దృశ్యం 1: హాస్పిటల్ ప్రమోషన్ - రుద్ర ఆలోచన
ఒక పెద్ద బంగ్లా, చుట్టూ ఎవరూ లేరు. ఇంట్లో నుంచి చిన్నగా నవ్వుతున్న శబ్దాలు. అప్పుడే ఫోన్ రింగ్ అవుతుంది. ఎవరో ఒక మనిషి తన దగ్గర ఉన్న ఫోన్‌ను ఆన్ చేస్తాడు. చూడటానికి చాలా పాతగా కనిపిస్తుంది. దాన్ని ఆన్సర్ చేసిన తర్వాత..
"హలో సార్! అదే, మనం హాస్పిటల్ పెట్టాం కదా, దాని గురించి ఏమంటారు? దాని ప్రమోషన్ చేయడానికి యాడ్స్ పూర్తి చేయమన్నారు కదా. ఏజెన్సీ దగ్గరికి వచ్చాము, మీరు ఒక మాట చెప్తే.." అని అడిగాడు అవతలి వ్యక్తి.
"అవునా.." అని ఒక గంభీరమైన శబ్దం ఆలోచిస్తున్నట్టుగా వచ్చింది. "వాళ్ళు ఏమంటున్నారు?" అని అడిగాడు.
"అంతే సార్, ఫస్ట్ మన హాస్పిటల్ ని ఒక్కో ఇంచు చూపించి.. అంటే మన దగ్గర ఉన్న ఎక్విప్మెంట్ ని చూపిస్తూ, మందులు ఎలా ఉన్నాయి, ఆపరేషన్ థియేటర్లు ఎలా ఉన్నాయి, సౌకర్యంగా ఉన్నాయా లేదా అని వీడియో తీసి, దాన్ని యాడ్ గా మార్చాలి అని చూస్తున్నారు."
"అవునా! నాకు ఒక ఐదు నిమిషాలు గ్యాప్ ఇవ్వు, నేను మళ్ళీ మాట్లాడతాను. అంతలోపు నాకు ఇంతకుముందు ఇలాంటి యాడ్స్ చేశారు కదా, ఆ క్లిప్స్ నాకు ఒకసారి పంపించు" అన్నాడు యువకుడైన రుద్ర.
"సరే సార్," అని అవతల నుంచి తన మనుషులు ఫోన్ పెట్టేశారు. కొద్దిసేపటికి కొన్ని క్లిప్స్ తన ఫోన్ వాట్సాప్ కి వచ్చాయి.
వాట్సాప్ లో వీడియోలు చూడడం మొదలు పెట్టాడు. ఒక్కో క్లిప్ చూసేటప్పటికీ అతని కళ్ళు గట్టిగా ముడుచుకుంటున్నాయి. అవన్నీ చూసి ఒక ఐదు నిమిషాలు కళ్ళు మూసుకొని, వాటర్ బాటిల్ నుంచి నీళ్లు తీసుకొని తాగుతున్నాడు.
దృశ్యం 2: రుద్ర, అక్షరల ప్రేమ సంభాషణ
అప్పుడే పైనుంచి ఒక అమ్మాయి, "ఏంటి రుద్ర, ఇంకా ఆఫీసుకు వెళ్లలేదా?" అని అంటుంటే.. "లేదు, ఈరోజు కొంచెం రెస్ట్ తీసుకుందామని.." అంటూ పైన మెట్ల మీద నుంచి నడుస్తూ వస్తున్న అక్షరాన్ని చూస్తాడు రుద్ర.
అటు ఇటు నడుము ఊపుతూ, ఒక్కో మెట్టు దిగుతూ.. చీర కట్టుకొని, కనిపించీ కనిపించని నడుముతో, తన జడను ముందుకు వేసి అటు ఇటు నడుస్తుంటే.. ఆ అందాన్ని చూసి ఒక్క నిమిషం గట్టిగా కళ్ళు మూసుకున్నాడు.
"అనవసరంగా ఇంటికి వచ్చాను, నేను ఇంటి దగ్గరుంటే నన్ను ప్రశాంతంగా ఉండనివ్వవు కదా!" అని గట్టిగా అంటూ.. "నాకు కొంచెం గ్యాప్ ఇవ్వు. ఒక్క ఐదు నిమిషాలు వాళ్లకు ఒక మంచి ఐడియా ఇచ్చి నీ దగ్గరికి వస్తా. నీ పని ఏంటో చూస్తా, నా గురించి తెలుసు కదా!" అని చిలిపిగానే అంటాడు.
"కానీ, ఆ వచ్చేదేదో తొందరగా రా.." అని అంటూ మళ్ళీ అలాగే తన జడను వెనక్కి వేసుకొని, పైకి ఎక్కి నడుచుకుంటూ వెళ్ళిపోతుంది అక్షర.
అలా నడుచుకుంటూ వెళ్తున్న ఆమెను చూస్తూ, "మూడు సంవత్సరాలు అయినా నీలో అందం తగ్గలేదు, నాలో ఆవేశం తగ్గలేదు" అని చిన్నగా నవ్వుకుంటూ మళ్లీ తన మనుషులకు ఫోన్ చేస్తాడు.
"మీరు పంపించిన క్లిప్స్ అన్నీ చూసిన తర్వాత నాకు ఒకటి అర్థమైంది. సరే, ఈసారి మనం కొత్తగా ట్రై చేద్దాం! ఎప్పుడూ ఆ ఎక్విప్మెంట్ ఎలా ఉంది, డాక్టర్లు ఎంత చదువు చదివారు అనేది చూపించారు కదా. ఇప్పుడు మనం కొత్తగా ట్రై చేద్దాం. ఆసుపత్రి ఎలా ఉంది, పేషెంట్లను డాక్టర్లు ఎలా చూస్తారు, నర్సులు పేషెంట్లను ఎలా చూసుకుంటున్నారు అనేది చిన్న క్లిప్ తీసి వీడియో తయారు చేసి వదలండి" అని చెప్పాడు రుద్ర.
క్లిప్స్ లో ఏ పెద్ద సంఘటన లేదు, కేవలం 'రూమ్ ఎలా ఉంది, ఎక్విప్మెంట్ ఎలా ఉంది, మా దగ్గరికి రండి మేం బాగా చూస్తాం' అని మాత్రమే చెప్పారు. దాన్నే మనవాడు కొంచెం డిఫరెంట్ గా ఆలోచించాడు. వాళ్లకు ఆ విషయం చెప్పి ఫోన్ పెట్టేశాడు.
ఒక నిమిషం అలా కూర్చుని, ఏదో గుర్తుకొచ్చిన వాడిలా చకచకా మెట్లు ఎక్కుతూ రూంలోకి వెళ్ళాడు. పడుకొని ఉన్న అక్షర, ఫ్యాన్ గాలికి నడుము దగ్గర చీర కదులుతూ ఉంటే, ప్రాణం పోయినవాడిలా ఆమె కాళ్ళ దగ్గర కూర్చుని కాళ్ళను మెల్లగా నిమురుతూ అన్నాడు..
"అక్షర బంగారం! ఇప్పటికైనా నేను చెప్పేది వినవే. మన ఇంట్లో బుడ్డోదో, బుడ్డోడో ఉంటే ఎంత బాగుంటుంది చెప్పు? ఎప్పుడూ నీతో ముద్దులతో యుద్ధాలు చేస్తూ ఎంతసేపు ఉండను? నా కొడుకులతో, పిల్లలతో నేను కూడా ఆడుకోవాలి కదా?"
దానికి అక్షర, "అలా మాస్టారు, తగ్గు తగ్గు! నాకు కూడా పిల్లలు అంటే ఇష్టమే కానీ ఇప్పుడు వయసు ఎంత? కేవలం 25 సంవత్సరాలు. అప్పుడే తొందర ఎందుకు?" అంటుంది.
ఒక్కసారిగా కాళ్ళ దగ్గర నుంచి పైకి లేచి, "ఇప్పటికే మూడు సంవత్సరాలయ్యింది. నన్ను అందరూ వింతగా చూస్తున్నారు ఇంకా పిల్లలు పుట్టలేదని."
"చూస్తే చూడనీ.. పిల్లలు పుడితే వాళ్ల మీద నీ ప్రేమ మళ్లుతుంది, మరి నన్ను ఎవరు చూసుకుంటారు?" అని అంటుంది అక్షర.
"నా పిల్లలు వచ్చినా, నా పిల్లల తల్లి ఇక్కడే ఉంది కదా! ఎక్కడికి పోతుంది? నిన్ను మర్చిపోతే పిల్లలు పుట్టడం ఎందుకు, నేను వాళ్ళని పెంచడం ఎందుకు?" అని బుగ్గ మీద ఒక ముద్దు పెట్టాడు.
"ఇప్పుడే లే.. మళ్ళీ పిల్లలు పుట్టిన తర్వాత వాళ్ల దగ్గరికి వెళ్లిపోతావు. నా ముద్దులన్నీ వాళ్ళకే వెళ్ళిపోతాయి" అని పక్కకు తిరుగుతుంది అక్షర.
