పారిపోతుంది.ద జాంబి ఎంపరర్ (The Zombie Emperor)
రాంబాబు జ్ఞాపకాలు – ఫ్లాష్‌బ్యాక్ కొనసాగింపు
మరోసారి ఒక పెద్ద కేకతో ఆదిత్య గొంతు మారి మోగింది! అంతే! ఎక్కడెక్కడో ఉన్న జాంబీలు వందల కొద్దీ సైన్యంగా అక్కడికి చేరుకుంటున్నాయి. వాళ్ళ కళ్ళు ఇప్పుడు చూడడానికి ఎర్రటి వెలుగుతో మెరుస్తున్నాయి. ఆదిత్య అందరితో మాట్లాడుతూ ఇలా అన్నాడు:
"ఇక మనం మన శత్రువులైన మానవుల మీద దాడి చేయాలి! ముఖ్యంగా నా కుటుంబాన్ని వెతుక్కోవాలి. నా కుటుంబానికి ఒక ప్రత్యేకమైన ప్రపంచాన్ని సృష్టించాలి – అది మన జాంబీ ప్రపంచం అయి ఉండాలి! మన జాతి మాత్రమే భూమి మీద ఉండాలి. ఏ జాతి ఉండకూడదు!"
అంటూ తన సైన్యాన్ని ఒక్కొక్కరిగా బయటికి పంపించడం మొదలుపెట్టాడు.
వర్మ బంగ్లా – ప్రస్తుత సమయం
ఇప్పుడు ఉలిక్కిపడి లేస్తాడు వర్మ. అతని కళ్ళల్లో భయం. "వస్తున్నాడు... వస్తున్నాడు..." అని అనుకుంటూ ఉండగా తన కుటుంబ సభ్యులను ఒక చోటికి చేర్చాడు. కానీ అతనికి తెలీదు, ఇదే అతని ఆఖరి రోజు అని.
సుమంత్ ఇల్లు – సాయంత్రం
అక్కడ కట్ చేస్తే... సాయంత్రం సుమంత్ మరియు అక్షర ఇద్దరూ ఇంటికి వచ్చారు. అప్పుడే అక్షర చాలా బాధగా ఉంటుంది. "ఏమైందో అసలు?" అని సుమంత్ అడుగుతూ ఉంటే, ఒక పక్క నుంచి ఒక వ్యక్తి "పారిపోండి! పారిపోండి! మరణం రాబోతుంది!" అని అరుస్తున్నాడు. అతనిని చూసిన అక్షర మరింత బాధగా అక్కడి నుంచి వెళ్ళిపోతుంది.
"అసలు ఏమైంది?" అని సుమంత్ అడుగుతూ ఉండగానే అప్పుడే వచ్చిన మీనాక్షి ఇలా అంటుంది:
"తను ఎవరో కాదు... అక్షర వాళ్ళ నాన్న, అంటే మీ మామ! కానీ అతనికి ఇప్పుడు ఏమైందో ఎవరికీ తెలియదు. కొన్ని సంవత్సరాల క్రితం ఇక్కడికి వచ్చాడు. అప్పటి నుంచి ఇలాగే ఉన్నాడు. 'మరణం వస్తుంది, యోధుడు వస్తాడు, రక్షకుడు వస్తాడు, కానీ రక్షకుడు వచ్చేసరికి భూమి మిగలదు' అని విచిత్రంగా మాట్లాడుతున్నాడు!" అని అంటూ ఉంది మీనాక్షి.ఎపిసోడ్ 8: చీకటి పడుతున్న కుటుంబాలు
సుమంత్ ఇల్లు – సాయంత్రం
అక్షర బాధను చూసిన సుమంత్, ఆ రోజే తన పుట్టినరోజు కావడంతో, ఆమె కోసం ఒక పెద్ద సర్ప్రైజ్ ప్లాన్ చేశాడు. వారిద్దరూ మళ్లీ కలిసిపోయారు. వారిద్దరి మధ్య చాలా మంచి బంధం ఏర్పడింది.
రాముడి పూరి గుడిసె – అదే సమయంలో
అక్కడ కట్ చేస్తే... అక్షర వాళ్ళ నాన్న రాము ఒక పూరి గుడిసెలో ఒంటరిగా ఉన్నాడు. తను ఇలా అనుకుంటున్నాడు: "వాడు వస్తాడు అని అనిపించింది... మళ్ళీ విధ్వంసం మొదలైంది. అప్పుడు ఎలాగో తప్పించుకున్నాం, కానీ ఇప్పుడు మళ్ళీ యుద్ధం ప్రారంభమైతే ఎవరు ఆపుతారు? రక్షకుడు ఎప్పుడు వస్తాడు? ప్రాణం పోయాక?!"
