ఇది రెండు మహిళల మధ్య
మౌనంగా పుట్టిన ప్రేమ కథ.
స్నేహంగా మొదలైన పరిచయం
ఎలా ప్రేమగా మారిందో చెప్పే కథ.
మొదటిసారి తెలుగు ఆడపిల్లలు క్రికెట్ వరల్డ్ కప్ గెలిచారు … దేశమంతా సెలబ్రేట్ చేసుకుంటున్నారు … అందులో ఒక మెంబర్ రియా ప్రియా గురించి సోషల్ మీడియా టీవీ చానల్స్ అంతా చాలా గొప్పగా చెబుతున్నారు....
రియా...... తన ఇంటిలో .సోఫాలో కూర్చుని ఫోన్ స్క్రోల్ చేస్తోంది........
టీవీలో న్యూస్:
“భారత మహిళా క్రికెట్ జట్టును వరల్డ్ కప్ గెలిపించిన రియా…టీమ్ అని వర్తల్లో చెప్తున్నారు....”
రియా వాళ్ళ అమ్మ సుజాత వంట చేస్తూ టీవీలో వినిపిస్తున్న తన కూతురి పేరుని వింటూ చాలా సంతోషంగా ఉంది....
🔔 డింగ్ డాంగ్….... మని డోర్ బెల్ మొగుతుంది....
“అమ్మా… ఎవరో వచ్చినట్టున్నారు…”అని అంటుంది... సుజాత
స్పందన లేదు.
అలసటగా లేచి డోర్ తీస్తుంది.
బయట ఒక అమ్మాయి.
సింపుల్ చుడిదార్ వేసుకొని..చేతులు కాస్త వణుకుతున్నాయి.
కళ్లలో అమాయకత్వం ఫుల్ ఇన్నోసెంట్ లుక్ తో నుంచుని ఉంది...“సుజతా ఆంటీ వాళ్ల ఇల్లు ఇదేనా…?” అని అడుగుతుంది
రియా: “అవును ఇదే......మీరు ఎవరు…?
అమ్మాయి కాస్త భయంగా.......“నేను… ఉర్వి...ఆంటీ నన్ను లంచ్ కి రమ్మన్నారు—”
లోపల్నుంచి సుజాత వాయిస్.....“వచ్చావా బంగారం!
రా లోపలికి రా… ”
రియా వెనక్కి తిరుగుతుంది.
సునీత (కూతుర్ని తోసుకుంటూ)........“ఏయ్ బఫెలో!
డోర్ మొత్తం నువ్వే కప్పేస్తావా.....లె పక్కకి తప్పుకో ”
రియా పక్కకి జరగుతూ, మనసులో
(అబ్బా… ఈ వయసులో అమ్మకి ఫ్యాన్స్ ఎక్కువైపోతున్నారు…) అని అనుకుంటుంది.....
ఉర్వి లోపల అడుగు పెడుతుంది......
రియా ఆమెని చూసి వెంటనే స్కాన్ మోడ్ రియా (సైడ్‌గా):
“అమ్మా…
నిజం చెప్పు.....ఇంకో పెళ్లి ఆలోచన ఏదైనా ఉందా?” అయినా ఇంత చిన్న పిల్లని..... 🙄....
సునీత..... 🤨“ఓసేయ్!.....నీకు బుర్ర ఉందా లేదా?
ఇది నా లైఫ్ సేవర్!” “గుడిలో జారి పడితే
ఈ పిల్లే నన్ను పట్టుకుంది తల్లీ!
లేకపోతే
నీ వరల్డ్ కప్ కూడా టీవీలోనే చూసేదాన్నే!”
రియా ఒక్కసారిగా సీరియస్. అమ్మ ఏంటి ఆ మాటలు......నీకు ఎమ్ కాదు నేను ఎమ్ కానివ్వను.....
“నీకు ఒకవేళ ఏదైనా అయ్యిందంటే నేను బ్యాట్‌తో కాదు
మొత్తం టీమ్‌తో కొడతా తెలుసా…” అని కోపంగా అంటుంది....
ఉర్వి కి కళ్లు పెద్దవిగా చేసి అయ్యో ఇప్పుడు ఎమ్ కాలేదు కడండి ఎందుకు అంత కోపం......అని అంటుంది...
రియా ఎమ్ మాట్లాడదు కింద కూర్చొని తన అమ్మ పాదాలని పట్టుకొని తన వొడిలో తలపెట్టుకొని ఉంటుంది....
అంతలో టీవీ మళ్లీ ఆన్ అవుతుంది.....టీవీ:“రియా… వరల్డ్ కప్ హీరో…”అని చెప్తుంటే......
ఉర్వి ఒక్కసారిగా టీవీ…...తర్వాత రియా…...మళ్లీ టీవీ…..మళ్లీ రియా…
“అయ్యో!....మీరు… మీరు రియానా?!”....
