ఎపిసోడ్ 8
కాలేజ్ నుంచి ఇంటికి వస్తూ అఖిరా మనసంతా ఒక్కటే ఆలోచన.
వైభవ్ మాటలు, అభయ్ ముఖం, సత్యతో చేసిన సంభాషణ… అన్నీ కలిసిపోయి తల బరువెక్కినట్టు అనిపిస్తోంది.
బస్‌లో కూర్చుని కిటికీ బయట చూస్తున్నా ఏమీ కనిపించడం లేదు.
మనసులో మాత్రం అభయ్ పేరు మాత్రమే తిరుగుతోంది.
ఈ సర్‌ప్రైజ్ ఏంటో తెలియదు కానీ, ఎందుకో తెలియని ఒక టెన్షన్ కూడా తోడైంది.
అఖిరా ఇంటి తలుపు తెరిచిన క్షణమే లోపల నుంచి పిన్నీ ఉత్సాహంగా—
“అఖిరా… వచ్చావా? రా రా…” అని పిలిచింది.
అఖిరా బ్యాగ్ పక్కన పెట్టి, “ఏమైంది పిన్నీ అంత హడావుడి?” అంటూ లోపలకి అడుగుపెట్టింది.
హాల్ లోకి వెళ్లగానే ఒక్కసారిగా అడుగులు ఆగిపోయాయి.
సోఫాలో కూర్చుని ఉన్నాడు — వైభవ్.
అఖిరా ముఖం రంగు మారిపోయింది.
“వీడు ఇక్కడ ఏం చేస్తున్నాడు?” అన్న ప్రశ్న కళ్లలోనే కనిపించింది.
పిన్నీ చిరునవ్వుతో, తన చెవులు దెగ్గర వచ్చి ఏంటి షాక్ అయ్యవా ఇదే surprise వైభవ్, నీ పెళ్లి సంబంధం గురించి మాట్లాడడానికి వచ్చాడు అనగానే అఖిరా కళ్ళల్లో కోపం కనిపించింది.
అఖిరా పిన్నీ వైపు చూసి, “పిన్నీ… నాతో ఒక్క నిమిషం రా,” అని లోపల గదివైపు నడిచింది.
పిన్నీ వెనకే వెళ్లింది.
“పిన్నీ, నువ్వు ఎందుకు అతన్ని లోపలకి రానిచ్చావు?” అని అఖిరా కాస్త ఆవేశంగా అడిగింది.
పిన్నీ ఆశ్చర్యంగా, “ఏంటే అలా అంటున్నావు అతను నీకు బాగా తెలుసు కదా". నిన్ను ప్రేమించాను అన్నాడు అందుకే లోపలికి రమ్మన్నాను.
అఖిరా కు కోపం ఇంకా పెరిగింది. అసలు నేను చెప్పానా ఎప్పుడైనా అతన్ని ప్రేమిస్తున్నానని అంటుంది ఇంతలోనే వైభవ్ తలుపు తిట్టాడు పిన్ని ని చూసి యాంటీ అఖిరా తో నేను మాట్లాడుతాను మీరు వెళ్లండి అన్నాడు అఖిరా పిన్ని ని ఇంకా కోపం గా చేస్తుంది.
పిన్ని వెళ్ళిపోయింది.
అఖిరా చేతులు మడిచి నిలబడింది.
“హాయ్ అఖిరా…” అని వైభవ్ అన్నాడు.
అఖిరా మొహం మీద ఎలాంటి భావం లేదు.
“చెప్పాల్సింది చెప్పి వెళ్లిపో. నాకు టైం లేదు.” అని చెప్పింది.
వైభవ్ - నా ప్రేమ నీకు ఎప్పుడు అర్థం అవుతుంది అఖిరా. నేను నిజంగానే నిన్ను ప్రేమించాను. నేను ఎందుకు నీకు నచ్చలేదు అని అడిగాడు.
అఖిరా ఎందుకంటే నేను అభయ్ ని ప్రేమిస్తున్నాను కాబట్టి అతన్ని మాత్రమే ప్రేమిస్తున్నాను కాబట్టి. నీకు నా మీద ఉన్నది ప్రేమ కాదు నన్ను పొందాలి అనే స్వార్థం. నేను నా మనసును ఎప్పుడో అభయ్ కి ఇచ్చేశాను. నేను నా మనసు మార్చుకొను అని కోపంగా గట్టిగా అరిచింది.
