వర్మ భవనం – మరుసటి రోజులు
మరుసటి రోజు నుంచి వర్మ మీనాక్షిని బయటికి రానివ్వడం ఆపేసాడు. "ఇక రెండు రోజులు మాత్రమే నువ్వు ఇక్కడే ఉండాలి!" అని అంటూ ఆమెను గదిలో బంధించాడు.
అదంతా చూస్తున్న జగదీష్ మనిషిలో ఏదో తలుక్కుని మెరిసినట్టు అనిపించింది. వెంటనే "ఏంటమ్మా! ఏం జరిగింది?" అని అంటూ ఉన్నాడు. జరిగిందంతా చెప్పిన తర్వాత జగదీష్ ఇలా అంటున్నాడు: "చూడమ్మా, నాన్న పరువు తీయడం మన తప్పు. కావాలంటే నీకు నచ్చిన వాడిని మన సిటీలోనే ఉన్న కొందరిని చూసి పెళ్లి చేస్తాం. అంతే కానీ, ఇతరులతో మాట్లాడకు!" అని అంటున్నాడు.
అదంతా బయట నుంచి వింటున్న వర్మ 'నా కొడుకు!' అని అనుకుంటూ లోపలికి వెళ్లిపోతాడు.వర్మ భవనం – ఉదయం (కొనసాగింపు)
తన నాన్న మాటలు వింటూ జగదీష్ ఆనందపడిపోతూ ఉన్నాడు. అలా కట్ చేస్తే, మరుసటి రోజు ఉదయం ఏం చేయాలో ఆలోచిస్తూ ఉన్నారు.
ఉదయం కాఫీ తాగుతూ ఉన్నారు తండ్రీకొడుకులు.
జగదీష్: "నాన్న, ఎందుకని నువ్వు నా చెల్లిని ఎందుకు అలా బాధ పెడుతున్నావ్? మనం నా చెల్లిని ఎంతలా చూసుకున్నామో తెలుసు కదా? తను గాజు బొమ్మలా పెరిగింది. ఇప్పుడు నువ్వు ఆ బొమ్మకు బొక్క పెట్టి, తనని నీళ్ళ కుండలా మార్చావు. తన కంటి నుంచి నీళ్ళు వస్తున్నాయి! నీకు అర్థమవుతుందా?"
వర్మ: "చూడరా, నేను పెట్టింది చిన్న చిన్న రంధ్రమే! అది కేవలం తనని తాను నిరూపించుకోవడానికి. ఒక కొండకు చిన్న రంధ్రాన్ని లేదా ఏదో ఒక చిన్న రంధ్రాన్ని ఏర్పరిచినప్పుడు నీళ్లు కారి కారి తన శక్తిని గుర్తు చేసుకుని, చిన్న రంధ్రాన్ని పూడ్చుకుంటుంది. అలాగే, ఈ ప్రేమ అనేది ఒక చిన్న రంధ్రం. దానికి నేను ఇంకొంచెం చిన్న రంధ్రాన్ని ఇచ్చాను. ఆ ప్రేమ అనే కన్నీరు కారి కారి, ఆ ప్రేమే తనని గట్టిగా మారుస్తుంది. అప్పుడు తను తన గతాన్ని మరిచిపోయి, భవిష్యత్తు గురించి ఆలోచిస్తుంది!" అని చెబుతాడు.ర్మ భవనం – రాత్రి
ఆ రోజు పొద్దున్నుంచి సాయంత్రం దాకా ఆలోచించిన జగదీష్, పండు వెన్నెలలో తన నాన్నను ఇలా అడుగుతాడు: "అవును నాన్న, ఒకవేళ చెల్లి అతడితో వెళ్ళిపోతే ఏం చేస్తావ్?"
వర్మ తాగుతున్న మందు గ్లాసును పట్టుకుని పగలగొట్టి, ఆవేశంగా ఇలా అన్నాడు: "నా పరువు తీసిన దాన్ని నేను బ్రతకనిస్తానా? చంపడానికైనా, చావడానికైనా వెనుకాడను! ఈ ఆస్తంతా మీ అందరి పైన రుద్దకుండా తనపైనే ఎందుకురా రాశాను? తను నాకు పరువును, గౌరవాన్ని కాపాడుతుందని! అలాంటిది ఎందుకు పనికిరాని అతడితో వెళ్ళిపోతే, తన దారిని తను చూసుకుంటే... ఈ ఆస్తి అతనికి వెళ్ళిపోతుంది! అంత పెద్ద ప్రయత్నం చేసింది అంటే, నేను తనని వదలను! తన ఆస్తిని మొత్తం నీ పేరుపై రాసి పడేస్తాను! అంతేకానీ అతనికి ఒక్క రూపాయి కూడా దక్కనివ్వను!"
