అతని చేతిలోని గ్లాసు టేబుల్‌పై పగిలిపోయింది.
"నాకు తిరిగి అక్కడికి వెళ్లాలంటే భయం వేస్తోంది."
"అందుకే మీలాంటి వాళ్ళను పెట్టుకున్నా... పోలీస్ ఆఫీసర్స్, ప్రైవేట్ ఇన్వెస్టిగేటర్స్... పెద్ద పెద్ద వాళ్లు. కానీ పని చేసేది లేరు!"
ఒక్కసారిగా వర్మ గొంతు తీవ్రమైంది –
"డబ్బులు కుప్పలుగా తీసుకుంటారు,
పనితనం మాత్రం సున్నా!"
అంటూ ఫోన్‌ను గట్టిగా బెడ్‌పైకి విసిరేశాడు.
గ్లాస్ షెడ్‌లో అతని ప్రతిబింబం కనిపిస్తోంది...
అందులో అతను తానే కాదు, భయం, బాధ, కోపం కలగలిసిన ఒక రహస్యాత్మక వ్యక్తి.
వర్మ... అతని చీకటి గతం ఎవ్వరికీ పూర్తిగా తెలియదు.ఎపిసోడ్ 6: కలలలో ఉన్న కనెక్షన్
(సీన్ ప్రారంభం — నిశ్శబ్ద రాత్రి)
వర్మ తన టాప్ ఫ్లోర్ బెడ్ పై ఒంటరిగా పడుకున్నాడు. గదిలో హాయిగా ఏసీ నడుస్తోంది, వెలుతురు మృదువుగా ఉంది. కానీ అతని ముఖంలో విరామం లేదు... ఒక మానసిక కలత స్పష్టంగా కనిపిస్తుంది.
ఒక కల మొదలవుతుంది...
బలమైన తెల్లటి ట్యూబ్ లైట్లు వెలుగుతున్నాయి. చుట్టూ రౌండ్ టేబుల్స్, గౌన్లు వేసుకున్న సైంటిస్టులు.
సెంటర్ లో ఒక వ్యక్తి... అతని పాదాలకు జైలు గొలుసులు వేసి ఉన్నాయి. అతని చేతులు కట్టబడి ఉన్నాయి. అతని ముఖం స్పష్టంగా కనిపించదు – కానీ అతని అరుపులు గుండె బయపడేలా ఉన్నాయి.
"ఇది తప్పు... ఇది తప్పు... నన్ను వీళ్ళు చంపేస్తారు!"
సైంటిస్టులు అతనిని పట్టుకొని ఒక భారీ ఇంజెక్షన్ వేస్తారు.
అతను గట్టిగా అరుస్తాడు: "ఇది వస్తుంది... అది వస్తోంది... నన్ను విడిచిపెట్టు!"
అతని నరాలు ఫర్రెత్తిపోతాయి. ఆ క్షణంలో, ఒక్కసారిగా ఆ గదిలోకి ఎర్రటి వెలుగు ప్రవేశిస్తుంది – తలపై ఒక ఎర్రటి ఆకృతి. ఒక వ్యక్తి నీడ మాత్రమే కనిపిస్తుంది.
ఆ వ్యక్తి గొంతు:
> "ఇంకా 20 ఏళ్ల ఆకలి... ఇప్పుడు మొదలవుతుంది..."
>
అప్పుడే... స్క్రీన్ బ్లాక్!
కట్ టూ – సుమంత్ బెడ్‌పై
ఒక్కసారిగా సుమంత్ ఉలిక్కిపడి లేస్తాడు. అతని ముఖం చెమటలతో తడిసి ఉంది. అతని శ్వాస వేగంగా ఉంది, గుండె దడదడలు గట్టిగా వినిపిస్తున్నాయి.
అతను ఎదురుగా చూస్తాడు – "ఇది కలేనా? కానీ నన్నెందుకు భయపెడుతుంది?"
