతి నీతో కొంచెం మాట్లాడాలి.. ఒకసారి టెర్రస్ పైకి వస్తావా...?

శృతి ; (కొద్దిసేపు ఆలోచించి) సరే నేను బ్యాగ్ క్లాస్ రూమ్ లో పెట్టి వస్తాను.. నువ్వు వెళ్ళు...

రవి ; (మనసులో) ఏదో తేడా కొడుతుంది ఏంటి.. ఇంతకుముందు హాయ్ చెప్పేటప్పుడు చాలా ఎగ్జైటింగ్ తో హాయ్ రవి అనేది. ఈ రోజు ఎందుకు డల్ గా చెప్పింది.. ఏమై ఉంటుంది.. మరి ఇప్పుడు ప్రపోజ్ చేద్దామా వద్దా.. అనుకుంటూ టెర్రస్ పైకి వెళ్లాను.. చాలా కన్ఫ్యూజన్ లో ఉన్నాను.. రాహుల్ గాడికి ఫోన్ చేసి అంతా వివరించాను.. వాడి ఎట్టి పరిస్థితుల్లో ఈ రోజు ప్రపోస్ చెయ్యి అన్నాడు..!నేను కొంచెం దైర్యం తెచ్చుకొని.. ఇప్పుడు ప్రపోజ్ చేద్దామని ఫిక్స్ అయ్యాను.. పక్కనే ఉన్న గులాబీ మొక్కలో నుంచి ఒక గులాబీ ని తీసుకుని.. ఇలా ప్రపోజ్ చేద్దామని. ప్రాక్టీస్ చేస్తూ ఉన్నాను..! తను వస్తుంది.. నేను గులాబీ కనిపించకుండా వెనక్కి పెట్టుకొని కంగారుగా తల దించుకున్నాను.. తన దగ్గరికి వచ్చి..

శృతి ; హాయ్ రవన్న... ఏదో చెప్పాలి అన్నావ్.. ఏంటి విషయం...?   

రవి ; (తల దించుకొని) అదే నీతో ఎలా చెప్పాలో అర్థం కావడం లేదు.. (అంతలో శృతి  అన్న మాట గుర్తుకు వచ్చి.. శృతిని చూస్తూ ఆశ్చర్యంతో)  అవును.. ఇప్పుడు నన్ను ఏమన్నావు..? 

శృతి ; అదే అన్నా.. ఇంతకుముందు ఏదో చెప్పాలి అన్నావ్ కదా.. చెప్పు రవన్న అన్నాను..! 

రవి ; (షాక్ తో దుఖ్ఖం పొంగుకొస్తుంది) అ.... అ.....  అదే ఏంటి... కొత్తగా అన్నా... అని పిలుస్తున్నావ్...! 

శృతి ; మొదటి నుంచి నీ పైన అదే ఫీలింగ్ ఉందన్న... నేను నిన్ను సొంత అన్న లాగానే భావించాను.. ఈరోజు అన్నా, అని పిలవడానికి కూడా ఒక బలమైన కారణం ఉంది.. నువ్వు  ఇంచుమించుగా మా పెద్దనాన్న కొడుకు శంకరన్న లాగానే ఉంటావు... శంకరన్న అంటే నాకు చాలా ఇష్టం... (కొంచెం బాధతో ) తను చనిపోయిన సంవత్సరం అయ్యింది.. ఆ Date ఈరోజే... తనని నేను చాలా మిస్ అవుతున్నాను.. అందుకే ఈరోజు మూడ్ ఆఫ్ లో ఉన్నాను.. (శృతి ఇలా చెబుతుంటే రవి బాధతో వెనకాల ఉన్న గులాబి పువ్వు ను నలుపుతూ ఉంటాడు..) ఇకపై నుంచి మా శంకరన్న నీ, నీలో చుసుకోవాలని అనుకున్నాను.. అందుకే అన్నా అని పిలుస్తున్నాను.. ఇకపై అలాగే పిలుస్తాను..! సరే అన్న ఇదంతా పక్కన పెట్టు.. నువ్వు ఏదో చెప్పాలి అన్నావు ఏంటి..?

రవి ; (వస్తున్న కన్నీళ్లు తనకు కనిపించకూడదని వెనక్కి తిరిగి బాధతో) మర్చిపోయాను... గుర్తు వచ్చినప్పుడు చెప్తాలే... నువ్వు వెళ్ళు..! 

శృతి ; సరే అన్న గుర్తు వచ్చినప్పుడు కచ్చితంగా చెప్పు... ఉంటా..!( అని వెళ్ళిపోయింది)

                    రవి బాధతో గట్టిగా అరవాలని అనుకుంటాడు... కానీ కింద స్టూడెంట్స్ ని చూసి అక్కడి నుంచి కన్నీళ్లతో సైలెంట్గా వెళ్తాడు..! ఆ కాలేజ్ వెనకాల ఒక కొండ ఉంటుంది.. ఆ కొండ పైకి ఎక్కుతున్నప్పుడు అతని ఫోన్ పడిపోతుంది.. చూసుకోకుండా అలాగే పైకి వెళ్లి. పైన నిలబడి ఆ... అని గట్టిగా అరుస్తాడు... వెక్కి వెక్కి ఏడుస్తాడు... 

                  తనలో తానే.. ఛీ... నీయబ్బ... అన్నా అనుకున్న దాన్ని.. నువ్వు ఎలా ఊహించుకున్నాను కదరా..!  ఎంత పెద్ద తప్పొ.. నీకు అర్థం అవుతుందా...? అయినా నిన్ను బావ అని పిలవాలసినా వాళ్లే... అన్నా అని పిలుస్తారు.. తను పిలవద్దని ఎలా అనుకున్నావ్ రా...! చీ..... అయినా నీ మొహానికి అంత సీన్ లేదని... ఇది వర్క్ ఔట్ కాదు అని అనుకుంటూనే ఉన్నావు కదరా... ఆ రాహుల్ గాడీ.. మాటలు ఎలా నమ్మావు.. ఇప్పటికైనా అర్థం చేసుకో... ఈ ముఖాన్ని ఏ అమ్మాయి ప్రేమించదు... ప్రేమించిదు... ప్రేమించదు.... అని తనా బ్యాడ్ లక్ ను.. తన ఫెయిల్యూర్ ను.. తలుచుకొని.. తను వేస్ట్ అని డిసైడ్ అయ్యి.. అలాగే కొండ పైన కూర్చుని ఏడుస్తూనే ఉంటాడు... రాత్రవుతుంది. ఆ బాధతోనే అలాగే, అక్కడే పడుకుంటాడు..! 

                   ఉదయం 7 అవుతోంది.. లేవగానే శృతి, అన్నా.. అన్న మాటే గుర్తుకు వస్తుంది...! మళ్లీ బాధపడతాడు.. ఈ బాధను.. రాహుల్ తో షేర్ చేసుకుందాం.. వాడు అయితే నన్ను ఓదార్చి.. ఈ బాధ నుండి విముక్తిని చేస్తాడు.. అని అనుకుంటాడు.. ఫోన్ కోసం చూస్తాడు.. అది ఎక్కడో పడిపోయి ఉంటుంది.. వాడిని ఇంటి దగ్గర కలుద్దామని బయలుదేరుతాడు.. బయటకు వెళ్లాలంటే కాలేజ్ నుంచి రావాలి.. అలా కాలేజ్ నుంచి బయటకు వస్తున్న సమయంలో.. రాహుల్ బైక్, కనబడుతుంది.. రవి మనసులో రాహుల్ ఇక్కడే ఉన్నాడా..? ఇంత త్వరగా వచ్చాడు ఏంటి..? అని కాలేజీలో  రాహుల్ కోసం వెతుకుతాడు..! అలా వెతుకుతూ క్లాసు రూమ్ కిటికీ లో నుంచి చూస్తే లోపల రాహుల్ కనిపిస్తాడు.. వాడితో పాటు శృతి కూడా కనిపిస్తుంది.. షాక్ అవుతాడు రవి. వీళ్లిద్దరి ఏంటి ఇక్కడ ఉన్నారు.. అని చాటుగా వాళ్ల మాటల్ని వింటాడు..! 

శృతి ; (రాహుల్ తో) వాడు నాకు ప్రపోజ్ చేస్తాడని అంత కరెక్ట్ గా ఎలా గెస్ చేసావు రా..? వాడి నీకు ముందే చెప్పాడు...? 

రాహుల్ ; అలాంటిదేమీ లేదు.. వాడి ఫేస్ రీడింగ్ చూస్తే అలా అనిపించింది.. గెస్ చేసి నువ్వు జాగ్రత్త పడతవు.. అని చెప్పాను.. ఇంతకీ వాడు, ప్రపోజ్ చేసిన తర్వాత నువ్వు ఏం చెప్పావ్...? 

రవి ; (రాహుల్ మాట కి షాక్ అవుతాడు మనసులో ) అంటే నాకు ప్రపోజ్ చేయమని చెప్పి.. తనకు ప్రపోస్ చేస్తున్నాడు జాగ్రత్త అని కూడా వీడే చెప్పడా ఎందుకు అయింది..? 

శృతి ; ఎక్కడ వాడికి ప్రపోజ్ చేసే ఛాన్స్ నేను ఇస్తే కదా..! దాని కన్నా ముందే వాడిని అన్నా అని పిలిచాను.. సెంటిమెంటల్ గా కూడా వర్కౌట్ కావాలని.. నీవు మా పెద్దనాన్న కొడుకు లాగా ఉన్నావు.. అని ఏదో కహాని చెప్పాను.. కానీ వాడిని అన్న అన్నప్పుడు.. వాడి ఫేస్ నీ చూడాలి రా.. నువ్వంటే పడి పడి నువ్వే వాడివి..! 

రవి (మనసులో) అంటే కావాలనే అనిందన్నమాట...! 

రాహుల్ ;(నవ్వుతూ) అన్నా అని పిలిచావా ఎందుకు...?

శృతి ; వాడు ప్రపోజ్ చేసిన తర్వాత.. నేను No అంటే. తర్వాత ప్లీజ్.. ప్లీజ్.. అని నా వెంట పడొచ్చు.. అదే నేను ఇలా అన్నా.. అన్నందుకు అక్కడితో కట్ అయిపోతాడు... ఎంతైనా సెంటిమెంటల్ fool కదా..! ఒక నాలుగు రోజులు ఏడ్చి మూసుకుంటాడు.. అని ఇలా ప్లాన్ చేశాను... అయినా ఇంతకాలం నువ్వు చెప్పావ్ అని. నేను వాళ్ళతో క్లోజ్ గా ఉన్నాను... లేకపోతే వాడిని నా దగ్గరికి కూడా రాని ఇచ్చేవాన్ని కాదు వాడు వాడి మొఖం..! 

రాహుల్ ; ఏయ్ నేను అలా ప్లాన్ చేసినందుకే కదా.. వాడు నీకు కుక్కలాగా అన్ని పనులు చేశాడు..? 

శృతి ; అవుననుకో.. అయిన వాడు అంతా వెర్రి పప్పా ఏంట్రా.. మీరంతా వాడిని అవమానిస్తుంటే.. నేను కొంచెం సపోర్ట్ గా ఉండి.. కొంచెం క్లోజ్ గా ఉన్నందుకే.. నన్ను దేవతల చూసి.. నేను ఏ పని చెప్పిన చేసేవాడు... ఇలాంటి పనులకు వాడి ఓకే కానీ.. ఇలా లవ్వు.. గివ్వు.. అంటేనే.. వాడి ముఖం చూస్తేనే వాంతీ.. వస్తుంది.. వాడికి నేను కావాల్సి వచ్చింది అంట. వాడు.. వాడి కర్రీ మొఖం..!!

