Friend... in Telugu Love Stories by sharanya books and stories PDF | సఖి...

Featured Books
Categories
Share

సఖి...

అది ఒక పెద్ద ఇంద్రభవనం లాంటి ఇల్లు.... కానీ అంతా చీకటితో ఒక స్మశానంలా వెలవెలబోతూ ఉంటుంది.....  



ఆ పాలేస్ లో ఒక్క మనిషి కూడా లేకుండా... ఇల్లంతా చాలా నిశ్శబ్దంగా ఉంది..! అదే పాలేస్ లోని లాస్ట్ ఫ్లోర్లో ఒక రూమ్ నుంచి ఒక అబ్బాయి గట్టిగా గట్టిగా అరుస్తూ.....



నానమ్మ నాకు నువ్వు తప్ప నాకు ఎవరున్నారు..!? నన్ను వదిలేసి ఎలా వెళ్ళిపోయావు నువ్వు...!? నన్ను ఒంటరిని చేసేసావు కదా...! చిన్నప్పుడే అమ్మానాన్న చనిపోయారు....  


నువ్వు , తాతయ్య పెంచారు.... తాతయ్య నాకు పది సంవత్సరాలు ఉండగా చనిపోయాడు...! 


ఇప్పుడు నువ్వు కూడా నన్ను వదిలేసి వెళ్ళిపోయావు...! ఇప్పుడు నాకు ఎవరు ఉన్నారే..!? 


నన్ను కూడా నీతో పాటు తీసుకువెళ్ళిపోవచ్చు కదా నానమ్మ..! 


ఇప్పటివరకు నాతో నటించడానికి వచ్చిన ఆ అమ్మాయి " నిజంగా నా భార్య కాదు..! " నేను నీ దగ్గర ఈ విషయం దాచి... నిన్ను మోసం చేశాను.! నన్ను క్షమించు నానమ్మ కానీ నాకు అదంటే ప్రాణం....



అది కూడా నన్ను వదిలేసి వెళ్ళిపోయింది...! ఇంతకీ నాకు దానికి పెళ్లి కుదిరింది... అని తెలిసి కూడా ఎలా నటించమని అడిగానో... నాకే ఇప్పటివరకు అర్థం అవ్వట్లేదు...!  


నేను ఎంత వెధవనైనా తను నన్ను మార్చింది..! నన్ను ఒక మనిషిని చేసింది..! 

అందరిలో నా పరువు పోకుండా కాపాడింది....!

నన్ను అమ్మలా లాలించింది...! 

నాన్నలా ఆధరించింది..! 

స్నేహితురాల్లా సహాయం చేసింది..!  

భార్యగా ప్రతి విషయంలో తోడుంది..! 

ఇప్పుడు దాని ప్రేమలో ముంచేసింది....!

నన్ను వదిలి వెళ్లిపోయింది.....!



నాలుగు అంటే నాలుగు రోజుల్లో దానికి పెళ్లి ఇప్పుడు దాని దగ్గరికి వెళ్లి ఏమని అడగాలి..!? 


నేను నిన్ను ప్రేమిస్తున్నాను అని చెప్పాను..! కానీ అది వాళ్ళ అమ్మానాన్న పరువు కోసం ఆలోచిస్తుంది... వాళ్ళు దీన్ని ఒక వస్తువుల వాడుకుంటున్నారు..! అది దీనికి చెప్పినా అర్థమయ్యి చావట్లేదు...! 


పోనీ నేను వచ్చి మాట్లాడుతానని చెప్తున్నాను..! చెప్పినా కూడా నాకు ఆల్రెడీ ఎంగేజ్మెంట్ అయిపోయింది..! ఇప్పుడు నువ్వు వచ్చి ఏం మాట్లాడుతావు...!  


అప్పుడు వాళ్ళు నన్ను ఎలా చూస్తారు..!? ఇప్పుడు ఏమని చెప్తావు..! నేను నీతో ఒక ఎయిట్ మంత్స్ నీ ఇంట్లో...! నీ భార్యగా ఉన్నానని చెప్తావా.!? అలా అంటే మా ఇంటి వాళ్ళ పరువు ఏమైపోతుంది.!?  



ఈ రోజు " నీకు నాకు మధ్య.... ఈ పరిచయం ,

ఈ బంధం శాశ్వతం కాదు , ఇది జస్ట్ కాంట్రాక్ట్ మాత్రమే " అని అది నన్ను వదిలేసి వెళ్ళిపోయింది.



ఇక నేను ఎవరి కోసం బ్రతకాలి...!? అని విస్కీ సిప్ చేస్తూ , మత్తులో తూగిపోతూ


సఖి నా కోసం తిరిగి వచ్చేయ్..! 

నేను నీ అన్వయ్... నీ భర్తని... 

అని గతం లోకి వెళ్తాడు....


                           ******



ఒక అమ్మాయి కాల్ మాట్లాడుతూ అటు ఇటు తిరుగుతూ చెప్పు విహాన్ అంటుంది.....


