Search in Telugu Motivational Stories by Sangeetha books and stories PDF | అన్వేషణ

Featured Books
Categories
Share

అన్వేషణ

తనకంటూ ఒక కల, ఒక బాధ్యత, ఏ వైపు మల్లుతోందో తెలియని దారి నడక కొనసాగించింది.

ఉదయం 9 గంటలకు అమ్మ లేట్ అయిపోతోంది. టిఫిన్ రెడీనా అని హడావిడిగా అడుగుతుంది.

అమ్మ:"యెందుకే కంగారు పడతావ్? ఇదిగో నీ బాక్సు."

అను: "ఇప్పటికే ఆలస్యం అయ్యింది. సరే, వెల్లొస్తాను అని చెప్పి ఆఫీస్ కి బయలుదేరింది."

అను మళ్లీ ఆలోచనలో పడిపోయింది. తనకు ఎప్పుడూ ఏదో ఒకటి సాధించాలనిపించేది, కానీ ఏం చేయాలో అర్థం కావడంలేదు. అయితే, గతం లాగే అయోమయంగా ఆలోచిస్తూ, అమ్మ చెప్పిన మాటలు గుర్తుకు వచ్చాయి: "మనకి కావాల్సింది ఎప్పుడూ మన చేతుల్లోనే ఉంటుంది, అది ఎలా తీసుకోవాలనేది మనమే నిర్ణయించాలి." అను ఆలోచిస్తూ, "నాకు వంట చేయడం అంటే బాగా ఇష్టం, కదా. నేను ఎందుకు ఫుడ్ బిజినెస్ స్టార్ట్ చేయకూడదు?" అని తేల్చుకుంది. ఆ ఆలోచనతో చాలా హ్యాపీగా ఫీల్ అవుతోంది. ఆ రోజు సాయంత్రం ఇంటికి వెళ్లి శ్యామలతో ఇలా చెప్పింది:

అను: "అమ్మా, నేను ఎప్పటి నుంచో నా సొంతంగా ఏదైనా వ్యాపారం చేయాలని అనుకుంటున్నాను. నేను వంటలు బాగా చేస్తాను కదా, ఫుడ్ బిజినెస్ స్టార్ట్ చేద్దాం అని అనుకుంటున్నాను."

శ్యామల: "ఆదేవిటి విని, మన దగ్గర అంత పెట్టుబడికి చోటు లేదు, ఇంటికి మన రోజూ ఖర్చులు తప్పించుకోవడం కష్టంగా ఉంది. ఇప్పుడు పెట్టుబడి ఎక్కడ నుండి తెస్తాం?"

అను: "దానికెందుకు దిగులు పడతావ్? అమ్మ, మనం క్లౌడ్ కిచెన్‌తో స్టార్ట్ చేద్దాం. డాంట్లో వచ్చిన లాభం చూసి, తర్వాత స్టెప్పులు తీసుకుందాం."

శ్యామల: "సరే, సరే ఒప్పుకుంటున్నాను."


---


3 రోజుల తరువాత


అను క్లౌడ్ కిచెన్ స్టార్ట్ చేయడంలో అన్ని విషయాలను ముందుగా పరిశీలించి, ఓ యాప్ డౌన్‌లోడ్ చేసుకుంది. ఆ యాప్ లో తన వంటకాలకు ప్రొఫైల్ క్రియేట్ చేసింది. బడ్జెట్డె అంత లేకపోవడం తో డెలివరీ  కూడా తానే చేయడం వల్ల 5 కిమీ లోపల ఉండేలా సెట్ చేసింది. 

రోజూ ఉదయం నుంచి సాయంత్రం వరకు ఆఫీస్ వర్క్ చేస్తూ, సాయంత్రం ఇంటికి రాగానే, యేదైనా డిన్నర్ ఆర్డర్ వస్తే, తను రెడీ చేసి డెలివరీ చేయడానికి తానే వెళుతుంది. కొన్ని రోజులు సాగింది లొకేషన్ 5 కిమీ లోపల ఉండడంతో, ఆర్డర్లు చాల ఎక్కువగా రాలేదు.

అందుకే, శనివారం, ఆదివారం ఆర్డర్స్ తీసుకోవడం ప్రారంభించింది. ఆ సమయంలో, కస్టమర్ల నుండి మంచి సమీక్షలు రావడంతో, చాలా హ్యాపీగా ఫీల్ అవుతోంది. కానీ ఆదాయం మాత్రం అంతంత మాత్రాన ఉండే సరికి ఇల్లు కొనసాగించడం చాలా కష్టం అనిపిస్తుంది.