రవికి అప్పుడు శృతి అన్న మాట గుర్తుకు వస్తుంది.. అది నేను ఎప్పుడు రవి అనే పిలుస్తాను..! ఇలా వీళ్ళ మాటలు రవి గుండెల్లో గుణపాలుగా దిగుతాయి..! 

రాహుల్ ; వాడిని ఎలా కట్ చేయాలో, అలా చేసావు...  సరే ఇంతకీ నన్ను ఎందుకు ఇంత త్వరగా రమ్మన్నావు.. ఇది చెప్పడానికైనా.. (ఒంటెగా) ఇంకేదైనా...? 

శృతి ; ఇంకొకటి ఉంది. నిన్నంతా నేను బాగా ఆలోచించాను.. నువ్వు ఆ రోజు ఫోన్ లో, ఒక అమ్మాయి కి ఒక మంచి సలహా ఇచ్చవు.. అది ఇప్పుడు నేను పాటిస్తున్నాను.. అది అందమైన ఆడ వాళ్ళు.. ఎవరినైనా లవ్ చేస్తే, వాళ్ళ దగ్గర ఓపెన్ అవ్వాలి.. అందరికీ తెలిసేలా చేయాలి.. అప్పుడు వేరే వాళ్ళు మనల్ని ట్రై చేయకుండా ఉంటారు అని..  అందుకే రవి లాంటి కుక్కలు నా వెంట పడకుండా ఉండాలి అంటే... నేను లవ్ చేసే వాడికి.. ఆ విషయం చెప్పి.. కాలేజ్ మొత్తం తెలిసేలా చేస్తాను..! (సిగ్గుపడుతూ) అందుకే నిన్ను ఇంత త్వరగా రమ్మన్నాను..!

రాహుల్ ; అవునా..? ఎవరో ఆ లక్కీ బాయ్..?

శృతి ; (రాహుల్ని గిల్లీ) ఏమీ తెలియనట్టు..! సరే నేనే ముందు చెప్తా.. ఏ అమ్మాయి అయినా నీలాంటి హీరోనె ఇష్టపడేది.. నేను నిన్ను ప్రేమిస్తున్నాను... I love you Rahul...

రాహుల్ ; (నవ్వుతూ) ఎక్స్పెక్ట్ చేశా.. నువ్వు ఇలా అంటావని... నువ్వు ఎక్స్పెక్ట్ చేయనిది.. ఏమిటంటే.. నువ్వు అంటే నాకు ఇష్టం శృతి.. ఐ టు లవ్ యు..! 

రవి ; (మనసులో బాధ తో) తనంతటతానే.. నీకు ఐ లవ్ యు చెప్పాలని.. ఇన్ని ప్లాన్లు వేసి నా మనసుతో ఇలా ఆడుకోవాలా రా.. తన ముందు నన్ను జీరోని చేసి.. నువ్వు హీరో వి అయ్యావు... అందుకే ఇప్పుడు అది నిన్ను ప్రపోజ్ చేసింది...!!

                  రాహుల్, శృతి, కౌగిలించుకుంటారు... అది చూడలేక రవి అక్కడనుండి వెళ్ళిపోతు.. అతని గుండె సముద్రం అవుతుంది.. కన్నీళ్లు అలల రూపంలో అలా బయటకు వస్తుంటాయి... 

ఇది ఫ్లాష్ బ్యాక్... 

ప్రజెంట్... ట్రైన్ కోసం పట్టాల మీద నిల్చున్న రవి.. 

రవి ; నిజానికి వీళ్ళు చేసిన మోసానికి నరికేయాలి అనంత కోపంగా ఉంది.. కానీ ఈ కోపం వాళ్ళ పై కంటే నా పైన ఎక్కువ ఉంది.. నామీద నాకే అసహ్యం గా ఉంది.. నేను ఎదవని కాబట్టే కదా. నన్ను అమాయకుడిని చేసి ఆడుకున్నారు.. నమ్మకద్రోహం చేశారు.. బాగా ఏడుస్తూ అందుకే నేను అంటే నాకు అస్సలు ఇష్టం లేదు.. నా మొఖం ఇష్టం లేదు.. ఇలా పుట్టడం అస్సలు ఇష్టం లేదు.. అందుకే ఈ జీవితాని చాలించాలి అనుకున్నాను.. అందరి ముందు ఎదవనై.. అవమానాలు పడుతూ.. ఇలా బాధపడుతూ.. జీవించే కన్నా.. చావడం ఎంతో మేలు.. అందుకే నేను చస్తున్నాను....

                   ఇలా అనుకోగానే వెనక నుండి ట్రైన్ వస్తున్న శబ్దం వినిపిస్తుంది..! ఒక్కసారిగా తల పైకెత్తి గట్టిగా ఊపిరి పీల్చుకుంటాడు.. కొంచెం ఆనందంతో మరి కొద్ది క్షణాల్లో నేను ఈ బాధ నుండి విముక్తి అవుతున్నాను.. అనుకోని వెనక్కి తిరిగి చూడకుండా.. కళ్ళు గట్టిగా మూసుకొని.. తలదించుకుని, చేతులు కట్టుకొని, అలా పట్టాల మధ్యలో నిల్చుని ఉంటాడు.. ట్రైన్ చాలా వేగంగా వస్తుంది.. ట్రైన్ డ్రైవర్ పట్టాలపైన ఎవరు ఉన్నారు అని. హారన్ కొడతాడు.. సౌండ్ చాలా ఎక్కువగా వస్తుంది.. దాంతో రవి భయంతో గట్టిగా చెవులను పట్టుకుంటాడు.. ట్రైన్ హారన్ కొడుతూ దగ్గరికి వస్తుంది.. రవికి కి కాళ్లు చేతులు వణుకుతాయి.. చెవులు గట్టిగా పట్టుకొని క్రింద కూర్చుంటాడు..  ట్రైన్ డ్రైవర్ non-stop ka haran కొడుతూ.. దగ్గరికి వస్తుంటాడు.. రవికి టెన్షన్ ఎక్కువ కావడం వల్ల. ఇంకా ట్రైన్ తనని గుద్ధక ముందే.. స్పృహ కోల్పోయి.. అలాగే పట్టాల మీద పడుకుంటాడు..! 

అప్పుడు ట్రైన్ అతన్ని దాటుకోని వెళ్తుంది.. రవి చనిపోతాడు....!!!??? 

రవి ఆత్మ బయటకు వస్తుంది..! తన బాడీ కోసం ఆత్మ గా మారిన రవి వెతుకుతాడు.. కొంతదూరం అతని బాడీ కి సంబంధించిన కాళ్ళు.. మరోచోట మొండెం.. ఇంకోచోట తల కనిపిస్తుంది.. తన బాడీని ట్రైన్ ఎక్కించడం వల్ల, ముక్కలు.. ముక్కలు.. అయి చాలా ఘోరంగా ఉంటుంది.. రవి ఆత్మ చూసి తట్టుకోలేక పోతాడు... చా... ఎంత ఘోరంగా చనిపోయాను.. కదా....!!??

                            ఇంటర్వెల్....!!!!???

                కొద్దిసేపటికి అక్కడికి జనం, పోలీసులు వస్తారు.. ఆ బాడిని చూసి, అంబులెన్స్ లో ఎక్కిస్తారు.. పోలీస్.. రవి కాలేజ్ ఐడీ కార్డు చూసి. కాలేజ్ కి ఇన్ఫర్మేషన్ ఇస్తాడు..! అప్పుడు రవి ఆత్మ నేను చనిపోయినందుకు కాలేజ్ రియాక్షన్.. శృతి, రాహుల్, రియాక్షన్ ఎలా ఉంటుందో చూద్దామని. కాలేజీకి వెళ్లి చూస్తాడు..! 

               అక్కడ రవి ఫ్రెండ్స్ ఒకరినొకరు షాక్ తో.. రెయ్ కర్రీ రవి.. సూసైడ్ చేసుకున్నాడు అని చెప్పుకుంటారు.. ఏమైంది రా.. అని ఆశ్చర్య పోతూ ఉంటారు... అలాగే ఈ ఇన్ఫర్మేషన్ రాహుల్ కు చేరుతుంది.. ఇదంతా రవి ఆత్మ చూస్తుంది..

శీను; ( బాధతో) కర్రీరవి గాడు సూసైడ్ చేసుకున్నాడు.. రా..! 

రాహుల్ ; (షాక్ అవుతాడు) ఏంట్రా నువ్వు చెప్పేది.. ఎందుకు చేసుకున్నాడు...?

శీను ; ఏమో తెలియదు రా.. నేను కనుక్కొని నీకు చెబుతాను..( అని వెళ్తాడు)

వాడు అలా వెళ్లగానే రాహుల్ రియాక్షన్ చేంజ్ అవుతుంది.. నవ్వుతాడు.. అది చూసి రవి ఆత్మ, షాక్ అవుతాడు.. 

రాహుల్ ; ( నవ్వుతూ) నాకు తెలుసు రా..! ఎందుకు సూసైడ్ చేసుకున్నాడో.. ఎక్స్పెక్ట్ చేశా.. వాడు ఇలా చేస్తాడు అని.. (అనుకుంటూ శృతి కి ఫోన్ చేస్తాడు.. మన అడ్డ దగ్గరికి రా అంటాడు..) 

              అప్పుడు ఇద్దరూ ఒక క్లాస్ రూమ్ లో కలుస్తారు.. రవి ఆత్మ వల్ల పక్కనే ఉంటుంది..

రాహుల్ ; శృతి నీకు ఒక గుడ్ న్యూస్... రవి గాడు సూసైడ్ చేసుకుని చచ్చాడు అంట..! 

శృతి ; చచ్చాడా..! పీడా విరగడయింది.. లే..  ఎక్కడ మళ్ళీ వచ్చి.. ప్రపోజ్ చేస్తాడని చాలా చిరాగ్గా ఉండేదాన్ని...! 

రవి ఆత్మ ; చా... నేను చచ్చిపోతే మా వల్ల చనిపోయాడు అనే.. బాధ మీకు లైఫ్ లాంగ్ ఉంటుంది అనుకున్నాను కదరా.. కొంచెం కూడా జాలి, బాధ, లేదు కదా మీకు.. మరి ఇంత కఠిన హృదయాల.. చా.. నేను అనవసరంగా చచ్చాను...!

శృతి ; కొంపతీసి వాడు మన పేర్లు రాసి చచ్చాడా..? 

రాహుల్ ; అంత తెలివి వాడికి ఎక్కడిది.. అలాంటిదేమీ లేదు.. 

శృతి ; పోనీ నన్ను లవ్ చేస్తున్నట్టు.. నేను రిజెక్ట్ చేసినట్టు.. నీకు కాకుండా ఇంకా ఎవరికైనా తెలుసా..?

రాహుల్ ; చాన్సే లేదు.. వాడు ఇలాంటి పర్సనల్ విషయాలు నా ఒక్కడితో నే షేర్ చేసుకునేది.. 

రవి ఆత్మ ; ఎందుకంటే నువ్వే నా బెస్ట్ ఫ్రెండు అని అనుకున్నాను రా..! 

రాహుల్ ; సరే పద.. వాడి ఇంటి దగ్గరికి వెళ్లి బాధపడుతున్నట్లు నటిస్తాం.. (అంతలో) ఇల్లు అంటే గుర్తుకు వచ్చింది.. వాడు అన్ని విషయాలు వాళ్ళ అమ్మ తో, షేర్ చేసుకుంటాడు...! 

             అప్పుడు రవి కి వాళ్ళ అమ్మ గుర్తుకు వస్తుంది...!!! 

