Let's visit the Kashi region. - 2 in Telugu Spiritual Stories by PRINCE PREMKUMAR books and stories PDF | కాశీ క్షేత్రాన్ని దర్శించుకుందాం - 2

Featured Books
Categories
Share

కాశీ క్షేత్రాన్ని దర్శించుకుందాం - 2


మొదటి భాగంలో కాశీ క్షేత్రం ఎలా చేరుకోవాలో తెలుసుకున్నాం కదా


కాశీక్షేత్రంలో అతి ప్రధానమైనది ముఖ్యమైనది 
పిండ ప్రధాన కార్యక్రమం
సాధారణంగా కాశీ క్షేత్రానికి సమీపంలో 
పిండ ప్రదానానికి గయా ప్రముఖమైన ప్రదేశము
అలాగే త్రివేణి సంగమం అంటే ప్రయాగరాజ్...
దీన్నే అలహాబాద్ అని కూడా అంటారు 
ఇది కూడా పిండ ప్రదనానికి చాలా ముఖ్యమైన ప్రదేశము
అయితే మనం హైదరాబాద్ మీదుగా ప్రయాణం చేసినట్లయితే మనకు ప్రయాగరాజ్ అంటే అలహాబాద్ స్టేషన్ ముందుగా వస్తుంది 
అలహాబాద్ రైల్వే స్టేషన్ నుంచి త్రివేణి సంగమం
30 నిమిషాల ప్రయాణం
రైల్వే స్టేషన్ దగ్గరలో ఆటో వాళ్ళు ఉంటారు
ఒక్కరికి 30 రూపాయలు తీసుకుంటారు.
సరిగ్గా ఘాట్ దగ్గర మనల్ని దిగబెడతారు 
అక్కడి నుంచి పడవ ద్వారా సంఘంమం
లోపలికి వెళ్లాల్సి ఉంటుంది

ప్రయాగ రాజ్ లో త్రివేణి సంగమం వద్ద
పిండ ప్రదానం విధానం

పిండ ప్రధానం చేయడానికి ముందు మనము 
ప్రయాగ రాజ్ ఘాట్ నుంచి సంగమ ప్రదేశానికి
బోటులో వెళ్లాలి
పిండ ప్రధానం చేయడానికి పూజారిని  ముందుగానే మాట్లాడుకోవాలి 
ఎందుకంటే మనం ఏ ప్రదేశంలో అయితే బోటు ఎక్కుతామో  అక్కడ ఉండే పూజారులు ఒక రకమైన 
ఫీజు తీసుకుంటారు పిండ ప్రదానానికి 
అదే మనం అవతల ఒడ్డుకి చేరితే సంగమం మధ్యలో ఉన్న పూజారులు ఒక విధమైనటువంటి రేట్ చెప్తారు
ఇందులో పిండ ప్రధానానికి ఒక విధమైనటువంటి
ధర ఉంటుంది
అస్తికలు నిమజ్జనం చేయడానికి ఒక విధమైన ధర 
అలాగే శాంతి హోమానికి ఒక విధంగా ..
పితృపక్షాల శాంతి హోమానికి మరో విధంగా ఉంటుంది. కాబట్టి మనం ముందుగానే పూజారితో చాలా క్లియర్ గా మాట్లాడుకోవడం అన్నింటికంటే చాలా ముఖ్యం

సాధ్యమైనంత వరకు తెలుగు మాట్లాడగలిగే
పూజారితో మీరు ఈ క్రమము జరిపించడం ముఖ్యం
ఎందుకంటే....
ఇక్కడ కూడా చిన్న మోసం లాంటి భక్తి లాంటి మోసాన్ని మనం చూడవచ్చు
ప్రయాగరాజ్ లోని త్రివేణి సంఘమంలో పిండ ప్రదానం చేపించడానికి ముందుగా సంగమం చేరడానికి
బోటు వాళ్ళు  ఒకరికి 200 రూపాయలు తీసుకుంటారు
అలాకాకుండా మీరు ఏదైనా గ్రూప్ అంటే బ్యాచ్ తో
గనక వెళ్లినట్టు అయితే 
అందరికీ కలిపి తక్కువగా  తీసుకుంటారు.
ఘాట్ నుంచి సంగమం పెద్ద దూరం ఏం కాదు
పది నిమిషాల ప్రయాణం అంతే
సంగమం మధ్యలో చాలా పెద్ద పంటి ఉంటుంది
అలాగే ప్లాస్టిక్ చెక్క దిమ్మలతో ఒక పెద్ద ప్లాట్ఫారం లాగా తయారు చేయబడి ఉంది
అక్కడే ఎంతో మంది పూజారులు ఉంటారు
మనకు కావలసిన సామాను కూడా అక్కడే తీసుకోవచ్చు అక్కడ జరిపిస్తారు ఈ కార్యక్రమం