వర్మ ఆదిత్య గురించి మాట్లాడుతున్నాడు.వర్మ భవనం – రాత్రి (కొనసాగింపు)
తన మనసులో జగదీష్ ఇలా అనుకుంటూ ఇంకో చిన్న ఐడియా వేసి, "నా చెల్లి ఆనందంగా ఉంటే నాకు ఇంకేం కావాలి?" అని అనుకుంటూ, "సరే నాన్న, నేను ఒక చిన్న సజెషన్ ఇస్తాను. అది నీకు నచ్చితేనే చెయ్యి!" అన్నాడు.
"ఒకవేళ చెప్పేది విన్నావా?" అని సీరియస్‌గా చూస్తున్న వర్మను కొంచెం కూల్ చేస్తూ, జగదీష్ ఇలా అన్నాడు: "అదే... ఇప్పుడు ఆ ఆదిత్య గాడు ఉన్నాడు కదా, అతను ఎంత శక్తివంతుడో, ఎంత తెలివైనవాడో మనం పరీక్షిద్దాం! నీకు నచ్చితేనే అతన్ని నీకు అల్లుడుగా, నాకు బావగా తెచ్చుకుందాం, సరేనా? ఇప్పుడు మన కంపెనీలో చిన్న ఉద్యోగం ఇద్దాం అతనికి. అతని పనితీరు చూస్తే మనకు అర్థమవుతుంది... ఎలాంటి వాడు? మన పరువును నిలబెట్టగలడా, తీసేయగలడా అని!" అని చిన్నగా చెప్పడం మొదలుపెట్టాడు.
వర్మ గట్టిగా "నీకు నీ చెల్లికి ఆదిత్య పైన అంత ప్రేమ ఉంది! ఇద్దరూ వెళ్ళిపోండి! నా పక్కన ఉండకు!" అని దొబ్బుతాడు. జగదీష్ చిన్నగా కింద పడినట్టుగా మళ్ళీ లేచి, "లేదు నాన్న, చెప్పేది విను నాన్న!" అని అంటూ ఉన్నా కానీ వర్మ వినడం లేదు. బాటిల్ తీసుకుని పక్కకు వెళ్ళిపోయాడు.
జగదీష్ మనసులో చాలా బాధగా ఉంది. 'నేను ఏదైనా చేయకపోతే బాధతో చెల్లి చనిపోతుంది, లేదా ఏదైనా చేస్తే నాన్న వీళ్ళిద్దరిని ఏదో ఒకటి చేస్తాడు. ఎవరికి కనిపించకుండా ఏదో ఒకటి చేయాలి' అని అనుకుంటూ ఎవరికో ఫోన్ చేయడం మొదలుపెడతాడు.
రాముకు ఫోన్ చేస్తాడు.
జగదీష్ (ఫోన్‌లో): "రాము! నీ దగ్గర ఆదిత్య ఉన్నాడా? అర్జెంట్ మేటర్!"జగదీష్ రాముకు ఫోన్ చేసి, "రాము! నీ దగ్గర ఆదిత్య ఉన్నాడా? అర్జెంట్ మేటర్!" అని అడగ్గానే, వెంటనే అదే టైంలో ఆదిత్య ఫోన్ లిఫ్ట్ చేసి, "ఆ... చెప్పండి సార్!" అని అన్నాడు.
జగదీష్: "ఆదిత్య, నీ గురించి మా ఇంట్లో తెలిసిపోయింది. చెల్లిని రూమ్‌లో పెట్టేశారు. మీ పెళ్లికి ఒప్పుకోనంటున్నాడు మా నాన్న. కాబట్టి మీ ఇద్దరికీ రేపే పెళ్లి చేస్తాను! మీరు ఆ ఊర్లోనే, రాము వాళ్ళ ఇంట్లోనే ఉండండి. మీరు ఊరెంత తిరిగినా పరవాలేదు. మేము వచ్చినప్పుడు మాత్రం కొంచెం సైలెంట్‌గా ఉండండి. ఊరి ప్రజలను నేను చూసుకుంటా. నేను చెప్పింది శాసనం వాళ్ళకు. లేదంటే ఏం చేస్తానో వాళ్ళకు తెలుసు!"
రాంబాబు జ్ఞాపకాలు – ఫ్లాష్‌బ్యాక్ – రంగనాధపురం – మరుసటి రోజు ఉదయం
అక్కడ సీన్ కట్ చేస్తే పొద్దున్నే చూపిస్తారు. పొద్దున్నే వర్మ ముంబైకి వెళ్ళిపోతాడు. అతనికి డైమండ్ వ్యాపారం ఉంది, దాని కోసం వెళ్ళిపోయాడు. ఇప్పుడు అదే మంచి టైం అని భావించిన జగదీష్, చెల్లి మీనాక్షిని తీసుకొని గుడి దగ్గరికి వెళ్ళాడు. ఆదిత్యకు మరియు మీనాక్షికి పెళ్లి చేసేస్తాడు.
