అందరి జీవితం ఒకేలా ఉండదు.
అందరి జీవితం ఒకటికాదు
బాధ అనేది జీవితంలో ఒక భాగం.సంతోషంతో పాటు దుఃఖం, కష్టం కూడా ఉంటాయి. అన్నీ స్వీకరించాలి
మార్పు జీవితంలో అనివార్యం.
దేనికీ శాశ్వతంగా బంధింప బడకూడదు.
మార్పు తప్పదు
సంబంధాలు చాలా కష్టం.
ఏ సంబంధం కూడా సంపూర్ణంగా ఉండదు.
భయం మనల్ని వెనక్కి లాగుతుంది.
రేపు అనేది జీవితానికి హామీ కాదు. మనం ఈ రోజు ఉన్నామంటే రేపు కూడా ఉంటామని గ్యారెంటీ లేదు.
అందరూ మిమ్మల్ని ఇష్టపడాలని లేదు.
మీరు ఎంత మంచిగా ఉన్నా, కొందరు మిమ్మల్ని విమర్శించవచ్చు
అందరినీ మెప్పించడం అసాధ్యం.మీరు మీ స్వంత రక్షకులు.
న్యాయం ఎల్లప్పుడూ జరగకపోవచ్చు.
గెలిచేది అంతా న్యాయం కాదు
మనం మంచి చేసినా మనకు మంచి జరుగుతుందని చెప్పలేము…
మన మానసిక స్థితి మన జీవితాన్ని చాలా వరకు నిర్దేశిస్తుంది.
నిజమైన ఆనందం లోపల నుండి వస్తుంది. బయటి వస్తువులు లేదా వ్యక్తులు శాశ్వతమైన ఆనందాన్ని ఇవ్వలేరు.
సమయం చాలా విలువైనది మరియు తిరిగి రాదు.
ఒంటరితనం అనేది జీవితంలో ఒక వాస్తవం కావచ్చు.
ప్రతి ఒక్కరూ తమ స్వంత పోరాటాలతో బాధపడుతూ ఉంటారు.
జీవితం యొక్క అర్థం వ్యక్తికి వ్యక్తికి మారుతుంది.
అజ్ఞానం అనేది సాధారణమైన విషయం.
మనకు అన్నీ తెలుసని అనుకోవడం భ్రమ.
సంబంధాలు శాశ్వతంగా ఉండవు.
కొందరు మీ జీవితంలో కేవలం ఒక అధ్యాయం మాత్రమే.
ప్రేమ మాత్రమే సరిపోదు. సంబంధాలకు కమ్యూనికేషన్, గౌరవం, ప్రయత్నాలు కూడా కావాలి.
మీ విలువను మీరే నిర్ణయించుకోవాలి.
ఇతరుల అంచనాలను ఆధారం చేసుకుంటే, ఆత్మవిశ్వాసం కుదురదు.
జీవితం అనూహ్యమైనది. ప్రణాళికలు ఎల్లప్పుడూ
పని చేయవు. సర్దుకోవడం నేర్చుకోవడమే.
వృద్ధాప్యం అనివార్యం. శరీరం, మనస్సు క్రమంగా మారుతుంది. దీన్ని అంగీకరించడం శాంతికి మార్గం.
అన్ని సంబంధాలు శాశ్వతంగా ఉండవు.
కొన్ని బంధాలు కాలపరిమితితో వస్తాయి.
వాటిని విడిచిపెట్టడం నేర్చుకోండి.
సంపద సుఖాన్ని కొనగలదు, కానీ సంతోష జీవితాన్ని కొనలేదు.
ప్రపంచం చాలా పెద్దది, మనం తెలుసుకోవాల్సింది
చాలా ఉంది.
తప్పులు చేయడం మానవ సహజం.
ఎవరూ పరిపూర్ణులు కాదు.
సమయం గడిచే కొద్దీ వ్యక్తుల ఆలోచనలు, అభిరుచులు, లక్ష్యాలు మారవచ్చు.
నియంత్రణ అనేది ఒక భ్రమ. మన జీవితంలో చాలా విషయాలు మన నియంత్రణలో ఉండవు.
కష్టపడి పనిచేసినంత మాత్రాన విజయం రాకపోవచ్చు. కృషి, అదృష్టం, సమయం మరియు ఇతర అంశాలు కూడా తోడ్పడతాయి.
రోజువారి కష్టపడి సంపాదించుకున్న కూలీ డబ్బులను దాచిపెట్టుకొని ఆసుపత్రికి వెళ్ళటానికి కూడా మనసు ఒప్పుకోకుండా రోగాల పాలు అయ్యే వాళ్ళు ఎంతోమంది
కడుపునిండా ఆహారం తీసుకునే అవకాశం ఉన్న కూడా ఏదో తింటే చాల్లే అనుకొని
అరకొర తిండితో సరిపెట్టుకునే వాళ్ళు చాలా మంది.
ఇదంతా వదిలేయాలి
ఎప్పుడో తెగిపోయిన ఒక బంధాన్ని పట్టుకొని ఇప్పటికి ఏడుస్తున్న వాళ్ళము ఎంతమంది లేము? ఒక మాట పంతానికి ఇంకెన్నో బంధాలను దూరం చేసుకుని ఒంటరిగా మిగిలిపోయిన వాళ్లు మనలో లేరా?వ్యాపార లాభాలు అంటూనో,
పేరు ప్రతిష్ఠలంటునో వృత్తికి అంకితం అయిపోయి తన కుటుంబాన్ని పిల్లల్ని నిర్లక్ష్యం చేసిన పెద్దలు
ఎందరో.
