మనసు శాంతించనంటోంది.
అంతులేని ఆశలతో, వృధా ప్రయాసలతో అడుగు పడనంటోంది,
అలుపెరుగని ప్రయాణంతో, అలలై ఎగిసిపడే అవాంతరాలతో,
నిరాశల సుడిగుండాలెన్నో, అంతులేని ఆలోచనల అగ్నిగుండాలెన్నో,
విరామంలేని ప్రయాణంలో, నిరాశల నిశీధిలో సాగిపో నేస్తమా...
చిరునవ్వు అనే వెలుగులో, ప్రయత్నం అనే దారిలో.
- Yamini