పిండ ప్రధాన కార్యక్రమం జరిపించే 
పూజారినీ మాట్లాడుకునే ముందు కొన్ని విషయాలు
మనం గమనించాలి 
ఉదాహరణకి పిండ ప్రదానానికి తను ₹2,000 చెప్పాడు అనుకుందాం 
పూజ మొదలవుతుంది
పూజ మొదలవగానే ముందుగా 
శాంతి దక్షిణ 500 రూపాయలు ఇమ్మని అడుగుతాడు
తను చెప్పినట్టుగానే మనం 500 ఇస్తాము
మళ్ళీ  పిండ ప్రధానము ముగిశాక...
వంద రూపాయలతో లేదా 200 రూపాయలతో
వాటికి దిష్టి తీసేయమని చెప్తాడు
ఆ పిండాలకి అలాగే తీసేస్తాము
ఆ తర్వాత పిండాలు సంగమం లో  వదిలి
  మళ్ళీ స్నానం చేసి వచ్చకా.... 
ఇంకొక చిన్న హోమం చేస్తాడు శాంతి ప్రక్రియ అది
ఐదు నిమిషాలు ఉంటుంది 
ఇప్పుడు ఇదంతా అయిపోయాక...
తను మొదట అడిగిన 2000 తీసుకుంటాడు
అలాగే  మనం దిష్టి తీసిన 200 రూపాయలు తీసుకుంటాడు 

ఆ తర్వాత పూజ మధ్యలో ఇచ్చిన 500 తీసుకుంటాడు
ఇవి కాకుండా మళ్లీ దక్షిణ సపరేట్గా అడుగుతాడు
అది కూడా ఇచ్చాక...
అన్నదానానికి అంటే మనం ఎవరికీ అయితే
పిండప్రదానం చేసామో
వారి పేరు మీద అన్నదానం జరిపించడానికి 
తప్పకుండా వెయ్యినుట పదహార్లు  అడుగుతారు
అయితే వీళ్ళు ముందుగా ఇవేవీ కూడా మనకు చెప్పరు ఇదంతా కూడా ...
పూజ మొదలైన తర్వాత ఉంటుంది 
సాధారణంగా మనం ఏమనుకుంటాము..
పూజకు 2000 రూపాయలు మాట్లాడుకున్నాం కదా అనుకుంటాము 
కానీ వాళ్ళు 2000 కేవలం పూజ కోసం మాత్రమే తీసుకుంటారు 
మళ్ళీ మధ్య మధ్యలో కొంతమంది శాంతి హోమంకి 1116లు తీసుకోవచ్చు
కొంతమంది 500 తీసుకోవచ్చు
దక్షిణ కొంతమంది 1000 తీసుకోవచ్చు
కొంతమంది 500 తీసుకోవచ్చు 
కొంతమంది అన్నదానానికి కచ్చితంగా 2000 అడుగుతారు
అలా ఇదంతా కూడా మనకి జరగకుండా ఉండాలి అంటే
మనం పూజరికి ముందే చెప్పాలి
అన్ని కలిపి నేను ఇంతే ఇస్తాను అని 
అలా కాదు అంటే కచ్చితంగా ఈ కార్యక్రమం ముగిసే సరికి
మినిమం 5000 రూపాయల నుంచి పదివేల వరకు కూడా
మనం ఇవ్వాల్సిన పరిస్థితి రావచ్చు

      ఇలాగే కాశీలో కూడా చేస్తారు 
గయాక్షేత్రంలో కూడా ఇలాగే చేస్తారు
  కాబట్టి మనం ముందే చాలా క్లియర్ గా మాట్లాడుకోవడం
బెటర్ 
లేదు అంటే కచ్చితంగా మనకు ఇబ్బందులు తలెత్తుతాయి 

ఇక్కడ మీకు అనిపించవచ్చు వాళ్ళు అడిగిన దాంట్లో తప్పేమీ లేదు కదా 
ఇస్తే ఏముందిలే అని
అది మీ అభిప్రాయం
ఎందుకంటే సాధారణంగా...
కాశీలో అన్నదానం జరిపించే సత్రాలు చాలా ఉంటాయి మీరు ఒకవేళ ఇవ్వాలి అనుకుంటే
స్వయంగా మీరే ఆ అన్నదాన సత్రానికి వెళ్లి 
ఎవరి  పేరు మీద ఇవ్వాలనుకుంటున్నారో 
ఇస్తే అది నేరుగా భక్తులకు చేరుతుంది కదా
అది మీ అభిప్రాయం 
అలాగే దశ అశ్వమేధ ఘాట్ సమీపంలో..
కిచిడి బాబా ఆశ్రమం అని ఉంటుంది 
ఉదయం ఎనిమిది గంటల నుంచి 10 గంటల వరకు
చాలామంది భక్తులకి కిచిడి పంచి పెడతారు అక్కడ
అలాంటి వారికి గనక ఇస్తే మీకు నేరుగా అన్నదానం జరుగుతుంది కదా

