అతను చిన్నప్పుడే అర్థం చేసుకున్నాడు—జీవితం అందరికీ ఒకేలా మొదలవదు ఒకేలా ఉండదు అని,కానీ అందరూ ఒకేలా మనుసుకి నచ్చిన కలలు కంటాఉంచాడుకలలు మాత్రం చిన్న వయసులోనే బాధ్యతల భారంలో నలిగిపోయాయిబాధ్యతలు మరచిపోయిన తండ్రి ఇంటి మీద పేరుకుపోయిన అప్పులు, మౌనంగా అనారోగ్యం తో అన్ని భరించే తల్లి చెల్లెలి చదువుల ఆశలు ఆ పై తన పెళ్లి కష్టాలు—ఇల అన్నీ అతడిని ఆడుకునే వయసులో ఆలోచించేలా చేసాయి , కలలు కనే వయసులో కష్టపడేలా పెద్దవాడిని చేశాయి. .స్నేహితులు ప్రేమ కథల్లో మునిగితే,అతడు... జీవితం అనే యుద్ధంలో నిశ్శబ్దంగా పోరాటం చేసే వాడు.తన ఆనందాన్ని వాయిదా వేసుకుంటూ,ఇంటి బాధ్యతల్ని ముందుకు నెడుతూ వచ్చాడుఅతడి దృష్టి లో ప్రేమంటే... ఒకరి భుజం కాదు,ఒకరి అర్థం చేసుకునే మనసు.ఏళ్ల తరువాత…ఒక్కొక్క బాధ్యతను తీరుస్తూ,చివరికి కొంత శ్వాస తీసుకునే స్థితికి వచ్చాడు.అప్పుడే అతడికి అనిపించింది—ఇప్పుడైనా తన జీవితంలో ఒకరు ఉండాలని.. ఒక సహచరి ఉండొచ్చేమో అని, విధి కీ అనుకున్నది తెల్సిందేమో అప్పుడే ఆమె పరిచయం అయింది .ఆమె మాటల్లో తొందర లేదు,ఆమె ఆలోచనల్లో లోతుంది.బాధ్యతల గురించి బాగా తెలిసిన అమ్మాయి .అవే జీవితానికి పునాది అని నమ్మే అమ్మాయి. పరిచయం మొదలయింది, మాటలు మెల్లగా అలవాటయ్యాయి,అలవాట్లు అవసరాలయ్యాయి.ఇద్దరూ తమ తమ జీవితాల్ని ఎటువంటి అబద్ధాలు లేకుండా పంచుకున్నారు. ఎంత పంచుకున్న ఆమె కీ ఇతని పై ఎటువంటి అభిప్రాయం లేదు కాని ,తనే చెప్పింది " నిన్ను ఒక అమ్మాయి రిజక్ట్ చెయ్యడానికి పెద్దగా కారణాలు లెవ్వని " అతనిలో ప్రేమ చిగురుటాకులా పుట్టింది—గట్టిగా కాదు,నిశ్శబ్దంగా ..తన అభిప్రాయాన్ని ఆమె ముందు చెప్పడానికి మాటలు రావటం లేదు ,కాని చెప్పకుండా ఉండలేడు చివరికి తన అభిప్రాయాన్ని అక్షరాల రూపం లో ఉంచాడు ప్రేమ లేఖఈ కాలం లో కూడా ప్రేమలేఖ రాస్తున్నాడు ఏంటి మూర్ఖుడు అని అనుకుంటవేమో ...అనుకున్న పర్లేదు మనుసులో మాటలు నీకు చేరడానికి నేను మూర్ఖున్ని ఐన పర్లేదు నా లోని భావాలని ఒక్క పదం లో తెలపాలి అంటే "నేను నిన్ను ప్రేమిస్తున్నాను" నిజానికి ఈ పదం కూడా సరిపోదు అనిపిస్తుంది ఎందుకంటే "ప్రేమిస్తున్నాను" అనే పధం లో ప్రేమని మాత్రమే ఇవ్వటం ఉంది నేను అల అస్సలు ఉండను .. నువ్వు నాతో ఉన్నప్పుడు ఆనందాన్ని చూపిస్తాను.. నువ్వు అలసి పోయి వచ్చినప్పుడు ని కోసం పనులు చేసి నా సేవ ని చూపిస్తానునువ్వు బాధలో ఉన్నప్పుడు నా ధైర్యాన్ని చూపిస్తాను..అదే నికేమన్న అయితే కన్నీరు తో నా బాధని చూపిస్తాను..