మనసిచ్చి చూడు-17
మధు కాల్ లిఫ్ట్ చేసి
హలో అంది....???
హలో మధు నేను సమీరా అంది.
చెప్పు సమీరా ఎలా ఉన్నావు ఈ టైమ్లో ఫోన్ అంది.
మాట్లాడాలి అనిపించింది మధు అందుకే చేశాను అంది.
సరే సమీరా నీ హెల్త్ ఎలా ఉంది.
బాగుంది మధు,నన్ను క్షమించు అంది.
హే పర్లేదు లైట్ తీసుకొ సమీరా.
లేదు మధు నేను చాలా తప్పుగా అనుకున్నాను,చాలా అనుమానించాను,నిజం తెలిసిన తరువాత నా మీద నాకే అసహ్యం వేసింది.చాలా బాధ పడ్డాను.
అయ్యో సమీరా ఎందుకు బాధ పడడం చెప్పు.తల రాత ఏలా ఉంటే అలా జరుగుతుంది.ఇందులో ఎవరి తప్పు లేదు.నువ్వేమి బాధ పడకు సమీరా.
నీ ఆరోగ్యం ఎలా ఉంది మధు,నువ్వు ఇండియాకి వచ్చేయి అంది.
ఏమో చూద్దాం సమీరా,వీలు ఉంటే తప్పకుండా చూస్తాను రావడానికి.
నేను ఈరోజు కళ్యాణ్తో మాట్లాడాను మధు అంది సమీరా....???
ఇంక ఏమీ మాట్లాడాలి ఏమ్ లాభం ఉంది సమీరా.
ఆయన టాపిక్ ఏమీ నా దగ్గర ఎత్తకు,ఇంక నాకు అసలు ఓపిక లేదు భరించడానికి అంది.
సరే మధు ఇంక ఆయన ఏమి చేస్తున్నారు అంది.
ఒక్క నిమిషం సమీరా బావకి ఫోన్ ఇస్తాను అంది.
సరే మధు.
వేరే రూమ్లో నిద్రపోతున్నా గౌతమ్ దగ్గరకు వచ్చి ఫోన్ ఇచ్చింది సమీరా లైన్లో ఉంది అని.
హా సమీరా చెప్పు ఎలా ఉన్నావు,అమ్మ నాన్న ఎలా ఉన్నారు అంది.
అందరూ బాగున్నారు అండీ ఇప్పుడే నిద్ర లేచాను అంది.
ఇంక ఏంటి విషయాలు ఆరోగ్యం అంతా ఒకే కదా అన్నాడు.
అంతా ఒకే కానీ మీరు ఇండియాకి వచ్చేటప్పుడు తప్పకుండా మధుని కూడా తీసుకొని రండి.తను ఒంటరిగా అక్కడ వద్దు అంది.
హా సమీరా అదే చూస్తున్నాను అత్తయ్యకు ఇంక విషయం చెప్పలేదు అన్నాడు.
ఏదో ఒకటి నచ్చజెప్పి తీసుకొని రండి అంది.
సరే సమీరా జాగ్రత్త ఇక్కడ చాలా కూల్గా ఉంది నిద్ర వస్తుంది.
సరే అండీ గుడ్ నైట్
లవ్ యూ అండీ 💙
లవ్ యూ సమీరా 💙
గౌతమ్ ఫోన్ పెట్టేశాకా మధు ఫోన్ స్క్రీన్ మీద కళ్యాణ్ ఫోటో వాల్ పేపర్గా ఉంది.
అంటే మధు మనసులో ఇంకా కళ్యాణ్ ఉన్నాడు.సో ఎలాగైనా ఆ ఇద్దరిని కలపాలి అనుకున్నాడు.
మధుకి ఫోన్ ఇచ్చేసి తన గదిలోకి వచ్చి పడుకున్నాడు.
సమీరా బాగా గుర్తు వస్తుంది తనకి.
మధు జీవితాన్ని నిలబెట్టాలి,అత్తయ్యకు విషయం నెమ్మదిగా చెప్పాలి అని ఎన్నో ఆలోచనలు ఎప్పటికో గానీ నిద్ర పట్టలేదు.
ఇక్కడ మధు కూడా కళ్యాణ్ని తలచుకొని చాలా బాధ పడుతుంది.ఒక నెలలో ఎంత ప్రేమ చూపించావు కళ్యాణ్.దగ్గరగా ఉండాల్సిన టైమ్లో దూరంగా ఉంటున్నావు.మా బావ బంగారం కళ్యాణ్ అందుకే నా జీవితం కోసం ఇంత దూరం వచ్చాడు.
ఒక్కసారి నిన్ను చూడాలి అనిపిస్తుంది కళ్యాణ్.నీ కాల్ లిఫ్ట్ చేసే ధైర్యం నాకు లేదు.
ఈ క్షణం ఒకే ఒక కోరిక..
నీ స్వరం వినాలని తీయగా..
ఈ క్షణం ఒకే ఒక కోరిక..
నీ స్వరం వినాలని తీయగా..
తరగని దూరము లో ఓ .. ఓ....
తెలియని దారుల లో ఓ .. ఓ....
ఎక్కడున్నావు అంటోంది ఆశగా..