రవి ఆత్మ ; అమ్మ... అమ్మ...  (ఏడుస్తూ.. కంగారు పడుతూ.. తిరిగి వెళుతూ..) అయ్యో నిన్ను మర్చిపోయాను ఏంటమ్మా.. ( ఇంటికి గాలి లో తేలుతూ వెళుతూ చిన్నప్పటి నుంచి వాళ్ళ అమ్మ చేసినవి గుర్తు  తెలుసుకుంటాడు ) చిన్నప్పుడే నాన్న చనిపోతే, అన్ని నువ్వై.. ఎంతో ప్రేమతో.. అల్లారుముద్దుగా.. నన్ను చూసుకుని.. ఎంతో కష్టపడి.. నన్ను పెంచి, చదివించి, పెద్దవాడిని చేస్తే.. నేను నిన్ను ఈ వయసులో ఒంటరిన్ని చేసి వెళ్లిపోయాను. అమ్మ... నన్ను క్షమించు అమ్మ... క్షమించు.. (అనుకుంటూ ఇంటికి చేరుకుంటాడు..!)

               అక్కడ ఇంటి చుట్టూ జనం, రవి బాడీ మీద దండలువేసి ఉంటాయి... వాళ్ళ అమ్మ ఒక్కటే రవి బాడీ మీద పడి.. ఎంతపని చేశావు.. రవి ఒక్కసారి లేవరా... అని బోరుమని ఏడుస్తుంది..!  రవి ఆత్మ, వాళ్ళ అమ్మ దగ్గర కూర్చొని ఏడుస్తూ..!

రవి ఆత్మ ;  అమ్మ... నన్ను క్షమించమ్మా... క్షమించు... 

అమ్మ ; (ఇంకా బాగా ఏడుస్తూ) ఇక నేను ఎలా బ్రతకాలి.... ఎవరికోసం బ్రతకాలి.... అమ్మాయి ల ప్రేమ కోసం... మీరు చచ్చిపోతే....  మా అమ్మ లా... ప్రేమ గతి ఏమి కావాలి రా...! 

రవి ఆత్మ ; (చేతులతో తలని కొట్టుకుంటూ.. బాగా ఏడుస్తూ) అయ్యో.... నేను తప్పు చేశానామ్మ.....  తప్పు చేశాను..... వాళ్లు చేసిన మోసాన్ని లక్షసార్లు తలుచుకుని... చనిపోయాను కానీ... నిన్ను... నీ ప్రేమను... ఒక్కసారి తలుచుకునుంటే.... నేను బ్రతికి ఉండేవాడిని అమ్మ.... బ్రతికే వాడిని.. ఈ పిచ్చి పని చేసే వాడిని కాదామ్మ.... నన్ను క్షమించమ్మా... నన్ను క్షమించు... నువ్వు ఏడవకు అమ్మ... (అనీ కన్నీళ్లు తుడుస్తూ..) నేను తట్టుకోలేకపోతున్నాను... (కానీ కన్నీళ్లు పోవు..) అయ్యో... నీ కన్నీళ్లు పోవటం లేదే... (జనాల వైపు చూస్తూ... వాళ్ల దగ్గరికి వెళ్లి) అయ్యో అక్క ఎవరైనా.. రాండి.. మా అమ్మ కన్నీళ్ళు తుడిచి, ఓదార్చండి.. ప్లీజ్... 

అమ్మ ; (కన్నీళ్ళు తుడుచుకుంటూ) రెండు నెలలు ప్రేమించిన అమ్మాయి కాదన్న అందుకే, మీరు చనిపోతే... చచ్చేవరకు మీరే సర్వస్వం అని బతుకుతున్న మాకు.. మీరు లేరంటే.. మీకోసం మేము చేయడం కరెక్టే కద రా.. ఇక నేను బ్రతకను.. నేను చేస్తాను.. (అని లేచి చక..చక.. అక్కడి నుంచి వెళుతుంది..) 

రవి ఆత్మ ; వద్దమ్మ.. అలా చేయకు.. ఎవరైనా మా అమ్మ ని పట్టుకొండి... అని వాళ్ళ అమ్మ వెనకాల వెళ్తాడు.. వాళ్ళు అమ్మ ని ఎవరు అపరు.. 
వాళ్ళమ్మ రవి ఎక్కడైతే చనిపోయాడో, అక్కడే పట్టాల మద్దెలు ఆవేశంగా.. స్పీడ్ గా నడుస్తూ వెళ్తుంది..! 

రవి ఆత్మ ; (వెనకాల నుండి) అమ్మ ఆగమ్మ.. నువ్వు చావోదమ్మ.. నువ్వు బాగుండాలమ్మ.. 

అని వాళ్ళ అమ్మ దగ్గరికి వచ్చి. పట్టుకుంటాడు కానీ అతను ఆత్మ కావడంవల్ల.. పట్టుకోవడం కుదరదు... అమ్మ రవి లో నుంచి ముందుకు వెళుతుంది...  అంతలో ట్రైన్ సౌండ్ వినిపిస్తోంది.. చూస్తే ఎదురుగా వేగంగా వస్తుంటుంది..! 

రవి ఆత్మ ; (కంగారుగా) అయ్యో ట్రైను వచ్చేస్తుంది.. అమ్మ ఆ ట్రైన్ గుద్దితే బాడీ ముక్కలు.. ముక్కలు.. అవుతుందమ్మా.. నువ్వు ఆ నొప్పిని తట్టుకోలేవ్ అమ్మా... నా మాట వినమ్మా... నువ్వు చావొద్దమ్మా... 

వాళ్ళ అమ్మ అసలు ఆగదు.. అలాగే ముందుకు పోతుంది.. తనకంటే ముందు వెళ్లే. ట్రైను చూస్తూ.. ఆపండి.. ఆపండి... అని చేతులతో అలా అంటాడు రవి...! ట్రైన్ వేగంగా వచ్చి రవి ని దాటుకుని వాళ్ళ అమ్మను ఢీ కొడుతుంది..! 

               పట్టాలపైన, స్పృహ కోల్పోయిన రవి.. అమ్మ.... అని గట్టిగా అరిచి... ఉలిక్కిపడి లేస్తాడు....!!!

                పక్కన ఇంకో ట్రాక్ లో, ట్రైన్ స్పీడ్ గా వెళ్తుంది.. రవి కంగారుగా.. ఊపిరి పీలుస్తూ.. ఆ ట్రైన్ నీ చూస్తాడు... ట్రైన్ వెళ్ళిపోతుంది... రవి కంగారుగా చుట్టుపక్కల అంతా చూస్తూ... తనను తాను చూసుకుని... నేనింకా బ్రతికే ఉన్నాన..? అంటే ఇదంత.. కాల నా...???

                 అప్పుడు అసలు ఏం జరిగింది అంటే..? అక్కడ రెండు రైలు పట్టాలు ఉంటాయి... రవి ట్రైన్ సౌండ్ వినగానే.. తన ట్రాక్ లోనే వస్తుంది అనుకొని.. వెనక్కి చూడకుండా... గట్టిగా చెవులు మూసుకుని అలా కూర్చొని.. టెన్షన్ కు లోనే.. స్పృహ కోల్పోయు.. పట్టాల మీద పడి ఉంటాడు..!

               ఆ ట్రైన్ పక్క ట్రాక్ మీద నుంచి.. హరన్ కొడుతు... స్పీడ్ గా వెళ్లి ఉంటుంది... అప్పుడు రవి చనిపోయాడు అన్న భ్రమలో.. ఇదంతా కల రూపంలో వచ్చి ఉంటుంది..!!!

               రవి కొంచెం కోలుకొని.. వాళ్ళ అమ్మ ని తలుచుకుని.. కన్నీళ్లతో ఆకాశంవైపు చూస్తూ.. దేవుడికి దండం పెడుతూ...  "నేను సృష్టించిన ఈ ప్రపంచంలో, తల్లికి మించిన ప్రేమ మరొకటి లేదు అని.. అమ్మాయి లా ప్రేమ కోసం చావకండి.. అమ్మ ప్రేమ కోసం బతకండి రా"... అంటూ నాకు ఒక అవకాశం ఇస్తావా దేవుడా...! నీకు కోటి దండాలయ్యా... అని దేవుని మొక్కుతాడు..! 

రవి ; అమ్మ నువ్వు ఏంటో.. నీ ప్రేమ విలువ ఏంటో... నాకు తెలిసింది అమ్మ.. ఇక నేను చావను అమ్మ.. నీ కోసం బ్రతుకుతాను.. వస్తునను అమ్మా... (కన్నీళ్లు తుడుచుకుని) నీకోసం వస్తున్నాను.. అని ఏడుస్తూ ఇంటికి పరుగెత్తుకుంటూ వెళ్తుంటాడు..! అలా పరిగెత్తుతూ.. చిన్నప్పటినుంచి వాళ్ళ అమ్మ ప్రేమను.. తలచుకుంటూ వస్తుంటాడు... 

              వాళ్ళ అమ్మ చిన్నతనంలో అన్న మాట... "నువ్వు నల్లబంగారనీవి రా... ప్రపంచంలో నీ అంత అందగాడు ఎవరూ లేరు తెలుసా"...? 

             రవి మధ్య వయసులో " నువ్వు ఎప్పుడూ నాకు హీరోనే రా.. జీరో వి కాదు.." 

ఇలా తలుచుకుంటూ.. ఏడ్చు కుంటు.. పరిగెత్తుకుంటూ ఇంటికి వస్తాడు రవి..! 

               ఇంట్లో వాళ్ళ అమ్మ, చేతిలో ఫోను పట్టుకుని కంగారుగా.. కూర్చుని ఉంటుంది.. రవి అమ్మను చూసి. ఏడుస్తూ... అమ్మా.... అంటాడు..!!

అమ్మ ; (రవి ని చుసి సంతోషంతో) రవి.... వచ్చావా.... (దగ్గరికి వెళ్లి) ఏమైపోయావ్ రా.. నిన్న అంతా.. ఫోన్ కూడా ఎత్తడం లేదు..!

రవి ; (అమ్మను గట్టిగా కౌగిలించుకొని ఏడుస్తు) అమ్మ... నన్ను క్షమించు.... క్షమించుమ్మ... 

అమ్మ ;  రవి.... (కంగారుగా) ఏమైంది రా.... ఎందుకు ఇలా ఏడుస్తున్నావు..... (అని రవి ముఖాన్ని చూస్తూ) ఏమైంది రా.... ఇంతగా ఏడుస్తున్నావు....  చెప్పరా...

రవి ; చేతులు పట్టుకొని క్షమించమ్మా... క్షమించు( అని ఇంకా ఏడుస్తాడు..

అమ్మ ; (ఏడుస్తూ) అయ్యో... విడు ఏమి అయిందో చెప్పకుండా ఇలా ఏడుస్తున్నాడె... నాకు కాళ్ళూ చేతులు ఆడటం లేదు... (గట్టిగా) ఏమైందో చెప్పరా...? 

రవి ; అమ్మ... నేను ఒక అమ్మాయిని మనస్ఫూర్తిగా ప్రేమించానమ్మా.... ఆ అమ్మాయి కాదు అనే సరికి.. ట్రైన్ కింద పడి చచ్చి పోదాం... అనుకొని వెళ్లాను అమ్మ...! 

అమ్మ ; (బాగా టెన్షన్ తో) ఆ....! ఏంట్రా నువ్వు మాట్లాడేది....?  

