International Mother Language Day) in Telugu Motivational Stories by SriNiharika books and stories PDF | అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవం

Featured Books
  • فطرت

    خزاں   خزاں میں مرجھائے ہوئے پھولوں کے کھلنے کی توقع نہ...

  • زندگی ایک کھلونا ہے

    زندگی ایک کھلونا ہے ایک لمحے میں ہنس کر روؤں گا نیکی کی راہ...

  • سدا بہار جشن

    میرے اپنے لوگ میرے وجود کی نشانی مانگتے ہیں۔ مجھ سے میری پرا...

  • دکھوں کی سرگوشیاں

        دکھوں کی سرگوشیاںتحریر  شے امین فون کے الارم کی کرخت اور...

  • نیا راگ

    والدین کا سایہ ہمیشہ بچوں کے ساتھ رہتا ہے۔ اس کی برکت سے زند...

Categories
Share

అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవం


అంతర్జాతీయ మాతృభాష దినోత్సవం (ఆంగ్లం: International Mother Language Day) ప్రతి సంవత్సరం ఫిబ్రవరి 21న ప్రపంచవ్యాప్తంగా నిర్వహించాలని 1999 నవంబరు 17న యునెస్కో ప్రకటించింది. 2000 సంవత్సరం నుంచి ప్రతి ఏటా మాతృభాషా పరిరక్షణ కార్యక్రమాన్ని యునెస్కో డైరెక్టర్‌ జనరల్‌ ప్రకటిస్తూ వస్తున్నారు. ప్రపంచంలో చిన్న, పెద్ద భాషలన్నిటినీ రక్షించుకోవాలని, భాషా సాంస్కృతిక వైవిధ్యాన్ని కాపాడుకోవడం ద్వారానే మనం జీవ వైవిధ్యాన్ని కాపాడుకోగలమని యునెస్కో చెబుతోంది.


అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవం
జరుపుకొనేవారు
ప్రపంచవ్యాప్తంగా
ప్రాముఖ్యత
అన్ని భాషల సంరక్షణ కోసం
జరుపుకొనే రోజు
ఫిబ్రవరి 21
సంబంధిత పండుగ
బెంగాలీ భాషా ఉద్యమం
ఆవృత్తి
వార్షికం
యునెస్కో 1999 ఫిబ్రవరి 21 న అంతర్జాతీయ మాతృభాష దినంగా ప్రకటించింది. 2000 ఫిబ్రవరి 21 నుండి ప్రపంచవ్యాప్తంగా జరుపుకుంటున్నారు.బంగ్లాదేశీయులు (అప్పటి తూర్పు పాకిస్తానీయులు ) చేసిన భాషా ఉద్యమానికి నివాళిగా ప్రతి ఏట ఈ అంతర్జాతీయ మాతృభాష దినోత్సవాన్ని జరుపుకుంటున్నాము. 1947 లో భారత దేశం, పాకిస్తాన్ విభజన జరిగినప్పుడు పాకిస్తాన్ రెండు భౌగోళికంగా వేర్వేరు భాగాలు ఏర్పడింది. ఒకటి తూర్పు పాకిస్తాన్ (ప్రస్తుతం బంగ్లాదేశ్ అని పిలుస్తారు) రెండవది పశ్చిమ పాకిస్తాన్ (ప్రస్తుతం పాకిస్తాన్ అని పిలుస్తారు). సంస్కృతి, భాష మొదలైన వాటిలో రెండు ఒకదానికొకటి చాలా భిన్నంగా ఉండేవి. ఈ రెండు భాగాలను భారతదేశం వేరు చేసింది.