“రియానా కాదు….....రియా....సింగర్ కాదు.....బౌలర్ కాదు
బ్యాట్స్‌మన్.”😎.....
ఉర్వి (తల పట్టుకుని)...“అందుకే మీ ముఖం...ఎక్కడో చూసినట్టుంది అనుకున్నా…”
సునీత....“ఏముంది తల్లీ!....“కప్ గెలిచింది గానీ....నడక మారలేదు,....నవ్వు మారలేదు…...అదే నా రియా.”
రియా ఉర్వి దగ్గరకి వెళ్లి...చేతులు మడతపెట్టి...“షాక్ అవ్వకు.
అమ్మని కాపాడావు కదా….అంతే......ఇప్పటినుంచి
నువ్వు మా ఇంటి మనిషివే.”......ఉర్వి గుండె వేగంగా కొట్టుకుంటుంది.
ఉర్వి (నవ్వుతూ):....“నాకు తెలిసి....ఇది లంచ్ ఇన్వైట్ కాదు…
ఇంటర్వ్యూ లాగా ఉంది…”
రియా (స్మైల్‌తో)....“అవును....ఇస్టాగ్రామ్ లో పోస్ట్ చెదాం
‘అమ్మకి దగ్గరైన వ్యక్తి’.”అని...... 😂😂😂
సునీత ఇద్దరినీ చూసి.....చేతులు రుద్దుకుంటూ:
“ఓహో…....ఈ మ్యాచ్ చాలా ఇంట్రెస్టింగ్‌గా ఉంది రా!”అని అంటు వల్ల వైపు చూస్తూ 😂😂నవ్వు తుంది.......
ఇద్దరు చేతులు దూరం జరిపి ఒకరినొకరు చూసుకుంటూ నవ్వు కుంటారు.....
సుజాత....(చేతులు తుడుచుకుంటూ)....“సరే సరే…..ఇంత మాట్లాడితే ఆకలే పోతుంది.....పడండి… లంచ్ చేదాం.”అని అనుటుంది.....
డైనింగ్ టేబుల్ దగ్గరకి ముగ్గురూ వస్తారు.
టేబుల్ మీద
సాంబార్, కూర, పప్పు, పెరుగు, పాయసం.. ఉంటాయి....
రియా కూర్చుంటుంది.
సుజాత గారు కూర్చో ఊర్వి అని అంటుంది....
ఉర్వి కాస్త అటూ ఇటూ చూస్తూ, ఎక్కడ కూర్చోవాలో అర్థం కాక చూస్తు రియా ఎదురుగా కూర్చుంటుంది....
రియా ఎదురుగా కూర్చోవడం తో ఒక్కసారిగా.......ఉర్వి వైపు చూస్తుంది.....ఉర్వి కాస్త గబరాగా కూర్చుంటుంది.
రియా....“అమ్మా… అతిథి కదా,.....అలా ఆర్డర్స్ ఇవ్వకు.”
“అతిథి అయితే ఏంటి?.....మనవాళ్లే కూర్చోవాలి దగ్గరగా.”
ఉర్వి నవ్వుతూ తల వంచుతుంది.
లంచ్ మొదలు.....రియా తింటూ తింటూ
ఉర్వి ప్లేట్ వైపు ఓసారి చూస్తుంది.
:..“ఏంటి…...ఇంతే తింటావా అని అడుగుతుంది రియా....
“అవును…..నాకు ఎక్కువ తింటే నిద్ర వచ్చేస్తుంది.” ..అంటుంది ఊర్వి
రియా (నవ్వుతూ):....“అయ్యో…మ్యాచ్ టైంలో అయితే
ఇలా తింటేనే స్టామినా వస్తుంది.”
సునీత (మధ్యలో):...“మ్యాచ్ లో అయితే
ఈ పిల్ల.....మూడు ప్లేట్లు తింటుంది తల్లీ!
ఇక్కడ మాత్రం....సన్యాసిలా నటిస్తుంది.”
ఉర్వి నవ్వు ఆపుకోలేకపోతుంది.....“నిజమా?”ఆంటీ... అని అంటుంది...
రియా (చెంపలు ఉబ్బించి):....“అమ్మా…
ఎందుకు నా సీక్రెట్స్ అన్నీ బయటపెడతావు?”
“సీక్రెట్ కాదు…నీ ఆకలే నీ బలం.”.. అని అంటారు... సుజాత గారు
రియా, ఉర్వి కళ్లూ కలుస్తాయి....చిన్న మౌనం....ఆ మౌనంలో
ఏదో కొత్త ఫీలింగ్....రియా చూపు కాస్త ఎక్కువ సేపు ఆగుతుంది.....ఉర్వి వెంటనే చూపు తిప్పేసుకుంటుంది.