రవి ; అవునమ్మా ఆ దేవుడు చివరి క్షణంలో నిన్ను, నీ ప్రేమను గుర్తుచేశాడు... అందుకే చవకుండా నీ కోసం తిరిగి వచ్చాను. అమ్మ.. ఇక ఎప్పుడూ ఇలాంటి పిచ్చి పనులు చేయను అమ్మ... చేయను... నన్ను క్షమించు... (అని కాళ్ళ మీద పడి ఏడుస్తాడు...! ) 

అమ్మ ; (ఏడుస్తూ) అయ్యో భగవంతుడా... నా బిడ్డ మనసుకి ఎంత కష్టం వచ్చేలా చేశావు కదయ్యా...? (క్రింద కూర్చొని) రేయ్ రవి ఏడవ కు... అంతా మన మంచికే అనుకో (అని కన్నీళ్లు తుడిచి) అందుకే నేరా.. నిన్ను అంత రాలేదు...? (అవును అన్నట్లు తల ఊపుతడు రవి) ఒక్క రోజు కే నా గుండె ఆగిపోయింది రా.. నీకు ఏమన్నా అయితే నేను తట్టుకోలేను రా..! అవును ఇంతకీ నిన్నటి నుంచి ఏమైనా తిన్నావా..? 

రవి ; లేదమ్మా... నిన్ను చూసిన తర్వాత, నీతో మాట్లాడిన తర్వాత నాకు బాగా ఆకలి వేస్తుంది అమ్మ...! 

అమ్మ ; నిన్నటి నుంచి ఏమీ తినలేదా...? నిన్ను... (అని కొట్టడానికి చెయ్యి పైకి ఎత్తి కొట్టకుండా) ఉండు అన్నం కలుపుకొని వస్తాను.. (అని వంట రూమ్ లోకి చకచకా ఏడుస్తూ పోతుంది. ఏడుస్తూనే అన్నం ప్లేట్లో పెట్టుకుంటూ..) ఒక్కపూట కుడా తట్టుకునే వాడు కాదు... అలాంటిది నిన్ను అంత ఏమీ తినలేడంట.... ఎలా తట్టుకున్నాడో ఏమో..?  ఆ రాక్షసి ఎవతో.. నాకు కనిపిస్తే తోలు తీస్తా.. (అనుకుంటూ అన్నం కలుపుకొని రవి దగ్గరికి వెళ్లి)  రవి... తిను రా.... (అని బాగా పెద్ద ముద్దా చేసి తినిపిస్తుంది.. రవి ఏడుస్తు తింటాడు... అమ్మ తినిపిస్తూ..) ఏం పిల్లలు రా మీరు.. అమ్మాయిల కోసం... అన్నాన్ని వదిలేయడం ఏంట్రా... ఏముందిరా అమ్మాయిలలో... (రవికి పొర పోతుంది.. అమ్మ కంగారుగా) నీధానం... నీధానం.. రా.. 

         అని నీళ్లు తాపుతూ.. నెత్తి మీద అలా తడుతుంది.. అన్నం తినేది అయిపోతుంది.. రవి ని తన ఒడిలో పడుకో పెట్టుకుని.. జో.. కొడుతుంది... రవి మెల్లగా ఏడవడం తగ్గిస్తాడు.. కొద్దిసేపటికే అమ్మ కూడా నిదానం అవుతుంది...! 

అమ్మ ; (రవి తలమీద అలా వెంట్రుకలను చేతితో ప్రేమ తో అలా అంటూ..) రవి నేను ఒక మాట చెప్తాను వింటవా..? 

రవి ; (పైకిలేచు) చెప్పమ్మా... నువ్వు ఏం చెప్తే అదే వింటాను చెప్పు...!

అమ్మ ; అమ్మాయి ప్రేమ దక్కానంత మాత్రానా... చావడం మో.. తాగి తిరగడం మె.. కాదురా... బతకడం... గెలగడం.. ప్రేమలో ఫెయిల్ అయితే...  ఒక లక్ష్యాన్ని ఎంచుకోండి రా.. ఆ లక్ష్యాన్ని నేను గెలుస్తున్నాను అని. అనిపిస్తే చాలు.. ఆ ఫీలింగ్ అమ్మాయి కంటే బాగుంటుంది..! అందుకే నువ్వు ఒక మంచి లక్ష్యాన్ని ఎంచుకో.. దాన్ని ప్రేమించు.. దాని కోసం పరితపించు.. చివరికి గెలిచి చూపించు.. అప్పుడు నిన్ను హేళన చేసిన వాళ్లే... నిన్ను మెచ్చుకుంటారు.. నిన్ను వదులుకున్న వాళ్ళు తప్పు చేశామని కుమిలిపోతారు...! అందంగా లేను అని ఎప్పుడూ బాధపడకు. సమాజంలో ఒక మంచి గుర్తింపు వచ్చిందంటే, దాని ముందు ఈ అందం చిన్నబోతుంది రా.. అందుకే నీకంటూ ఒక మంచి లక్ష్యాన్ని ఎంచుకుంటవా..?

రవి ; ఎంచుకుంటున్నమ్మ.. ఒక గొప్ప లక్ష్యాన్ని ఎంచుకుని.. దాని కొసం నేను ఎంతైనా పోరాడుతాను..ఇక నన్ను హేళన చేసిన వాళ్ళని ఎవర్నీ పట్టించుకోను.. ఈ క్షణం నుంచి నువ్వు నాలో కొత్త రవి ని చూస్తావు.. థాంక్స్ అమ్మ.. నాకు ఒక మంచి దారి చూపించి నందుకు...! 
(అప్పుడు అమ్మ మనసు..‌ సంతోషపడుతుంది..)
  
           మార్నింగ్ రవి స్నానం చేస్తూ ఉంటాడు.. నెత్తి మీద నీళ్లు అలా వేసుకుంటే. ఏదో కొత్తగా అనిపిస్తుంది... ఎందుకంటే మనం మారాలని ఏ క్షణమైతే అనిపిస్తుందో.. ఆ క్షణం నుంచి మనం ఏం చేసినా అది కొత్తగా అనిపిస్తుంది.. స్టైల్ గా  కూడా అనిపిస్తుంది.. రవి అద్దం ముందు నిలిచొని వుంటాడు... ఎందుకో ఈ సారి తను అందంగా ఉన్నాను అని అనుకుంటాడు... ఎందుకంటే రవి చాలా కాన్ఫిడెంట్ గా ఉంటాడు.. సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఉంటే.. అద్దం ముందు నిల్చుంటే.. మన ముఖంలో ఒక Brightness కనిపిస్తుంది..! రవి పౌడర్ని చుస్తాడు.. ఇక దీంతో పనిలేదని విసిరేస్తాడు.. కొత్త బట్టలు వేసుకుని, బయటికి వచ్చి చూస్తే షాక్ అవుతాడు.. ఎదురుగా వాళ్ళ అమ్మ, కొత్త బైక్ తో పక్కనే నిలబడి ఉంటుంది.. 

రవి ; అమ్మ.. ఈ బైక్ ఏంటి..? 

అమ్మ ; చాలా రోజుల నుంచి అడుగుతున్నావు కదా రా.. డబ్బులు జమ చేస్తూ వుండేదాన్ని. అది మొన్నటి సరిపోయాయి.. నిన్న కొన్నాను.. ఈరోజు నీ ముందుంచాను..  మనం మారాలి అనుకున్నప్పుడు.. మనకు నచ్చినవి పక్కన ఉంటే.. కొత్త ఉత్సాహాన్ని ఇస్తుంది రా.. ఆల్ ద బెస్ట్...! 

రవి ; థాంక్స్ అమ్మ.. మంచి టైమింగ్ లో తెప్పించావు అమ్మ... 

ఇక బైక్ మీద.. స్పెడ్స్ పెట్టుకొని కొత్త ఉత్సాహంతో.. కాలేజీ కి వెళ్తాడు.. రవి కాలేజీలో అందరికీ కొత్తగాను
స్పెషల్ గా కనిపిస్తాడు.. రాహుల్, శృతి, పై నుంచి రవి ని చూస్తారు...

రాహుల్ ; ఏంటి అప్పుడే వచ్చేసాడు.. ఏడవటనికి ఇంకో వారం రోజులు టైం పడుతుంది అనుకున్నాను..

శృతి ; ఏం పర్వాలేదు లే.. నేను ఏడిపిస్తాను గా (అని ఇద్దరు నవ్వుకుంటారు..) 

రాహుల్ ; సరే ముందు నువ్వు వెళ్ళి ఒక రౌండ్ వెయి.. తర్వాత నేను వస్తాను..! (అని వెళ్ళిపోతాడు )

        ఇక రవి మెట్లు పైకెక్కి శృతి ముందు నుంచి  శృతిని చూడకుండా వెళ్తుంటాడు...!

శృతి ; హాయ్ రవన్న..! (రవి పట్టించుకొకుండా క్లాసులోకి వెళ్తాడు) అబ్బో.. బాగా కాలి నట్టు ఉంది.. నేను వదలను గా..! 

               రవి క్లాస్ లోకి వెళ్లి. తన బెంచి మీద కూర్చుని నోట్స్ తీసుకొని.. ఏదో రాసుకుంటూ ఉంటాడు.. క్లాస్ లో  ఆరుగురు అక్కడక్కడ స్టూడెంట్స్ మాత్రమే ఉంటారు.. శృతి క్లాస్ లోకి వస్తుంది.. తన బెంచి దగ్గర బ్యాక్ పెట్టి. రవి దగ్గరికి వెళ్లి..

శృతి ; హాయ్ అన్న ఏంటి కొత్తగా తెగ రాస్తున్నావ్..! 

రవి రాయడం అపి. కోపంతో గట్టిగా ఊపిరి వదుల్తాడు.. 

శృతి ; ఏమన్నా మాట్లాడవు.. ఏం రాస్తున్నావ్.. (అని నోట్స్ నీ చూస్తుంది..) 

రవి ; (సీరియస్ గా) శృతి ఇక నుంచి నువ్వు నాతో మాట్లాడకు.. నేను నీతో మాట్లాడను.. 

శృతి ; (ఏమీ తెలియనట్టు) ఏ అన్న ఎందుకు..?

రవి ; ఎందుకంటే నేను నిన్ను, ఒకప్పుడు  ప్రేమించాను...! 

శృతి ; (గట్టిగా) ప్రేమించవా..?

రవి ; అవును ప్రేమించాను.. ఆ విషయం నీకు కూడా తెలుసు.. అది తెలిసిన క్షణం నుంచి నువ్వు నన్ను, అన్నా అని పిలవడం మొదలుపెట్టావు.. ఎంతైనా ఒకప్పుడు పెళ్ళి చేసుకోవాలి అని, అనుకున్న అమ్మాయి కదా.. ఇలా అన్న అంటుంటే (గట్టిగా) చండాలంగా ఉంది.. అందుకే నువ్వు నాతో మాట్లాడవద్దు..

క్లాసులో ఒక్కొక్కరిగా ఎంటర్ అవుతుంటారు వీళ్లను చూస్తుంటారు.. 

శృతి ;( చిరాగ్గా అసహ్యించుకుని గట్టిగా) ప్రేమించవా...? ఆ మాట చెప్పటానికి సిగ్గుగా లేదా నీకు..! అయినా నువ్వు ఎక్కడ, నేనెక్కడ. నీ కర్రీ ముఖానికి నేను కావాల్సి వచ్చిందా..? నేను కొంచెం క్లోజ్ గా ఉన్నంత మాత్రాన ప్రేమిస్తావా..! ఇంత చీప్ క్యారెక్టర్ రా నీది..! 

రవి ; (ఆవేశంగా పైకి లేచి గట్టిగా) ఏయ్.. ఇప్పుడు ఎవడే నిన్ను ప్రేమించమని అడిగింది..
(శృతి కొంచెం ఉలిక్కి పడుతుంది.. అప్పుడు రవి ఫ్రెండ్స్, స్టూడెంట్స్ అందరూ లోపలికి వస్తూ ఉంటారు..) 