అలహబాద్ లో శక్తి పీఠం కూడా ఉంది.
ఈ సంగమానికి దగ్గర్లో.
అలాగే సంగమం దగ్గర ఉన్న హనుమాన్ టెంపుల్ బాగా ఫేమస్.

కాశి ఘాట్ పడవ ప్రయాణం

కాశికి వెళ్తే తప్పకుండా కాశీ ఘాట్స్ పడవ ప్రయాణం
చేయడం అస్సలు మర్చిపోవద్దు.
ముఖ్యంగా ఉదయం సూర్యోదయం సమయంలో
సాయంకాలం సూర్యాస్తమయం సమయంలో చేసే 
పడవ ప్రయాణం ఎంతో ఆహ్లాదాన్ని ఆనందాన్ని ఇస్తుంది
అది మాత్రమే కాకుండా ....
నవంబర్ డిసెంబర్ టైంలో ప్రత్యేకంగా
ఎక్కడో దూరం నుంచి వచ్చే వలస పక్షులతో 
గంగా నది మరింత అందన్నీ సంతరించుకుంటుంది 
మనం పడవ ప్రయాణం చేస్తున్నప్పుడు..
పక్షులు మన వెనకే రావడం 
మన చుట్టూ తిరగడం ఎంతో ఆహ్లాదాన్ని ఇస్తుంది
అక్కడికి వచ్చే పక్షుల కోసం ప్రత్యేకంగా స్నాక్స్ కూడా తయారు చేస్తూ ఉంటారు అక్కడి పడవ వాళ్ళు
ప్యాకెట్ ధర పది రూపాయలు ఉంటుంది
చిన్న చిన్న చిప్స్ లాగా ఉంటాయి
అవి వాటిని మనం దోసిల్లో పట్టుకొని పడవలో ప్రయాణం
చేస్తూ ఉంటే అవన్నీ మన చుట్టూ ఎగురుతో..
మన దోసీల్లో ఉన్న చిప్స్ తీసుకొని దూరంగా వెళ్లిపోతూ
ఉంటాయి. 
భలే సరదాగా అనిపిస్తుంది ఈ పడవ ప్రయాణం.


సాధారణంగా పడవ యొక్క సామర్ధ్యాన్ని బట్టి ధరలు
నిర్ధారించబడి ఉంటాయి
అంటే సాధారణ బోట్ అయితే ఒకరికి 200 రూపాయలు
ఫెర్రీ ఇలాంటివి అయితే 500 నుంచి 1000 2000 వరకు కూడా ఉంటుంది

ఒక్కసారి కాశీ క్షేత్రానికి వెళితే కాశి గయా త్రివేణి సంగమం
ఈ మూడు చూసే విధంగా ప్లాన్ చేసుకోవడం చాలా బెస్ట్ ఎందుకంటే ప్రతిసారి వెళ్లడం ఇబ్బంది కదా

ఇక కాశీ విశ్వేశ్వరుని దర్శనం చేసుకున్నాక బయటకు వస్తే
లోకల్ ట్రిప్ తీసుకెళ్లే వాళ్ళు చాలామంది ఉంటారు అక్కడ
సుమారు 200 రూపాయలు తీసుకుంటారు ఒక్కరికి
మీరు ఒక్కరే వెళితే అక్కడ ఉన్న ఎవరితో అయినా... అంటే ఎంతో మంది వస్తూ ఉంటారు కదా
వారితో కలిసి ట్రిప్ ఎంజాయ్ చేయడం చాలా ముఖ్యం
అలాగే ముందు మనం లోకల్ ఆటో డ్రైవర్లతో కానీ
లేదంటే టాక్సీవాలాతో కానీ ఒక టెంపుల్ లో ఎంత టైం వరకు గడపవచ్చు కనుక్కోవాలి
ఎందుకంటే
కొంతమంది జస్ట్ అలా తీసుకువెళ్లి చూపిస్తారు అంతే ..
లోపలికి వెళ్లి దర్శనం చేసుకోవడానికి టైం ఇవ్వరు.
  కాబట్టి క్లియర్ గా కనుక్కోవడం చాలా మంచిది
ఆ చుట్టుపక్కలో ఉన్న అన్ని కూడా చూడడానికి 
ఒకరోజు పడుతుంది 
పెద్ద దూరం ఏమి కాదు అంతా కూడా చుట్టుపక్కలనే ఉంటుంది