ఈ క్షణం ఒకే ఒక కోరిక..
నీ స్వరం వినాలని తీయగా..
ఎన్ని వేల నిమిషాలో లెక్క పెట్టుకుంటోంది..
ఎంత సేపు గడపాలో చెప్పవేమి అంటోంది..
నిన్ననేగ వెళ్ళావన్న సంగతి గుర్తేలేని గుండె ఇది...
ఆ..ఆఆ..ఆ..ఆఆ...ఆ..ఆఆ..ఆ..
మళ్ళి నిన్ను చూసేదాకా నాలో నన్ను ఉండనీక ..
ఆరాటంగా కొట్టుకున్నది..
ఈ క్షణం ఒకే ఒక కోరిక..
నీ స్వరం వినాలని తీయగా..
రెప్ప వెయ్యనంటోంది ఎంత పిచ్చి మనసు ఇది..
రేపు నువ్వు రాగానే కాస్త నచ్చచెప్పు మరి ..
నిన్న మొన్న చెప్పుకున్న ఊసులే మళ్ళి మళ్ళి తలచుకుని..
ఆ..ఆఆ..ఆ..ఆఆ...ఆ..ఆఆ..ఆ..
ఇంకా ఎన్నో వున్నాయంటూ ఇప్పుడే చెప్పాలంటూ ..
నిద్దరోను అంటోంది..
ఈ క్షణం ఒకే ఒక కోరిక..
నీ స్వరం వినాలని తీయగా..
తరగని దూరము లో ఓ .. ఓ....
తెలియని దారుల లో ఓ .. ఓ....
ఎక్కడున్నావు అంటోంది ఆశగా..
కళ్యాణ్ ఫొటో చూస్తూ ఏడుస్తు అలాగే నిద్రపోయింది.
మధు నిద్ర పోయాకా తన ఫోన్ తీసుకున్నారు మమత.
ఎవరు ఈ అబ్బాయి ఇక్కడికి వచ్చే ముందు రోజు ఇంట్లో చూశాను,మధుకు ఎలా పరిచయం వాల్ పేపర్గా ఎందుకు పెట్టుకుంది.తనలో కూడా ఈ మధ్య చాలా మార్పు వస్తుంది విషయం ఏదో ఉంది.తప్పకుండా గౌతమ్కి విషయం తెలిసి ఉంటుంది అనుకొని వెంటనే గౌతమ్ని నిద్రలేపడానికి వెళ్ళింది.
గౌతమ్ నిద్ర లే నిన్ను ఒక్కటి అడగాలి అంది.
ఏంటి అత్త మార్నింగ్ మాట్లాడుదాము అన్నాడు.
కాదు నువ్వు ముందు లే రా అంది.
సరే చెప్పు అత్త ఏంటి అన్నాడు.
ఇక్కడ కాదు బయటకు రా బాల్కనీలోకి అని తీసుకొని వెళ్ళింది.
సూటిగా ఫోటో చూపించి ఎవరూ ఈ అబ్బాయి,మధుకి ఈ అబ్బాయికి ఏంటి సంబంధం అంది.
దెబ్బకి నిద్ర మబ్బు వదిలింది గౌతమ్కి.
అత్త విషయం నీకు అప్పుడే చెప్పాలి అనుకున్నాను కానీ నువ్వు బాధ పడతారువు అని మధు చెప్పద్దు అంది.
ఏమైంది చెప్పు రా.నా బిడ్డను ఎప్పుడు ఇంత డల్గా చూడలేదు వచ్చినప్పటి నుంచి తనలో సంతోషం లేదు.ఏదో కోల్పోయిన బాధ బాగా కనిపిస్తుంది అంది.
గౌతమ్ జరిగింది అంత చెప్పాడు.
అంతే ఒక్కసారిగా ఆమె ఏడుస్తు కింద కూర్చుంది.
అత్తయ్య మీరు ఇలా మాట్లాడుతారు అనే తను చెప్పద్దు అంది.మీకు తెలిసింది అని తెలిస్తే తను చాలా బాధ పడుతుంది అత్తయ్య మీరు లేవండి పైకి అన్నాడు.
నా బిడ్డకు ఇంత కష్టం వస్తుందని అసలు అనుకోలేదు గౌతమ్,మనకు ఒక్క మాట కూడా చెప్పకుండా ఎంత నరకం అనుభవించిందో తలుచుకుంటేనే గుండె పగిలిపోతుంది రా.
అత్తయ్య ఏమీ కాదు మధుకి మనం అంతా ఉన్నాము కదా.ముందు మీరు లోపలికి పదండి అత్త అన్నాడు.
పైకి లేస్తున్న ఆమె ఒక్కసారిగా కుప్పకూలిపోయింది గుండె పట్టుకొని.
అత్త అత్త అంటున్న పలకలేదు.హార్ట్ ఎటాక్ అనుకొని మధుని ఇబ్బంది పెట్టకూడదు అని డోర్ లాక్ చేసుకొని వెంటనే వాళ్ల అత్తయ్యను హాస్పిటల్ తీసుకొని వెళ్లాడు..........!!!???!!!!!????
ఇంకా ఉంది
💐 ధన్యవాదాలు 💐
అంకిత మోహన్