ఇద్దరు స్నేహితులు – సామ్రాట్ మరియు విశాల్. వీరి స్నేహం చిన్ననాటి నుండే అద్భుతంగా ఉండేది. ఒకరు మాట్లాడితే ఇంకొకరు అర్థం చేసుకునేంత అనుబంధం. వీరిద్దరూ ఒకే పాఠశాలలో చదువుతూ, ఒకే బంచ్‌లో కూర్చునే వారు.
సామ్రాట్ – చేసే పనిలో నిబద్ధత, ధైర్యం, సహాయం చేయడంలో ముందుండే వాడు. ఎవరికైనా అవసరం ఉంటే, "నేను ఉన్నాను" అని ముందుకొచ్చే గుణం.
విశాల్ – తెలివి, మర్యాద, పరిజ్ఞానం కలిగిన వాడు. మాట్లాడే మాటల్లో మాధుర్యం, ఆలోచనల్లో లోతు. సమస్యకు పరిష్కారం చూపే తెలివి అతని బలము.
ఒకరోజు ఊర్లో పండుగ. అందరూ సంతోషంగా ఉన్న సమయంలో… అనుకోకుండా ఒక బాంబు పేలింది. ఆ శబ్దం క్షణాల్లో ఊరంతా చిదరబాదారైంది. అందరూ పరుగులు, అరుపులు, కన్నీళ్లు… ఆ గందరగోళంలో సామ్రాట్ మరియు విశాల్ విడిపోయారు.
బాంబు పేలుడు తర్వాత గాయపడి, ఒంటరిగా ఉన్న సామ్రాట్‌ను ఒక పోలీస్ అధికారి రామచంద్ర గమనించాడు. అతని వయస్సు చిన్నది, కళ్లలో భయం, గుండెల్లో బాధ. రామచంద్ర తన విధి కంటే మానవత్వాన్ని ముందుకు పెట్టాడు.
"ఈ పిల్లాడు ఇప్పుడు ఒంటరిగా ఉన్నాడు. నేను అతని భవిష్యత్తు కోసం ఏదైనా చేయాలి," అని భావించి, సామ్రాట్‌ను తన ఇంటికి తీసుకెళ్లాడు.
రామచంద్ర భార్య సుశీల కూడా మానవతావాది. ఆమె సామ్రాట్‌ను తన కుమారుడిలా చూసింది. "ఇతని గాయం శరీరంలో కాదు, మనసులో ఉంది. ప్రేమతో మాన్పాలి," అని చెప్పింది.
సామ్రాట్ మొదట్లో మౌనంగా ఉండేవాడు. విశాల్‌ను గుర్తు చేసుకుంటూ, రాత్రిళ్లు నిద్రలేక ఏడ్చేవాడు. రామచంద్ర అతనికి ధైర్యం చెప్పాడు, "నువ్వు బలమైనవాడివి. నీ స్నేహితుడిని మళ్లీ కలుస్తావు. కానీ ముందుగా నీ జీవితాన్ని నిలబెట్టాలి."
ఆ మాటలు సామ్రాట్ గుండెను తాకాయి. అతను చదువులో, క్రమశిక్షణలో, సేవలో ముందుకు సాగాడు. పోలీస్ శిక్షణలో ఉత్తీర్ణుడై, రామచంద్ర లాగా నిజాయితీగల అధికారి అయ్యాడు.
ఇప్పుడు సామ్రాట్ ఒక యువ పోలీస్ అధికారి. అతని గుండెల్లో మాత్రం ఒక కోరిక – విశాల్‌ను మళ్లీ చూడాలి.
సామ్రాట్ ఇప్పుడు ఒక యువ పోలీస్ అధికారి. విధి నిబద్ధత, నిజాయితీ, ధైర్యం—అతని వ్యక్తిత్వాన్ని ప్రతిబింబించే లక్షణాలు. కానీ అతని మనసులో మాత్రం ఒక కోణం ఖాళీగా ఉంది… ప్రేమ అనే కోణం.
ఒకరోజు, అతను ట్రాఫిక్ నియంత్రణ విధిలో ఉన్నప్పుడు, వేగంగా నడుస్తున్న ఓ యువతి అతని దృష్టిని ఆకర్షించింది. ఆమె పేరు మధు. ఆమె నడకలో నిగూఢమైన నమ్మకం, ముఖంలో మృదుత్వం, ఆమె చూపులో ఓ ప్రత్యేకత.
