Thalli perma in Telugu Moral Stories by kvlsandhyarani books and stories PDF | తల్లి ప్రేమ

Featured Books
Categories
Share

తల్లి ప్రేమ

యశోద తొమ్మిది నెలల నిండు గర్భిణిగా ఉన్నప్పుడు మూడు అంతస్తులు ఎక్కి ఏపీ స్లట్ పరీక్ష రాసి పాస్ అయ్యింది .తర్వాత డెలివరీ కి , పుట్టింటికి వెళ్లి , ఒక అబ్బాయికి జన్మనిచ్చింది.

        యశోద బాబుకు 5 నెలలు నిండి, ఆరో నెల రాగానే పుట్టింటి నుండి అత్తగారింటికి వెళ్ళింది . అప్పుడే ఆఖరి ఆడపడుచు కి పెళ్లి కుదిరింది. చంటోడికి సంవత్సరం ఆరు నెలలు వచ్చేవరకు అత్తగారింట్లో ఉంది .సాకేత్ అమ్మ ను చూస్తే ఎవ్వరు పిలిచినా వెళ్ళడు.యశోద పిల్లవాణ్ణి ఎక్కువసేపు వదిలిపెట్టి అస్సలు ఉండదు. సాకేత్ని ఎవ్వరికీ ఎక్కువ సేపు ఇచ్చేది కాదు. యశోద డెలివరీ కి వెళ్ళినప్పుడు ఈమె భర్త అర్జున్ ఆలోచించి ఎంఫిల్ అప్లికేషన్ నింపి యూనివర్సిటీలో సబ్మిట్ చేశారు.

    యశోద అత్తగారిది చాలా పెద్ద కుటుంబం. మామయ్య వ్యవసాయం చేసేవారు. కొబ్బరి ,జీడి మామిడి ముఖ్యమైన పంటలు. ఇల్లు చాలా పెద్దగా ఉండేది ఇంటి నిండా పాలేర్లతో చాలా బిజీగా కలగా ఉండేది. వీళ్లు బాగా పనిచేసే వారు. అత్తయ్యని, మామయ్యని ,పెద్ద అయ్యగారు ,పెద్దమ్మ గారు అని పిలుస్తూ ఉండేవారు. మామయ్య గారికి ఐదుగురు సంతానము. ముగ్గురు అబ్బాయిలు ,ఇద్దరు అమ్మాయిలు. పెద్ద అబ్బాయి కాంట్రాక్టర్ గా పని చేస్తున్నారు. రెండో అబ్బాయి డాక్టర్, 3 అబ్బాయి వాళ్ళ నాన్నకి వ్యవసాయంలో సాయం చేస్తారు. మామయ్య గారు పెద్ద కూతురుకి పెళ్లి చేసి అత్తగారింటికి పంపించారు. అందరికీ పెళ్లిళ్లు అయిపోయాయి ఒక్క చిన్న కూతురే పెళ్లికి ఉంది. వీళ్ళ మూడో కొడుకు కోడలు యశోద అత్తమామలతో కలిసి ఉంటారు .

       యశోద అత్తగారు బాగా పని చేస్తారు. ముందు చూపు చాలా ఎక్కువే. ఏదైనా పండగ వస్తుందంటే ఒక 20 రోజులు ముందు నుంచే దేవుడు సామాన్లు శుభ్రం చేయడం , కావాల్సినవి తెప్పించి ఉంచడం ,
మొదలుపెడతారు . వైనం కూడా చాలా ఎక్కువే . కోడళ్లను చాలా ప్రేమగా చూసుకునేవారు. సాయంత్రం అయ్యేసరికి చెట్లు నుండి సన్నజాజి పువ్వులన్ని సేకరించి పువ్వుల మాలలు కట్టి ముగ్గురు కోడళ్ళ తలలో పెట్టేవారు. కోడళ్ళకు పని కూడా చెప్పేవారు కాదు . సూక్తులు సామెతలు బాగా చెప్పేవారు. యశోద బాబుని అందరూ వచ్చి కాసేపు ఆడించేవాళ్ళు. మామయ్య గారు చంటి బిడ్డను ఎత్తుకొని కాసేపు ఆరు బయట కూర్చునేవారు. ఇంటికి వచ్చే వారందరికీ మనోడ్ని పరిచయం చేసేవాళ్ళు. అప్పుడప్పుడు చంటోడ్ని యశోద చిన్న మరిది గారు ఎద్దుల బండి మీద ఒడిలో కూర్చోబెట్టుకొని, సరదాగా తిప్పి తెచ్చేవారు .చంటోడు నవ్వుతూ ఉండేవాడు.
  