"అబ్బో మేడం గారికి చాలా బాధ వచ్చినట్టుంది! నువ్వు నాకు ఒక కన్ను. ఇప్పుడు నాకు మొత్తానికి నువ్వేలే, నా శరీరం అంతా నువ్వే. నాకు పిల్లలు వస్తే నాకు రెండో కన్ను అవుతారు. ఒక కన్ను వస్తే ఇంకో కన్ను ఎందుకు బాధగా ఏడుస్తుంది? దానికి తోడు ఎవరు ఉంటారు అలాంటప్పుడు? వాళ్ళని వదిలేసి, నిన్ను వదిలేసి.. వాళ్ళను వేరు వేరుగా చూడలేను బంగారం! ఎందుకు ఇలా అనుకుంటున్నావు? ఒక్కటి చెప్పనా?" అంటూ చిన్నగా ఆమెను తనవైపు తిప్పుకొని.. "నీకు ఒక విషయం తెలుసా? పెళ్లయిన పిల్లల కంటే, తల్లిగా మారిన పిల్ల అంటేనే చాలా ఇష్టం. ముద్దుగా మారిపోతారు. ఇప్పుడు నువ్వు స్లిమ్ గా ఉన్నావ్ కదా, అప్పుడు కొంచెం బొద్దుగా మారతావ్.. అప్పుడు ఇంకా బాగా నచ్చుతావే!" అని అంటున్నాడు రుద్ర.
"అవునా? మరి చిన్నప్పుడు నాతో ఎందుకు మాట్లాడలేదు అబ్బా! అప్పుడు నేను చిన్నపిల్లనే కదా!" అని అంటుంటే..
"అప్పుడు నేను కూడా చిన్న పిల్లడినే కదా! అప్పుడు నీతో ఎలా మాట్లాడుకోవాలో తెలియలేదు."
"అదేం లేదులే, నీకు వేరే వాళ్ళంటే చాలా ఇష్టం. అన్నీ వాళ్ళకే చేసావ్, వాళ్ళు ఏమి అడిగితే అది చేశావ్. కానీ నాతో ఒక్కసారైనా మాట్లాడావా?" అని అంటుంది అక్షర.
"ఏంటి.. అప్పుడెప్పుడో జరిగిన సంఘటనకి, ఇప్పుడు ఇక్కడ ఎలా లింక్ చేయగలరు? ఇలా కూడా చేస్తారా?" అన్నాడు రుద్ర ఆశ్చర్యంగా.
"అక్షర.. మా స్టైల్ ఇంతే! మేము ఇలాగే ఉంటాం" అని అంటుంటే ఒక్కసారిగా దుప్పటి కప్పుతాడు.
దృశ్యం 3: హాస్పిటల్ సక్సెస్ - మీడియా రాక
ఒక మూడు రోజుల తర్వాత టీవీ న్యూస్ రిపోర్టర్స్ అందరూ వచ్చారు. ఒక్క ప్రమోషన్ తో ఒక చిన్న స్థాయి హాస్పిటల్ చిన్నచిన్న కుటుంబాలకు ఎలా మేలు చేస్తుంది, కేవలం 15 రూపాయలకి సర్జరీలు ఎలా చేస్తున్నారు, ఇది మంచిదా చెడ్డదా, గవర్నమెంట్ కి ఆదాయమా లేదంటే వీళ్ళకి ఏదైనా ఆదాయం ఉందా అని న్యూస్ రిపోర్టర్స్ అందరూ ఆత్రుతగా వస్తున్నారు.
ఒక్కసారిగా ఆ గార్డెన్ అంతా న్యూస్ రిపోర్టర్లతో నిండిపోయింది. మెల్లగా రుద్ర బయటికి వచ్చాడు. తన వెనకాలే అక్షర కూడా నడుచుకుంటూ వచ్చింది. రుద్ర మెడ మీద చిన్నగా గిల్లుతూ, చెవి దగ్గరికి వచ్చి, "ఏంట్రా ఏం చేసావ్?" అని అంటుంది అక్షర.
"నాకేం తెలుసు? నేను మాత్రం ఏం చేశాను, నాకేం తెలుసు? అడుగుతా ఆగు" అంటుంటే..
అక్షర మరోసారి చెవి దగ్గరికి వచ్చి, "ఈరోజు మీ అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్దాం అన్నావు కదా! ఇప్పటికే చాలా రోజులైంది, వెళ్లకపోతే బాగోదు" అని అంటుంది.
"సరే ఆగు, ఒక నిమిషం ఆగు" అంటాడు రుద్ర.
వాళ్లందరిలో ఇద్దరు ముగ్గురు అమ్మాయిలు చాలా హైట్ గా, క్యూట్ గా, బొద్దుగా కనిపించారు. వాళ్లను చూడగానే ఒక్కసారిగా రుద్ర కళ్ళు పెద్దవయ్యాయి. వెనకాల నుంచి అక్షర గట్టిగా కొట్టింది. రుద్ర తల గోక్కుంటూ, "ఏంటి అలా కొట్టావ్?" అని అటు ఇటు చూసాడు ఎవరూ చూడలేదని.
అక్షర పెద్ద గుడ్లతో, "ఏం చూస్తున్నావ్?" అని ఒక్కసారిగా అడిగింది.
"ఏం లేదే బాబు!" అని అంటుంటే.. "చూడు బొద్దుగా ఉన్నారు కదా, ముద్దు పెట్టేద్దామని చూసావో.. పీక కొరుకుతా!" అని అంటుంది అక్షర.
"అబ్బో! మీరు కొరికే దాకా మేము ఊరుకుంటామా!" అని చిన్నగా నవ్వుతూ "సరే దా.." అని అక్షర చెయ్యి పట్టుకొని బయటికి తీసుకువెళ్లాడు. ఆ క్షణం అక్షర ఒక్కసారిగా గాల్లో తేలినట్టయింది.
బయట ఉన్న ప్రజల వైపు చూసి ఒక్కసారిగా తను కూడా గంభీరంగా మారిపోయింది. బయటికి వచ్చిన రుద్రాక్షరలు, ఒకరి చేతిలో ఒకరు పట్టుకొని వాళ్ళ వైపు చూస్తూ.. చేతులు విడిపించుకుని రుద్ర రెండు చేతులు కట్టుకొని, "ఏంటి, ఎందుకు వచ్చారు?" అని అడిగాడు.
"అదేనండి.." అని ఒక అమ్మాయి ముందుకు వచ్చింది. "సార్! మాది ఫ్లాష్ 5 టీవీ. ఫ్లాష్ మాన్ ని ఆదర్శంగా తీసుకొని మేము ఈ ఛానల్ ని పెట్టాం. ఏ పెద్ద ఇన్సిడెంట్ అయినా మేమే ముందుకు వచ్చి కవర్ చేస్తాం, వార్తలు రిపోర్ట్ చేస్తాం."
"ఆ.. చెప్పండి."
"మీరు మూడు రోజుల్లోనే ఆల్మోస్ట్ 15 రూపాయలకే ఎంతోమంది పేద ప్రజల జబ్బులు నయం చేశారు. దీనిపై మీ అభిప్రాయం ఏంటి?" అని అడుగుతుంది టీవీ న్యూస్ రిపోర్టర్ సరోజ, వెనకాల కెమెరామాన్ విశ్వతో.
రుద్ర ఏం చెప్పాలని ఆలోచిస్తూ, ఏదో రాసుకున్నవాడిలా ఒక కన్ను పైకి పెట్టి ఆలోచిస్తున్నాడు. వెంటనే అక్షర ముందుకు వచ్చి, "మేము ఈ ప్లేస్ కి కొత్తగా వచ్చినప్పుడు.. ఎంతమంది పేద ప్రజలు రోడ్లమీద అడుక్కుంటూ, రోగాలు వచ్చినా అక్కడే పడిపోతూ, యాక్సిడెంట్స్ తో ఎంతోమంది చనిపోయారు. అదంతా చూసిన తర్వాత మొట్టమొదటగా ఏదైనా చేయాలి అని అనిపించింది. ఎంతోమంది పేద ప్రజలు ఊరు కోరికే చనిపోతున్నారు. వాళ్లకి మాకు చేతనైన సహాయం చేయాలని ఈ హాస్పిటల్ పెట్టాలి అని అనుకున్నాం" అని ఒక మాటలో తేల్చేసింది.
మరో రిపోర్టర్, "రుద్ర గారు, మీరు ఎంత మంచి పని చేసి, మీరు చెప్పకుండా మీ వైఫ్ చేత చెప్పారు అంటేనే మీరు ఎంతో గ్రేట్ అండి" అని అంటుంటే..
వెంటనే అక్షర ముందుకు వచ్చి, "ఏంటి ఆయన చెప్పాడా? నేను కదా చెప్పింది. ఆయన ఆలోచిస్తున్నాడు. నేను ఐడియా ఇచ్చింది, నేను ఇది స్థాపించింది. అలాంటిది రుద్ర నువ్వు ఎలా పొగుడుతున్నారు? అబ్బాయి మంచి మనుషుల ఉన్నాడు, తీసుకెళ్ళి పోదామని..?" అని ఒక్కసారిగా నోరు జారిపోయింది. రిపోర్టర్లందరూ కెమెరాలు అటు ఫిక్స్ చేశారు.
వెంటనే రుద్ర యాక్షన్ లోకి దిగి, అక్షరను తన వెనకాలకి తీసుకొని, "అయ్యో! మీరు తప్పుగా అనుకోకండి. తను కొంచెం.. అంటే నా మీద కొంచెం ప్రేమ ఎక్కువ, అందుకే అప్పుడప్పుడు ఇలా మాట్లాడుతుంది. తనకు చాలా సార్లు చెప్పాను, తను వినదు. అయినా రిపోర్టర్లు అందరూ చాలా అందంగా ఉన్నారు. మేకప్ వేశారా లేదంటే లేదా? ఎందుకో మీ మొహం చూస్తుంటే నాచురల్ బ్యూటీ లా ఉన్నారు!" అని అనడంతో ఒక్కసారిగా కెమెరాలు డౌన్ చేసి అబ్బాయిలు తమ మొహాలు ఒకరివి ఒకరు చూసుకున్నారు.