చిరాకులో ఉన్నప్పుడు కోపాన్ని చూపిస్తాను .. నీకు కోపం వచ్చేట్టు చేస్తూ సరసాన్ని చూపిస్తానుఒక్క మాటలో చెప్పాలి అంటే గొప్ప ప్రేమికుడిలా నిన్ను ....మీ అమ్మ నాన్న ల చూసుకుంటాను అని అస్సలు చెప్పను కానీ ఒక సాధారణ ప్రేమికుడిలా నాతో ఉన్నని రోజులు నీకు మీ అమ్మ నాన్న లు గుర్తుకు రాకుండా మాత్రం చూసుకోగలనుప్రేమున్న చోటే బయం ఉంటుంది అని ఎవరో చెప్పారు బహుశ అందుకేనెమో .. కాగితం పై రాయడానికి వచ్చిన అక్షరాలు .. నీతో చెప్పడానికి మాత్రం బయపడుతున్నాయి అర్ధం చేసుకుంటావని ఆశిస్తూ ప్రేమతో నీ... ఇలా తన ప్రేమని అక్షరాల రూపంలో మలిచి తనకి అందజేసాడు.. జీవితం లో సంతోషంగా ఉండటానికి ప్రేమ ఒక్కటే చాలదని జీవితం మళ్లీ గుర్తుచేసింది.ఆమె మెదడులో ఆలోచనలు మొదలయ్యాయి—“అబ్బాయి మంచివాడే,కానీ డబ్బుండాలి…మంచిగా సెటిల్ అయి ఉండాలి.” ఇంట్లో వాళ్ళకి కూడా ఇదే కావాలి ఒకవేళ నేను ఒప్పుకుంటే తప్పకుండా ఇంట్లో వాళ్ళని ఒప్పించి పెళ్లి చేసుకోవాలి వాళ్ళు ఒప్పుకోవాలి అంటే తప్పకుండా డబ్బు ఉండాలి,సెటిల్ అవ్వాలి అని ఆలోచిస్తారు నేను వాళ్ళతో వాదించలేను,ఎదిరించలేను" ఇలా అమ్మాయి తనతో తను ఒక యుద్ధం చేస్తూ ఉంది కానీ లోపల మాత్రం విరిగిపోయింది.అతడు ప్రయత్నం చేయలేదు అని కాదు,కానీ అతడి కష్టానికి ఇంకా కాలం కావాలి.. అతడు ఏదైనా సాధిస్తాడు అనే నమ్మకం తనకి ఉన్న ఆ నమ్మకాన్ని తన వాళ్ళ ముందు నిలుపలేని పరిస్థితి తనది. చివరికి తన అభిప్రాయం నీ తనతో చెప్పడానికి కలిసింది.వాళ్లు కలుసుకున్న చివరిసారి ఘడియలు మాటలు తక్కువ అయ్యాయి, కళ్లలో చెప్పలేని భావాలు ఎక్కువ ఉన్నాయి.ఆమె కళ్లలో ప్రేమ ఉంది,అతడి కళ్లలో అర్థం చేసుకున్న ప్రేమ ఉంది....“నువ్వు సరిపోవు ఇది జరగదు మర్చిపోవటమే మంచిధి" అని ఆమె అనలేదు ఇప్పుడ, ఆమెకి మాటలు లేవు ,మాట్లాడటానికి అక్షరాలు రావట్లేదు కాని చెప్పక తప్పదు కాని చెప్పకుండానే అక్కడి పరిస్థితులే చెప్పేశాయి. ఏమీ మాట్లాడలేని స్థితిలో అతను అలా ఉండి పోయాడు ,జీవితం లో ఎన్నో బాధలు చూసి పెరిగిన తనకి ఈ బాధకి ఏడవడకి కన్నీళ్లు కూడా రాట్లేదు — చిన్న చిరునవ్వు... ద్వేషంతో కాదు,అసహాయతతో.అతడు మళ్లీ తన జీవితం వైపు నడిచాడు,ఆమె మళ్లీ తన కుటుంబం వైపు తిరిగింది.ఇద్దరి మధ్య ప్రేమజ్ఞాపకంగా మాత్రమే మిగిలింది.అతడికి ఇప్పుడు ఒకే ఒక్క ప్రశ్న—బాధ్యతల్ని మోయడమే తప్పయితే,ఆ బాధ్యతల్ని అర్థం చేసుకున్న ప్రేమ ఎందుకు సరిపోదు? జీవితం సమాధానం చెప్పలేదు.కానీ ఒక నిజాన్ని మాత్రం మిగిల్చింది—కొన్ని ప్రేమలు కలవవు,కలవలేకపోయినా ప్రేమని మాత్రం వదలవు.