రవి ; వినబడుతుందా..? నువ్వు నాతో మాట్లాడొద్దు..! నువ్వంటే నాకు ఇప్పుడు అసహ్యం.. అయినా ప్రేమించిన వాడిని, అన్నా అని పిలిచే. చీప్ మెంటల్ క్యారెక్టర్ నీదే, నాది కాదు..!

అప్పుడు శృతి చుట్టూ ఉన్న వారందరినీ చూస్తుంది.. అవమానంగా అనిపిస్తుంది..!

శృతి ; (గట్టిగా) అందులో తప్పేముంది.. నువ్వంటే నాకు ఇష్టం లేదు... మళ్లీ నా వెంట పడకూడదని అన్నా.. అని పిలిచాను..! 

రవి ; తప్పేముంద్య..? ఎలా చెప్తే అర్థమవుతుందే నీకు.. నిన్ను నా లవర్ గా అనుకున్న క్షణం నుంచి.. నీతో ఇలా మాట్లాడాలి.. అలా పట్టుకోవాలి.. ఇలా ముద్దు పెట్టుకోవాలి.. అని ఏవేవో అనుకొని కలలుకంటాం.. (గట్టిగా) చెల్లి తో ఎవరైనా ఇలా అనుకుంటారా......? ( కొద్ది గ్యాప్ ఇచ్చి) కుక్కలాగా నాతో అన్ని పనులు చేయించుకోవటానికి... హాయ్ రవి... గీ రవి.. అని స్వీట్ గా ముద్దు.. ముద్దుగా.. పిలిచి నాతో క్లోజ్ గా ఉండి.. నాలో ఫీలింగ్స్ కలిగించేలా చేసి.. అది చెప్పడానికి నీ దగ్గరికి వస్తే.. ఏమీ ఎరగనట్టు... అన్న.. అన్న.. నిన్ను.. నెను సొంతం అన్నా లాగా భావిస్తున్నాను.. ఛీ... సిగ్గు లేదు నీకు..! 

(అప్పుడు శృతి కి ఇంకా అవమానంగా అనిపిస్తోంది.. కొంచెం కన్నీళ్లు కూడా వస్తాయి..)

రవి ; నువ్వు మామూలుగా No చెప్తుంటే.. నేను పెద్దగా పట్టించుకునే వాడిని కాదు.. ఎందుకంటే నా ఫేస్ కి అంత సీన్ లేదని అనుకునే వాడిని.. మళ్లీ నీకు కుక్కలాగా అన్ని పనులు చేసేవాడిని.. (అప్పుడు రాహుల్ క్లాసులోకి వస్తాడు) కానీ నువ్వు ఇలా అన్నా అనడం నాకు నచ్చడం లేదు.. అందుకే నువ్వు అంటే అసహ్యం.. నువ్వు నాతో మాట్లాడొద్దు.. నీతో మాట్లాడటం నాకు ఇష్టం లేదు... (గట్టిగా) ఐ హేట్ యు..! 

అందరి ముందు శృతికి షేమ్ గా అనిపిస్తుంది.. కళ్ళల్లో నీళ్ళు వచ్చేస్తాయి.. 

రాహుల్ ; ఏంట్రా నువ్వు.. అందరి ముందు శృతి తో అలాగేనా మాట్లాడేది..! ఏమున్నా నాతో చెప్పుకో రా..! నేను క్లియర్ చేస్తాను.. పద ఇక్కడి నుంచి.. 

రవి ; రేయ్ ఆప రా.. నీ డ్రామాలు.. నీ గురించి నాకు అంతా తెలుసు రా.. శృతి నీన్ను ఇష్టపడుతుంది.. నీతో చాలా క్లోజ్ గా ఉంటుంది.. అని నాలో లేనిపోని ఆశలు కలిగించి.. ప్రపోజ్ చేయమని చెప్పి. నువ్వే మళ్ళీ తన దగ్గర వాడు ప్రపోజ్ చేయడానికి వస్తున్నాడు.. జాగ్రత్త.. వాన్ని కట్ చెయ్ అని తనకి సలహా ఇచ్చింది నువ్వే.. ఎందుకురా ఈ డబల్ గేమ్స్..

(శృతి షాక్ తో రాహుల్ ని చూస్తుంది.. అది గమనించిన రాహుల్ తడబడుతూ..) 

రాహుల్ ; రెయ్ ఏం మాట్లాడుతున్నావ్ రా..? 

రవి ; ఆ రోజు  మీ ఇద్దరూ మాట్లాడుకునింది నేను విన్నాను.. (కొంచెం బాధ తో) ఫ్రెండ్ అరా నువ్వు..  ఆ... ఫ్రెండ్ వా..? చిన్నప్పటి నుంచి నువ్వే నా బెస్ట్ ఫ్రెండు అని అందరికీ చెపుతున్నాను కదరా..! తెలీదా నెను ఎలాంటి వాడినో అని.. ఎందుకు రా, నా మనసులో ఇలా అడుకున్నావు...? దీని తీట్టేటప్పుడు. నాకు కోపం వచ్చింది రా.. కానీ నిన్ను తిడుతుంటే బాధగా ఉంది రా...! దీన్ని నువ్వు పడేయటానికి.. దీని ముందు నన్ను జీరో నీ చెసి.. నువ్వు హీరో కావాలా రా..? బాగానే ఉంటావు కదా.. డైరెక్ట్ గా ట్రై చేయొచ్చు కదా..? నీకు తెలుసా నువ్వు వేసే కుళ్లు జోక్ లకు. ఇది ఎప్పుడూ నీకు పడిపోయింది రా..! అయినా లవ్ లో కూడా అంత ఈగో ఏంట్రా నీకు.. ఇదే నీకు ముందు ఐ లవ్ యు చెప్పాలని ఇన్ని ప్లాన్లు వేసి... నా మనసు తో ఇలా అనుకోవాలారా..? (బాధతో) ఆ రోజు దీన్ని లవ్ చేస్తున్నాను.. అని నీ ముందే ఏడుస్తూ చెప్పాను.. కదరా.. అప్పుడు కూడా నీకు ఏమీ అనిపించలేదా రా..! మన యూత్ అన్ని విషయాలు ఎవరికి షేర్ చేసుకోలెరు రా.. కానీ ఒక బెస్ట్ ఫ్రెండ్ తోనే అన్ని విషయాలు షేర్ చేసుకుంటారు.. అలా అనుకునే కదరా.. నీతో అని చెప్పుకునే వాడిని..  నీకు తెలుసారా..? ఆరోజు ఇది అన్నా, అన్నప్పుడు.. నా లవ్ ఫెయిల్ అయిందని, ఒక రోజంతా ఏడ్చుకుంటూ ఉన్నాను రా..! నిన్ను గట్టిగా పట్టుకుని.. ఏడ్చి.. నీతో చెప్పుకుందామని. నీ దగ్గరికి వచ్చాను... కానీ అందుకు కారణం నువ్వే అని తెలిసే సరికి (ఏడుస్తూ) నా మనసు అక్కడే చచ్చిపోయింది.. 

(అప్పుడు శృతి బాధ పడుతుంది.. అందరూ కొంచెం బాధ పడతారు.. రాహుల్ కూడా కొంచెం ఏదోలా అనిపిస్తుంది..) 

రవి ; (గట్టిగా) నా దృష్టిలో మనిషిని చంపినా ఒకటే.. మనసు నీ చంపిన ఒకటే.. you are the killer.. మీ ఇద్దరి చేసిన మోసాన్ని తట్టుకోలేక.. నిజంగానే  చద్దామని రైలు పట్టాల మీద నిలుచున్నాను.. కానీ చివరి క్షణంలో ఆ దేవుడు మా అమ్మని.. మా అమ్మ ప్రేమని తెలిసేలా చేసి... అమ్మాయి ల ప్రేమ కోసం చవాకండి.. అమ్మ ప్రేమ కోసం బ్రతకండి.. అని తెలిసేలా చేశాడు.. అందుకే నేను చావకుండా తిరిగి వచ్చేసాను.. ఆ తర్వాత మా అమ్మ ఒక మాట చెప్పింది రా.. ప్రేమలో ఫెయిల్ అయితే ఒక గొప్ప లక్ష్యాన్ని ఎంచుకో అని.. ఆ లక్ష్యం కోసం బ్రతుకు అని.. అది నాకు బాగా నచ్చింది.. అందుకే నేను ఒక లక్ష్యాన్ని పెట్టుకున్నాను.. అది ఏంటో తెలుసా...? నేను సాధించిన విజయాలకు, ఈ దేశం నన్ను అవార్డులతో సత్కరిస్తుంది.. అప్పుడు నాకు ఒక Question... వస్తుంది.. నీ గెలుపుకి కారణం ఎవరు అని..  అప్పుడు మాత్రం మీ ఇద్దరి పేర్లు కచ్చితంగా చెప్తాను రా.. కచ్చితంగా చెప్తాను... This is my goal...! వీలైతే, ఆరోజు మీ పేర్లను టీవీల్లోనూ.. పేపర్ల లోనూ.. చూడండి.. గుడ్ బాయ్..! 

అని అక్కడనుంచి వెళ్ళి పోతాడు.. వీళ్ళ ఇద్దరిని.. క్లాస్ లో ఉండే స్టూడెంట్స్ అందరూ.. తప్పు చేసిన వాళ్లని చూసినట్టుగా చూస్తారు..! శృతి కూడా కన్నీళ్లతో తప్పు చేశాను.. అనే గిల్టీ ఫీలింగ్ ఏర్పడుతుంది..! రాహుల్ తలదించుకుని వెస్తుంటాడు.. అప్పుడు...

శ్రుతి ; ఒక్క నిమిషం.... రవి కి నన్ను లవ్ చేయమని ఎంకరేజ్ చేసి.. ప్రపోజ్ చేయమని చెప్పింది నువ్వేనా..???

రాహుల్ ; అవును అన్నట్టుగా మెల్లిగా తల ఊపుతాడు..

శృతి ; (కోపం తో, కొట్టడానికి చెయ్యి పైకెత్తుతోంది.. చెంప దగ్గర ఆపి.. అసహ్యించుకుని..) నిన్ను కాదు.. నన్ను నేను కొట్టు కోవాలి..

(అని తనను తాను గట్టిగా కొట్టుకుంటుంది.. అలా రెండు 3 సార్లు కొట్టుకున్న తర్వాత.. రాహుల్ చెయ్యి పట్టుకుని ఆపి..!)

రాహుల్ ; శృతి ప్లీజ్.. కోపం ఉంటే నన్ను కొట్టు.. ఇప్పుడు నన్ను ఎవరైనా కొడితే బాగుంటుంది అనిపిస్తుంది..!

శృతి ; (చేయి విడిపించుకుని) నిన్ను కొట్టలేను.. నువ్వు నన్ను కూడా Fool నీ చేశావు..! కాదు నేనే నీ దగ్గర Fool ని అయ్యాను..! ఇక నీ మొఖం నాకు చూపించకు..
(అని అక్కడి నుంచి ఏడుస్తూ వెళ్తుంది..) 

            ఇక వీళ్ల మేటర్ కాలేజ్ మొత్తానికి తెలుస్తుంది. రవి పై అందరికీ సానుభూతి కలుగుతుంది. శృతి చేసింది.. ముఖ్యంగా రాహుల్ చేసింది. పెద్ద తప్పు అని. అందరూ ఒకరికొకరు చెప్పుకుంటూ అనుకుంటూ ఉంటారు..! 
నెక్స్ట్ డే.. రవి కాలేజీలోకి వస్తు.. క్లాసులోకి వెస్తుంటాడు.. ఇద్దరమ్మాయిలు రవిని చూడకుండా ఇలా మాట్లాడుకుంటారు..

