The Endless - 7 in Telugu Mythological Stories by Ravi chendra Sunnkari books and stories PDF | అంతం కాదు - 7

Featured Books
Categories
Share

అంతం కాదు - 7

సలీం వెంటనే రుద్ర చెయ్యి పట్టుకుని ఏం జరిగిందో చూశాడు. రుద్ర తన జీవితం మొత్తం తన కళ్ల ముందు చూశాడు – తను ఎలా పుట్టాడు, తన జీవితంలో ఏం జరిగింది, చివరి క్షణంలో రుద్రను ఎవరు అటాక్ చేశారు, తన మెడలో ఉన్న లాకెట్ తన శరీరంలోకి చేరడంతో తను ఎలా మారాడు. తర్వాత ఏం జరిగింది, ఇక్కడికి ఎందుకు వచ్చాడు అన్నది అన్నీ అర్థమయ్యాయి.

రుద్ర ప్రశాంతంగా ఊపిరి పీల్చుకొని సలీంతో మాట్లాడటం మొదలుపెట్టాడు.

అదే సమయంలో, మరో పక్క నుంచి ఎవరో వేగంగా ఒక గది పైకప్పుపైకి దిగుతారు. అక్కడ సిరియస్ కంపెనీ యజమానిని కలుసుకున్నాడు, "నా సొంతం కావాలి," అని అంటున్న అతనితో డీల్ చేసుకుని, "సరే, ఇక నాకు టైం అయింది నేను వెళ్తాను," అని ఎంతో స్పీడ్‌గా వెళ్లిపోతాడు.

అదే సమయంలో, చిన్న క్రాస్ జరుగుతుంది. అక్షర వాళ్ల నాన్న ఘటోత్కచుడు మాట్లాడుతూ, "వచ్చావా? నీ అంతం ఇప్పుడే చూస్తాను," అని ఫైట్ చేయడానికి సిద్ధమవుతాడు. కానీ ఎర్రకళ్ల వ్యక్తి అసలు పట్టించుకోకుండా స్పీడ్‌గా అక్కడి నుంచి మాయమైపోతాడు. అతను మనసులో ఇలా అనుకుంటూ, "ఇతనికి మరోసారి వచ్చే అవకాశం ఉంటుంది అందుకే వదిలేశాడు," అని అనుకుంటూ ముందుకు సాగాడు, అక్కడ ఏం జరుగుతుందో అని.

మళ్లీ ఇక్కడ కట్ చేసి మాయా లోకంలో చూపిస్తారు. "చూడు బాబు, ఇది మాయా లోకం. దీని ప్రత్యేకత ఏంటో నీకు నేను చూపిస్తాను," అని అంటూ రుద్ర చెయ్యి పట్టుకొని పైకి తీసుకు వెళ్తాడు. మెల్లగా ఆకాశంలోకి వెళ్తారు. "ఇక చూడు," అని అంటూ చెయ్యి గట్టిగా పట్టుకొని మంత్రాలు చదువుతాడు. ఇక ఏమేమి జరిగిందన్నది మొత్తం చూపిస్తాను అని ముసలి సలీం అంటాడు.

"ఇది ఎంతో అద్భుతమైన కథ. ఇప్పుడు చూడు," అని అంటూ చూస్తుండగా ఇంకా అనుమంతులు వారి ప్రత్యక్షమవుతారు. లంకకు తగలబెట్టి మధ్యలో వెళుతూ ఉంటాడు. తన తోకకు చిన్నగా మంట రావడంతో అలా సముద్రంలోకి దూకుతాడు. అదే క్షణంలో ఆ తాకిడికి 26 వెంట్రుకలు ఊడిపోతాయి. అన్నీ నీళ్లల్లో పడిన వెంటనే ఒక గంట కట్టిన డైమండ్లు తయారవుతాయి. ఆ డైమండ్లు పడిన చోట 26 స్తంభాలు చేరుకుంటాయి. ఆ స్తంభాలే నగరాలుగా మారతాయి, ఇక్కడ ఉన్న జీవులకు...ఆ 26 స్తంభాలు నగరాలుగా మారిన తర్వాత, ఆ జీవులకు మాట్లాడే సామర్థ్యం, తెలివితేటలు అన్నీ వచ్చాయి. భూమి మీద ప్రజలు ఎలా విభజించబడ్డారో, ఇక్కడ కూడా అలాగే జరిగిందని, ఆ నగరాలు A నుండి Z వరకు వివిధ ప్రాంతాలుగా ఏర్పడ్డాయని సలీం కథను చూపిస్తూ ఉన్నాడు.

కొన్ని రోజుల తర్వాత, ఒక వ్యక్తి రాజుగా నిలబడతాడు. అతని కుటుంబంలో, ప్రతి తరానికి ఈ రాజ్యం వస్తూ ఉంటుంది. ఈ రాజ్యానికి దేవతల శక్తి లేదు, కానీ హనుమంతుడి శక్తి మాత్రం ఈ డైమండ్లకు ఉంది. దానివల్లే ఇది ఇంకా ప్రత్యేకంగా నిలిచింది.