తూర్పు పాకిస్తాన్ (ఇప్పుడు బంగ్లాదేశ్), పశ్చిమ పాకిస్తాన్ (ఇప్పుడు పాకిస్తాన్ ) కలిపి మెజారిటీ ప్రజలు బెంగాలీ లేదా బంగ్లా భాష ఎక్కువగా మాట్లాడేవారు.1948 లో అప్పటి పాకిస్తాన్ ప్రభుత్వం ఉర్దూను పాకిస్తాన్ జాతీయ భాషగా ప్రకటించింది. దీనికి తూర్పు పాకిస్తాన్ ప్రజలు అభ్యంతరం తెలిపారు.తూర్పు పాకిస్తాన్ జనాభాలో ఎక్కువ భాగం బెంగాలీ మాట్లాడతారు. ఉర్దూతో పాటు బెంగాలీ కూడా జాతీయ భాషలలో ఒకటిగా ఉండాలని వారు డిమాండ్ చేశారు. ఈ డిమాండ్‌ను తూర్పు పాకిస్థాన్‌కు చెందిన ధీరేంద్రనాథ్ దత్తా 1948 ఫిబ్రవరి 23 న పాకిస్తాన్ రాజ్యాంగ సభలో లేవనెత్తారు. తూర్పు పాకిస్తాన్ ప్రజలు (ప్రస్తుతం బంగ్లాదేశ్) నిరసనలు చేపట్టారు.భాష సమాన హోదా కోసం ఉద్యమం చేపట్టారు. ఈ ఉద్యమాన్ని అణచివేయడానికి పాకిస్థాన్ ప్రభుత్వం 144 సెక్షన్, ర్యాలీలు, మొదలైనవి ఢాకా నగరంలో నిషేధించింది.ఢాకా విశ్వవిద్యాలయం విద్యార్థులు, సాధారణ ప్రజల సహకారంతో భారీ ర్యాలీలు, సమావేశాలు ఏర్పాటు చేశారు.1952 ఫిబ్రవరి 21 న ర్యాలీలో పాల్గొన్న వారిపై పోలీసులు కాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో సలాం, బర్కాట్, రఫీక్, జబ్బర్, షఫియూర్ మరణించారు. వందలాది మంది గాయపడ్డారు. చరిత్రలో ఇది చాలా అరుదైన సంఘటన, ప్రజలు తమ మాతృభాష కోసం ప్రాణాలను అర్పించారు.పోలీసుల దాడికి నిరసనగా ముస్లిం లీగ్అదే రోజు పార్లమెంటరీ పార్టీకి రాజీనామా చేశారు. ఉద్యమం పెరుగుతున్న నేపథ్యంలో, పాకిస్తాన్ కేంద్ర ప్రభుత్వం చివరకు దిగి వచ్చింది. 1954 మే 8 న పాకిస్తాన్ రాజ్యాంగ సభలో బెంగాలీని రాష్ట్ర భాషలలో ఒకటిగా స్వీకరించారు. 1956 లో పాకిస్తాన్ మొదటి రాజ్యాంగం అమల్లోకి వచ్చినప్పుడు, ఆర్టికల్ 214 లో బెంగాలీ ఉర్దూలను పాకిస్తాన్ రాష్ట్ర భాషలుగా పేర్కొంది. 1971 లో బంగ్లాదేశ్ స్వతంత్రమైనప్పుడు, బెంగాలీ ఏకైక రాష్ట్ర భాషగా ప్రవేశపెట్టబడింది. యునెస్కో బంగ్లా భాషా ఉద్యమం, మానవ భాష సాంస్కృతిక హక్కులను పురస్కరించుకుని 1999 ఫిబ్రవరి 21, న అంతర్జాతీయ మాతృభాష దినోత్సవం ప్రకటించింది.
చరిత్ర

