ఎపిసోడ్ 7
ఆరోజంతా అఖిరా, వైభవ్ అభయ్ ని ఏం చేస్తాడో అని ఆలోచిస్తూ దిగులుపడుతూ గడిపేసింది.
మరుసటి రోజు హడావుడిగా కాలేజ్‌కు రెడీ అవుతోంది. పిన్నీ కిచెన్ నుంచి,
“టిఫిన్ రెడీ అయింది అఖిరా… కాస్త తిని వెళ్ళు,” అని పిలిచింది.
“టైం లేదు పిన్నీ… నేను క్యాంటీన్‌లో తింటాను,” అంటూ అఖిరా తొందరగా బయలుదేరింది.
కాలేజ్‌కి రాగానే —
“అభయ్ ఎక్కడ?”
అని క్లాస్‌రూమ్స్, క్యాంటీన్ అన్నీ వెతుకుతూ చివరికి ఆడిటోరియం దగ్గర నిలబడి అటు ఇటు చూస్తోంది.
తన కళ్లలో అభయ్‌ని చూడాలనే తపన.
మనసులో — అతనికి ఏమైపోతుందో అన్న భయం.
ఆ లోపలి వణుకు ఆమెను ఇంకా ఆరాటపెడుతోంది.
అప్పుడే వెనకనుంచి ఒక గొంతు —
“Excuse me…”
ఒకరు ఆమె భుజంపై చెయ్యి పెట్టి పిలిచారు.
అఖిరా గుండె ఒక్కసారిగా బలంగా కొట్టుకుంది.
పెదవులపై తెలియని చిరునవ్వు,
కళ్లలో తెలియని ఆనందం.
తిరిగి చూసింది…
అభయ్.
ఒక్క క్షణం అలా నిలిచిపోయింది.
అభయ్ చిరునవ్వుతో,
“Hello… అఖిరా కదా?” అని అడిగాడు.
అఖిరా కళ్ళల్లో ఆనందం.
“హా… నేనే… నేనే అఖిరా,” అని తడబడుతూ చెప్పింది.
“Cool… HOD మిమ్మల్ని స్టాఫ్ రూమ్‌కి రమ్మన్నారు. ఏదో వర్క్ ఉందట.”
“Okay… I will go now,” అని అఖిరా ఇంకా అదే చిరునవ్వుతో చెప్పింది.
అభయ్ వెళ్లబోతుంటే,
“Nice to meet you,” అంటూ చేతిని ముందుకు చాపింది.
అభయ్ కాస్త ఆశ్చర్యంగా,
“Same here,” అని షేక్ హ్యాండ్ ఇచ్చి వెళ్లిపోయాడు.
అఖిరా రెండు అడుగులు వేసి, మళ్లీ వెనక్కి తిరిగి —
“అభయ్…” అని ప్రేమగా పిలిచింది.
“Are you okay?” అని మెల్లగా అడిగింది.
ఆమె కళ్లలో ప్రేమ.
అభయ్ చిరునవ్వుతో,
“Yeah… I’m fine,” అని చెప్పి వెనక్కి చూడకుండా వెళ్లిపోయాడు.
అఖిరా తన చేతిని చూస్తూ,
ఆ మొదటి స్పర్శను మళ్లీ మళ్లీ గుర్తు చేసుకుంటూ ఆనందంగా నడుస్తోంది.
ఆ క్షణంలో ఆమె మనసులో ఒక విచిత్రమైన భయం కూడా కదిలింది. వైభవ్ మాటలు, అతని చూపు, అతని హెచ్చరిక—all ఒకేసారి గుర్తొచ్చాయి. కానీ అభయ్ నవ్వు, అతని స్పర్శ, ఆ చిన్న క్షణం… ఆ భయాన్ని కాస్త వెనక్కి నెట్టేసింది.
క్లాస్ అయిపోయాక, సత్య – అఖిరా క్యాంటీన్‌లో కూర్చున్నారు.
అఖిరా మళ్లీ అభయ్ కోసం అటూ ఇటూ చూస్తోంది.
“ఎవర్ని ఇంతగా వెతుకుతున్నావ్?” అని సత్య అడిగింది.
“ఇంకెవర్ని… అభయ్‌నే,” అని నవ్వింది.
అఖిరా – “నీకు ఒక విషయం చెప్పడం మర్చిపోయాను.
నిన్న వైభవ్ ఇంటికి వచ్చాడు.”
“వైభవ్?” అని సత్య షాక్ అయింది.
“ఆ రోజు ఈవెంట్‌లో, ఆఫీసులో ప్రపోజ్ చేశాడు అని చెప్పాను కదా వాడే.”