         యశోదకి M.Phil జాయిన్ అవ్వమని యూనివర్శిటీ నుండి కాల్ లెటర్ వచ్చింది. ఒకపక్క చంటోడు, ఒకపక్క చదువు. యశోద కి చదువు అంటే చాలా ఇష్టము. "అవకాశము అస్తమానం రాదు కదా అని ఆలోచిస్తూ ఉంది." అత్తమ్మ వాళ్ళ దగ్గర ఒక 13 ఏళ్ల చిన్నమ్మాయి అత్తకి చిన్న చిన్న సాయాలు చేసేది. తన పేరు దీపిక. చంటోడికి స్నానం చేయించేటప్పుడు దీపిక అక్కడే నిల్చోని చేతికి టవల్ అందించడం, బాబుకి జలుబు చేయకుండా కొంచెం సాంబ్రాణి పొగ వేసేటప్పుడు కూడా దీపికా అక్కడే ఉండి యశోదకు సాయం చేసేది. యశోద భర్త ఉద్యోగరీత్యా రాజమండ్రిలో ఉంటున్నారు. అత్తగారిది అనకాపల్లి. "యశోద అత్తకు తన పరిస్థితి చెప్పుకొంది." అప్పుడు అత్త నేను వస్తాలే ,అప్పుడప్పుడు అని చెప్పింది. యశోద చాలా సంతోషించింది. యశోద నాన్నగారు విజయవాడలో ఉండేవారు ఆయన సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయ్. ఈ లోపల "అత్తయ్య ఆలోచించి యశోద యూనివర్సిటీకి వెళ్తే చంటోడిని ఎవరు చూసుకుంటారు అనుకొని ఆ 13 ఏళ్ల దీపికను అడిగింది. " అమ్మాయి దీపికా నువ్వు యశోద అక్కతో వెళ్లి రాజమండ్రిలో వాళ్లతో పాటు ఉండి చంటోడ్ని బాగా చూసుకుంటావా అని అడిగింది?" దీపిక వెంటనే అలాగే అమ్మగారు అని చెప్పింది. యశోద చాలా సంతోషించింది. రాజమండ్రి వెళ్లగానే యూనివర్సిటీలో ఎంఫిల్ కి జాయిన్ అయిపోయింది. ప్రతిరోజు ఉదయము 8:30 కల్లా బయలుదేరి మధ్యాహ్నము రెండు గంటల లోపల ఇంటికి వచ్చేసేది. వెళ్లే ముందు చంటోడికి సెరిలాకు ఒక కప్పులో ఉంచి వాటర్ తో కలిపి దానికి మూత పెట్టి ఒక ఎత్తు ప్రదేశంలో ఉంచేది. అంతే కాకుండా బాబుకి రెండు సీసాలు పాలుని మైక్రోవేవ్ లో ఉంచేది. ఈ లోపల బాబుకి స్నానం చేయించి చక్కగా తయారు చేసి, బుగ్గన చుక్క పెట్టి, ఆట వస్తువులన్నీ సిద్ధం చేసి ,బాబును దీపికకు ఇచ్చి అన్ని జాగ్రత్తలు చెప్పి తలుపులన్నీ వేసి, ఒక చిన్న తలుపు ఎమర్జెన్సీ కోసం తీసి, పై పోర్షన్ లో వాళ్ళను మధ్య మధ్యలో వచ్చి చూసుకోమని చెప్పి బయలుదేరేది.
   
        యశోద తిరిగి వచ్చాక బాబు ఒక్క క్షణం కూడా ఆగకుండా అమ్మను చూసి ఎగిరి దూకేవాడు. అప్పుడు యశోద ఒక్క నిమిషం అమ్మ చేతులు ,కాళ్లు కడుక్కొని వస్తానమ్మా బంగారం! అని చెప్పి తొందరగా చేతులు కాళ్లు కడుక్కొని పిల్లవాణ్ణి ఎత్తుకుంటుంది ,"దీపిక ఇప్పుడు వరకు నా దగ్గరే ఉన్నావ్ కదమ్మా! అని బాబుతో అంది దీపిక. "యశోదతో అక్క నువ్వు కొద్దిసేపు లేటుగా రా అక్క అని చెప్పేది" వెంటనే చంటోడు దీపిక చంప మీద చెల్లమని అనిపించేవాడు. "యూనివర్సిటీలో రీసెర్చ్ మొదలైంది". సుమారు ఒక 150 పేజీలు డిసర్టటేషన్ రాయాలి లై బ్రరీ కి వెళ్లి అన్ని పుస్తకాలు తిరగేసేది యశోద . ఇంక డిసర్ టేషన్ రాయటం మొదలు పెట్టింది . "దీపిక నాన్న రాజమండ్రి కి వచ్చి ఏవో కబుర్లు చెప్పి దీపికను వాళ్ళ ఊరికి తీసుకెళ్లిపోయాడు". ఒక పక్క చంటోడ్ని చూసుకుంటూ, ఇంకో పక్క పేపర్లనుతయారు చేసుకుంటూ ఉండేది యశోద . లోపల పని చేసుకుని యశోద బయటికి వచ్చేసరికి చంటోడు పేపర్లు చించేసేవాడు. మళ్లీ మళ్లీ అదే రాయవలసి వచ్చేది. అప్పుడు యశోద "అమ్మానాన్నలు వచ్చి మేము రెండు నెలలు సాకేతుని తీసుకొని వెళ్లి చూసుకుంటాము అని అన్నారు."అప్పుడు చంటోడు వాళ్ళ అమ్మ వైపు జాలిగా చూశాడు. "యశోద ఓ పక్క చంటోడ్ని వదిలి ఉండలేక, ఎం .పిల్ వదల లేక సతమతమైంది. రోజు పొద్దున సాయంత్రం వాళ్ళ అమ్మని పిల్లవాడిని మాట్లాడించమనేది. చంటోడు ఫోన్ దగ్గరికి వచ్చి అమ్మతో మాట్లాడకుండా వెళ్ళిపోయేవాడు. ఆ తల్లి తల్లడిల్లి పోయింది . యశోద మళ్లీ ఒక రోజు చంటోడు కోసం ఫోన్ చేస్తే చంటోడు ఫోన్లో అమ్మ అని ఏడ్చేసాడు. యశోద బాగా ఏడ్చేసింది . "నాకు ఎం మ్ .ఫిల్ వద్దు నా పిల్లవాడే ముద్దు" అనుకొని తన కొడుకుని తన దగ్గరకి తెచ్చేసుకుంది. "బంగారు తల్లి నిన్ను ఎక్కడికి పంపించను , ఎవరికి నిన్ను ఇవ్వనమ్మా, అని చెప్పి ముద్దులు కురిపించింది."