అన్ని ప్యాక్ చేసుకున్నావా…. బట్టలు.., నగలు…, ఇంక ఎం అయినా మర్చిపోయావా….! అంటాడు విహాన్ 



ఆ అమ్మాయి ఆ అన్ని ప్యాక్ చేసుకున్నాను ఒకసారి మళ్లీ అన్ని చెక్ చేసుకున్నాను. అంటుంది



మా అక్క , బావ , పిల్లలు , నాన్న , అమ్మ అందరు కూడా బయలుదేరిపోయారు….



ఫస్ట్ మీరు వెళ్తే కొంచెం వాళ్లకి హెల్ప్ చేసినట్టు అవుతుంది....


ఎందుకంటే అక్కడ వాళ్లకి తెలిసిన వాళ్ళు ఎవరూ లేరు. అందులో అది ఒక పల్లెటూరు…! అని చాలా చిరాగ్గా చెప్తాడు  



తర్వాత మా అక్క వాళ్ళ పిల్లలు అక్కడ అడ్జస్ట్ అవ్వడం కష్టం...! వాళ్ళని నువ్వే చూసుకోవాలి సఖి… అంటాడు 


ఆ అమ్మాయి అలాగే విహాన్ మేము ఇప్పుడే బయలుదేరుతున్నాం. మీ వాళ్ళు వచ్చే లోపల మేము అక్కడికి రీచ్ అయిపోతాము..! అని అంటుంది


మీ వాళ్ళు , మా వాళ్ళు ఏంటి..!? నీకు నాకు ఎంగేజ్మెంట్ అయిపోయింది..! సో అంతా మనవాళ్లే ఇలా ఎప్పుడు వేరు చేసే మాట్లాడకు.... అని చాలా సీరియస్ గా చెప్తాడు విహాన్…



ఓకే ఐ యాం రియల్లీ సారీ..! నేను కావాలని అనలేదు అంటుంది సఖి.... 



సరే ఈ ఒక్కసారికి ఎక్స్క్యూజ్ చేస్తున్నాను..! మళ్లీ ఎప్పుడైనా ఇది రిపీట్ అయిందంటే.... నాతో ఎలా ఉంటుందో నీకు తెలుసు కదా..! అంటాడు విహాన్ 




ఇక చిరాకు వచ్చిన తను ఓకే విహాన్ బాయ్ లేట్ అయిపోతుంది... అక్కడికి రీచ్ అయిన తర్వాత మా అత్తయ్య వాళ్ళని రిసీవ్ చేసుకుని నీకు కాల్ చేస్తాను అని కాల్ కట్ చేసేస్తుంది.... సఖి 



అప్పుడే సఖి వాళ్ళ అమ్మ సుధా గారు వచ్చి సఖి అన్ని ప్యాక్ చేసావా..! ఏమైనా బ్యాలెన్స్ ఉన్నాయా..! అని అడుగుతుంది 



సఖి మనసులో ఆ ఇప్పటిదాకా ఆ వెధవ టార్చర్ చేశాడు. ఇప్పుడు మళ్ళీ వచ్చి సేమ్ క్వశ్చన్ రిపీట్ చేస్తుంది..! అని ఐపోయింది ఇంకా మనం బయలుదేరుదామా..!? అని అడుగుతుంది 



అప్పుడే అక్కడికి సుధా.... సుధా..... అనుకుంటూ వస్తారు…. సఖి వాళ్ళ నాన్న కృష్ణ గారు…



ఆవిడ చెప్పండి ఏమైనా కావాలా..!? అని అడుగుతారు…..


లగేజ్ మొత్తం ప్యాక్ చేయడం అయిపోతే...


డ్రైవర్ వచ్చేసాడు మనం వెళ్తే మంచిది ఇదిగో మన అమ్మాయి వాళ్ళ అత్తింటి వాళ్ళు కూడా బయలుదేరిపోయారట...!  



ఇప్పుడే అల్లుడుగారు కాల్ చేసి చెప్పారు.... మనం వాళ్ళు వచ్చేటప్పుడు వెళ్ళిపోతే వాళ్ళని రిసీవ్ చేసుకోవడానికి ఉంటుంది..! అంటారాయన….



సఖి ఈ వెధవ మా నాన్నకు కూడా కాల్ చేసి చెప్పేసాడా..! వీడి మొహం తగలెయ్య.... అని తిట్టుకుంటుంది….



సుధ గారు అయిపోయిందండి ప్యాక్ చేసేసాము డ్రైవర్ వస్తే లగేజ్ మొత్తం కార్లో పెట్టించేయండి..! అని సఖి నువ్వు ఇలా రా నాతో అని పక్కకు తీసుకువెళ్తారు….


సఖి ఏంటమ్మా అని చాలా చిరాగ్గా అంటుంది....


సుధ గారు చూడు సఖి నువ్వు ఇలాగే మొహం మాడ్చుకొని ఉంటే..... మీ అత్తయ్య గారి వాళ్ళు వెళ్లి నీ మొగుడితో చెప్తారు....! వాడు నీకు కాల్ చేసి ఎలా మాట్లాడుతాడో తెలుసు కదా..! అని అంటారు.


ఇదండి ఇవాళ్టి ఎపిసోడ్....