వర్మ ప్యాలెస్ – అదే సమయంలో
ఇక ప్యాలెస్‌లో చూపిస్తారు వర్మ. తన చుట్టూ తన కుటుంబ సభ్యులు అందరూ ఉన్నారు. అందులో మూడు సీట్లు ఖాళీగా ఉన్నాయి. "ఒక్కొక్కటిగా తగ్గిపోతుంది... మొదటిగా నా కూతురు వెళ్ళిపోయింది. తర్వాత నా కొడుకు గుండె జబ్బుతో పేషెంట్‌లా ఎక్కడో ఉన్నాడు. ఇక నందవర్ధన్ అయితే మనకు అస్సలు చిక్కడు. ఇలాంటి గొర్రెల మందను నేను ఎలా కాపాడుకోవాలి? వాడు మళ్ళీ తిరిగి వస్తే ఎలా? అప్పుడైతే తప్పించాను, కానీ ఇప్పుడు తన కుటుంబం కోసం నిజంగానే వస్తే ఏం చేయాలి?" అని అనుకుంటున్నాడు.
"చూశారా! నేను గతంలో చేసిన చిన్న తప్పు ఇప్పుడు మన కుటుంబానికి పూర్తిగా శిక్ష వేయబోతుంది. మీలాంటి వాళ్ళను పెట్టుకొని నేను ఏం చేయాలి? నా మనవడు ఇప్పుడు నా దగ్గర లేడు..." అని నందవర్ధన్‌ను తలుచుకుంటున్నాడు.
మరో వర్మ విల్లా – రాత్రి
ఇక ఇక్కడ కట్ చేస్తే... మరోచోట, ఒక చిన్న ప్యాలెస్‌లో చూపిస్తారు – అది కూడా వర్మ విల్లానే, కాకపోతే వేరే చోట. అందులో వర్మ పీఏ ఉన్నాడు. పక్కన ఉన్న బెడ్‌పై జగదీష్, వర్మ కొడుకు, పడుకొని ఉన్నాడు. అతని చేతులు, కాళ్ళు పనిచేయని విధంగా ఉన్నాయి.
పీఏ ఫోన్ చేసి ఇలా అంటున్నాడు: "త్వరలోనే మనం ఈ జగదీష్ ఫ్యామిలీలోని వర్మ గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్ మొత్తం సామ్రాజ్యాన్ని మనం సొంతం చేసుకోబోతున్నాం. వీడు చచ్చిపోతే ఇక మనకు ఎటువంటి దిగులు ఉండదు. వీడి పేరు మీదే మొత్తం ఆస్తి ఉంది కాబట్టి, వీడి సంతకం ఒక్కటి చాలు మనం గెలవడానికి."
ఇదేదో తెలివైన పని చేశామని అనుకుంటూ, ఆ అబ్బాయిలు చప్పట్లు కొట్టుకుంటున్నారు. కానీ "చేసినదంతా మనమేనని, వీళ్ళ చేత చేయించామని తెలిస్తే ఏమైపోతారో!" అని పీఏ మనసులో అనుకుంటున్నాడు.
జగదీష్ వైపు చూస్తూ పీఏ ఇలా మాట్లాడుకుంటూ ఉన్నాడు: "నువ్వు నేను ప్రేమించిన అమ్మాయిని ఎవరికో ఇచ్చి పెళ్లి చేశావు. నిన్ను ఎలాగ వదిలేస్తాను రా! అందుకే నీ బావను చంపేశా. నీ చెల్లి జస్ట్ మిస్ అయింది" అని గట్టిగా మాట్లాడుకుంటూ ఉన్నాడు.
పడుకొని ఉన్న జగదీష్ చాలా తీవ్రంగా కోపంగా ఉన్నా ఏమి చేయలేకపోతున్నాడు. ఒక బుస మరియు గుర్రుమంటున్న శబ్దం – ఈ రెండు తప్ప ఇంకేమీ రావడం లేదు అతని నుంచి.అప్పుడే మళ్ళీ ఐలాండ్‌లో చూపిస్తారు. ఆదిత్య దగ్గర ఉన్న జాంబీ సైనికులు రక్తంతో కూడిన ఒక భవనాన్ని సృష్టించడం మొదలుపెట్టారు. ఆ ఆరుగురి రక్తంతో సిమెంటులా, వాళ్ళ చర్మం, కండలు, రాళ్ళుగా ఒక్కదాని మీద ఒకటి పేర్చి ఒక చిన్న భవనాన్ని నిర్మిస్తున్నారు. ఆదిత్య వేగంగా పరిగెత్తడం మొదలుపెట్టాడు. ఒక్కసారిగా గాలిలోకి ఎగిరి, స్పీడ్‌గా కదులుతూ ఎక్కడికో వెళ్తున్నాడు.
