Are commitments only for women?? in Telugu Women Focused by PRINCE PREMKUMAR books and stories PDF | కట్టుబాట్లు ఆడవాళ్ళకేనా??

Featured Books
Categories
Share

కట్టుబాట్లు ఆడవాళ్ళకేనా??


ఒక తల్లిగా కూతురును పెంచినంత పద్ధతిగా కొడుకుని పెంచరు ఎవరు కూడా

వాడికేంటి మగాడు అనే భావన కావచ్చు మగాళ్లు ఎలా ఉన్నా పర్లేదు అనే ఆలోచన కావచ్చు

ఆడపిల్లకు చెప్పిన అన్ని జాగ్రత్తలు ఆడపిల్లకు చెప్పిన అన్ని మంచి మాటలు మగవాళ్ళకి చెప్పదు ఏ తల్లి కూడా

అక్కడే వస్తుంది అసలు తప్పు

ఇవన్నీ ఉన్నా లేకున్నా భార్య కూడా ఒకింటి ఆడపిల్లనే అని

తను కూడా ఒక తండ్రి గారాలా కూతురు అని

అన్నిటికీ మించి తనకి మనసు ఉంటుంది అని ఆలోచిస్తేఎలాంటి బాధలు ఆ అమ్మాయికి ఉండవు

ఒకవేళ తన అదృష్టం బాగుండి అర్థం చేసుకునే భర్త

దొరికితే చెప్పలేము....

కానీ.... లేదంటే ఇంకా ఈ మధ్యకాలంలో అయితే 

కొడుకు కూతురు సంతోషంగా ఉన్నా కూడా

విడదీసి పాలించే అత్తలను చూస్తూ ఉన్నాను

ఇంకొందరైతే ఏకంగా కోడలు ఎవరిని కనాలో కూడా 

డిసైడ్ చేసేవాళ్లను చూస్తున్న

ఇంకా ప్రతిదానికి అమ్మ ఇష్టం అనే మాట తగిలించే

భర్త దొరికితే ఇంకా ఆడపిల్ల పరిస్థితి


 ఎంతమంది అమ్మాయిలు

తను జాబ్ చేస్తున్న సాలరీని ధైర్యంగా వాళ్ళ పుట్టింట్లో

ఇవ్వగలుగుతున్నారు చెప్పు

కొన్ని సందర్భాలలో అనిపిస్తుంది 

అనాధ ఆడపిల్ల జీవితమే బెటర్ ఏమో అని

ఎందుకంటే తనకు నా అనే వాళ్ళు ఎవరు ఉండరు

అన్నీ తనే భరిస్తుంది

ప్రతి ఆడపిల్ల జీవితం పెళ్లితో కొన్ని బంధాలు తెంపుకోవాల్సి ఉంటుంది ఏమో అనిపిస్తుంది


చెప్పుకోడానికి ఎవరూ లేక బంధాలను బాధ్యతలను మోయడం వేరు

చెప్పుకోవడానికి అందరూ ఉన్నా కూడా

చెప్పుకోలేని పరిస్థితిలో ఉండడం వేరు

కట్టుబాట్లు ఆడవాళ్ళకేనా మగవాళ్ళకి లేవా

కార్యేషు దాసీ

కరణేషు మంత్రీ
భోజ్యేషు మాతా
శయనేషు రంభా......
క్షమయా ధరిత్రి...
ఉత్తమ భార్య సుగుణాలు గా చెప్తారు.
అయితే మరి భర్తకి ఎలాంటి లక్షణాలు అక్కర్లేదా అంటే..

యోగ్యుడైన భర్తకి ఉండాల్సిన మొదటి లక్షణం 
యోగిగా ఉండటం.
యోగి అంటే ఏదో కాషాయ వస్త్రాలు ధరించిన వాడని కాదు
కష్టసుఖాలను లాభనష్టాలను మానావమానాలను సమంగా స్వీకరించడమే యోగి లక్షణం. 
అందుకే
కార్యేషు యోగీ అని అన్నారు.
అందుకే ....
కార్యేషు యోగీ అన్నది యోగ్యుడైన భర్త మొదటి లక్షణం.