ఢాకాలో 1952 ఫిబ్రవరి 21న జరిగిన ఊరేగింపు కవాతు
పాకిస్థాన్ ఏర్పాటుకు ముందు పరిస్థితి 1947లో భారతదేశ విభజన తర్వాత పాకిస్థాన్ రెండు భౌగోళిక భాగాలుగా ఏర్పడింది: తూర్పు పాకిస్థాన్ (ప్రస్తుతం బంగ్లాదేశ్) పడమటి పాకిస్థాన్ (ప్రస్తుతం పాకిస్థాన్) ఈ రెండు ప్రాంతాలు భౌగోళికంగా వేరు కాగా, భాష, సంస్కృతి పరంగా కూడా ఎంతో భిన్నంగా ఉన్నాయి. తూర్పు పాకిస్థాన్ ప్రజలు బంగ్లాను ప్రధాన భాషగా ఉపయోగించగా, పడమటి పాకిస్థాన్ ప్రజలు ఉర్దూ, పంజాబీ భాషలను ఎక్కువగా ఉపయోగించేవారు. భాషా ఉద్యమం – 1948 నుంచి 1952 వరకు 1948లో, పాకిస్థాన్ ప్రభుత్వం ఉర్దూనే దేశపు ఏకైక జాతీయ భాషగా ప్రకటించింది. అయితే, తూర్పు పాకిస్థాన్ జనాభాలో అధిక శాతం బంగ్లా మాట్లాడేవారే. దీంతో, తూర్పు పాకిస్థాన్ ప్రజలు తీవ్రంగా వ్యతిరేకించారు. 1948 ఫిబ్రవరి 23న, తూర్పు పాకిస్థాన్‌కు చెందిన ధీరేంద్రనాథ్ దత్తా, పాకిస్థాన్ రాజ్యాంగ సభలో బంగ్లాను కూడా జాతీయ భాషగా గుర్తించాలని ప్రస్తావించారు. కానీ, ఈ ప్రతిపాదనను ప్రభుత్వం తిరస్కరించింది. 1952లో, భాషా ఉద్యమం ఉధృతమైంది. ఫిబ్రవరి 21న, ఢాకా విశ్వవిద్యాలయ విద్యార్థులు భారీ ర్యాలీ నిర్వహించారు. పోలీస్ కాల్పుల వల్ల అయిదుగురు విద్యార్థులు ప్రాణాలు కోల్పోయారు.
యునెస్కో గుర్తింపు
1998లో, కెనడాలో నివసిస్తున్న బంగ్లాదేశీ రఫీకుల్ ఇస్లాం, అబ్దుస్ సలాం అనే ఇద్దరు వ్యక్తులు "భాషల పరిరక్షణ కోసం ప్రత్యేకమైన రోజు ఉండాలనే" ప్రతిపాదనను ఐక్యరాజ్యసమితికి పంపారు. 1952 ఫిబ్రవరి 21 జరిగిన భాషా ఉద్యమాన్ని గుర్తుచేసేందుకు, ఈ తేదినే అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవంగా ప్రకటించాలని సూచించారు. బంగ్లాదేశ్ ప్రభుత్వం యునెస్కోలో ఈ ప్రతిపాదనను ప్రవేశపెట్టగా, అప్పటి ప్రధాన మంత్రి శేఖ్ హసీనా ప్రత్యేక శ్రద్ధ తీసుకున్నారు. 1999 నవంబరు 17న యునెస్కో 30వ జనరల్ అసెంబ్లీ లో ఫిబ్రవరి 21ను అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవంగా గుర్తించాలని ఏకగ్రీవంగా తీర్మానించబడింది.
కాల క్రమం
1952: బెంగాలీ భాషా ఉద్యమం
1955: భాషా ఉద్యమ దినోత్సవాన్ని మొదట బంగ్లాదేశ్‌లో నిర్వహించారు.[2]
1999:యునెస్కో ఫిబ్రవరి 21 (ఎకుషే ఫిబ్రవరి) ను అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవంగా ప్రకటించింది.
2000: అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవ ప్రారంభోత్సవ వేడుకలు[మూలం అవసరం]
2002: భాషా-వైవిధ్యం అంశం, 3,000 అంతరించిపోతున్న భాషలను కలిగివున్నాం (నినాదం: భాషల గెలాక్సీలో, ప్రతి పదం ఒక నక్షత్రమే.)[మూలం అవసరం]
2004: పిల్లల-అభ్యాస అంశం; యునెస్కో ఆచరణలో "ప్రపంచవ్యాప్తంగా ఉన్న పిల్లల రాత పుస్తకాల విభిన్న ప్రదర్శనను చేర్చారు, ఇది తరగతి గదిలో పిల్లలు எలా వ్రాతా విద్యా నైపుణ్యాలను అభ్యాసించి, అందులో ప్రావీణ్యం పొందుతారో చూపిస్తుంది..[3]
2005: బ్రైలీ సంజ్ఞా భాష[4]
2006: వార్షిక అంశం: "భాష అంతర్జాల వినియోగం"[5]
2007: వార్షిక అంశం: బహుభాషా విద్య[6]
2008: భాషల అంతర్జాతీయ సంవత్సరం[మూలం అవసరం]
2010:అంతర్జాతీయ సంస్కృతుల సామరస్య సంవత్సరం[మూలం అవసరం]
2012: మాతృభాష బోధన మరియు సమ్మిళిత విద్య[మూలం అవసరం]
2013: వార్షిక అంశం: "మాతృభాషలో విద్యాబోధనకు పుస్తకాలు"[7]
2014: వార్షిక అంశం: "ప్రపంచ పౌరసత్వం కోసం స్థానిక భాషలు: సైన్స్ పై దృష్టి"[8]
2015: వార్షిక అంశం: "విద్యలో మరియు విద్య ద్వారా ఎదిగేందుకు: భాష ప్రధానం"[9][10]
2016: వార్షిక అంశం: "నాణ్యమైన విద్య, బోధనా భాష(లు) మరియు అభ్యాస ఫలితాలు"[11]
2017: వార్షిక అంశం: "బహుభాషా విద్య ద్వారా స్థిరమైన భవిష్యత్తు వైపు"[12]
2018: మన భాషలు, మన ఆస్తులు.[మూలం అవసరం]
2019: అంతర్జాతీయ స్థానిక భాషల సంవత్సరం[13]
2020: వార్షిక అంశం: "భాషా వైవిధ్యాన్ని కాపాడుదాం[14]
2021: వార్షిక అంశం: "బహుభాషావాదాన్ని విద్యలోనూ సమాజంలోనూ ప్రవేశపెడదాం[15]
2022: వార్షిక అంశం: "బహుభాషా అభ్యాసానికి సాంకేతికతను ఉపయోగించడం: సవాళ్లు , అవకాశాలు"[16]|
2023: వార్షిక అంశం: "బహుభాషా విద్య: ఇది అత్యవసర విద్యాసంస్కరణ"
2024: వార్షిక అంశం: "బహుభాషా విద్య - నేర్చుకోవడానికి మరియు తరతరాల అభ్యసనానికి మూలస్థంభం"
2025: వార్షిక అంశం: "అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవ రజతోత్సవ వేడుకలు".