సత్య – “అసలు వాడు నీ వెనకాల ఎందుకు పడ్తున్నాడు?” అని కాస్త కోపం తో అన్నది.
అఖిరా – “నిన్న మళ్లీ, ‘నువ్వు నాకు నచ్చావు’ అన్నాడు…”
సత్య – “నువ్వు ఏమని చెప్పావు?” అని అడిగింది.
అఖిరా – “నేనేమీ అంటాను… ‘I don’t love you, get out’ అని చెప్పేశాను. కానీ అతనికి అభయ్ గురించి ఎలా తెలుసో నాకు అర్థం కావడం లేదు.
నెన్న ఎలా చెప్పాడు తెలుసా? ‘అభయ్ కదా… వాడి సంగతి నేను చూసుకుంటాను’ అన్నాడు…”
“అదేంటీ!” అని సత్య.
“అసలు వాడు ఏమి చేస్తాడో అనే కంగారులోనే…
నిన్న రాత్రంతా నిద్ర పట్టలేదు.
ఈ రోజు అభయ్‌ని చూసాకే ప్రాణం వచ్చినట్టు అనిపించింది,” అని చెప్పింది.
సత్య – “మనము ఏదో ఒకటి చేయాలి. వైభవ్‌కి ఫుల్‌స్టాప్ పెట్టాలి,” అని అంటుంది.
అంతలో అఖిరా ఫోన్ మోగింది. “పిన్నీ!” అని చూసి తీసింది.
“హలో… చెప్పు పిన్నీ, ఏమైంది?” అని అఖిరా అడిగింది.
పిన్నీ ప్రేమగా,
“ఏదైనా జరిగితేనే నీకు కాల్ చేయాలా? ఎందుకు నీ వాయిస్ అంత డల్‌గా ఉంది?” అని అడిగింది.
“ఏం లేదు పిన్నీ… చెప్పు, ఏమిటి?” అని అఖిరా మళ్లీ అడిగింది.
పిన్నీ ఆనందంగా నవ్వుతూ,
“త్వరగా ఇంటికి రా… నీకో సర్‌ప్రైజ్ ఉంది,” అని చెప్పింది.
“సర్‌ప్రైజ్ ఆ? ఇప్పటికే నా జీవితం సస్పెన్స్ ట్రాక్‌లో నడుస్తోంది పిన్నీ… ఇప్పుడు సర్‌ప్రైజ్ ఎందుకు?” అని కాస్త నవ్వుతూ వేటకారంగా అంది.
“పిన్నీ, ఎంటే అదోలా మాట్లాడుతున్నావ్?
ముందు ఇంటికి రా… అప్పుడు తెలుస్తుంది,” అని పిన్నీ చెప్పింది.
“సరే, వస్తాను,” అని అఖిరా చెప్పి ఫోన్ పడేసింది.
“ఏమంటుంది పిన్నీ?” అని సత్య అడిగింది.
సత్య ఏమంటోంది పిన్నీ అని ఆశ్చర్యంగా అడిగింది.
అఖిరా – “ఏదో సర్‌ప్రైజ్ ఉందంటూ త్వరగా ఇంటికి రమ్మంటోంది… దేవుడా… ఇంకేమి చూడాలో,” అని అఖిరా ఊపిరి తీసుకుంది.
“ఎందుకు టెన్షన్ పడతావ్? వెళ్లి చూడు,” అని సత్య చెప్పింది.
“సరే, నేను వెళ్తాను. మనం లైబ్రరీకి రేపు వెళ్దాం.
రేపు కలుద్దాం. ఈవెనింగ్ నీకు కాల్ చేస్తాను,” అని అఖిరా అంది.
“సరే సరే, కాల్ చేయి. బై,” అని సత్య అంది.
అఖిరా నువ్వు నాతో రావచ్చు కదా అని అడిగింది.
సత్య ఎందుకు తల్లి నేను ప్రశాంతంగా ఉండటం నీకు ఇష్టం లేదా అని చేతులు దణ్డం పెడుతూ చెప్తోంది.
అఖిరా ఏంటె అలా అంటావు పిన్ని ని చేసినట్టు ఉంటుంది కదా అని అంటుండగానే...
సత్య - పిన్ని ని నేను ఇంకోసారి కలుస్తాను లే.. నువ్వు వెళ్లు అని చెప్పింది..
అఖిరా - కాస్త కోపం చూపిస్తూ సరే వెళ్తున్నాను లే...
“బై,” అని అఖిరా చెప్పి బ్యాగ్ ప్యాక్ చేసుకుని బయలుదేరింది.
-----
ముందుకు కొనసాగుతుంది…
-----