ఇక అక్షరను మళ్లీ ముందుకు తీసుకువచ్చి, చెవిలో "చూడు, చూసి అడుగులో అడుగు వేసి మాట్లాడాలి" అని అనడంతో తను నోరు మూసుకొని ఒక అడుగు వెనక్కి వేస్తుంది.
రుద్ర మాట్లాడుతూ, "అవునండి, తను చెప్పింది నిజమే. తను లేకపోతే నేను ఈ ఐడియా పెట్టే వాడిని కాదు. తను చెప్పింది కాబట్టే చేశాను కాబట్టి ఆ గ్రేట్నెస్ అంతా తనదే.. నా భార్య అక్షరది" అని అన్నాడు. ఇప్పుడు అందరూ ఆ భార్యాభర్తలైన రుద్రాక్షరల మొహాలను కెమెరాల్లో దాచుకున్నారు.
దృశ్యం 4: స్వాతి - తన జాబ్ కోసం పోరాటం
అందులో స్వాతి అనే అమ్మాయి, "సార్, నాకు ఒక చిన్న డౌట్ ఉంది. వీళ్ళందరూ వెళ్ళిపోయినాక నాతో కొంచెం మాట్లాడండి" అని అంటుంటే, అక్షర మళ్ళీ ముందుకు వస్తుంటే ఆమె చెయ్యి పట్టుకున్నాడు రుద్ర.
"సరే, మీరు ఏం అడగాలనుకుంటున్నారో అడగొచ్చు, ఇబ్బంది లేదు. కాకపోతే కొంచెం సెన్సిటివ్ గా ఆలోచించి నాతో మాట్లాడండి."
"అది కాదు, మీకు ఇది ఒక్కటే బిజినెస్ కాదు అని నాకు తెలిసింది. మీకు ఇంతకుముందు చాలా బిజినెస్ లు ఉన్నాయి కదా! అందులో మీకు బాగా నచ్చిన బిజినెస్ ఏది?" అని అడిగింది స్వాతి.
"నేను బిజినెస్ అంటే ఒకటి, ఇది రెండు.. కానీ, నాకు బాగా నచ్చిన పని అంటే రైటింగ్ (Writing) అండి. చిన్నప్పటినుంచి నా బాధలు, కోపాలు, ఆనందం అన్నీ కథల్లోనే చూసుకున్నాను. వాటిని బిజినెస్ అనడం కంటే నా గుర్తింపు అనడం నాకు చాలా ఇష్టం" అని అనడంతో, అందరూ ఇంకొన్ని ప్రశ్నలు అడిగి అక్కడి నుంచి వెళ్ళిపోయారు.
అందరూ వెళ్తుంటే స్వాతి తన ఛానల్ బండిలో కూర్చుని ఎవరితోనో ఫోన్ మాట్లాడుతూ, "సార్! ఈసారి నాకు ఒక్క ఛాన్స్ ఇవ్వండి. అతన్ని మనం ఒక బ్లాగ్ లాగానో, లేదంటే ఒక కథ లాగానో మన పేపర్లో ప్రచురిస్తే చాలు. ఇప్పటివరకు అతని గతాన్ని ఎవరూ అడగలేదు, నేను మాత్రమే అడగబోతున్నాను. ఒక్కసారి.. ఒకే ఒక్కసారి ఛాన్స్ ఇవ్వండి. ఈ జాబ్ పోతే, నాకు మరో జాబ్ వెతికేలోపు మా ఇంట్లో అన్నానికి కూడా చాలా కష్టంగా ఉంటుంది సార్" అని బతిమిలాడుతోంది.
"సరే అమ్మా, నీ ఇష్టం! అది సక్సెస్ అయితే ఉంటావు లేదంటే జాబ్ పోతుంది. నీకంటే మంచిగా వార్తలను పట్టుకొని బాగా రాసే వాళ్ళు, లేదంటే AI వాడుకుని రాసే వాళ్ళు ఉన్నారు" అన్నాడు అవతలి వ్యక్తి.
"లేదు సార్, ఎప్పటికీ హ్యూమన్ ఎమోషన్ దే పైచేయి. కాబట్టి ఛాన్స్ ఇవ్వండి" అని అడుగుతుంది స్వాతి.
"సరే ఇక నీ ఇష్టం! నువ్వు రేపు పొద్దున్నకి ఆ ఇన్ఫర్మేషన్ ఇచ్చి పేపర్లో వేయిస్తావా? అది సక్సెస్ అయ్యిందా, దాన్ని మనం టీవీలో న్యూస్ గా కూడా వేయొచ్చు. కానీ అది సక్సెస్ కాకపోతేనే నీ జాబ్ ఊడిపోతుంది" అని అంటుంటే.. "నాకు టైం ఇవ్వండి" అని అంటూ ఫోన్ కట్ చేస్తుంది స్వాతి.
పక్కన ఉన్న కెమెరామెన్, "ఏంటి అక్కా, ఈ జాబ్ కోసం ఎందుకు అంత తపన పడుతున్నావ్?" అని అంటుంటే.. "లేదురా, నాకు వచ్చింది ఇదొక్కటే. దీన్ని కూడా చేయలేకపోతే నేను మా అమ్మ నాన్నలను ఎలా చూసుకోవాలి? నన్ను కని ఇంత పెద్ద చదువు చదివించారు, కానీ చదువుకి తగ్గ పని నాకు చిక్కడం లేదు. ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేయడం అంటే నాకు చాలా ఇష్టం, అందుకే నేను ఇలా న్యూస్ రిపోర్టర్ గా మారాను. కానీ కొన్ని రోజుల నుంచి ఎందుకో నా టైం బాగాలేదురా. ఒక్క న్యూస్ కూడా నేను ఫస్ట్ సరిగా అందించలేకపోతున్నాను. ఫస్ట్ టైం ఇక్కడ చిన్నగా అడిగినా కూడా భంగపడకుండానే ఒప్పుకున్నారు, ఇది చాలా విచిత్రంగా ఉంది" అని అంటూ తన కెమెరామెన్ ఫ్రెండ్ తో మాట్లాడుతుంది స్వాతి.
దృశ్యం 5: రుద్ర ఇంటికి స్వాతి రాక
అందరూ వెళ్లిన తర్వాత స్వాతి తన కెమెరామెన్ ని అక్కడే ఉండమని చెప్పి, కెమెరా తీసుకొని లోపలికి వెళుతుంది. కాలింగ్ బెల్ మోగుతుంది. లోపల నుంచి చిన్నగా నవ్వుకుంటూ, జుట్టు చెదిరి ఉండి వచ్చిన అక్షర డోర్ తీస్తుంది. బయట స్వాతిని ఆ అవతారంలో చూసి అక్షర కొంచెం సిగ్గుగా ఫీల్ అయ్యి, "సారీ అండి.." అని అంటుంటే, "ఏంటి ఇలా వచ్చావ్?" అని అంటుంది అక్షరను స్వాతి.
"అంటే సార్.." అని అంటుంటే..
"సార్ ఇప్పుడు బిజీగా ఉన్నాడు" అని అంటే, "అర్థమవుతుంది మేడం!" అని చిన్నగా నవ్వుతుంది స్వాతి.
"ఏమి అర్థమవుతుంది అమ్మ మీకు?" అని అక్షర అంటుంటే, సారీ మేడం అని నవ్వింది స్వాతి.
"రుద్రా!" అని గట్టిగా పిలుస్తుంది అక్షర.
పైనుంచి అప్పటిదాకా మామూలు నార్మల్ షర్ట్ లో ఉన్న రుద్ర.. వైట్ షర్ట్, బ్లాక్ కోట్, బ్లాక్ పాయింట్ వేసుకొని, చేతిలో దువ్వెనతో "అక్షర రా.." అని పిలుస్తున్నాడు.
"ఒక్క నిమిషం.. సరే ఒక నిమిషం ఉండండి మళ్లీ పిలుస్తాను" అని అంటుంది స్వాతితో.
స్వాతి కూడా గోడకు పక్కన ఆనుకొని, "వీళ్ళ జీవితం ఎంత హాయిగా ఉంది, పెళ్లి చేసుకుని చాలా సుఖంగా ఉన్నారు. నా జీవితం ఏంటి ఇలా అయిపోయింది!" అని చిన్నగా తనలో తాను అనుకుంటుంది.
లోపలికి వెళ్లిన అక్షర, రుద్ర కంటే ఒక మెట్టు పైకి ఎక్కి రుద్ర తలను పట్టుకొని, "చక్కగా పెట్టు" అని అంటూ చేతిలోకి దువ్వెన తీసుకొని రుద్ర తల దువ్వుతూ.. "బాబు ఎటు తిప్పితే అటు పోవాల్సిన వెంట్రుకలు, నేను ఎంత చేసినా దానికి ఇష్టం వచ్చినట్టే వెళ్తున్నాయి" అని అంటూ మెల్లగా పాపిడి తీసి అక్షర ఇంకా మాట్లాడుతూ, "రుద్రా నీకు బొట్టు పెట్టనా?" అంటుంది.
"ఛీ! నేను ఏమైనా ఆడపిల్లను అని అనుకుంటున్నావా నాకు బొట్టు పెడతా అంటున్నావ్?" అని రుద్ర అంటాడు.
"అబ్బో! సార్ గారికి కోపం కూడా ఉందా?" అని అక్షర అంటుంది.