ఉత్తమ భర్త రెండవ లక్షణం ...కరణేషు దక్షః. 
పనులు చేయించుకోవడంలో, 
అందరినీ బాగా ఆకట్టుకోవడంలో నేర్పరితనం ఉండాలి. ఇంట్లో తల్లిదండ్రులతో అక్కచెల్లెళ్ళతో అన్నదమ్ములతో అనుబంధం ఉంచుకుంటూ ..
భార్యా బిడ్డలకు కష్టం రాకుండా చూసుకోవడం నేర్పరితనానికి మొదటి మెట్టు. 
వీలైనంతవరకూ భార్యకు సహాయసహకారాలు అందిస్తూ
ఉండాలి. 
ఎవరిమీదా కోపతాపాలు ప్రదర్శించకుండా ఉండడం 
చాలా ముఖ్యం.
అందుకే కరణేషు దక్షః గా ఉండాలి.

మూడవ లక్షణం రూపేచ కృష్ణః....
అంటే భర్త మానినీ మానస చోరుడు కావాలని కాదు. ప్రసన్నంగా చిరునవ్వుతో ఉంటేనే బాగుంటుంది కదా.

నాలుగవ లక్షణం... క్షమయాతు రామః.
శ్రీరామచంద్రుని తలుచుకుంటే క్షమా గుణం గొప్పతనం తెలుస్తుంది. 
మర్నాడు పట్టాభిషేకం అనగా వనవాసానికి 
పంపిన తండ్రిపై కానీ సవతి తల్లి పై కానీ ఏ విధమైన కోపము ప్రదర్శించలేదు.
క్షమాగుణం వల్ల ఇతరులకే కాదు 
మనకే ఎన్నో లాభాలు కలుగుతాయి. 
అందుకే క్షమాగుణం అనేది చాలా ముఖ్యం.

ఐదవది.... భోజ్యేషు తృప్తః. 
భోజనం విషయంలో తృప్తిగా ఉండాలి 
ప్రతిసారి భార్యను విమర్శిస్తూ ఉండరాదు
అందుకే భోజనం దగ్గర తృప్తిగా ఉండడం చాలా ముఖ్యం.

చివరి లక్షణము... సుఖదుఃఖమిత్రం.
కష్టాలలో కానీ సుఖాలలో కానీ భార్య మనసును గ్రహించి మెలిగే వాడే యోగ్యుడైన భర్త.

నిజంగా ఇలా ఉంటారా అని అనుమానిస్తే...
ఉంటారా అని కాదు ఉండాలి అని
కానీ...
పెళ్లి అనేది అందరికీ ఒకటి మాత్రం కాదు 
పెళ్లి తర్వాత అందరి జీవితం ఒకేలా ఉండదు
కొందరికి జీవితం వస్తుంది ఇంకొందరికి జీవితం పోతుంది
కొందరి జీవితం అద్భుతంగా మారుతుంది
మరి కొందరు జీవితం అందరూ ఉన్న 
అనాధగా మిగిలిపోతుంది

ప్రపంచంలో మనుషులంతా ఒకేలా ఉండరు.
అంత వరకు ఎందుకు ఓ కుటుంబంలోని మనుషుల
మనస్థత్వమే ఒకేలా ఉండదు..
ఓ ఫ్యామిలీలో నలుగురు ఉంటే నాలుగు రకాల మనస్థత్వాలు ఉంటాయి. 
కొంతమంది ప్రవర్తనా శైలి ఆధారంగా
వాడు చాలా సున్నితం
చాలా జాగ్రత్తగా ఉండాలంటుంటారు.
అంటే ఆ వ్యక్తి యొక్క వ్యవహరశైలి.. 
ఒక విషయాన్ని రిసీవ్ చేసుకునే విధానం ఆధారంగా సెన్సిటివ్ అనే ముద్ర పడిపోతుంది. 
నిజంగా కూడా సెన్సిటివ్ మైండ్ సెట్ కలిగిన వ్యక్తులతో చాలా జాగ్రత్తగా ఉండాలి.