ఒక అమ్మాయి ; కర్రోడు ఏమో అనుకున్నాను.. కానీ వాడు మామూలోడు కాదు..!

మరో అమ్మాయి ; అవునే ఆ కర్రోడు ఒక్కొక్క డైలాగ్ వదులు తుంటే.. శృతి కి, రాహుల్ కి గునపాలు దిగాయి తెలుసా..? 

అప్పుడు వాళ్ళు రవిని చూసి సైలెంట్ అవుతారు.. రవి ఒకసారి చూసి వెళ్తుంటాడు.. వెనకనుండి శీను..

శీను ; రెయ్ కర్రోడా ఆగరా..! (రవి ఆగి వెనక్కి తిరిగి..)

రవి ; హాయ్ శీను..

శీను; (దగ్గరికి వచ్చి భుజం మీద చెయ్యి వేసి వెళ్తూ) ఏరా కర్రోడా.. నిన్న రాహుల్ గాని శృతి ని అలా వంచీ పడేసావు ఏంట్రా..? 

రవి ; ఏదో బాధలో, కోపంలో  అలా అయిపోయింది.. అంతే..

శీను ; వాళ్ళిద్దరు చేసిన పనికి చాలా బాధ అనిపించింది నాకు. నువ్వు నిజంగా అంటే సూసైడ్ చేసుకోవాలని అనుకున్నావా రా..?

రవి ; వదిలేయ్ రా.. మరి అవన్నీ ఎందుకు..!

            అనీ క్లాసు లోకి వెళ్లి. ఎవరి సీట్ లో వాళ్ళు కూర్చుంటారు.. క్లాసులో అందరూ స్టూడెంట్ వస్తారు.. రాహుల్ వచ్చి ఉండదు.. శృతి కొంచెం లేటుగా క్లాసులోకి వస్తుంది.. అప్పుడు తనని అందరూ వింతగా చూస్తారు.. శృతి ఫేసులో బాధ స్పష్టంగా కనబడుతుంది..! రవి ని చూస్తూ అలా కూర్చుంటుంది.. రవి సీరియస్ గా Note రాస్తూ ఉంటాడు.. కొద్ది సేపు అయిన తర్వాత లేడీ తెలుగు టీచర్ క్లాస్ కి వస్తుంది.. అందరు గుడ్ మార్నింగ్ చెప్తారు.. 

లేడీ టీచర్ ; గుడ్ మార్నింగ్ ఈ రోజు కూడా మీ మ్యాథ్స్ టీచర్ రాలేదు.. నేను అటెండెన్స్ వేసి వెళ్ళిపోతాను.. 

అని అటెండెన్స్ మొదలు పెడుతుంది.. అందరి పేర్లు మామూలుగా పిలిచి.. రవి పేరు వచ్చేసరికి, కర్రీ రవికుమార్ అని పిలుస్తుంది. రవి ఎస్ టీచర్ అని నిలబడతాడు.. అందువల్ల క్లాస్ లో ఉండే వాళ్ళు అందరూ నవ్వుతారు.. శృతి తప్ప..! 

టీచర్ ; (కంగారు గా నిలబడి గట్టిగా) సైలెంట్స్.. స్వారీ రవి. ఇందులో అలాగే రాసి ఉంది. (అని బాయ్స్ స్టూడెంట్ వైపు కోపంగా చూస్తూ) మర్యాదగా చెప్పండి.. ఇది ఎవరి పని.? ఇందులో ఇలా రాసింది ఎవరు..?

రవి ; అలా రాసింది.. నేనే టీచర్..! (అప్పుడు టీచర్ తో పాటు అందరూ షాక్ అవుతారు..)

టీచర్ ; నువ్వే రాసావా...? ఎందుకు...?

రవి ; (ఎటువంటి బాధ లేకుండా) వీళ్ళందరికీ నన్ను అలా పిలవడం ఇష్టం టీచర్.. ఇంతమందికి ఇష్టమైన పేరు. నా ఒక్కడికే ఎందుకు ఇష్టం ఉండకూడదు అనిపించింది..! అందుకే నా పేరు నీ ఇలా మార్చుకున్నాను..

టీచర్ ; అలా అందరూ అంటే, నీకు ఏం బాధ అనిపించదా.?

రవి ; కొందరు మాత్రమే అంటే బాధనిపిస్తోంది.. అదే అందరూ అంటే అలవాటు అవుతుంది.. బాధ అయినా, కోపం అయినా, ఏదైనా మనసులో నుంచి కథ టీజర్ పుట్టేది.. అందుకే దానికి ఇలా సర్ది చెప్పుకున్నాను. అసలు పేరు అంటే ఏంటి..? ఒక మనిషిని గుర్తు పట్టడానికి ఉపయోగపడుతుంది.. నన్ను రవికుమార్ అంటే ఎవరు గుర్తు పట్టారు టీచర్. అదే కర్రీ రవికుమార్ అంటే, ఎవరైనా సరే ఈజీగా గుర్తు పడతాడు.. మరి అలాంటి పేరును, ఎందుకు  వదులుకోవాలి అనిపించింది..! పైగా వీళ్లందరిని, వాళ్ళ అమ్మ నాన్న పెట్టిన పేరు తో పిలుస్తారు.. నన్ను మాత్రం ఆ దేవుడిచ్చిన గ్యారెంటీ కలర్, పేరుతో పిలుస్తున్నారు.. మరి అలాంటప్పుడు నేను ఎందుకు బాధ పడాలి.. ఇది నా పేరు అని నేను ఫిక్స్ అయ్యాను.. (అందరి వైపు చూస్తూ) So ఫ్రెండ్స్.. ఇక నుంచి మీకు ఇష్టమైన పేరు.. కర్రీ.. కర్రీ రవి కుమార్.. అని ధైర్యంగా పిలవండి.. నేను ఏమీ అనుకోను.. బాధ పడను.. కొపడను.. మీరు కూడా అలాగే పిలవండి టీచర్..

అప్పుడు స్టూడెంట్ అందరికీ ఏదోలా అనిపిస్తుంది.. 

టీచర్ ; (స్టూడెంట్స్ అందరినీ ఒకసారి చూసి) సారీ రవి.. నేను అలా పిలవలేను.. ఎందుకంటే నాకు కొంచం సంస్కారం ఉంది. 

(అని అటెండెన్స్ లో కర్రీ అనే పదాన్ని కొట్టేస్తుంది.. మిగిలిన అటెండెన్స్ కంప్లీట్ చేసి. వెళ్తూ మరో సారి ఆగి స్టూడెంట్ వైపు చూపు..)

టీచర్ ; మీకు అర్థం అవుతుందో లేదో నాకు తెలియటం లేదు కానీ. నాకు మాత్రం స్పష్టంగా కనిపిస్తుంది..!

శీను ; ఏంటి మేడం..?

టీచర్ ; రవి మిమ్మల్ని చెప్పుతో కొట్టాడు.. అది మీ రెండు చెంపల మీద క్లియర్ గా కనిపిస్తుంది..! ఫ్రెండ్స్ ని, నిక్ నేమ్ తో పిలవడం కామన్.. నేను కాదనను, కానీ అది వాళ్ళు చేసే తప్పుల వల్ల ఆ నిక్ నేమ్ రావాలి..! ఇలా దేవుడు ఇచ్చిన లోపాలతో కాదు.. కుంటోడా.. గుడోడా.. కర్రోడా..  This Is Not Correct. చదువు నేర్చుకుంటే సరిపోదు. కొంచం సంస్కారం కూడా నేర్చుకోండి..! 

అప్పుడు స్టూడెంట్స్ అందరూ, తల దించుకుంటారు.. టీచర్ వెళ్ళిపోతుంది.. అప్పుడు కర్రోడు అని మాట్లాడకున్నా.. ఇద్దరమ్మాయిలు.. 

అమ్మాయి ; ఏంట్యె.. నిన్న శృతి కి, రాహుల్ కి మాత్రమే దించాడు.. ఈరోజు అందరికీ దించేశాడు..? 

శృతి రవి ని అలా చూస్తుంది.. తర్వాత క్యాంటీన్లో రవి కూర్చొని ఉంటాడు.. అక్కడికి రవి ఫ్రెండ్స్ వస్తారు..! 

శీను ; హాయ్ రవి..  (అందరూ హాయ్ రవి అంటారు) 

రవి ; రేయ్ మీకు ఆ పేరు సూట్ కాదు. కర్రీ రవి అనే పిలవండి..! 

శీను ;( కొంచెం బాధ తో) సారీ రవి, ఇప్పటిదాకా అలా పిలిచినందుకు.. ఇక నుంచి రవి అనే పిలుస్తాను..! 

రవి ; పర్లేదు నేను ఏమీ అనుకోను.. (అంతలో)

శీను ; రవి ప్లీజ్ వదిలెయ్.. నా నోటినుంచి కాదు, నా మనసు నుంచి కూడా రావడంలేదు..! 

మిగతా ఫ్రెండ్స్ ; అవును రవి, ఇక నుంచి మేము అలా పిలవము..! 

రవి ; ఏం ఫ్రెండ్స్ రా మీరు. పిలవద్దు అన్నప్పుడు పదేపదే పిలిచారు.. ఇప్పుడు పిలవండి. అంటే మాత్రం పిలడం లేదు..

శీను ; అది సారె రా.. రాహుల్ గాడు, T C తీసుకొని. ఊరు వదిలి వెళ్లిపోయాడు అంట..!

రవి ; రాహుల్ ఎవరు..? 

శీను ; అర్థమైంది.. ఓకే నేను మళ్ళీ కలుస్తాను..
  
               ఇక ఆ తర్వాత నుంచి రవి అంటే అందరికీ రెస్పెక్ట్  పెరుగుతుంది.. రవి అన్ని విషయాల్లో యాక్టివ్ గా ఉంటాడు.. అతని ఆటిట్యూడ్ మొత్తం చేంజ్ అయి ఉంటుంది.. చదువులో అతి త్వరలోనే ఇంటెలిజెంట్ అవుతాడు.. ఎంతగా అంటే ఎవరికి ఏ డౌట్ వచ్చినా..? అతని నే అడుగుతారు.. రవి దాన్ని సాల్వ్ చేస్తాడు..! 

            ఇక్కడ శృతి తను చేసిన తప్పుకి, బాగా ఫీల్ అవుతుంది.. రోజు బాధపడుతుంది. వీలు కుదిరినప్పుడల్లా రవి కి స్వారీ చెబుతూనే ఉంటుంది.. రవి ఆమెను అసలు పట్టించుకోడు. ఒకరోజు శృతి, రవి ఎలాగైనా తన స్వారీ నీ యాక్సెప్ట్ చేసే వరకు చెబుతూనే ఉండాలని fix అవుతుంది.. రవి కాలేజీలో అలా వెళ్తుంటే.. వెంటపడుతూ..

శృతి ; సారీ రవి.. నేను చేసింది తప్పే.. అందుకు నెను ప్రతిక్షణం బాధపడుతూనే ఉన్నాను.. నన్ను శిక్షించు.. నువ్వే శిక్ష వేసిన నేను భరిస్తాను... నువ్వు ఏం చెప్తే అది నేను కుడా కుక్కలాగా చేస్తాను.. ప్లీజ్.. నా సారీ నీ యాక్సెప్ట్ చెయ్యి రవి..! నాకు చాలా గిల్టీగా ఉంది...!

రవి ; (చిరాకు వచ్చి) నిజంగానే తప్పు చేశానని బాధపడుతున్నావా..?