"ఏంటి రాత్రి కోపం సరిపోలేదా?" అని రుద్ర అంటే, "ఆ కోపం సరిపోదులే మాకు!" అని చిన్నగా నవ్వుతూ తన జడకు దువ్వెన తగిలించుకొని.. "బయట స్వాతి కెమెరామెన్ రాంబాబుతో వచ్చింది కదా" అని అటు ఇటు నడుము తిప్పుకుంటూ కిందకి వచ్చింది అక్షర.
"అక్కడ కూర్చోమని చెప్పు, నేను కూడా వస్తాను" అని చెప్పి లోపలికి వెళ్తుండగా, "రుద్రా!" అని ప్రేమగా పిలుస్తూ, "నేను మేకప్ వేసుకోనా?" అని అడిగింది.
"ఉన్నది ఎందుకు? వేసుకోవడానికే కదా! ఇప్పుడు ఎలాగో అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళాలి. అలాగే ఇప్పుడు ఎవరో రిపోర్టర్ వచ్చింది, మనిద్దరినీ కలిపి ఒక ఫోటో తీస్తుంది, అందులో నువ్వు అందంగా కనిపించాలి కదా!" అని అన్నాడు.
"అంటే ఇలాంటి అప్పుడు మాత్రమే నేను వేసుకోవాలా?"
"అవును, నువ్వు వేసుకున్నా వేసుకోకపోయినా నాకు అందగత్తెవేలే!" అని చిన్నగా నవ్వుతూ కిందికి వెళ్తాడు. అక్షర కూడా రూమ్ లోకి వెళ్లి మేకప్ చేసుకొని, డ్రెస్ మార్చుకొని కిందికి దిగుతుంది.
అక్షర ముఖానికి మేకప్, కనురెప్పలకు బ్లాక్ కలర్ కోటింగ్, పెదవులకి రెడ్ కలర్ లిప్స్టిక్.. జడను మూడు పాయల్లో తీసి వెనకకి పూర్తిగా జుట్టును వదిలేసి, కొన్ని వెంట్రుకలని మొహం మీదకి విడిచినట్టుగా వేసుకుంది. మెడలో నెమలి డిజైన్ లో ఉన్న నెక్లెస్, చిన్న బొట్టు, బ్లూ కలర్ చీర మీద పసుపు రంగు జాకెట్ తో అక్షర చాలా అందంగా కనిపిస్తుంది. రుద్ర.. బ్లాక్ కలర్ కోట్, బ్లాక్ కలర్ పాయింట్, బ్లాక్ కలర్ షూస్ తో ఉన్నాడు. చిన్నగా నల్లగా కనిపిస్తున్న మొహం, కానీ ఆ నలుపు రంగులో ఏదో తెలియని ఒక రకమైన గంభీరం.
దృశ్యం 6: ఇంటర్వ్యూ మొదలు - రుద్ర గతం
స్వాతిని ఇంట్లోకి రమ్మని పిలిచారు. స్వాతి మెల్లగా అడుగులు వేసుకుంటూ, వాళ్ళ ఇంటిని చూస్తూ, 'డబ్బుంటే ఇలాగే ఉంటుంది మరి' అని మనసులో అనుకుంటూ.. "సరే సార్, నేను లోపలికి రావచ్చా?" అని అడిగింది. రుద్ర లోపలికి రమ్మన్నట్టు సైగ చేశాడు.
"ఏం కావాలి?" అని అడిగాడు రుద్ర.
"అంటే.. నేను ఎవరో, నా గురించి ఏంటో మీకు పూర్తిగా చెప్పనక్కర్లేదు. నేనొక రిపోర్టర్ ని. నేను న్యూస్ తీసుకురావాలి, నేను తప్ప అందరూ బాగా పనిచేస్తున్నారు. కానీ మా న్యూస్ ఛానల్ పెద్దగా హైప్ కి రావడం లేదు. మీలాంటి పెద్ద మనుషులు, ఒక యువతకు స్ఫూర్తినిచ్చే మనుషులను పరిచయం చేస్తే మా టీవీ రేటింగ్ కూడా కొంచెం పెరుగుతుంది సార్" అని అనడంతో..
"నీ ఇష్టం. మరి మీరు తప్పు తప్పుగా ఏమీ అడగకుండా మంచిగా అడిగితే నేను ఇంకా మంచిగా సమాధానం చెప్తాను" అని అంటుంటే, 'నన్ను కూడా అడుగు' అన్నట్టుగా అక్షర తెగ చూస్తుంది. కానీ స్వాతి తన గురించి పట్టించుకోవడంలేదని అక్షరకు అర్థమైంది.
ఒకసారిగా చేతులతో రుద్ర నడుమును గిల్లి, "నువ్వేనా, నేను కూడా ఉన్నాను" అని చిన్నగా చెవులో చెప్తుంది. అప్పుడు స్వాతి స్పృహలోకి వచ్చింది.
"అడగండి స్వాతి గారు" అని రుద్ర అంటాడు. పక్కనుంచి గిల్లడంతో చిన్నగా అరుపు.. అక్షర వైపు తిరుగుతాడు. పక్కనే కూర్చుని చిన్న కుక్కపిల్లలా పెద్ద కళ్ళతో, ఆ కళ్ళలో ఏదో తెలియని ఆశతో ఉండడం చూసి ఒక్కసారిగా నొప్పి మాయం అయిపోయి చిన్నగా నవ్వుతూ, "స్వాతి గారు, చెప్పండి. తన పేరు అక్షర, నా భార్య. నేను చిన్నప్పటి నుంచి ప్రేమించిన నా భార్య" అని చెప్పడంతో అక్షర కళ్ళల్లో మరింత ఆనందం, చిన్నగా కాలర్ ఎగరేసింది.
ఆ చూపును గమనించిన స్వాతి, చిన్నగా వాళ్ళిద్దరి వైపు చూస్తూ ఒక చిన్న నవ్వు విసురుతుంది. అందులో ఆనందం ఉందా, జెలసీ ఉందా, వైరాగ్యం ఉందా తెలియలేదు కానీ.. "అవును చెప్పండి మేడం! ఇంత మంచి హస్బెండ్ ని, ఇంత తెలివైన వ్యక్తిని మీరు ఎలా దక్కించుకున్నారు?" అని అడిగింది.
వెంటనే అక్షర, "నేను దక్కించుకున్నానా, లేక వీడే నన్ను దక్కించుకున్నాడా లేదా ఇద్దరం కలిసి దక్కించుకున్నామో తెలియదు కానీ, కలిసిపోయాం!" అని అంటుంది.
రుద్ర కలుగజేసుకుని, "ఏంటమ్మా మీరు, ఏం మాట్లాడుతున్నారు? ఇక్కడికి ఎందుకు వచ్చారు, మీరు ఏ ప్రశ్నలు అడుగుతున్నారు?" అని అంటాడు.
"సారీ సార్, అంటే మీ ఇంత మంచి కపుల్ ని చూసినప్పుడు ఎవరికైనా ఇలాంటి ప్రశ్న అడగాలనిపిస్తుంది. అందులోనూ మీలాంటి గొప్పవాళ్లు, తెలివైన వాళ్ళు.. ఇంత మంచి భార్యను ఎక్కడ తెచ్చుకున్నారు లేదా తనే మిమ్మల్ని ఎలా దక్కించుకుంది కదా అని.. అది కాదు, ఇంకొకటి అడగండి. మీకు రైటింగ్ అంటే ఇష్టం అని చెప్పారు కదా! మొట్టమొదటిసారిగా మీరు కథ రాయాలని ఎలా అనుకున్నారు? దీని వెనకాల మీ నాన్నగారు లేదా మీ ప్రేయసి అక్షర, ఇంకా ఎవరైనా దీనికి తోడ్పడ్డారా?" అని అడిగింది స్వాతి.
ఆ ప్రశ్నకు అక్షర కూడా చాలా ఆత్రుతగా.. 'ఏం చెప్తాడు? ఒకవేళ నేనే కారణమేమో, ఎందుకంటే ప్రతి పాత్రలోనూ నా పేరే ఉంది కదా! నేనే అయి ఉంటాను' అని అనుకుని, ఇప్పుడు నా పేరు రాబోతుంది అని స్వాతి వైపు గర్వంగా చూస్తుంది.
ఒక రెండు నిమిషాలు ఆలోచించి, "ఇది నిజం చెప్పాలంటే ఎవరి వల్ల వచ్చింది అని చెప్పడం చాలా కష్టం. నేను కలవలేని నా భార్య, మా నాన్నతో మాట్లాడని కష్టాలు, తిరిగిన ప్లేసులు, కలిసిన మనుషులు.. నేను, నా చుట్టూ ఉన్న వాతావరణం ఇలా ప్రతి ఒక్కటి నన్ను కథలు రాసేలా చేశాయి. నాలో ఉన్న ప్రతి ఎమోషన్ ని బయటకు తీయడానికి ఎవరూ మనిషి నాకు తోడుగా లేరు మొట్టమొదటిగా. అందుకే నేను కథ రాసాను. నాకు వచ్చిన బాధను, నాకు ఉన్న తెలివితేటలను మొట్టమొదటిసారిగా చూపించడానికి రాసిన కథ అది" అని చెప్పాడు.
ఆ ఆన్సర్ కు అక్షర కళ్ళు చిన్నగా చేసి, "ఏంటి నిజంగా మీ చుట్టూ ఎవరూ లేరా?" అని అడిగింది. అదే ప్రశ్న స్వాతి కూడా అడగాలనుకుంది.