వినే సామర్థ్యం, ఆలోచించే విధానం, సహనం,
అవగాహనా స్థాయి సెన్సిటివ్ వ్యక్తిగా మార్చేస్తాయి. ఇలాంటి వ్యక్తులు ఎదుటివారిని అర్థం చేసుకోవడానికి, చుట్టూ పరిస్థితులను అర్థం చేసుకోవడానికి 
ఎక్కువ సమయం తీసుకుంటారు. 
కానీ..
ఒక్కసారి సెన్సిటివ్ మైండ్ సెట్‌ ఉన్న వ్యక్తులు 
కనెక్ట్‌ అయ్యారంటే చాలా బాగా కలిసిపోతారు.
నమ్మినవాళ్ల కోసం ఎంతటి త్యాగానికైనా సిద్ధం అవడానికి రెడీ అవుతారు. 
అదే తాను నమ్మిన వ్యక్తి మోసం చేస్తున్నాడని తెలిస్తే మాత్రం ఆ వ్యక్తితో లైఫ్‌లో కనెక్ట్‌ అయ్యే అవకాశాలు
చాలా తక్కువ.
ఓ వ్యక్తి యొక్క సెన్సిటివ్ నెస్ అతని చుట్టూ ఉండే ప్రశాంతత, ఆనందం, విజయం, ఆరోగ్యం,
మానసిక ఆరోగం వంటివాటిపై చాలా ప్రభావం చూపిస్తుంది. 

చిన్న చిన్న విషయాలకు ఎక్కువ సంతోషపడిపోవడం, బాధపడిపోవడం అనేది సెన్సిటివ్‌ మైండ్‌సెట్
‌ ఉన్నవారి లక్షణంగా చెబుతుంటారు. 
వాళ్ల మూడ్ స్వింగ్స్ తరచూ మారిపోతూ ఉంటాయి. వాళ్లకి ఏమికావాలనే విషయంపై కూడా స్పష్టత ఉండదు.
ఏది త్వరగా తేల్చుకోలేరు. 
ఇలా ఎందుకు జరిగింది,
అలా ఎందుకు జరుగుతుంది అని వివిధ ప్రశ్నలతో సతమతమవుతూ ఉంటారు.
అంత సులువుగా వారు వారి ఆలోచనలను వదలలేరు. 
ఇది వారికి తలనొప్పి, నిద్రలేమి, ఆందోళన, స్ట్రెస్, బాధ, కోపం మొదలైన సమస్యలకు కారణమవుతుంది.

సున్నితమైన మనసు ఉన్నవారికి పెద్దగా శత్రువులు
ఎవరు ఉండరండి 
వీళ్ళ ఆలోచనలె వీళ్ళ మనసే వీళ్ళకు పెద్ద శత్రువు
ఎందుకంటే...
ఏ విషయాన్ని వీలు గట్టిగా అడగలేరు 
ఏ విషయాన్ని వీళ్లు గట్టిగా చెప్పలేరు 
ఏదో ఆలోచిస్తూ ఇంకేదో ఆశిస్తూ అలా ఉండిపోతారు.
అలా అని వీళ్ళకు కచ్చితంగా  అభిప్రాయాలు ఉండవా
అంటే అదేం లేదు 
వీళ్ళ అభిప్రాయాలు చాలా బాగుంటాయి

సున్నితమైన మనసు ఉన్న వాళ్ళలోనే భావాలు అద్భుతంగా ఉంటాయి 
కానీ ఆ భావాలను 
అర్థం చేసుకోవడమే చాలా కష్టం.

సున్నితమైన మనసు ఉన్న వాళ్ళ ఆలోచనలు
ఎలాంటి కల్మషం లేకుండా చాలా పవిత్రంగా ఉంటాయి
ఎందుకంటే వీళ్ళు ఎప్పుడు వీళ్ళ ఆలోచన తగ్గట్టుగానే ప్రవర్తిస్తారు
వీళ్ళ అంతిమ లక్ష్యం ఒక్కటే ..
వీళ్లను ఎవరు ఎంత బాధ పెడుతున్నా సరే
వీళ్ళ వల్ల ఏ ఒక్కరు కూడా బాధపడకూడదు.
వీళ్ల దృష్టిలో అందరూ మంచివాళ్లే
అందరూ మంచి మనసున్న వాళ్ళే