రియా (మనసులో):..ఎందుకు ఈ అమ్మాయి అలా చూడగానే
మనసు కాస్త ఆగిపోయింది…
ఉర్వి (మనసులో):....టీవీలో చూసిన రియా కాదు ఇది…
చాలా దగ్గరగా… చాలా మంచిది ...…టివి లో అయితే సింహాన్ని చూసినట్టే ఉండేది కానీ సూపర్ ఉంది........ అని అనుకుంటుది....
ఏంట్రా…...ఇద్దరూ తింటున్నారాలేక ఒకరినొకరు చూస్తున్నారా అని అంటారు సుజాత గారు...
ఇద్దరూ ఒక్కసారిగా నవ్వేస్తారు....లంచ్ కంప్లీట్....పాయసం వేస్తూ—
సునీత: ..“ఇది తినకపోతే
ఇక్కడ నుంచి వెళ్ళడం లేదు.”
ఉర్వి:....“అయ్యో ఆంటీ…...ఇంత తింటే
నిజంగానే నిద్ర వస్తుంది.”
రియా (సాఫ్ట్‌గా):....“వస్తే వస్తుంది…..ఇక్కడే పడుకో.” ఉర్వి షాక్.
సుజాత......గట్టిగా నవ్వుతుంది....“చూసావా తల్లీ!
వరల్డ్ కప్ గెలిచినా
మాట మాత్రం ఇంకా చిన్నపిల్లలనే......”
లంచ్ తర్వాత....ముగ్గురూ సోఫాలో కూర్చుంటారు.
మాటలు… నవ్వులు…...సమయం తెలియదు.
గడియారం వైపు చూసుకుంటుంది ఉర్వి....“అయ్యో…....నాలుగు అయిపోయింది.”
“అయ్యో అప్పుడేనా?....ఇంకా కాఫీ తాగి వెళ్ళు.”అని అంటారు సుజాత గారు....
ఉర్వి లేచి నిలబడుతుంది.....“లేదండీ ఆంటీ…
ఇంకో రోజు తప్పకుండా వస్తాను.”
రియా కూడా లేచి నుంచొని.....ఉర్వి వైపు చూస్తూ: “ఇంకో రోజు కాదు…...మళ్ళీ తప్పకుండా రా.” అని అంటుంది...
ఆ మాటలో.....ఆర్డర్ లేదు…...అభ్యర్థన లేదు…..కానీ ఒక హక్కు ఉంది.
ఉర్వి కళ్లలో చిన్న చిరునవ్వు.....“వస్తాను…”...డోర్ దగ్గరకి వెళ్తుంది.....రియా వెనకనే నడుస్తుంది....డోర్ దగ్గర
చిన్న మౌనం...రెండోసారి కళ్లూ కలుస్తాయి.....ఈసారి....ఎవరూ చూపు తిప్పరు.
రియా (నెమ్మదిగా):
“అమ్మని కాపాడినందుకు చాలా థాంక్స్...…
ఉర్వి అయ్యో.... పరవాలేదు.... మరి ఇంత పెద్ద థాంక్స్ లు ఎమ్ వద్దు లంచ్ ట్రీట్ ఇచ్చారు కదా... అసలు నేనే చెప్పాలి మీకు ఎవ్వరికి దక్కని అదృష్టం నాకు దక్కింది.... మిమల్లి కలవడం చాలా సంతోషం గా ఉంది.....
“మీరు…....చాలా సింపుల్‌గా ఉన్నారు....అదే నాకు… నచ్చింది.”నిజంగా నేను నిమల్లి అసలు ఎప్పుడు కలుసుఖినేమో అనుకున్న బట్ ఆంటీ వల్ల సాధ్యమయింది.....అని అంటుంది ఊర్వి....అలా మాట్లాడుతూ డోర్ దగ్గరకు వెళ్తుంటే.....
రియా నేను వస్తాను జరగాయలు ఇంక షాపింగ్ చేయాలి అని అంటుంది సరే అమ్మ రా అని డోర్ బయట నుంచుంటారు....
నీకు ఒకే కదా నిన్ను మీ ఇంటిదగ్గర దింపి మేము అలా వెళ్తాము అని రియా అంటుంది....
అయ్యో నాకు ఒకే కాని నేను మీతో వస్తాను అంత అయ్యాక నన్ని దింపి మీరు ఇంటికి రండి అని అన్నది ఊర్వి...
అంతలో సుజాత గారు బయటికి వచ్చి డోర్ వేస్తూ పద అంటుంది...
ఎప్పుడు ఎంటి మా సడన్గా షాపింగ్ అని అన్నది రియా...
ఎమ్ దానికి ఒక టైం అనుకోవాలా ఏంటి అని వెటకారంగా అంటుంది సుజాత గారు...
అలాకాదు సరేలే పద అని కార్ దగ్గరకి వెళ్తారు.... ముగ్గురు...