అందుకే చిన్న మోతాదుల కానీ పెద్ద మోతాదులో కానీ ట్రాప్ లో ఏమైనా ఉన్నామేమో చూసుకోవాలి.
మన చుట్టు చాలా ట్రాప్ లు ఉంటాయి
అది నిత్యం మన చేతిలో ఉండే మొబైల్ కావచ్చు
మన నుంచి దూరంగా వెళ్లిపోయిన బంధం కావచ్చు
డబ్బు కావచ్చు, కీర్తి కావచ్చు..
మనల్ని పట్టేసి ఉంచుతుందేమో గమనించుకోవాలి. అవసరానికి దాన్ని వదులుకోగలమో లేదో చూసుకోవాలి.
అప్పుడే మనము ఈ ట్రాప్ నుంచి బయటపడగలం.
మనల్ని ఏడిపించే జ్ఞాపకాలు, నో అని చెప్పలేని మోహమాటాలు, తిరిగి అడగలేని అప్పులు, దండించలేని ప్రేమలు...
ఊపిరి సలపనివ్వని పనులు, ఒత్తిడి పెంచే కోరికలు, ఆరోగ్యాన్ని హరించే సంపాదనలు, పేరు ప్రఖ్యాతుల కోసం పరుగులు.. ఇలాంటివన్నీ ట్రాప్ లే.
మనం జీవించే జీవితం అబద్ధమని తెలిసిన సరే
మనమే గొప్ప
డబ్బు విషయంలో కావచ్చు
అందం విషయాల్లో కావచ్చు
చదువు విషయంలో కావచ్చు
ఆఖరికి సోషల్ మీడియాలో ఉన్న పరిస్థితిలో కావచ్చు మనమే గొప్ప
ఎదురు వాళ్ళు మనకంటే తక్కువే
అయితే ఈ స్నేహాలు ఒకరితోనే ఆగిపోతాయా అని అడిగితే అలా ఆగిపోవు
ఈ వ్యక్తులకు ఎప్పుడు వీళ్ళ చుట్టూ కొంతమంది ఉండడం కావాలి
వీళ్ళ చుట్టూ గొప్ప అని చెప్పడం కావాలి
వీళ్ళు ఏది చేసినా కరెక్ట్ అనే వాళ్ళు కావాలి.
దానికోసం వీరు ఏం చేయడానికైనా సిద్ధమ
ఎవరేమనుకుంటారో అనే ఆలోచన పక్కన పెడితే సంతోషం ఉంటుందో లేదో తెలియదు కానీ
ప్రశాంతత మాత్రం ఉంటుంది
మనకు నచ్చినట్టుగా మనం ఉంటున్నామని ప్రశాంతత
మనకు నచ్చిన జీవితాన్ని గడుపుతున్నామని ప్రశాంతత
మన ఆలోచనల్ని ధైర్యంగా చెప్పగలుగుతున్నాము అనే ప్రశాంతత...
నటించాల్సిన పనిలేదు
ఆలోచనల్ని ఇష్టాల్ని దాచుకుంటూ
బ్రతకాల్సిన పనిలేదు
ఈ శరీరానికి ఉండే విలువ కొన్నిసార్లు నీకు కూడా ఉండకపోవచ్చు.
ఆరోగ్యానికి కాపాడుకోవడం అన్నింటికంటే చాలా ముఖ్యం ఎందుకంటే ఒక్కసారి ఆరోగ్య సమస్య మొదలైతే
అది ఇంక జీవితాంతం వదిలిపెట్టకపోవచ్చు
ఆరోగ్యం ఉన్నప్పుడే దానికి విలువ తెలుసుకోవాలి ఆరోగ్యంగా ఉన్నప్పుడే అన్ని సక్రమంగా చూసుకోవాలి.
ఒక్కసారి సమస్య మొదలైతే ఇంకా ఏముంటుంది..
డాక్టర్లు టెస్టులు ఇంజక్షన్లు టాబ్లెట్లు రిపోర్ట్ లు ఇవి
కొన్ని సందర్భాల్లో మనల్ని మనం క్షమించుకోవాలి కూడా. 'నేనలా ప్రవర్తించాను. కాబట్టి ఇక దేనికీ పనికిరాను' అని వెంటనే ఒక నిర్ణయానికి వచ్చేయకూడదు.
ఒక్కోసారి అనుకోకుండా పొరపాట్లూ, తప్పులూ చేస్తుంటాం.
వాటిని పెద్ద మనసుతో సమీక్షించుకోవాలి.
ఒకవేళ ఎదుటివాళ్లే తప్పు చేసి మనల్ని మన్నించమని అడిగితే క్షమిస్తాం కదా... అలాగే మన తప్పులనూ మనం మన్నించుకోవాలి.
అయితే ఇదే సాకుగా తీసుకుని తప్పులు చేయడానికి అలవాటు పడటం మాత్రం మంచిది కాదు.
మనల్ని ఒకరు తక్కువ చేసి మాట్లాడుతున్నారు అంటే
మనకి ఒకరు గౌరవం ఇవ్వడం లేదు అంటే
పూర్తి బాధ్యత మనదే
ఎందుకంటే గౌరవం లేని చోట మన వ్యక్తిత్వాన్ని ప్రదర్శించడం కూడా సరైనది కాదు
ఎవరితో ఎప్పుడు ఎలా ప్రవర్తించాలో అని ఇంగిత జ్ఞానం కచ్చితంగా ఉండాలి
ఈ సత్యాలు కఠినంగా అనిపించినా, వాటిని అంగీకరించడం వల్ల మనిషి బలంగా, బుద్ధివంతుడిగా మారగలడు. జీవితాన్ని దాని వాస్తవ రూపంలో స్వీకరించడమే జ్ఞానోదయానికి మొదటి మెట్టు.