నీ మనసు నాకు తెలుసు -1
ఉదయం 6 గంటలు..... కిటికీ లో నుండి సూర్యుడు వెలుగు మెల్లగా వస్తుంది.... ఆ వెలుగు అక్కడే పడుకున్న అమ్మాయి మీద పడుతూ ఉండగా.... ఆ అమ్మాయి లేచి...
ఏంటి? అప్పుడే తెలివారిపోయిందా?? ఈరోజు ఉదయపు వెలుగు అయిన నా జీవితం లో ఒక కొత్త వెలుగు నింపుతుందా ?? లేకపోతే ఈరోజు కూడా నా జీవితం అదే పాత చీకటిలో పడిపోయి గడిచిపోతుందా?? చూద్దాం అని లేచి, స్నానం చేసి మంచి డ్రెస్ వేసుకొని.... రెడీ అవుతూ... అద్దం లో చూసుకుంటూ... తనకి తను ఏ ఒక కొత్త వ్యక్తి లాగా.... తనను తానే ఇంట్రడ్యూస్ చేసుకుంటుంది....
హాయ్, నా పేరు సీత.. సీత మహాలక్ష్మి.. పేరు కి సీత మహాలక్ష్మి... కానీ, పుట్టిన కొన్ని రోజులు కి అమ్మ నీ పోగొట్టుకున్న దురదృష్టవంతురాలని నేను... తర్వాత నాన్న కి నా మీద కొద్దిగా కోపం వచ్చింది... నా వల్లే, నేను పుట్టిన తర్వాత అమ్మ చనిపోయింది అని.... నన్ను చూసుకోడానికి నాన్న ఇంకో పెళ్లి చేసుకున్నాడు... మా పిన్ని వచ్చాక ఏం అయింది తెలియదో. కానీ, మా నాన్న కి నా పైన కోపం ఎక్కవ అయ్యింది... అండ్ నాకు ఒక చెల్లి కూడా ఉంది... తను నన్ను అక్క అని పిలవదు.. కానీ, నేను మాత్రం చెల్లి లాగా చూస్తా... ఓహ్, మీకు వల్ల పేర్లు చెప్పలేదు కదా,,,, నాన్న పేరు సురేంద్ర... పిన్ని పేరు సరోజ... చెల్లలు పేరు స్వాతి....
గత, ఆరు నెలలు నుండి... ఉద్యోగం కోసం చూస్తున్న,, ఈరోజు ఒక ఇంటర్వ్యూ ఉంది వెళ్ళాలి... ఆ ఉద్యోగం వల్ల అయిన నా జీవితం బాగుపడుతుంది ఏమో అని నా చిన్న నమ్మకం.. అనట్టు, చెప్పడం మర్చిపోయా... నా కథ మాత్రం కొద్దిగా బాధ అండ్ సాడ్ గా వుంటుంది... అంతే... కానీ, నేను మాత్రం ఎప్పుడూ నవ్వుతూ, అల్లరి చేస్తూ, చాలా సంతోషం గా ఉంటా.... ఎవరు ఏం అన్న కూడా పట్టించుకొనే టైప్ కాదు... నాకు ఒక ఫ్రెండ్ కూడా ఉంది.... దివ్య, ఇప్పుడు తను వర్క్ చేస్తున్న కంపెనీ కి నేను ఇంటర్వ్యూ కి వెళ్తున్న....అని తను అద్దంలో కి చూస్తూ తన స్టోరీ తనే గుర్తు చేసుకుంటూ వుంటుంది.....
ఆలోపు, బయట నుండి పిలుపు....
ఏమే, సీత... అద్దం ముందు రెడీ అయ్యింది చాలు... ఇంట్లో పనీ ఎవరు చేస్తారు??? రా తొందరగా.....
అని సరోజ పిలుస్తుంది....
వస్తున్న పిన్ని... అంటుంది సీత...