నీళ్ల బాటిల్ తీసుకొని కొంచెం తాగి, బెడ్‌పై కూర్చుంటాడు. అది చెరచిపోని కలలా అనిపించడంతో నిద్ర మళ్ళీ పట్టదు. కాసేపు చంద్రుడిని చూస్తూ ఉంటాడు. నిద్రపోవడానికి ప్రయత్నం చేస్తాడు. కానీ అతని మనసు ఆ కలపైనే నిలిచిపోతుంది...ద జాంబి ఎంపరర్ (The Zombie Emperor)
ఎపిసోడ్ 7: ఉదయాన్ని అలరించిన అక్షర
(సీన్ ఓపెన్ — తెల్లవారుజాము 6:30)
సుమంత్ నిద్రలో నవ్వు Episode తున్నాడేమో అనిపించేంత ముద్దుగా ఒళ్ళు ముడుచుకొని పడుకున్నాడు. అంతలోనే...
"ఛప్!"
ఒక్కసారిగా ఏదో చల్లటి నీళ్లు ముఖానికి తాకి, సుమంత్ ఉలిక్కిపడి కూర్చున్నాడు.
సుమంత్: "ఏవడ్రా వాడు! ఏంటివి నీళ్లు...?"
వెనక్కి తిరిగి చూశాడు.
అక్కడ... ఒక నీలి దుస్తుల్లో, మురిపెం నవ్వుతో అందాల దేవతలా అక్షర నిలుచుంది.
అక్షర: "లేచు మగబాబూ! ఆరున్నర అయింది. నీ కాలేజీ మిస్సవుతావ్!"
ఇంతలో లోపలినుండి, వంటింటి పక్కనుంచి మీనాక్షి గారి అరుపు:
మీనాక్షి: "ఏం రా? ఆ అరుపు ఏంటి? మళ్ళీ ఏం చేశావ్ నా కొడుక్కి?"
అక్షర (గట్టిగా నవ్వుతూ): "ఏం కాదు అత్తమ్మ! మీ కోడలనే కదా నేను... మీ కొడుక్కి బాగా చలివేసి స్నానం చేయించా అంతే!" 😇
మీనాక్షి (వేడుకగా): "అయ్యో బాబోయ్! నీవంటే ఏం నమ్మితేనయ్యా నేను!"
అక్షర నవ్వుతూ బయటికి పారిపోతుంది. వెనకాల సుమంత్ తడి ముఖంతో, ఒక చేత్తో తల నిమురుకుంటూ చూస్తూ:
"ఇదేమి శుభోదయం రా భగవా..." 😵💫EXT. కాలేజీకి దారి – ఉదయం 7:30AM
సుమంత్ అద్దంలోకి చూసుకుంటూ డ్రెస్ సెట్ చేసుకుంటూ బయటికి వస్తాడు. కాలేజీ బ్యాగ్ సర్దుకుంటూ బస్టాండ్ వైపు నడవటం మొదలుపెడతాడు. వెనకాల గాలి కొట్టేలా బ్లూ కలర్ శర్ట్ వాలుతూ, ఆత్మవిశ్వాసంగా ఉన్న వాడిలా అడుగులు వేస్తాడు.
అప్పుడే ఓవైపు నుంచి ఆసిఫ్ వచ్చి చేతి మీద చెయ్యేసి చెవిలో చెవికి:
ఆసిఫ్ (నవ్వుతూ):
"ఏంట్రా బావా… నిన్న ఏం మ్యాజిక్ చేశావ్ రా? కాలేజీకి నువ్వు, నీ మరదలు, శ్వేత – ముగ్గురూ కనిపించలేదు. ఏదో సీక్రెట్ మిషన్ అట్టా?"