సామ్రాట్‌కి ఆమెను చూసిన మొదటి క్షణంలోనే గుండె కొట్టే వేగం మారిపోయింది. "ఇది ఏమిటి? విధి లో ఉన్నా, మనసు మాత్రం ఆమె వెంట పరుగెడుతోంది!"
మధు కూడా సామ్రాట్‌ను గమనించింది. ఆమెకు అతని క్రమశిక్షణ, మృదుత్వం, మాటల్లో ఉన్న గౌరవం నచ్చింది. ఆమెకు అతని రూపం కాదు, అతని మనసు అందంగా కనిపించింది.
కొన్ని రోజులు గడిచాయి. ఒక ఉదయం మధు బస్టాండ్ వద్ద తన పర్సు కోల్పోయింది. ఆమెకు తెలిసేలోపే, అది సామ్రాట్ చేతికి వచ్చింది. ఆమె ఫోటో, ఐడీ కార్డు చూసి, "ఇదే ఆ అమ్మాయి!" అని గుర్తించాడు.
అతని మనసులో మాట – "ఇదే అవకాశం. ఆమెతో మాట్లాడాలి. కానీ ఎలా?"
ఆమెను చూసిన క్షణంలోనే, ఆమె దగ్గరకు వెళ్లి, చిరునవ్వుతో ఇలా అన్నాడు:
"ఏవండీ, ఈ పర్సు మీదేనా? ఇలా పడేసికుంటే ఎలా అండి? చెప్పండి."
మధు ఒక్కసారిగా ఆశ్చర్యపోయింది. ఆమె ముఖంలో నవ్వు, కళ్లలో కృతజ్ఞత. "అయ్యో! నిజంగా చాలా థాంక్స్. నేను చాలా టెన్షన్ పడిపోయాను.ఇది ఎక్కడ పోయిందో ఏమో అని. సమయానికి మీరు వెతికి ఇచ్చారు చాలా థాంక్స్ అండి. అని అంటుంది.
మధు: "మీ పేరు..."
సామ్రాట్: "హా, నా పేరు సామ్రాట్. నేను ఇక్కడే బస్టాండ్ పక్కనే ఉంటాను."
మధు: "నా పేరు మధు. ఇక్కడే అంబేద్కర్ కాలనీలో ఉంటాం."
ఆ మాటల మధ్య చిరునవ్వులు, ఆ చిరునవ్వుల మధ్య చినుకులు, ఆ చినుకుల మధ్య ప్రేమ మొదలైంది.
ఆ రోజు నుంచి, బస్టాండ్ దగ్గర మధు కనిపించని రోజు సామ్రాట్‌కి వెలుగు తగ్గిన రోజు. మధు కూడా, సామ్రాట్ మాటలు వినకపోతే, ఆ రోజు నిశ్శబ్దంగా గడిచేది.
కొన్ని రోజులు గడిచాయి. వీరిద్దరూ కాఫీ షాప్‌లో కలుసుకున్నారు. మధు తన కలల గురించి చెప్పింది – "నాకు చిన్న పిల్లల కోసం ఒక డాన్స్ అకాడమీ ప్రారంభించాలి. కళలో ప్రేమ ఉంది."
సామ్రాట్ తన గుండె మాట చెప్పాడు – "నాకు సేవలో ప్రేమ ఉంది. కానీ ఇప్పుడు, మీలో కూడా ఉంది."
మధు: "మీరు ఇక్కడే ఉంటారని ఊహించలేదు. బస్టాండ్ పక్కనే అంటే, రోజూ జనాల మధ్యే కదా?"
సామ్రాట్: "అవును. జనాల మధ్యే ఉంటా. కానీ మీలాంటి వ్యక్తి కనిపిస్తే, జనాల మధ్యలోనూ ఓ ప్రత్యేకత కనిపిస్తుంది."
మధు నవ్వింది. ఆ నవ్వులోనే ప్రేమ పరవశం. ఆ పరవశంలోనే బంధం మొదలైంది.
కొన్ని రోజులు గడిచాయి. వీరిద్దరూ తరచూ కలుసుకోవడం ప్రారంభించారు. కాఫీ షాప్, పుస్తక ప్రదర్శనలు, చిన్న చిన్న సంభాషణలు… ప్రతి మాటలో భావం, ప్రతి చూపులో అనుబంధం.
ఆలా చాలా సంతోషం గా వున్నా జీవితంలో ఒక ఆటంకం వచ్చి పడింది సామ్రాట్ కి.
అదేంటో తదుపరి భాగం లో తెలుసుకుందాం!!
మీ ఆశీస్సులతో
నేను... ✍️ Naik 💞