శృతి ; అవును రవి.. ప్రతిక్షణం..

రవి ; అది నేను నమ్మాలంటే, నువ్వు ఒక పని చేయాలి..! 

శృతి ; (కొంచెం సంతోషం తో ) చెప్పు.. నేను ఏం చేయడానికైనా సిద్ధం. ఏం చేయాలి..? 

రవి ; నాతో మాట్లాడొద్దు.. (శృతి షాక్ అవుతుంది) ఇలా వెంటపడి అసలు డిస్టర్బ్ చేయకు.. నువ్వు నిజంగానే, చేసిన తప్పుకు బాధపడుతున్నావు.. అని నాకు అనిపిస్తే, అప్పుడు నేనే చెబుతా నీ స్వారీ నీ నేను యాక్సెప్ట్ చేస్తాను అని.. ( వెళ్ళిపోతాడు)

శృతి ; (మనసులో బాధ తో) ఏ మాత్రం మాట్లాడడానికి అవకాశం లేకుండా చేశావు కదా రవి..!

              ఇక రవి ఫుల్ ఫోకస్ స్టడీ, మీద పెడతాడు.. శృతి తన ని ఎప్పుడు క్షమిస్తాడో అని. ప్రతి రోజు కాలేజీలో తనని చూస్తూ.. మౌనంగా బాధ పడుతు.. ఇంతకు ముందు రవి ఎలా ఉండేవాడు, నన్ను ఎలా చూసేవాడు, నన్ను ఎంతలా ప్రేమించే వాడు.. అని తలచుకుంటూ కాలం గడిపేది.. 

             మూడు నెలలు అవుతుంది.. ఫైనల్ ఎగ్జామ్స్ అయిపోతాయి.. రవి స్టేట్ ఫస్ట్ వస్తాడు.. టీచర్స్ అందరూ రవి మెచ్చుకుంటారు.. ప్రతి ఒక్క విద్యార్థి రవి ని ఆదర్శంగా తీసుకోవాలని చెబుస్తారు.. ఈ విషయంలో శృతి కూడా సంతోష పడుతుంది..! 

               ఆ రోజు కాలేజ్ చివరి రోజు.. అందరూ ఒకరికొకరు సెండాఫ్ చెప్పుకొని.. బాయ్ అని వెళ్తుంటారు.. శృతి ఎవరికీ చెప్పకుండా. రవి ఈ రోజైనా మాట్లాడిస్తాడా.. అని ఆశగా ఎదురుచూస్తుంది..! కానీ రవి కి శ్రుతి మీద ధ్యాసే ఉండదు.. 

రవి, ఇద్దరమ్మాయిలు మాట్లాడేది. అనుకోకుండా వింటాడు..! 

అమ్మాయి ; పాపం శృతి, అన్ని సబ్జెక్ట్ లో ఫస్ట్ రాంక్ వచ్చేవి.. తను స్కూల్ ఫస్ట్.. కాలేజ్ ఫస్ట్.. అలాంటిది ఇప్పుడు అన్ని సబ్జెక్టులో ఫెయిల్..

మరో అమ్మాయి ; పాపం.. రవి కోసం అంతగా బాధ పడితే.. చదువు ఎక్కడ ఎక్కుతుంది..?

గొడవ అయిన తర్వాత ఫస్ట్ టైం శృతి గురించి ఆలోచిస్తాడు రవి.. 

రవి అందరికీ బాయ్ చెప్పి.. బైక్ పార్కింగ్ దగ్గర కి వెళ్తాడు.. శృతి సెకండ్ ఫ్లోర్ నుంచి రవి ని చూస్తూ ఉంటుంది.. రవి బైక్ స్టార్ట్ చేస్తాడు.. అలా బైక్ అద్దం లో చూస్తే, పైనుంచి తనని బాధతో చుస్తున్నాను శృతి కనిపిస్తుంది.. కొంచెం ఆలోచిస్తాడు.. బైక్ ని ఆఫ్ చేసి. కిందకు దిగి శృతి వైపు చూసి. ఇలా రా అన్నట్టుగా, తలని అలా ఉపుతాడు..! 

ఇక శృతి ఆనందంతో కన్నీళ్లు తుడుచుకుని, ఒక్క క్షణం కూడా లేట్ చేయకుండా బ్యాగును అలా పడేసి. పరిగెత్తుకొని వస్తుంటుంది.. వేగంగా మెట్లు దిగటానికి చెప్పులు అడ్డు వస్తే, వాటిని విడిచేసి. పరిగెత్తుకొని రవి దగ్గరికి వచ్చి. ఆయాసపడుతూ.. రవి ఏం చెబుతాడో అని చిన్నగా కన్నీళ్లతో ఆశ గా చూస్తోంది..! 

రవి ; (శ్రుతిని చూస్తూ) స్వారీ ఏ కదా..? నీ స్వారీ నీ నేను యాక్సెప్ట్ చేస్తున్నాను..! ఇక తప్పు చేశాను అనే ఫీలింగ్ తో ఉండాల్సిన అవసరం లేదు.. ఒక్క మాట చెప్పగానే మూడు నెలలు నన్ను డిస్టర్బ్ చేయకుండా ఉన్నందుకు థాంక్స్.. నీ స్వారి యాక్సెప్ట్.. 

శృతి ; కొంచెం కంగారు గా, గుటకలు మింగుతూ. తల అడ్డంగా ఊపుతూంది..!

రవి ; ఏంటి. స్వారీ కాదా..? 

శృతి ; అవును అన్నట్టుగా తల నిలువుగా ఊపుతూంది..

రవి ; మరెంటి..? 

శృతి ; (కన్నీళ్లు తుడుచుకొని ) I Love You...! 

రవి ; అన్నా అని పిలిచి, లవ్ చేయాలి అని ఎందుకు అనుకుంటున్నావో, నాకైతే అర్థం కావడం లేదు.. ఇక నా విషయానికి వస్తే ఒకసారి అన్న, అనినా అమ్మాయిని లవ్ చేయాలెను స్వారీ...

శృతి ; రవి ప్లీజ్.. దాన్ని మళ్లీ గుర్తు చేయకు.. అప్పుడు నేను రాహుల్ మయలో ఉన్నాను.. ఆ మాట అని నేను తప్పు చేశాను.. అందువల్ల నేను ప్రతిక్షణం శిక్ష అనుభవిస్తూనే ఉన్నాను.. ఇక నీపై ప్రేమ కలగడానికి కారణం.. ఆరోజు నువ్వు చెప్పిన తర్వాత.. నీ గురించి ఆలోచించాను.. ఇంతకు ముందు నువ్వు చేసిన వని తలచుకున్నాను.. (ఏడుస్తూ) నిజంగానే ఎంత ప్రేమించావు రవి నన్ను.. (ఈమాటకి రవి కళ్ళలో కొంచెం నీళ్లు తిరుకుతాయి) నాకోసం ఎంత పరితపించే వాడివి.. నా కోసం ఏం చేయడానికైనా సిద్ధంగా ఉండే వాడివి.. నన్ను నువ్వు ఎలా చూసుకున్నావొ తలుచుకుంటే... ఆ ప్రేమను నేను మిస్ అయ్యాను.. రవి ఇప్పుడు నాకు ఆ ప్రేమ కావాలి.. ఆ స్వచ్ఛమైన ప్రేమ నాకు ఎప్పటికీ కావాలి.. అందుకే నేను ఇప్పుడు మనస్పూర్తిగా నిన్ను ప్రేమిస్తున్నాను..! I Love You Ravi.... I Love You So Much..

రవి ; (కళ్ళల్లో నీళ్ళతో) ఆ ప్రేమ.. ఆ రవి ఎప్పుడు చచ్చిపోయాడు...! చచ్చిపోయిన వాళ్ళు తిరిగి రాలేరు..! 

శృతి ; అందుకు కారణం నేనె.. అందుకే నాకు మరో అవకాశం ఇవ్వమని వేడుకుంటున్నాను.. నేను నిన్ను ఇప్పుడు ఎంతగా ప్రేమిస్తున్నానో అంటే దాన్ని మాటల్లో వర్ణించలేను.. 

అని పక్కనే ఉన్న గులాబీ మొక్కలొ నుంచి ఒక గులాబీ పువ్వు ను తీసే సమయంలో, ముళ్లు గుచ్చుకున్ని, కొంచెం రక్తం వచ్చిన, అది లెక్క చేయకుండా.. ఆ పువ్వు ను తీసి.. రవి ముందు మోకాళ్ళ మీద కూర్చుని.. గులాబీ ఇస్తు..

శృతి ; నాకు ఒక్క ఛాన్స్ ఇవ్వు.. నా ప్రేమను నిరూపించుకుంటాను.. నా శక్తికి మించి నిన్ను పువ్వుల్లో పెట్టుకొని చూసుకుంటాను.. (కన్నీళ్లతో) Will You Marry Me... 

రవి ; (కొంచెం ఆలోచించి) స్వారీ... 

అని బైక్ ఎక్కి స్టార్ట్ చేస్తాడు.. శృతి అలాగే కూర్చుని బాగా ఏడుస్తుంది..! రవి కొంచెం ముందుకు పోతాడు..

శృతి ; (బాగా ఏడుస్తూ గట్టిగా) రవి... (రవి ఆగి శృతిని చూస్తాడు) Pleasesss..... (ఇంకా ఏడుస్తూ) వెళ్ళకు......

రవి ; నా గుండె రాయి అయింది.. దాన్ని నీ కన్నీళ్లతో కలిగించలేవు... నాకంటూ ఒక లక్ష్యం ఉంది. నీ లవ్ ok చేసి. దాన్ని దూరం చేసుకోలేను..! (అని వెళ్లిపోతాడు)

                12 సంవత్సరాల తర్వాత, రవికి ఏకంగా భారతరత్న అవార్డు వచ్చి ఉంటుంది..! రవి సైంటిస్ట్ అయ్యి.. అందులో సాధించిన విజయాలకు. భారత రత్న వరించింది..! చిన్న వయసులోనే, మెడికల్ సైన్స్ లో, రవి ఒక అద్భుతం.. ఎన్నో రకాలా అంతు చిక్కని వ్యాధులకు, మెడిసిన్స్ కనిపెట్టాడు.. అంతే కాదు కోమాలో ఉన్న పేషెంట్ ని ఒక్కరోజులో స్పృహలో వచ్చేలా మందు కనిపెట్టి ఉంటాడు.. యాక్సిడెంట్ ద్వారా, పక్షవాతం ద్వారా, చలనం కోల్పోయి.. కాళ్లు చేతులు పడిపోయిన వారికి, కూడా బాగు చేసే ముందు కనిపెట్టాడు.. ప్రపంచ వ్యాప్తంగా సైంటిస్ట్ గా రవి కి మంచి గుర్తింపు ఉంటుంది.. 

రాష్ట్రపతి, భారతరత్న అవార్డు ఇస్తాడు.. ఆడిటోరియం లో ఉన్నవారు అందరూ చప్పట్లు కొడతారు... ఎంతో కాలంగా ఎదురు చూస్తున్న ఆ Question రానే వస్తుంది.. అది మీ గెలుపు కారణం ఎవరు అని. రవి మైక్ పట్టుకుంటాడు..

రవి ; (సంతోషముతో) నా ఈ గెలుపుకి ముఖ్య కారణం.... మా అమ్మ.....! 

ఆడిటోరియంలో ఆమె కూర్చున్న చోట, లైట్ ఫోక్స్ వేస్తారు.. అందరూ చప్పట్లు కొడతారు.. వాళ్ళ అమ్మకి ఆనందభాష్పాలు వస్తాయి..