అలా కొన్ని సంవత్సరాల తర్వాత, రాజు తన కుమారుడికి పట్టాభిషేకం చేయాలనుకున్నాడు. కానీ ఆ రాజుగారి కొడుకు బ్లాక్ మ్యాజిక్ నేర్చుకోవడం మొదలుపెట్టాడు. అందువల్ల ఇప్పుడు అతను రాజుగా మారే అవకాశం లేదు. దానికోసం రాజుగారు ఒక పెద్ద పూజ చేశారు. అందులో ఒక పూజారి ఇలా చెప్పాడు: "మీ కుటుంబంలో ఇక మీకు తప్ప ఎవరికీ రాజు అయ్యే అర్హత లేదు. మీకు అంతగా కావాలంటే ఒక పని చేయాలి. భూమి మీద నుంచి రుద్ర అని పేరుగల వ్యక్తి వస్తాడు. అతను మాత్రమే మీ కొడుకుని మార్చి రాజుగా చేయగలడు. లేదంటే మీ వంశం ఇంతటితో అంతమైపోతుంది," అని భయపెట్టాడు.

దానికోసం ఏం చేయాలి అని రాజు అడగ్గా, పూజారి ఇలా చెప్పాడు: "మీరు ఏదో ఒక నగరం నుంచి ఒక డైమండ్‌ను తీయాలి. దానిని భూమి మీదకి పంపాలి. ఆ తర్వాత కొన్ని సంవత్సరాలకు ఆ యువకుడు వచ్చి ఇక్కడ అన్నీ సరిచేసి వెళ్తాడు. అతడికి తన అనుకున్న వాళ్ల మీద తప్ప దేనిమీదా ఆశ లేదు."

అదే సమయంలో, ఎటునుంచో కొంతమంది సైంటిస్టులు ఆ లోకం దగ్గరికి వచ్చారు. బాంబులు పేల్చారు. "ఇదే సరైన సమయం," అని పూజారి చెప్పడంతో ఆ రాజు ఒక డైమండ్‌ని తీసి బయటికి విసిరాడు. అంతేకాకుండా వాళ్లకు కొన్ని విలువైన రాళ్లు, లిక్విడ్స్ కూడా దొరికాయి. అలా సీన్ కట్ అవుతుంది.

ఆ తర్వాత, రుద్ర వాళ్ల తాతయ్యకు ఆ డైమండ్ లాకెట్‌లో చిక్కుతుంది. అది తన మనవడికి ఇస్తాడు. ఇప్పుడు ఆ సమయం వచ్చింది, ఇక రుద్ర ఆ లోకానికి వచ్చాడు. ఇంతటితో కథ అయిపోతుంది.

కిందకి దిగిన తర్వాత వృద్ధ సలీం రుద్రతో ఇలా చెప్పడం మొదలుపెట్టాడు: "ఓకే రుద్ర, ఇప్పుడు నీకు అంతా తెలిసింది కాబట్టి నువ్వు ఏం చేయాలో నీకు తెలుసు. నువ్వే రాజుగా మారతావా లేదా రాజుగా మారుస్తావా అన్నది నీ చేతిలోనే ఉంటుంది. దానికంటే ముందు నువ్వు ఇక్కడ శిక్షణ తీసుకోవాలి. దానికోసం నువ్వు ధ్యానం చేయాలి, నీ శక్తిని నువ్వు తెలుసుకోవాలి."

వృద్ధ సలీం రుద్రతో ఇలా చెప్పడం మొదలుపెట్టాడు: "శక్తి ఏంటో తెలుసుకోవాలి. నీ భయం ఏంటి? నీ ఆలోచన ఏంటి? దానిని నువ్వు గెలవాలి. హనుమంతులకు ఎటువంటి భయం లేదు, కేవలం ఆరాధన మాత్రమే. అది రాముడిపైనే. నీకు కూడా అలాంటిది ఏదో ఉండాలి. ఏంటది? ఆలోచించు."

ఆలోచిస్తూ, "నాకు భయం అంటే..." అని రుద్ర ఒకసారిగా కళ్లు తిరుగుతున్నట్టు ఉండడంతో అలా కూర్చుండిపోయాడు. మెల్లగా తనకే తెలియకుండా ధ్యానంలోకి వెళ్ళాడు. "నాకు భయం లేదు," అని అనుకుంటూనే ధ్యానం చేస్తున్నాడు, కానీ ఏదో డిస్టర్బ్ చేస్తోంది. ఎవరు అరుస్తున్నారు? వెక్కిరిస్తున్నారు? ఇదే అతని భయం – ఏది చేసినా తననే తప్పు అంటారని భయం రుద్రకి. తల తిరుగుతుంది. ప్రశాంతంగా ధ్యానం చేయలేకపోతున్నాడు.

"నీ శక్తిని నువ్వే కనుక్కోవాలి. నీ శక్తిని కనుక్కోవాలంటే నీ భయం తొలగాలి. భయం తొలగిన తర్వాతే నువ్వు ఏదైనా చేయగలవు. కావాలంటే ప్రయత్నించు," అని చెప్పగా రుద్ర కళ్లు మూసుకుంటాడు. కానీ వింత వింత అరుపులు మళ్లీ అలాగే వినిపిస్తూ ఉన్నాయి. రుద్ర సక్రమంగా కూర్చుని ధ్యానం చేయలేకపోతున్నాడు.