అప్పుడు మీనాక్షి వాయిస్ ఓవర్ వినిపిస్తుంది: "మా అన్నయ్య చాలా మంచివాడు అనుకున్నాను... కానీ చివరికి..." అంటూ ఆపేస్తుంది.
వర్మ ప్యాలెస్ – ప్రస్తుత సమయం (కొనసాగింపు)
ఇప్పుడు ఆదిత్య వైపు వెళ్ళిపోతుంది కథ. ఆదిత్య వర్మ గొంతు పట్టుకొని, "ఈ... ఈ సంగతి తెలిసిన తర్వాత నువ్వు చేసిన తరువాత నీ కొడుకు కోసం ఎంత ప్రయత్నించి చివరికి నా కుటుంబాన్ని, నన్ను దూరం చేశావు!" అని అంటూ గట్టిగా పట్టుకొని, ఊపిరాడని వర్మను కిందికి దించి, మళ్ళీ పైకెత్తాడురాంబాబు జ్ఞాపకాలు – ఫ్లాష్‌బ్యాక్ – రంగనాధపురం – పెళ్లి జరిగిన రాత్రి
ఆరోజు రాత్రికి తన ఇంటికి వచ్చేసాడు జగదీష్. తన నాన్న వస్తే ఏం చేయాలో అని ఆలోచిస్తూ మందు తాగుతున్నాడు. మందు తాగుతూ అతనిలోని నిజం బయటికి వస్తుంది. అతడు పూర్తిగా మందు తాగి, మందు మత్తులో ఇలా అనుకుంటున్నాడు:
"ఏంటే మీనాక్షి! నేను నీకంటే పెద్దవాడిని అయ్యుండి, నా డబ్బు నాకు ఇవ్వకుండా నీ పేరున రాస్తే నేను ఒప్పుకుంటానా? ఇప్పుడు ఒకే ఒక్క షాట్ అంతే! నీకూ నాకూ అంతం కథం! ఇక నా ఆస్తి నాది! నీ బాధలు నీవి. నాన్న నీ మీద పూర్తిగా పగబట్టేస్తాడు!" అని గట్టిగా నవ్వుతున్నాడు.
అంతటితో ఆగకుండా, "అంటే 'అన్నా నువ్వు ఎంత మంచివాడివి రా' అని కౌగిలించుకుంటావా? మీ అన్న వర్మ కుమారుడే, నీలాగా పసివాడు అయితే కాదు!" అని మీనాక్షి ఫోటోను తీసి, "ఇప్పుడు ఆస్తి మొత్తం నాది! మీ గొడవలు నీవి! ఇక నా ఆస్తితో నా శరీరం బాగా అయిపోతుంది! కావాలంటే ఎంత మందినైనా చంపేయొచ్చు! నేను బ్రతకడానికి ఎంత మంది అయినా చచ్చిపోవచ్చు!" అని మత్తుగా తాగుతూ, ఊగుతూ అలా మేడ మీదనే పడుకుంటాడు.
"ఇక నాన్న రాగానే... అమ్మాయి! ఇప్పటిలా నాన్నను మోసం చేసింది! నాలుగు కన్నీటి బొట్లు చల్లిస్తే చాలు... నీ పేరు మీద ఉన్న ఆస్తి నాది!"రాంబాబు జ్ఞాపకాలు – ఫ్లాష్‌బ్యాక్ – రంగనాధపురం – పెళ్లి జరిగిన మరుసటి రోజు
అనుకున్నట్టుగానే, పొద్దున్నే వర్మ ఇంటికి వచ్చాడు. వెంటనే జగదీష్ ఏడుస్తూ, "నాన్న! అది మనల్ని మోసం చేసింది! నిజంగా నేను అలాంటిది అని అనుకోలేదు. ఒక బిచ్చగాడితో లేచిపోయింది!" అని అంటూ ఉంటాడు.
అదంతా వింటూ ఉన్న వర్మ మొహంలో రంగులు మారిపోయాయి. "ఎంత ధైర్యం దానికి! ఇక దానికి నాకు అసలు సంబంధం లేదు! అసలు ఈ డబ్బు ఎవరికీ రానివ్వను!" అని అంటూ, అప్పుడే బాధగా కూర్చుని ఏడుస్తూ ఉన్న జగదీష్‌ను చూసి, "అంతా నా కొడుక్కి! నా మాట కాదని లేదు. ఎప్పుడూ నన్ను కాదనే లేదు!" అని అంటూ బాండ్ పేపర్స్, మిగతా డాక్యుమెంట్స్ అన్నీ తీసుకువచ్చి, ఎవరికి ఒక్క రూపాయి కూడా ఇవ్వకుండా జగదీష్‌కే ఇచ్చాడు.