రుద్ర మెల్లగా నవ్వుతూ.. "నిజం చెప్పాలంటే మనుషులు ఎంతమంది ఉన్నా, తనను అర్థం చేసుకునే వారు లేనప్పుడు ఒంటరితనం వస్తుంది. అదే ఒంటరితనం నన్ను కథ రాసేలా చేసింది" అని చిన్న సమాధానం చెబుతాడు.
"ఓ! సూపర్ ఆన్సర్ సార్! మీ దగ్గర మీ వైఫ్ ఉంది, మీ వైఫ్ కు ఎలాంటి సమాధానం ఇవ్వాలో మీకు బాగా తెలుసు" అని చిన్నగా నవ్వితే, "అదేం లేదండి" అని అంటాడు.
"ఓకే, మీరు ఈ కథలు ఇంత బాగా రాశారు కదా, మరి మీరు ఎంతవరకు చదువుకున్నారు?" అని అడిగింది స్వాతి.
అక్షర చిన్నగా నవ్వుతూ, "చదువా, వీడికి?" అని అంటుంది.
చిన్నగా తగ్గి రుద్ర మాట్లాడుతూ, "నిజమే, చాలా వరకు నిజం. అప్పుడు నాకు పెద్దగా చదువు అబ్బేది కాదు. టెన్త్ వరకు చదివాను, దాంట్లో కూడా బోర్డర్ పాస్. కాబట్టి చదువు మాత్రం మనకు రాదు" అన్నాడు.
"కథలు రాయడం, అప్లోడ్ చేయడం, AI వాడడం, వాటి ద్వారా వీడియోలు జనరేట్ చేయడం, ఒక బిజినెస్ ను నడిపించడం, దాంతో ఆగకుండా ఫ్రీగా సేవలు చేయడం.. ఇదంతా ఎలా వచ్చింది? మీరు ఎవరికీ తెలియకుండా చదువుకున్నారు కదా?" అని అడుగుతుంది స్వాతి.
ఒక్కసారిగా అక్షర మెదడులో కూడా ఏదో తెలియని వైబ్రేషన్. 'అవును కదా, ఇది కూడా నిజమే. ఇన్ని రోజులైనా నాకు ఎందుకు ఈ ప్రశ్న రాలేదు? ప్రేమలో నేను మునిగి వాడు చేసేది నేను పట్టించుకోలేదనుకుంటా. సరే ఇప్పుడేం సమాధానం చెప్తాడో చూద్దాం' అని రుద్ర వైపు చూస్తుంది.
"నిజమే, చదువు ఉంటేనే ఇవన్నీ కొంచెం ఈజీగా చేయొచ్చు. కానీ చదువు కంటే గొప్పది జీవితం! జీవితంలో గడిచిన ప్రతి సెకండ్ మనకు ఏదో ఒక ఆన్సర్ ఇస్తూనే ఉంటుంది. నువ్వు అడిగిన ప్రతి ప్రశ్నకు సమాధానం ఇస్తుంది. నేను ఎవరిని అని అడిగిన ప్రతిసారి ఒక కొత్త కథ.. దాంట్లో నుంచి నేర్చుకోవాల్సిన మంచి మార్గం. నన్ను మార్చింది మనుషులు కాదు జీవితం. జీవితంలో పడిన ప్రతిసారి భయపడ్డాను, దాని జోలికి వెళ్లలేదు. కానీ అవి నన్ను ఒక రాయిలా మార్చాయి. 'ఈసారి కింద పడకూడదు, నువ్వు కిందపడినా చాలా ఈజీగా లేచి రూట్ వెతకాలి' అని నన్ను పంపించాయి. నాకు చదువు కాదు నేర్పింది, జ్ఞానం.. నాకు జీవితమే జ్ఞానాన్ని ఇచ్చింది" అని చెప్పాడు రుద్ర.
దృశ్యం 7: రుద్రాక్షరల మొదటి పరిచయం
అందరూ ఆ మాటలకు.. అంటే స్వాతి, అక్షర ఇద్దరు అలా చూస్తూ ఉండిపోతే, "హలో హలో ఉన్నారా?" అని చిన్నగా నవ్వుతాడు.
వాళ్ళిద్దరూ కళ్ళు తుడుచుకుంటూ "తర్వాత?" అని ఇద్దరు అడుగుతారు.
రుద్ర "ఏంటి తర్వాత?" అని అంటాడు.
"అంటే ఇప్పుడు ఏదో చెప్తున్నావ్ కదా?"
"అంటే నేను ఏం చెప్తున్నానో వినలేదా? జీవితం నేర్పిన పాఠం, జ్ఞానం ఇచ్చిన జీవితం అని ఏదో అంటున్నావ్ కదా అది మాకు అర్థం కాలేదు" అని అంటే,
చిన్నగా నవ్వుతూ.. "అది అర్థం కావాలంటే మినిమం డిగ్రీ చదివి ఉండాలి" అని అంటే, "నేను పీహెచ్డీ కూడా చేశాను సార్" అని స్వాతి చిన్నగా నవ్వుతుంది.
"అక్షర.. నేను కూడా చేశాను."
"ఇప్పుడు ఏంటి? అంటే మేడం మీ సంగతి మర్చిపోయాను. మీరు పిఎంబిబిఎస్ (ఎంబీబీఎస్) చేశారు. అంటే మీరు కూడా చాలా కష్టపడి ఉంటారు కదా?" అని అంటే..
"అవును అవును, మెడిసిన్ చేయడానికి నేను చాలా చాలా కష్టపడి చదివాను, నా బుర్ర చించుకున్నాను. వీళ్లకంటే కరోనా వచ్చి క్లాసులు ఎగగొట్టి చివరికి పాస్ అయ్యారు కానీ, మాకు అలా కాదే.. నేను రెండుసార్లు ఫెయిల్ అయినా కూడా మూడోసారి సెలెక్ట్ అయ్యి పాస్ అయ్యి, ఆ తర్వాత నుంచి ఎంతో బాగా చదివి చివరికి మెడిసిన్ చదివాను అప్పుడే.." అని ఆగి చిన్నగా రుద్ర వైపు చూస్తూ సిగ్గుపడుతూ "ఇలా జరిగింది" అని అంటుంది అక్షర.
"అయ్యో మీరు ఇంత కష్టపడాలి అని తెలియడం లేదు" అని పక్క నుంచి చిన్నగా నవ్వుతూ అన్నాడు రుద్ర.
"అవును మెడిసిన్ చదవమంటే కష్టం, ఎంత కష్టమో తెలుసా? దాంట్లో అవి ఇవి.." అంటూ ఏదేదో చెప్తుంటే, "బాబూ.. పక్కనున్నవాడికి హార్ట్ ఎటాక్ వచ్చేలా ఉంది, తల్లీ ఆపేస్తే కొద్దిసేపు ప్రశాంతంగా ఉంటా" అని అంటాడు రుద్ర. ఆ దెబ్బకు సైలెంట్ అయిపోతుంది.
ఒక్కసారిగా స్వాతి, రుద్ర ఇద్దరు తమ చేతులతో చిన్నగా టచ్ చేసారు.. అంటే చప్పట్లు రాదా అని! ఇద్దరు చిన్నగా నవ్వుతూ.. "ఆ చెప్పండి సార్, అక్షరను సారీ.. అంటే మీ భార్యను మొట్టమొదటిసారి ఎక్కడ చూశారు? మొట్టమొదటిగా తనకోసం మీరు ఏం వదులుకున్నారు?" అని అడిగితే..
అక్షర కూడా 'చూద్దాం, నన్ను ఎప్పటినుంచి చూడడం మొదలుపెట్టాడో చూద్దాం' అనుకుంది.
"తనని మొట్టమొదటిసారిగా నేను మా ఇంటికి వచ్చినప్పుడు చూశాను. చాలా చిన్న పిల్ల, అంటే ఒక మూడు నాలుగు ఐదు సంవత్సరాలు ఉంటుందేమో కరెక్ట్ గా తెలియదు. అప్పుడు తను చిన్న గౌను వేసుకుంది. నేను మొదటిసారి చూసినప్పుడు, రెండోసారి చూసినప్పుడు తెల్లగా ఉండి.. మూడోసారి బాగా గుర్తుంది, తన బర్త్డేకి అనుకుంటా అప్పుడు కూడా తెల్ల డ్రెస్ వేసుకుంది ఎందుకో తెలియదు" అని అంటుంటే..
స్వాతి "ఫస్ట్ సారి ఎలా అనిపించింది మీకు?" అని అడిగింది.
"అది చిన్నతనం కదా పెద్దగా ఏమనిపించలేదు. బుడిబుడిగా అడుగులు వేసుకుంటూ తన అమ్మ వెనకాల వస్తూ ఉన్న అక్షర చెయ్యి ఒక్కసారిగా పట్టుకొని పక్కకు తీసుకువెళ్లి యాక్షన్ చేయడం మొదలు పెట్టాను. నీ పేరు ఏం పేరు, ఇక్కడికి ఎందుకు వచ్చావు అని అక్షరాన్ని అడగడం మొదలుపెట్టాను. తను నోరు తెరిచి అమాయకంగా చూస్తూ ఉంటే, పక్క నుంచి తన నాన్న వెళ్లడం చూసింది. ఒక్కసారిగా నా చెయ్యి విడిపించుకుని అలా పరిగెత్తుకుంటూ వాళ్ళ నాన్న దగ్గరికి వెళ్ళిపోయింది. అది నేను మొదటిసారి చూసింది" అని అన్నాడు రుద్ర.