సుమంత్ (నవ్వుతూ):
"ఓయ్ బాబు… తను నన్ను ఆటలాడిస్తోంది. నిన్న చేసిన పనికి నాకు ఇప్పటికీ షాక్ వదలట్లేదు. నువ్వు వింటే పడి పడి నవ్వుతావు. కానీ నా లోపల గందరగోళం మొత్తం."
ఆసిఫ్ (కొంచెం జోక్ గా):
"ఏంట్రా మరదలంటే అంత గోల అయ్యింది నికో? శ్వేత కూడా నిన్న రాలేదంట కదా… ఏదైనా ట్రయాంగిల్ డిజైన్ చేసావా?"
సుమంత్ (చెత్తగా నవ్వుతూ):
"అదే అయితే బాగుండేది రా... నేను ఎక్కడో చిక్కుకున్నా."
ఇద్దరూ ఇలా నవ్వుకుంటూ బస్టాండ్ దగ్గరకు వస్తారు. అప్పుడు అచానక వెనకనుంచి ఎవరో తోసినట్లు ముందుకు వాలిపోతాడు సుమంత్. బ్యాలెన్స్ తీసుకుంటూ వెనక్కి తిరిగి చూస్తాడు.
అక్కడ…ఆమె – అక్షర!
ఈ రోజు ఒక హాఫ్ వైట్ & లైట్ గ్రీన్ కాంబినేషన్ చుడిదార్ లో, పొడవాటి జడతో, చిరునవ్వుతో నిలబడి ఉంది. ఆమె చూపు లోతుగా చూసేలా ఉంది. నిశబ్దంగా, కాని స్పష్టంగా… ఏదో మాట్లాడుతోంది.
సుమంత్ లో లోపల మనసు:
"ఇదేంటి? ఇదెప్పుడైతే నన్ను గట్టిగా రెచ్చగొడుతోందో, ఇప్పుడు ఎందుకు ఇలా పల్లకిలో కనిపిస్తోంది? అసలు ఈ అమ్మాయి రోజు రోజు కి ఏంటి బాబోయ్!"
అక్షర తన ఎదుట వాలిపోయిన సుమంత్ ని చూసి:
అక్షర (సైలెంట్ గా నవ్వుతూ):
"అనుకోకుండా జరిగిపోయింది. అయినా నువ్వు ఈరోజు బాగున్నావ్."
అలా చెప్పి పక్కగా వెళుతుంది. ఆమె వెనకే నడుస్తూ సుమంత్ పక్కన ఉండే ఆసిఫ్ చెవిలో:
సుమంత్ (గమ్మత్తుగా):
"ఇదేంట్రా బావా… ఈ అమ్మాయి రోజురోజుకి అందంగా మారిపోతోంది. చూస్తుంటే నాలోని మనిషే మారిపోతున్నట్లు ఉంది."
ఆసిఫ్ (పుల్లగా నవ్వుతూ):
"బావా, ఇది లవ్ స్టోరీ బద్దలవుతున్న శబ్దం కావచ్చు… గౌరవంగా ఫాలో అవుతూ రా. ఏదో మ్యాజిక్ జరుగబోతుంది."ద జాంబి ఎంపరర్ (The Zombie Emperor)
0. బస్టాండ్ – ఉదయం 7:45AM
సుమంత్ పక్కన కూర్చున్న ఆసిఫ్, ఇంకొంచెం దగ్గరికి వచ్చి, "అవునురా... నిన్న రాత్రి ఏదో జరిగిందంట. ఒక్కసారిగా చెట్ల నుంచి ఒక వింతైన ఖడ్గం బయటకు వచ్చిందంట! దానికి పూజలు చేయడం కూడా మొదలుపెట్టారట. నీకేమైనా జరిగిందా?" అని అడిగాడు.
"నాకేం జరుగుతుంది?" అని సుమంత్ అనగానే, ఆసిఫ్ గట్టిగా నవ్వి, "ఏంటి... పొద్దున్నే నీ మరదలు వచ్చి స్నానం చేయించిందంట కదా!" అన్నాడు.