ప్రభాకర్ విల్లా – రాత్రి
అక్కడ కట్ చేస్తే... ఇప్పుడు పీఏ ప్రభాకర్ ఉన్న ప్రదేశంలో చూపిస్తారు. అతను మందు తాగుతూ, వికృతంగా నవ్వుతూ ఇలా అంటున్నాడు:
"నా ప్రేమను ధ్వంసం చేసిన జగదీష్! నీ ప్రాణాలు తీయకుండా వదిలేస్తానా? నరకం అంటే చూశావు, అంతకుమించి చూపిస్తా!"ఇప్పుడు ఆ భవనం ఒక్కసారిగా షేక్ అవుతుంది. దూరం నుంచి ఒక్క తోపుతో ఆ భవనంలోకి వచ్చాడు ఆదిత్య. పీఏ ప్రభాకర్ మాటలు వింటున్నాడు. అతనికి అర్థమవుతుంది.
పీఏ ప్రభాకర్ ఇంకా మాట్లాడుతూ, "మీ బావని ఎవరు చంపారు అనుకున్నావు? చెప్పాను కదా, నేనే! అతనిని కూడా తెలుసు. కానీ అతను ఏం చేస్తాడు? పందుల్ని వేటాడినట్టు కాదు కదా, నన్ను వేటాడడం అంటే?" అని గట్టిగా నవ్వుతూ ఉన్నాడు.
ఆదిత్య కోపంతో ఒక్కసారిగా జగదీష్ శరీరంలోకి వెళ్ళిపోయాడు! అంతే, జగదీష్ ఒక్క అడుగు పైకి లేచి మంచం మీద ఎగిరి పడ్డాడు. ఏం జరిగిందని ప్రభాకర్ వెనక్కి తిరిగి చూస్తుండగానే, జగదీష్ మెల్లగా పైకి లేస్తున్నాడు. అతని నరాలు, ఎముకలు మహాభావనంగా, కళ్ళ రంగు అన్నీ ఒక్కొక్కటిగా టిక్ టిక్ టిక్ టిక్ టిక్ టిక్ అంటూ ఎముకలు సెట్ అవుతూ, కళ్ళు ఎర్రగా మారుతూ నిలబడ్డాడు!
ఆ దెబ్బకు ఉలిక్కిపడిన ప్రభాకర్, "హలో సార్! ఏమైంది మీకు?" అంటూ నాటకాలు వేస్తూ దగ్గరికి వస్తున్నాడు. కానీ ఆదిత్య క్రూరంగా నవ్వుతూ, "నాటకాలు వేస్తున్నావా? నీ నాటకాలు ఎప్పుడో చూశాను!" అంటూ ఒక్క జంప్‌లో కిందకు దూకాడు. ప్రభాకర్ పరిగెత్తడం మొదలుపెట్టాడు.
కానీ ఒక్క నిమిషంలో ఆదిత్య ఒక అడుగు వేసి అతని మెడ పట్టుకొని తన చేతిని పూర్తిగా తనవైపుకు తిప్పుకున్నాడు. ప్రభాకర్ మొహంలో భయం! "ఏం జరుగుతుంది? నువ్వు ఎలా లేచావు?" అని అడుగుతూ ఉండగానే, ఆదిత్య "రేయ్ దుర్మార్గుడా! నీ పాపాలకు, ఈ మానవ ప్రపంచానికి మొదటి అంతానికి నువ్వే కారణమవుతావ్ రా!" అంటూ అతనిని పైకి లేపాడు. క్రూరంగా నవ్వుతూ ఉన్నాడు ఆదిత్య. అంతకంటే క్రూరంగా ఏడుస్తూ, గట్టిగా అరుస్తూ ఉన్నాడు ప్రభాకర్. ఆ బాధను చూస్తున్న ఆదిత్య ఇంకా క్రూరంగా గట్టిగా నొక్కడం మొదలు పెట్టాడు. ఒక్క నిమిషంలో ఆదిత్య గోళ్ళు పెద్దగా అవుతూ ప్రభాకర్ మెడలో కూరుకుపోయాయి. ప్రభాకర్ మెడ నుంచి, ఆదిత్య గోర్ల నుంచి ప్రభాకర్ శరీరంలో నుంచి రక్తం పీల్చుకుంటున్నాడు.