"రేయ్ రుద్ర, నువ్వు ఊరికే అబద్ధం చెప్పడం లేదు కదా? ఇదంతా నాకు గుర్తులేదు" అని అంటే..
"నిజంగా నీకు ఎలా గుర్తుంటుంది? అప్పుడు నువ్వు చిన్నపిల్లవు కదా!" అని రుద్ర అంటాడు.
"మరి నీకు ఎలా గుర్తుంది? నువ్వు అప్పుడు ఏమైనా పెద్దవాడివా?"
"అంటే నీ కంటే మూడు సంవత్సరాలు పెద్దవాడిని. అప్పుడు, ఇప్పుడు ఉన్నంత మంచి వాడినైతే కాదు, చాలా చెడ్డవాడిని" అని అంటే, ఒక కన్ను పైకి లేపి అక్షర "ఎంత చెడ్డవాడివి బాబు?" అని అడిగింది.
"నన్ను టీవీ చూడనివ్వలేదని, ఆ టీవీ ని పగలగొట్టడానికి వెళ్ళిన రౌడీని" అని గొప్పగా చెప్పుకుంటాడు.
"అవునా! అంతేలే అబ్బా.. మీరు రౌడీలు, మేము మిమ్మల్ని చూసి పారిపోయే అమ్మాయిలం అంతే కదా!" అని చిన్నగా అంటుంది.
"అది కాదు బంగారం" అని అంటే, "ఓకే" అని అంటుంది అక్షర.
దృశ్యం 8: ఇంటర్ లాక్ బ్రిక్స్ బిజినెస్ మొదలు
"ఈ కంపెనీ పెట్టడానికి నాకు ఆల్మోస్ట్ రెండు సంవత్సరాలు పట్టింది. అంటే 2 సంవత్సరాలు కాదు, ఆల్మోస్ట్ నా 18 సంవత్సరాల నుంచి కల కంటూ ఉన్నాను. చివరికి ఆ కల కన్నా నాలుగు సంవత్సరాల తర్వాత జరిగిన కథ అది. ఆ తర్వాతనే నేను అనుకున్నది నా దగ్గరికి వచ్చింది." రుద్ర చెప్పడం ప్రారంభించాడు.
"అది నేను మొట్టమొదటిగా పుట్టినరోజు. కష్టమంటే కష్టమే.. మామూలు ప్రమోషన్స్ చేద్దామన్నా ఎందుకో చేయలేకపోయాను. ఆరోజు కంపెనీ మొదలు పెట్టడానికి ఆర్డర్ల కోసం వెతుకుతున్నాను. 'మాకు ఇప్పటికే చాలామంది ఉన్నారు, అక్కడే మేము తీసుకుంటాం, ఇదేమో మాకు తెలియదు' అని అంటున్నారు. ఇక నాకు ఏం చేయాలో తెలియలేదు. ఒక టీ షాప్ దగ్గర కూర్చున్నాను. చుట్టూ జనాలు అందరూ పేపర్లు పట్టుకొని చదువుతున్నారు, కొంతమంది టీ తాగుతూ అటు ఇటు చూస్తూ అక్కడక్కడ ఉన్న బోర్డులను చదువుతున్నారు. అక్కడికి ఏడు నుంచి ఆల్మోస్ట్ 10, 11 వరకు చాలా రద్దీగా వచ్చారు. ప్రతి ఒక్కరు రావడం, తాగడం.. మళ్ళీ నాలుగు గంటలకు కొత్త కొత్త వాళ్లు రావడం నేను చూశాను. అందులో బాగా జనాలు వస్తున్నారు, ముఖ్యంగా తాపీ మేస్త్రీలు ఉన్నారని నేను గమనించాను."
"నా మొదటి ప్రమోషన్ మొదలు పెట్టాను. అక్కడ ఒక హోర్డింగ్ పెట్టి, ఆ టీ షాప్ వ్యక్తికి కొంచెం డబ్బులు ఇచ్చి.. 'మీరు ఏం మాట్లాడొద్దు, కేవలం ఇక్కడకు వస్తున్న వాళ్లకు కనిపించేలా ఈ బోర్డు పెట్టండి. వాళ్లకు ఇంట్రెస్ట్ కలిగించేలా నేను పేపర్ రెడీ చేస్తాను' అని చెప్పాను. రాధాకృష్ణుల బొమ్మతో ఒక ఐస్ క్రీమ్ బండి పోతుంది. వెంటనే ఒక ఐడియా వచ్చింది.." అని చెప్పడం ఆపాడు రుద్ర.
ఆపడం చూసి స్వాతి రికార్డ్ చేయడం కొంచెం పాజ్ చేసి, "చెప్పండి" అని అంటుంది.
"వెంటనే నేను ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) దగ్గరికి వెళ్లి, రాధాకృష్ణుల ఇంటర్నెట్ పిక్స్ తీసి.. 'మీ ప్రేమతో ఎంతో గట్టిగా ముడిపడిన మీ బంధాలకు, మీ ఆశలకు హద్దులు లేవని.. ఎంతో గట్టివని తెలిపి మా ఇంటర్ లాక్ బ్రిక్స్' అని కోడ్ ను అందంగా తీర్చిదిద్దాను. ప్రింటర్ మిషన్ దగ్గరికి వెళ్లి అక్కడ ఇదే పదాలను పేపర్ మీద అచ్చులు బిగించి దాన్ని జిరాక్స్ చేయించి, ఆల్మోస్ట్ నాలుగైదు చాలా పాపులర్ గా ఉన్న టీ షాప్స్ దగ్గర పెట్టడం మొదలుపెట్టాను. తను దూరంగా ఎక్కడో మూలన ఆ మిషన్ ని పెట్టి చిన్న చిన్నగా చేసుకోవడం మొదలు పెట్టాడు (రుద్ర తన గురించి తను థర్డ్ పర్సన్ లో చెప్తున్నాడు). కేవలం ఒక వారం రోజులకి 'ఇది కొత్తగా ఉందని' ఆల్మోస్ట్ నాలుగైదు ఆర్డర్లు గట్టిగా తగిలాయి. వేగం పెరిగింది, మనుషులు తగ్గిపోయారు. కేవలం నా దగ్గర నా తమ్ముడు, నేను తప్ప ఇంక పెద్దగా ఎవరూ లేరు. ఎంత చేసినా రోజుకి 100 కు మించి పెద్దగా రావడం లేదు. అంటే రోజుకు 100 ఇటుకలు. ఇప్పుడు ఏదో చేయాలి అని ఆలోచించడం మొదలు పెట్టాను."
"ఇంస్టాగ్రామ్ స్క్రోల్ చేయడం మొదలు పెట్టాను.." రుద్ర తన చేతిని స్క్రీన్ పై పెట్టి స్క్రీన్ ని స్క్రోల్ చేస్తున్నట్లు యాక్షన్ చేస్తూ చెప్పాడు. "నా మైండ్ లో ఏదో మెదిలింది. 'ఇప్పుడు నాకు పని ఉంది కానీ చేయడానికి శక్తి సరిపోవటం లేదు. అంటే నేనొక్కడినే ఉండను కదా, ఎంతోమంది పని లేక ఊరికే చూస్తూ ఉంటారు. కొంతమంది బాధగా స్టేటస్ చూస్తారు.' కానీ చెయ్యి ఒకచోట ఆగిపోయింది.. 'గెలుపే నీ లక్ష్యం, విజయం నీ మెట్టు' అని ఒక నినాదం. ఇది చూసిన తర్వాత అవును, ఎమోషన్స్ తో యువకులు ఉన్నారు, వాళ్లకు పని లేదు.. పని ఇచ్చే సౌకర్యం లేదు, చదువు లేని వాళ్ళు ఎంతోమంది.. చదువుకున్నా పని చేయలేని వాళ్ళు ఎంతోమంది, వీళ్ళని పట్టుకోవాలి అని ఒక్కసారిగా మైండ్ లో ట్రిగ్గర్ అయింది."
అక్షర, స్వాతి ఒక్కసారిగా కళ్ళు పెద్దవి చేస్తూ రుద్ర వైపు చూస్తూ ఉండిపోయారు. "కానీ సోషల్ మీడియాలో ఇలాంటివి ఫార్వార్డ్ అవ్వడం చాలా కష్టం, దీంట్లో ఏదో విచిత్రం ఉండాలి.. అంతకంటే ఎంటర్టైన్మెంట్ ఉండాలి అంటే ఒక వీడియో రిఫ్లెక్ట్ చేయాలి అని ఒక పేపర్ ముందల పెట్టుకుని రూమ్లో కూర్చొని ఆలోచించడం మొదలు పెట్టాను. రాత్రి సమయం.. పేపర్ మీద రాయడం మొదలుపెట్టాను. అది ఏప్రిల్ నెల."