కొన్ని రోజులు ఇలాగే సాగుతూ ఉంటుంది. ఇటు ఆర్డర్ కూడా లేదు అటు, ఆఫీసు లో కూడా పని ఏమీ అవడం లేదు ఒక్కసారిగా చాలా మంది వర్కర్స్ ని పని నుండి తీసేసారు అందులో అను కూడ ఒకటి. ఒక్క సారిగా అన్ని ముగిసి పోయినట్టు అనిపించింది. ఇక వేరే జాబ్ చూసిన కూడా ఇప్పట్లో దొరికేల లేదు స్ట్రీట్ సైడ్ బండి పెట్టి ఆ యాప్ లో లిమిటెడ్ డెలివరీ కూడా తీసి ఫుల్ టైమ్ వర్క్ స్టార్ట్ చేసింది కానీ అది కూడా చాలా రోజులు సాగలేదు. అప్పటి పూట గడిచిన పెద్దగా చెప్పుకునే అంత లాభం లేదు. చేతికి దొరికిన నోటికి దొరకనట్టు ముందు వ్యాపారం కొంచం బాగా సాగిన తరువాత లాస్ అయ్యి బండి కూడా మూసేసిoది.


---


కొన్ని రోజుల తరువాత:


ఒక రోజు,  ఓంకార్ స్టార్టప్ అనే చిన్న ఫుడ్ స్టార్టప్ కంపెనీ అనూ ప్రొఫైల్ చూసి, సమీక్షలు చూస్తూ, ఆమెను ఇంటర్వ్యూకి పిలిచారు. అనూ ఆ ఇంటర్వ్యూలో పాల్గొని, ఒక డిష్ శాంపిల్ ప్రెజెంట్ చేసింది. అందరికి రుచి బాగా నచ్చడంతో, స్టార్టప్ వారు ఆమెను సెలెక్ట్ చేసారు. అనూ చాలా ఆనందంగా ఫీల్ అవుతుంది.

అను: "కానీ, నా క్వాలిఫికేషన్ డిఫరెంట్ కదా, ఎలా?"

ఇంటర్వ్యూయర్: "మాకు కావాల్సింది క్వాలిఫికేషన్ కాదు, టాలెంట్. మీ వద్ద ఆ టాలెంట్ ఉంది కాబట్టి, మీరు సెలెక్ట్ అయ్యారు."అనూ మరింత ఆనందంగా ఫీల్ అవుతుంది. 2 రోజులు తరువాత పనికి జాయిన్ అవ్వమని అంటారు. అనూ ఇంటి కి వచ్చి, అమ్మకి చెప్పింది:

అను: "అమ్మా, నాకు ఒక స్టార్టప్ కంపెనీలో చెఫ్ గా జాబ్ దొరికింది."

అమ్మ: "నువ్వు చదివింది కమర్స్ కాదే, చెఫ్ గా ఎలా?"

అను: "నేను అదే అడిగాను దానికి వాళ్లు మాకు కావాల్సింది డిగ్రీ కాదు టాలెంట్ అన్నారు."

అమ్మ: "ఇన్ని రోజులూ సాగి సాగని బండి పెట్టి కష్ట పడ్డావు, ఇప్పుడు పెద్ద అవకాశమే వచ్చింది. చేసుకో."


---


2 రోజుల తరువాత 

 

ఓంకార్ స్టార్టప్ లో పనికి చేరింది. చిన్న సమస్యలతో ప్రారంభమైనా, మెల్లగా మంచి ఫలితాలు రావడం ప్రారంభించాయి. ఆమె వంటకాలు కస్టమర్లకు చాలా నచ్చాయి, స్టార్టప్ కు మంచి రివ్యూలు వచ్చాయి. లాభాలు కూడా వచ్చాయి, అనూ కష్టాలు తీరిపోయాయి. అనూ ఇంకా శ్యామల హ్యాపీగా ఉండటం ప్రారంభించారు. ఇక అన్ని సమస్యలు పరిష్కారం అవడం తో అనూ చెఫ్ కోకోర్స కూడ పూర్తి చేసి, సీనియర్ చెఫ్ గా ప్రమోట్ అవుతుంది.

తను ఏం చేయాలి, గోల్ ఏంటి అని ఆలస్యంగా తెలుసుకున్న అది సాధించే వరకు పట్టు వదలకుండా ప్రయత్నించింది.

అను ఇంకా శ్యామల సంతోషంగా కొత్త జీవితాన్ని మొదలు పెడతారు.


---


శిక్షణ:

మనస్ఫూర్తిగా మనల్ని నమ్మి, నచ్చిన పని కాన్ఫిడెంట్ గా స్టార్ట్ చేస్తే, సక్సెస్ ఖాయం.


------