సరోజ: ఆ ఉద్యోగం అది అంత అవసరం ఆ నీకు??? చక్కగా పెళ్ళి చేసుకుంటే సరిపోతుంది కదా......
సీత ఆ మాటకి చిన్నగా నవ్వి.... నాకు ఇంటర్వ్యూ ఉంది పిన్ని.... వెళ్ళాలి తొమ్మిది గంటలకు.....
సరోజ: ఉద్యోగం చేసి ఎవరిని ఉద్ధరించాలి... నువ్వు ఇప్పుడు......
సీత ఏం మాట్లాడకుండా... తన పని తను చేసుకుంటూ వుంటుంది.... పూజ చేసుకుంటూ నా జీవితం లో మంచి రోజులు వచ్చేలా చెయ్యి స్వామి అని కోరుకుంటుంది.....
ఈలోపు, దివ్య నుండి ఫోన్ కాల్ సీత కి.......
దివ్య: సీత, మా కంపెనీ CEO చాలా స్ట్రిక్ట్ అండ్ కోపం కూడా ఎక్కవ... చాలా జాగ్రత్తగా ఇంటర్వ్యూ ఇవ్వు.....
సీత: ఇంటర్వ్యూ అతను తీసుకుంటాడా.... HR కదా తీసుకుంటారు....
దివ్య: లేదు, సీత.... అతను ఏ తీసుకుంటాడు అండ్ కంపెనీ కూడా అతనిది.....
సీత: ఇంటరెస్టింగ్.... ఇంకా ఏం అయిన ఉందా అతని గురించి..??
దివ్య: లేదు, తనకి 3 కంపెనీస్ ఉన్నాయి... ఇది మెయిన్ కంపెనీ...సో, ఎక్కవ ఇక్కడే వుంటాడు.....
సీత: తన, పేరు ఏంటి???.....
అతని పేరు దివ్య చెప్పే లోపు.... స్వాతి వచ్చి సీత ఫోన్ లాక్కొని... సీత టిఫిన్ పెట్టు ఆకలి వేస్తుంది అండ్ కాలేజీ కి కూడా టైమ్ అవుతుంది..... అని ఫోన్ కాల్ కట్ చేస్తుంది....
సీత: పద, స్వాతి.... పెడతాను... నాకు కూడా ఇంటర్వ్యూ ఉంది వెళ్ళాలి.... టైమ్ అవుతుంది....
స్వాతి: ఎందుకు అక్క?? నీకు వస్తుందా... జాబ్ ఫస్ట్.... ఎందుకు అవి అన్ని... ఇంట్లో ఉండకుండా....
............
ఆలోపు, అక్క, అక్క... అని రవీంద్ర ఇంట్లోకి వస్తాడు.... సరోజ కి తమ్ముడు.....
సరోజ: తమ్ముడు, రా రా.... ఎలా ఉన్నావ్??
రవీంద్ర: బాగున్న అక్క... సీత ఎక్కడ???
వచ్చాడు దరిద్రుడు.... వీడి మొహం చూస్తే చాలు.... ఇంకా నాకు ఉద్యోగం వచ్చినట్టు ఏ???? అని సీత మనసులో అనుకొని.... నాన్న ఇంటర్వ్యూ కి వెళ్ళి వస్తా అంటే... సురేంద్ర సరే, అంటాడు.... సీత అమ్మ ఫోటో దగ్గరకి వెళ్ళి... నన్ను ఆశీర్వదించు అమ్మ అని కోరుకొని వెళ్ళిపోతుంది!!!
రవీంద్ర: నేను, డ్రాప్ చేస్తా రా... సీత....
పర్లేదు, మావయ్య నేను ఆటో లో వెళ్ళిపోతాను.... అని సీత ఇంకా లేట్ చేయకుండా అక్కడ నుండి వెళ్ళిపోతుంది....
సీత కి ఆ జాబ్ వస్తుందా?? రవీంద్ర ఎందుకు వచ్చినట్టు???
To be continued......
Don't forget to leave a comment.....
And follow me for next part......