"ఒక అబ్బాయి మౌనంగా కూర్చుని ఉన్నాడు. తన మనసులో చాలా బాధపడుతున్నాడు.. 'నన్ను ఎవరు అర్థం చేసుకోవడం లేదు, ప్రతి ఒక్కరు నన్ను తిడుతున్నారు, వీళ్లందరికీ నేను ఏదో ఒకటి చేసి చూపిస్తా. నా ఫ్రెండ్స్ ఎక్కడికి వెళ్లారు? ఈరోజు నా బర్త్ డే, వాళ్ళు కూడా నన్ను మర్చిపోయారా?' అని అంటూ.. అప్పటికే ఆ కుర్రాడు యూట్యూబ్లో షార్ట్స్ చేస్తూ ఉండేవాడు. కామెడీ షార్ట్స్ అరేంజ్మెంట్ చేయడం మొదలు పెట్టారు. చుట్టూ లైట్లు పెట్టి, బెంచ్ పెట్టి దానిమీద కేక్ పెట్టి, అందరి తల మీద టోపీలు పెట్టి.. క్యాండిల్ వెలిగించి తన ముందు పెట్టి ఒక్కసారిగా అందరూ 'హ్యాపీ బర్త్డే టూ యు' అని అరుస్తూ.. కేక్ కట్ చేయడానికి కట్ చేసి ఇచ్చారు. వాళ్ళందరూ మళ్ళీ చకచకా తీసేసి 'ఏప్రిల్ ఫూల్, ఏప్రిల్ ఫూల్' అని ఏడిపించడం మొదలు పెట్టారు. ఆ కుర్రాడి కళ్ళల్లో నీళ్లు.. మొహం విచిత్రంగా పెట్టి 'ఏం చేస్తున్నార్రా? ఈరోజు నా పుట్టినరోజు రా' అంటే.. 'అవును మామ, ఇప్పుడే మనం రీల్ తీశాం నీకు చెప్పలేదా వరుణ్ గాడు' అని అంటే.. 'రీలా?' అని వికారంగా మొహం పెట్టాడు. 'అవును మామ, ఈరోజు మనం ఏప్రిల్ ఫూల్ కదా ఒక మంచి కామెడీ స్టైల్ లో రీల్ తీద్దామనుకున్నాం, అది ఇప్పుడు పెట్టాం' అని అంటే, అవునా అని చిన్నగా నవ్వుతాడు."
"చుట్టూ ఉన్న ఫ్రెండ్స్ ఒక్కసారిగా, 'ఛీ పోరా! నీకు యాక్టింగ్ చేయడమే రావడం లేదు.. అలాంటిది మా ఛానల్ లో కమెడియన్ గా మారదాం అనుకుంటున్నావా?' అని అందరూ వెళ్ళిపోతుంటే.. అతడు ఒక్కడే కూర్చొని ఉన్నాడు. ఒక్కసారిగా అతను డల్ అవ్వగానే చుట్టూ ఉన్న తన ఫ్రెండ్స్ తన ముందుకు వచ్చి మళ్లీ ఏప్రిల్ ఫూల్ అంటూ మళ్ళీ బాంబులు పేల్చడం మొదలుపెట్టారు."
"ఏం జరుగుతుంది రా అని తల పట్టుకుని తిరిగేటప్పుడు, 'మామ నువ్వు తిరగకు, జాబ్ కోసం నువ్వు కాదు తిరగాల్సింది.. జాబే నీకోసం వచ్చింది' అని ఒక పెద్ద హోర్డింగ్ స్క్రీన్ పైన ఆకాశంలో చూపిస్తూ.. 'రాధాకృష్ణ ఇంటర్ లాక్ బ్రిక్స్.. ఉద్యోగం ఉంది ఇక్కడ! చెమట పడాల్సిన అవసరం లేదు, తెలివితేటలతో పని. తెలివితేటలు అన్నది ఎక్కడి నుంచో రావు, నేర్చుకుంటే వచ్చేవి కాదు.. కానీ చూసి ఎవరో చెప్పకుండా నీకు నువ్వే నేర్చుకునేది మీ తెలివితేటలు. అది ప్రతి మనిషికి ఉంటుంది. మీకు కావాల్సింది కేవలం అబ్జర్వేషన్, చూడడం మాత్రమే' అని హోర్డింగ్ పడి ఒకసారిగా అది పేలిపోతుంది. ఇలా స్కిట్ పూర్తి చేసి వదిలాను."
"అలా కొన్ని రోజులకి నాలుగు అంటే నాలుగు ఆర్డర్లకు పూర్తి కావాల్సిన మెటీరియల్ రెడీ అయిపోయింది. ఇక లోడింగ్ గురించి ఆలోచిస్తూ ఉన్నాం. వాళ్ళు మనకు లొకేషన్ పెట్టారు, మన దగ్గర పెద్ద బండి లేదు. ఏం చేయాలి అని ఆలోచిస్తున్నప్పుడు, మళ్లీ చిన్నగా కళ్ళు మూసుకొని తన తమ్ముడిని పిలిచి.. 'అవును తమ్ముడు, నువ్వు ఇంతకుముందు నీకు తెలిసిన వాళ్ళ దగ్గరికి డ్రైవింగ్ కోసం వెళ్లావు కదా, వాళ్లకు ఫోన్ కలుపు, చెప్తా' అన్నాను. తమ్ముడు 'ఎందుకు?' అని అన్నాడు. 'వాళ్ళ దగ్గర ట్రాక్టర్ ఉంది, మన దగ్గర ఐడియా ఉంది, కాంట్రాక్ట్ ఉంది' అని చెప్పడంతో సరే అని తమ్ముడు వాళ్లకు ఫోన్ చేశాడు. వాళ్లతో కొద్దిసేపు మాట్లాడిన తర్వాత ఫోన్ ఇచ్చాడు. 'ఇదిగో అన్న.. హలో సార్! నేను మా తమ్ముడికి బాగా నేర్పించారు. నా పేరు రుద్ర, ఇప్పుడు మీ సహాయం కావాలి. మీ డబ్బులు మీకు వస్తాయి.. కాకపోతే ఇప్పుడే ఇవ్వలేము. కానీ కాంట్రాక్టులు చాలా ఇస్తా. ప్రతి లోడింగ్ కి కూడా డబ్బులు ఇస్తాం కాకపోతే అంతగా ఇవ్వలేం. కానీ కాంట్రాక్టులు చాలా వస్తాయి మా దగ్గరికి. మీ పిల్లలను లేదా మీరే ఇక్కడికి రండి.. మేము లోడింగ్ చేస్తాం, అక్కడికి తీసుకు వెళ్తాం. అక్కడ ఇంకా ఏదైనా మంచి లోడింగ్ దొరికితే అక్కడికి పంపిస్తా. కానీ ఆల్మోస్ట్ నెల రోజులు మా దగ్గరే ఉండాలి. ఇది ఒక్క పని కాదు, మేము ఇక్కడ అన్నం పెడతాం, రూమ్లు ఇస్తాం' అని అంటే, అతను కొద్దిసేపు ఆలోచించి 'డబ్బులు ఇస్తాను అంటున్నాడు, కాంట్రాక్టు కుదురుతుంది అన్నాడు, నెలరోజులు రమ్మంటున్నాడు, అన్నం కూడా పెడతాను అంటున్నాడు.. దీంట్లో పెద్ద సమస్య ఏముంది' అని అనుకుని సరే అని అతను ఒప్పుకున్నాడు."
తమ్ముడు మాట్లాడుతూ "అవునన్నయ్య, ఎందుకిలా చేస్తున్నావు? ఊరికే డబ్బులు వేస్ట్ చేస్తున్నావ్ కదా" అని అంటే..
"డబ్బులు కాదు నా ఫస్ట్ టార్గెట్. వీటిని మన దగ్గరికి రప్పించుకోవాలి. ట్రాక్టర్ తో మనం మన కస్టమర్లకు నమ్మకం కలిగించామనుకో, వాళ్లే ఇంకో పది మందిని మనకు పంపిస్తారు. వాళ్ళిచ్చిన డబ్బుతో మెల్లగా మనం ఒక చిన్న ట్రక్కు లేదంటే ఏదైనా బండో.. కేవలం చిన్నది అయితే చాలు, మెల్లమెల్లగా మనమే గ్రోత్ తెచ్చుకోవచ్చు. వాడు మనతో నెల రోజులు ఉంటాడు, ఆ నెల రోజులు కూడా వానికి లాభం కనిపిస్తే వాడి లాంటి వాళ్ళను మన దగ్గరికి ఇంకా బాగా పంపిస్తాడు" అని చెప్పాడు రుద్ర.
అలా రెండు లోడ్లు వెళ్లిపోయాయి. ఇంకా రెండు లోడ్లు ఉన్నాయి. జనాభా కావాలి, మరో రెండు కొత్త ఆర్డర్లు వచ్చాయి. తన దగ్గర ఉన్న కొత్తగా వచ్చిన పిల్లలను అడుగుతూ "మీకు ఇలాంటి వాళ్ళు ఎవరైనా తెలిస్తే ఇలా ఇక్కడికి పిలుచుకోవచ్చు. ఎందుకంటే రోజురోజుకి డిమాండ్ పెరుగుతుంది, మనం కూడా తక్కువగా ఉన్నాం జనాభా ఎక్కువ కావాలి. ఇక కొన్ని రోజుల్లోనే మనం ఆటోమేటిక్ మిషన్ కూడా కొనవచ్చు. మనుషులు ఉంటే ఆ ఆటోమేటిక్ మిషన్ ని వాడుకోవాలంటే మన టైం సరిపోదు మన వేగం చాలదు. ఒకటి వెళ్ళిపోయాక మరొకటి వస్తూ ఉండాలి. కేవలం ఉండేది ఇక్కడ 6 మంది. నువ్వు ఆరుసార్లు ఎంతమందిని తిరిగినా లాభం లేదు. కేవలం ఇంకొక్క నలుగురు వస్తే ఆల్మోస్ట్ ఒక రెండు మూడు లేచిపోతాయి. మరో పక్కనుంచి ఆ నలుగురు జస్ట్ ఇసుక సిమెంట్ వంటివి దాంట్లో కలపాలి. దానికోసం మనలో ఈ 6 మంది ముగ్గురు ఇక్కడ ఉండి ముగ్గురు అక్కడ ఉండి.. ఇలా సరిపోదు కాబట్టి ఇంక నలుగురిని పిలిచినా పరవాలేదు. ఇక్కడ రూమ్స్ ఉన్నాయి, ఫుడ్ పెడతాను, నీడలో ఉండేది.. కాకపోతే అటు ఇటు తిరగాలి అది కూడా చేయకపోతే ఎలా బాబు?" అని అంటుంటే..
