కలల గమ్యం
ప్రతి మనిషికీ కల ఉంటుంది... కానీ ఆ కల కోసం పోరాడే ధైర్యం కొందరికే ఉంటుంది.
#కలలు ...
నీ కల... కలగానే మిగిలిపోయిందా? లేక నీ జీవితాన్ని విజయగాథగా మలిచిందా?
నిన్ను చిన్నచూపు చూసిన ప్రతి మనిషి, ఒక రోజు నీ విజయాన్ని చూసి చప్పట్లు కొట్టాలంటే... నీ చేతిలో ఉండాల్సిన అత్యంత శక్తివంతమైన ఆయుధం నీ కల.
నిన్ను కంటిపాపలా కాపాడే నీ తల్లిదండ్రుల కళ్లలో గర్వం నింపే కలను కనాలి.
నీ హృదయం కలలతో నిండిపోవాలి. అవి చిన్న సెలయేరులా కాదు... అంతులేని మహాసముద్రపు అలల్లా నిరంతరం ఉప్పొంగాలి.
ఈరోజు మృదువైన చిరుగాలిలా కనిపిస్తున్న నీ కల... రేపు కొండలను సైతం కదిలించే ప్రళయ గాలిగా మారాలి.
అస్తమయం భయపెడుతున్న సూర్యుడిలా నీ కల ఎప్పటికీ చీకటిలో కలిసిపోకూడదు. ప్రతి ఉదయం కొత్త సూర్యోదయంలా ప్రపంచాన్ని వెలిగించాలి.
ఆకలితో ఎదురుచూస్తున్న నీ విజయానికి... నీ కలే అన్నం కావాలి. అనుమతి లేకుండానే తలుపు తట్టే ఓటమిని జయించి, నీ జీవితంపై విజయ వెన్నెలను కురిపించాలి.
నీ కల వైపు వేసే ప్రతి అడుగు... అమరుల ప్రయాణంలా అచంచలంగా సాగాలి. నువ్వు చిందించిన ప్రతి చెమట బొట్టు... నీ విజయ కిరీటంలో ఒక మణిగా మారాలి.
భయం నీ బలహీనత కాదు... అదే నీ బలంగా మారాలి. నీ కలలను సమాధి చేయకుండా, రాజసింహాసనం వరకు తీసుకెళ్లే శక్తిగా నిలవాలి.
నీ నరనరాల్లో... నీ ప్రతి శ్వాసలో... ప్రతి ఆలోచనలో... ప్రతి చూపులో... ఆ కలను సాధించాలనే తపన, పట్టుదల, అగ్ని కనిపించాలి.
గుర్తుంచుకో...
కలలు కనేవాళ్లు ఎంతో మంది ఉంటారు... కానీ ఆ కలల కోసం నిద్రను, సుఖాన్ని, భయాన్ని త్యాగం చేసే వారే చరిత్ర సృష్టిస్తారు.
కాబట్టి... కలలు కనకు... కలలనే జీవించు.
నీ విజయం కోసం ప్రపంచం ఎదురు చూసే రోజు... దూరంలో లేదు.
#కలలు #విజయం #ప్రేరణ #జీవితం #పట్టుదల #స్వప్నం #లక్ష్యం #గెలుపు