రవి ; మా అమ్మే కాదు.. మరో ఇద్దరు వ్యక్తులు కూడా నా విజయానికి బలమైన కారకులయ్యారు..! వాళ్ళల్లో మొదటి వ్యక్తి, శృతి...... నా భార్య.....

                శృతి మెడలో మంగళ సూత్రం తో.. రవి అమ్మ పక్కనే కూర్చొని ఉంటుంది.. ఆమె పైన లైట్ ఫోకస్ వెస్తారు.. అందరూ చప్పట్లు కొడతారు.. ఆమె కి కూడా ఆనందభాష్పాలు వస్తాయి..! 

రవి ; మరొకరు రాహుల్.... నా బెస్ట్ ఫ్రెండ్...!

రాహుల్ స్టేజ్ పక్కనే, నిలబడి ఉంటాడు.. తనకి కూడా ఆనందభాష్పాలు వస్తాయి..! 

అప్పుడు శృతి, రాహుల్ ఆనంద పడుతూ జరిగింది తలచుకుంటారు...

           శృతి కాలేజ్ చివరి రోజు రవి, నో చెప్పి వెళ్లిన తర్వాత.. బాగా ఏడ్చి. క్లాస్ రూమ్ లోకి వెళ్లి, ఒక లెటర్ రాసి.. కాలేజ్ బిల్డింగ్ పై నుంచి దూకి సూసైడ్ చేసుకునింటుంది..! రక్తపు మడుగులో ఉన్న ఆమెను అక్కడ ఉన్న స్టూడెంట్స్ వెంటనే హాస్పిటల్ కు తీసుకుని వెళ్తారు.. శృతి కి ఆపరేషన్ అయి, I C U లో ఉంటుంది.. శృతి పేరెంట్స్, ఫ్రెండ్స్ బాగా ఏడుస్తుంటారు.. అక్కడ రవి ఫ్రెండ్స్, శీను కూడా ఉంటాడు..! 

రవికి విషయం తెలిసి, అక్కడికి వస్తాడు.. ఐసీయూలో ఉన్న శృతిని, Glass door నుంచి చూసి బాధ పడతాడు..! శీను భుజం మీద చెయ్యి వేసాడు..

రవి; (బాధతో) తనకు ఇప్పుడు ఎలా ఉందిరా..?

శీను; డాక్టర్లు బ్రతకడం కష్టం అంటున్నారు రా..!

రవి ; (శృతి అమ్మానాన్న ఏడవడం చూసి) చ.... తను ఇలా చేస్తుందని అనుకోలేదు.. రా.. తను ఇలా అవ్వడానికి  కారణం నేనే కదా..?

శ్రీను ; చేసిన తప్పుకి ఎదుటివాళ్ళు పనిష్మెంట్ ఇస్తే ఏదోలా భరించవచ్చు..  కానీ తనకు తానే పనిష్మెంట్ ఇచ్చుకుంది అంటే భరించడం చాలా కష్టం రా..!  తను మూడు నెలలుగా నీకోసం ఏడుస్తూనే ఉంది రా.. నువ్వు కొంచెం కరిగి ఉంటే బాగుండేది..! తాను చివరిసారిగా రాసిన లెటర్ తీసుకో.. 

రవి దాన్ని తీసుకుని చదువుతాడు. అందులో ఇలా ఉంటుంది..

శృతి లెటర్ ; రవి నీతో చివరి మాట, Pleasesss... వెళ్ళకు.... అన్న తర్వాత, నాలో నుంచి ఇంకో మాట కూడా వచ్చింది.. అది, నువ్వు కాదంటే నేను చచ్చి పోతాను అని. ఇది అప్పుడు చెప్పలేకపోయాను.. ఎందుకంటే, నాకు తెలుసు నేను ఈ మాట అంటే నువ్వు ఆగిపోతావు.. తర్వాత నన్ను ప్రేమిస్తావు కూడా.. కానీ అది బ్లాక్మెయిల్ అవుతుంది.. నా ప్రేమను నువ్వు బలవంతంగా ఒప్పుకున్నట్టు అవుతుంది.. అందుకే నేను, నీకు ఆ మాట చెప్పకుండా ఇలా చేశాను... 
నేను అన్న అని. No అన్నప్పుడు.. నువ్వు సూసైడ్ చేసుకోవాలని అనుకున్నాను.. చివరి క్షణంలో అమ్మ ప్రేమ గుర్తుకు వచ్చి. తిరిగి వచ్చావు... కానీ నేను అలాంటివి అమ్మ ప్రేమని మిస్ చేసుకున్నాను.. అదే నీ ప్రేమ.. అందుకే నాకు చవడం కరెక్ట్ అనిపించింది.. 

(ఈ మాటకి రవి కళ్ళల్లో నీళ్ళు తిరుగుతాయి.. ఒకసారి గ్లాస్ డోర్ నుంచి శృతిని చూసి ఫీల్ అవుతాడు.. లెటర్ కంటిన్యూ చేస్తూ) 

రవి నాకు ఒక చివరి కోరిక ఉంది.. అది నువ్వే మాత్రమే నెరవేర్చగలవు.. అది నువ్వు నెరవేరుస్తావు అని ఆశిస్తూ.. ఇలా చేశా. అది ఏమిటంటే..? నేను నీ వల్ల చనిపోయాను అని ఎప్పుడూ అనుకోకు.. గిల్టీగా అస్సలు బాధపడకు.. ఇదే నా చివరి కోరిక.. నా చావుకి కారణం నేనే.. నేను చేసిన తప్పు..! మరొక కోరిక కూడా ఉంది.. ఎంత అడగకూడదు అనుకున్న. నా మనసు ఆగడం లేదు. అందుకే అడుగుతున్నా, ఇది నీ ఇష్టం..
ఈ లెటర్ చదివిన తరువాత, ఒక్క క్షణమైన నన్ను లవర్ గా ఫీల్ అవ్వు...!  బాయ్ రవి.....
ఇట్లు నీ అమూల్యమైన ప్రేమను దూరం చేసుకున్న పాపిష్టి దాన్ని... శృతి...!!!

             రవి కన్నీళ్లతో శృతిని చూస్తూ లవర్ గా ఫీల్ అవుతాడు.. ఆ తర్వాత డాక్టర్స్ తను కోమాలో ఉంది. ఏ క్షణమైనా చనిపోవచ్చు.. బ్రతకడం అయితే కష్టం.. అంటారు..!

తర్వాత రవి వాళ్ళ అమ్మ పర్మిషన్ తో, ఆ హస్పిటల్ బెడ్ మీదే, శృతిని పెళ్లి చేసుకుంటాడు..

రవి ; (శృతి, అమ్మానాన్నలతో,) తను నా భార్య, నా ప్రాణం, తనని ఎలాగైనా కాపాడుకుంటాను అంటాడు..! 

అలాగే రాహుల్ కూడా, కాలేజ్ నుంచి వెళ్లిన తర్వాత. ఎవరికీ చెప్పకుండా ఫ్యామిలీతో సహా వేరే ఊర్లో సెటిల్ అవుతాడు.. నెల రోజులకే యాక్సిడెంట్ అయి, వెన్నెముకకు బలంగా దెబ్బ తగలడం వల్ల, అతని బాడీలో నరాలు బలహీనత అయి, బాడీ స్పర్శ కోల్పోతాడు.. ఊపిరి సినిమాలో నాగార్జున లాగా, తల మాత్రమే పనిచేస్తుంది.. అలా వీల్ చైర్ కే పరిమితమై ఉంటాడు రాహుల్..! అది తెలుసుకున్న రవి, రాహుల్ దగ్గరికి వస్తాడు. రాహుల్ రవిని చూసి తలదించుకుంటాడు. రవి దగ్గరికి వచ్చి, కూర్చుని తల పైకి ఎత్తాడు.. అప్పుడు రాహుల్..

రాహుల్  ; (ఏడుస్తూ) నాకు తెలియదు రా.. నాకు అప్పుడు అర్థం కాలేదు, నేను తప్పు చేస్తున్నాను అని.. నేనేం చేసినా, ఎంత అవమానించిన, నువ్వు కామెడీ గా, లైట్  తీసుకుంటాడు.. ఇది కూడా అలాగే అనుకుంటాడు అనుకున్నాను రా.. అప్పుడు నా టార్గెట్ అంతా శృతిని ఎలాగైనా పడేయాలనె ఉండేది రా..! నేను నీ ఫీలింగ్స్ ని పట్టించుకోలేదు. కానీ నువ్వు చావు దాకా వెళ్లావు అనేసరికి, నేనేం చేశానొ అప్పుడు నాకు అర్థమైంది. ఫ్రెండ్  ఒక అమ్మాయి ని చూస్తున్నాడు, అంటేనే మనం ఆ అమ్మాయిని చెల్లెలుగా భావిస్తున్నాం. అలాంటిది నువ్వు లవ్ చేస్తున్నాను అని నాతో చెప్పిన కూడా పట్టించుకోలేదు.. స్వారీ అని చెప్పడానికి కూడా మనసు ఒప్పుకోవడం లేదు రా.. ఎందుకంటే అది అంత చిన్న తప్పు కాదు.. అందుకే నేను ఎవ్వరికీ ఏమీ చెప్పకుండా వచ్చి.. నా తప్పు కి, నేను ఒంటరిగా శిక్ష అనుభవిస్తున్నాను.. దానికితోడు దేవుడు కూడా నాకు మంచి శిక్ష వేశాడు.. బాధలు పంచుకునే ఫ్రెండు, లేకుంటే ఎంత నరకం గా ఉంటుందో నాకు అర్థం అయింది రా.. అందుకే నువ్వు వచ్చేవరకు నాకు కన్నీళ్లు కూడా రాలేదు.. ఇప్పుడు వస్తున్నాయి.. గట్టిగా పట్టుకుని ఏడవాలని ఉందిరా.. కానీ నాకు అవకాశం లేకుండా చేశాడు, ఆ దేవుడు..! 

అప్పుడు రవి గట్టిగా కౌగలించుకున్నాడు రాహుల్ సారీ అంటూ తనివితీరా ఏడుస్తాడు..

రవి ; (రాహుల్ ని ఓదార్చి) నేను నీకు మాటిస్తున్నాను.. నిన్ను మళ్ళీ మామూలు మనిషిని చేస్తాను..  ప్రామిస్..! 

ఇక ఆ క్షణం నుంచి రవి. వాళ్ళిద్దరినీ బాగు చేయడం కోసం.. మెడికల్ సైంటిస్ట్ అవ్వడం కోసం.. దానికి సంబంధించిన కోర్సు అన్ని కష్టపడి చదివి, అన్నిట్లో ఫస్ట్ ర్యాంక్ లో పాస్ అయ్యి.. వాటి గురించి తెలుసుకుని, మెడిసిన్ కనిపెట్టడం మొదలుపెడతాడు.. కొన్ని సంవత్సరాల తర్వాత, ఫస్టు శృతి కి రాహుల్ కి ముందు కనిపెట్టి మామూలు గా చేస్తాడు..! అలా ఇద్దరికీ బాగవుతుంది రవి వల్ల..! 

ఆడిటోరియంలో.. ఇలా రాహుల్, శృతి, వాళ్ళకి జరిగింది తలుచుకుని.. ఆనంద భాష్పాలు కారుస్తూ.. రవి కి అభినందనలు తెలుపుతారు...! 
ఇక రవి, ఆ భారతరత్న అవార్డు ను తీసుకొని వచ్చి.. వాళ్ళ అమ్మ చేతిలో పెట్టి.. కాళ్లకు దండం పెడతాడు. శృతి కూడా, వాళ్ళ అమ్మ ఆశీర్వదిస్తుంది...!
                           
The End

Story By Nagraj..!!