"సరే సరే, నా ఫ్రెండ్స్ ని కొంతమంది పిలుస్తాను వాళ్లకు కూడా అడగమని చెప్తాను" అని ఆ కుర్రవాడు చెప్పడంతో..
చాలా సంతోషంగా రుద్ర, "సరే మీరు పని కానివ్వండి నాకు చిన్న పని ఉంది" అని అంటూ తన ఇంటికి వెళ్ళాడు.
ఎప్పటిలాగే తండ్రి, "ఏం చేస్తున్నావ్ రా? ఏదేదో చేస్తున్నావంట, కంపెనీ పెడుతున్నావంట? నీకు ఇక్కడికి ఇలాంటి ఇంత డబ్బు ఎక్కడి నుంచి వచ్చింది? ఎక్కడైనా దొంగతనం చేసావా? దొంగతనం చేయడానికి కూడా పనికిరావు కదరా. ఏదో చేశావు, ఏదైనా పెద్ద విషయం కావాలి. చంపుతా నా కొడకా" అని బెదిరిస్తాడు.
అమ్మ దగ్గరికి వెళ్లి ఆకలేస్తుంది అంటే.. అమ్మ ప్రేమగా ముద్దలు కలిపి నోట్లో పెడుతూ.. "అయినా ఎందుకురా ఎప్పుడూ అక్కడే ఉంటావు? అప్పుడప్పుడు ఇక్కడ రావచ్చు కదా!" అని అంటుంటే..
"ఇలాంటి నాన్నను పెట్టుకొని నేను ఇక్కడ ఉండి ప్రశాంతంగా ఎలా అమ్మా చేసుకునేది? కేవలం ఆరు నెలలు చాలుమ్మా" అని అంటుంటే..
"సరే ఇంక నీ ఇష్టం, మీరు ఎవరూ నాతో మాట్లాడకపోతే నేను ఏమైపోవాలి? నేను అనుకున్న చికెన్ తెచ్చాను.. మీ నాన్న తీసుకొచ్చాడు. చూడ్డానికి ఎలా ఉన్నా నీ మీద ప్రేమ ఎక్కువే, కష్టపడుతున్నావని చికెన్ తెచ్చాడు. రెండు ముద్దలు తినేసి వెళ్ళు" అని అంటుంటే, సరే సరే అని టీవీ చూడడం మొదలు పెట్టాడు.
అప్పుడే ఒక సినిమా రన్ అవుతుంది.. సినిమాలో చిరంజీవి సినిమా 'స్టాలిన్' ఏదో సీన్ చూసాడు. ఒకసారిగా తనకు ఈ ఐడియా వచ్చిన వాడిలా గబగబా బయటికి వెళ్లి, తన షాప్ కి వెళ్లి.. తన దగ్గర ఉన్న పిల్లలతో, "సరే మనం ఇక్కడ ఉండి అక్కడి నుంచి ఆర్డర్లు తీసుకోవడం ఇప్పుడు చాలా కష్టం. వస్తాయి కానీ మన మీద నమ్మకం రాదు. కాబట్టి మనమే ఒక చిన్న ఆఫీస్ ఆ టౌన్ లో తెరవాలి" అని తన తమ్ముడిని తీసుకొని.. "సరే ఈరోజు మీరు ఎంత చేస్తారో అంత చేసి వదిలేయండి, నేను మళ్ళీ వస్తా" అని చెప్పి, బండి స్టార్ట్ చేయమని చెప్పి ప్లేస్ లు బాగా చూసి ఒక చిన్న హోటల్ లాంటిది కనుక్కున్నాడు. అది ఎప్పటికీ పాడైపోయి ఉంటుంది. దాని పైన రాధాకృష్ణ ఇంటర్ లాక్ బ్రిక్స్ అని బోర్డు పెట్టి, దాన్ని క్లీన్ చేసి ఆఫీసులా తయారుచేసి, చుట్టుపక్కల ఉన్న బోర్డుల మీద ఈ షాప్ యొక్క ఆఫీస్ ఇక్కడే ఉందని అడ్రస్ రాయించి.. మెల్లమెల్లగా ఆ రూమ్ లో ఉండడం మొదలు పెట్టాడు.
ఒక రెండు మూడు వారాల తర్వాత ఒక వ్యక్తి వచ్చాడు. అతన్ని చూడగానే ఎక్కడ లేని సంతోషం.
"చెప్పండి సార్, ఏం కావాలి?" అని అంటే, "సార్ ఇక్కడ టీ షాప్.." అని అంటాడు.
"టీ షాపా?"
"అంటే నేను టీ షాప్ దగ్గర ఒక బ్యానర్ చూశాను, అందులో ఇలా ఉంది" అని అంటూ బ్యానర్ మీద ఉన్న రాధాకృష్ణ ఇంటర్ లాక్ బ్రిక్స్ అనే కంపెనీ నేమ్ గురించి అడిగాడు. "అది ఇక్కడే ఉంది సార్. మీ దగ్గర ఎటువంటి ఇటుకలు ఉన్నాయి, ఏ సైజు ఉన్నాయి?" అని అడగడం మొదలు పెట్టాడు.
"సారీ సార్, ఇక్కడ నేను ఇంకా ప్లేస్ చేయలేదు. కేవలం ఒక వారం అయింది, ఎవరూ రారని కొంచెం దిగులుగా ఉన్నాను. అప్పుడే మీరు వచ్చారు. కావాలంటే నేను ఒక పది నిమిషాలు ఇక్కడే కూర్చోండి, మా తమ్ముడి చేత అవి తెప్పిస్తాను ఏ ఏ సైజు కావాలో చెప్పండి" అని అంటే..
ఆ ముసలి వ్యక్తి, "అలా కాదు అబ్బాయి. ఇలా ఒక్కో సైజు కాదు, అవి ఒక పది పది సెట్లు అన్ని సైజుల్లో పది సెట్లు తెచ్చి ఇక్కడ గోడల దగ్గర పెట్టు. వచ్చిన వాళ్ళు దాన్ని చూసుకుంటారు, నచ్చిన వాళ్ళు ఆర్డర్ ఇచ్చి చేయించుకుంటారు" అని అంటుంటే..
"సూపర్ సార్! నాకు రాని ఐడియా మీకు వచ్చింది, మీరు చాలా గ్రేట్ సార్!" అని అంటూ పొగడడం మొదలుపెట్టి.. "సరే సార్ మీకు ఎన్ని కావాలి?" అని అంటే, "నాకు ఒక 500 కావాలి ప్రస్తుతానికి" అని చెప్పి వ్యాపారం మాట్లాడి వెళ్తుండగా..
"హలో సార్, మీకు ఒక చిన్న విషయం. ఇది నా ఐడెంటిటీ కార్డు లాంటిది. అంటే మీరు ఇప్పుడు మా దగ్గరికి వచ్చి ఈ ఇటుకలు తీసుకువెళ్తున్నారు కదా, ఒకవేళ మీరు వేరే వాళ్లకు చెప్పి వాళ్లకు ఇక్కడికి పంపించి వాళ్ళ చేత ఆర్డర్ చేయించినట్లైతే.. ఈసారి మీకు ఎప్పుడైనా అవసరమైనప్పుడు మీకు డిస్కౌంట్ మీద లేదంటే ఒక రివార్డ్ లాంటిది మీకు ఇస్తాం. ఇప్పుడు మీరు ఎంత తక్కువ తీసుకున్నా, రేపు ఎవరినైనా పంపించినప్పుడు మీకు డిస్కౌంట్ వస్తుంది మళ్ళీ కావాలంటే మీకు కొంచెం తక్కువ ప్రైజ్ కు గట్టిగానే ఇస్తాను" అని చెబుతాడు. దాన్ని సంతోషంగా తన జోబులో పెట్టుకొని, "సరే బాబు నేను ఇంకెవరినైనా పంపిస్తాను.. రివార్డు ముఖ్యం బిగులు" అని చిన్నగా నవ్వుతూ బయటికి వెళ్తాడు ముసలి వ్యక్తి.
అది చూసిన తర్వాత తనకు ఒకటి అర్థమైంది. 'నేను వేసిన ప్లాన్ బాగానే పనికొచ్చేలా ఉంది' అని అనుకుంటూ, ఆ ముసలి వ్యక్తి చెప్పిన సైజుల్లో పది పది ఒక్కో సైజులో పది ఇటుకలు తీసుకువచ్చి రూమ్ నిండా నింపి, అలాంటి ఐడెంటి కార్డులు ఒక 40 పీసులు చేయించి తన దగ్గర పెట్టుకున్నాడు.
చూశారుగా, ఫార్మాటింగ్ చేసిన తర్వాత కథలోని ఎమోషన్స్ ఎంత అద్భుతంగా అర్థమవుతున్నాయో!
తర్వాతి అడుగు: ఈ కథను ఇంకా ముందుకు కొనసాగించాలనుకుంటున్నారా? లేదా, ఈ కథలో ముఖ్యంగా రుద్ర బిజినెస్ ప్లాన్స్ ఎలా ఉన్నాయో మాతో చెప్పుడి?