అయితే వారణాసి క్షేత్రానికి వెళ్లిన చాలామంది కూడా
కేవలం టెంపుల్స్ మాత్రమే అక్కడ ఫేమస్ అనుకొని
దేవాలయం దర్శనం చేసుకుని తిరిగి వస్తూ ఉంటారు 
ఇవి మాత్రమే కాకుండా ఇంకా ఎన్నో మంచి మంచి
ప్రదేశాలు కూడా వారణాసిలో ఉన్నాయి 
అందులో ముఖ్యమైనది రాంనగర్ ఫోర్ట్ 
ఇది వారణాసి నుంచి సుమారు 15 కిలోమీటర్ల దూరం
ఉంటుంది 
మామూలుగా అయితే ఆ రూట్లో ఆటో వాళ్ళు 
30 రూపాయలు తీసుకుంటారు 
మనం డైరెక్ట్ గా మాట్లాడితే ఒక్కొక్కరికి 200 రూపాయలు
ఛార్జ్ చేస్తారు
చాలా అద్భుతంగా ఉంటుంది ఈ కోట 
హనుమంతుడు నిత్యం ఈ ప్రదేశంలోనే శ్రీరామ
నామస్మరణ చేస్తాడు అని అక్కడి భక్తుల నమ్మకం.


వారణాసి నుంచి 80 kms దూరం లో వింధ్యాచలం
అను ప్రదేశం ఉంది చాలా అద్భుతమైన ప్రదేశం
అది వింధ్యాచల మాత దేవాలయం పక్కనే నది చాలా
మంచి వ్యూ.

కాశి వెళ్ళిన వాళ్ళు తప్పకుండా కాలభైరవ స్వామిని
దర్శించుకోవడం ఎంత ముఖ్యమో... గవ్వలమ్మని 
కూడా దర్శించుకోవడం అంతే ముఖ్యం
గవ్వలమ్మ కాశీ విశ్వేశ్వరుని చెల్లెలిగా చెప్తారు
కాశి టెంపుల్ నుంచి ఇస్కాన్ టెంపుల్ వెళ్లే దారిలో...
  ఇస్కాన్ టెంపుల్ దాటి ముందుకు వెళ్తే రెండు దారులు మనకి కనిపిస్తాయి
ఒకసారి సంకటమోచన హనుమాన్ దేవాలయానికి కనకదుర్గ అమ్మవారి దేవాలయానికి వెళుతుంది 
ఇంకొక దారి గవ్వలమ్మ టెంపుల్ కి వెళుతుంది
అక్కడ లోకల్ రిక్షా వాళ్ళని ఆటో డ్రైవర్ని అడిగినా చెప్తారు 
అదే మనం  డైరెక్ట్ గా గవ్వలమ్మ టెంపుల్ కి వెళ్తే 
రిక్షా వాళ్ళు అయితే 30 రూపాయలు తీసుకుంటారు
ఆటో వాళ్ళు అయితే 20 రూపాయలు తీసుకుంటారు
ట్రాఫిక్ ఉదయం నుంచి రాత్రి వరకు చాలా ఎక్కువగానే
ఉంటుంది కాబట్టి కాస్త సమయం పడుతుంది
గవ్వలమ్మ దేవాలయానికి చేరుకున్నాక
దేవాలయం ఎంట్రన్స్ దగ్గర మనకు ఒక ప్రమిదలో గవ్వలు
చిన్న ఎరుపు రంగు గుడ్డ ముక్క గాజులు పసుపు
కుంకుమ పూజ సామాను ఇస్తారు
దానికి 30 రూపాయలు 
పూజారి ఆ పూజా సామాను తీసుకొని అర్చన జరిపించి
ప్రమిదలోని గవ్వలని అమ్మవారికి సమర్పించి...
  మనతో ఒక మాట చెప్పిస్తాడు
కాశీ పుణ్యం మాకు గవ్వలు మీకు అని  చెప్పి..
గవ్వలను పూజారి చేతిలో పెట్టాలి మనం
పూజారి ఆ గవ్వలను అమ్మవారికి సమర్పించి
అందులో నుంచి ఒక గవ్వ మళ్లీ మనకు ఇస్తాడు 
అలా చేస్తేనే కాశీ క్షేత్రాన్ని దర్శించుకున్న పుణ్యఫలం కలుగుతుంది అని భక్తుల నమ్మకం....

🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