వైభవ్ చిరు నవ్వు చూపిస్తూ.. అబ్బా ఎంత ప్రేమ... ఎంత ప్రేమ...
సరే అఖిరా నేను వెళ్తున్నాను ఇంక నీకు కనిపించను అని చెప్పి నాలుగు అడుగులు ముందుకు వేసి మనం ఇక పెళ్లి పీటల మీద కలుద్దాం ఇక నిన్ను పెళ్లి కూతురు గానే చూస్తాను సరే నా... అని నవ్వుతూ వెళ్లిపోయాడు..
అఖిరా కి ఇంకా కోపం పెరిగింది. తన చుట్టూ ఉన్న వస్తువులను కింద కోపం తో పడేసి కళ్లకు చేతులు పట్టి కూర్చుంది.
వైభవ్ వెళ్లిపోయిన తర్వాత గది ఒక్కసారిగా ఖాళీగా అనిపించింది.
అఖిరా మంచం మీద కూర్చుని గోడ వైపు చూస్తూ ఉండిపోయింది.
ఇంతసేపు ఉన్న కోపం కాస్త తగ్గి, లోపల ఏదో విచిత్రమైన ఫీలింగ్.
వైభవ్ అన్న మాటలు మళ్లీ మళ్లీ గుర్తొస్తున్నాయి.
“పెళ్లి పీటల మీద కలుద్దాం…”
అసలు ఎందుకు అలా అన్నాడు?
తను అభయ్‌ని ప్రేమిస్తున్నానని చెప్పిన తర్వాత కూడా
ఇంత ధైర్యంగా ఎలా మాట్లాడగలిగాడు?
అఖిరా ఫోన్ చేతిలోకి తీసుకుని తిరిగి పెట్టేసింది.
ఏమో… ఎందుకో ఈ క్షణంలో అభయ్ వాయిస్ వినాలనిపిస్తోంది.
ఇంతలో పిన్నీ దగ్గరకి వచ్చి, “ఏమైంది అఖిరా? వాడు ఏం అన్నాడు?” అని అడిగింది.
అఖిరా కాస్త నిశ్శబ్దంగా ఊపిరి తీసుకుని, పిన్నీ వైపు చూసి,
“పిన్నీ… నేను అభయ్‌ని ప్రేమిస్తున్నాను నాకు తనంటె చాలా ఇష్టం పిన్ని. తను పక్కనున్నపుడు నన్ను నేనే మరచిపోతాను. యేదో తెలియని బరువు తగ్గినట్టు అనిపిస్తుంది. మాట్లాడక పోయిన తన కళ్ళని చూస్తే చాలు గుండె నిండా ప్రేమని కళ్ళల్లో నింపినట్టు అనిపిస్తుంది. తను ఉన్నాడనే భావన చాలు. అదే నాకు ప్రేమలా అనిపిస్తుంది పిన్నీ… ఏదో పొందాలని కాదు, ఏమీ ఆశించకుండా, కేవలం అతను ఉన్నాడు అనే సంతృప్తి.” అని అంటునె కళ్ళల్లో నీళ్లు తిరిగింది.
పిన్ని పిచ్చి పిల్ల ఇంత ప్రేమ ని పెట్టుకుని ఎందుకే నాకూ చెప్పలేదు. ఇంతకీ ఆ అబ్బాయి కి తెలుసా అని అడిగింది. అఖిరా పిన్ని ని చూసి లేదు అని చెప్పింది. పిన్ని ముందు అతనికి చెప్పు దేనికి భయ పడకు నేను ఉన్నాను కదా వీడు నిన్నేమీ చేయడు, నేనే చూసుకుంటాను అని ధైర్యం చెప్పింది.
అఖిరా వెంటనే కళ్లు తుడుచుకుని ఫోన్ తీసుకుని అభయ్ కి కాల్ చేసింది.
Switch off.
మళ్లీ ట్రై చేసింది.
Switch off.
హృదయం వేగంగా కొట్టుకుంది.
“ఇంతసేపు అతను ఆఫ్ లో ఎందుకు ఉన్నాడు?”
అని తనలో తానే అనుకుంది.
వైభవ్ మాటలు గుర్తొచ్చాయి.
అఖిరా చేతులు వణికాయి.
అభయ్ కి ఏదైనా జరిగిందా?
వైభవ్ యేమైనా చేశాడా అని దిగులు మొదలైంది..
-----
ముందుకు కొనసాగుతుంది…
---