దృశ్యం: రుద్ర & అక్షర కొత్త జీవితం - లింగయ్య "డ్యూటీ"
స్థలం: రుద్ర & అక్షర కొత్త జీవితం ప్రారంభమైన రోజు. , అందరూ కాస్త రిలాక్స్ అయ్యారు, కానీ లింగయ్య ఇంకా తన "తాతగారి డ్యూటీ" పూర్తి చేయలేదు! అతని తేలికపాటి స్వరంలో కూడా లోతైన రహస్యం ఉంది.
(రుద్ర, అక్షర, శివ, సుమిత్ కలిసి కూర్చుని ఉన్నారు.)
లింగయ్య: చూడు రుద్ర, నువ్వు ఎంత బలమైన వాడివో నాకు తెలుసు. కానీ ఇది నీ బలం గురించి కాదు… నీ తరువాతి జన్మం గురించి!
రుద్ర: (కాస్త చిరాకుగా) తాతయ్య, పెళ్లి జరిగిందిగా. ఇంక నా ఫ్యూచర్ ప్లానింగ్ నీ మీద వదిలేస్తే, నేను ఈలోగా రిటైర్ అవ్వాల్సి వస్తుంది.
శివ: అవును తాతయ్యా, ఒక్కటే ప్రశ్న… ఇంత హడావిడి ఎందుకు?
లింగయ్య: శివ… నువ్వు నమ్మకపోవచ్చు, కానీ నా అనుభవం చెబుతుంది. నా మనవడి కొడుకు ఈ భూమిపై కొత్త శకం తెస్తాడు. మీ DNAలు కలిస్తే వాడు ఒక వాకింగ్ ఎనర్జీ బాంబ్ అవుతాడు!
(అందరూ కాస్త ఆశ్చర్యంగా చూస్తున్నారు.)
సుమిత్: హా! అంటే మన భవిష్యత్తు సూపర్ హీరోస్ మీద ఆధారపడి ఉంది అన్నమాట!
అక్షర: తాతయ్యా, మీకు మా ఫ్యూచర్ గురించి టెన్షన్ ఉంది, కానీ మాకు ప్రస్తుతానికి ఎంజాయ్ చేసే ఛాన్స్ ఇస్తారా?
లింగయ్య: (పెద్దగా నవ్వుతూ) హహహ! నేను మీ హనీమూన్ రద్దు చేయను! కానీ… ముహూర్తం లేకుండా ఏ పనీ జరగదు! ఇప్పుడు ఒక పెద్ద యుద్ధానికి రెడీ అవ్వాలి. అలాగే ముహూర్తం కుదిరితే, తరం మారే ముందే ‘మీ తరం’ పనులు పూర్తి అవ్వాలి!
(రుద్ర ముఖం మీద మొహమాటం. అక్షర సీరియస్‌గా తల వంచుతుంది. శివ, సుమిత్ నవ్వు ఆపుకోవడానికి ప్రయత్నిస్తున్నారు.)
రుద్ర: (తనలో తను) ఇది నా రెస్పాన్సిబిలిటీ! కానీ అంత త్వరగా యాక్సెప్ట్ చేయలేను…
శివ: … సారీ రుద్ర, కానీ ఇది లెజిట్ సౌండింగ్ లైక్ ఎ “సేవ్ ది వరల్డ్” మిషన్!
లింగయ్య: అవును, కానీ ఆ మిషన్ తర్వాత వచ్చే తరం కూడా భూమిని కాపాడాలి కదా! అందుకే వీలైనంత త్వరగా మీ భవిష్యత్తు గురించి ఆలోచించండి.
(సీన్ ముగుస్తుంది, కానీ రుద్ర మైండ్‌లో పెద్ద క్వశ్చన్ మార్క్. ఇది నిజంగా భూమి రక్షణ కోసమేనా, లేక లింగయ్య మళ్ళీ తన తాతగా ఆట మొదలుపెట్టాడా?)
రుద్ర ఆలోచనలు & వివాహ వేడుక
రుద్ర మనసులో, "ఇది నిజంగా ఎందుకు చేస్తున్నాడు? ఏదేమైనా కానీ, మన ముందు తాతయ్య పనికిరాడు అని అనిపిస్తుంది. అయినా తాతయ్య చాలా మంచివాడు. ఎందుకంటే నా లాకెట్టు ఇచ్చాడు, తర్వాత శివను పవర్ఫుల్ వ్యక్తిగా మార్చాడు. అలాంటి వాడిని అపార్థం చేసుకోకూడదు" అని అనుకుంటూ పెళ్ళికి సిద్ధమవుతాడు. ఒక వారం రోజుల తర్వాత మ్యారేజ్ ముహూర్తం కుదిరింది. పెళ్లి పనులన్నీ కుదిరాయి. ఆ తర్వాత వారం రోజులు నలుగురు స్నేహితులు (సుమిత్తో కలిపి) ఫుల్లుగా ఎంజాయ్ చేశారు.
ఇక వారం రోజుల అదే రోజు, లింగయ్యకు ఒక ఫోన్ కాల్ వస్తుంది. "సార్, ఇక్కడ కొంతమంది పిల్లలు మిస్ అవుతున్నారు. అది ఎక్కడికి వెళ్తున్నారో ఏమి అర్థం కావడం లేదు. మీరు రావాలి" అనగా, "చూడండి, మూడు నెలలు మమ్మల్ని డిస్టర్బ్ చేయకండి" అని చెప్పి కాల్ కట్ చేస్తాడు. ఆ తర్వాత వాళ్ళు మ్యారేజ్ హాల్‌కి బయలుదేరుతారు.
అది ఎంతో పెద్ద భవనం. అటు ఇటు రెండు ఏనుగులు, తమ కాళ్ళు పైకెత్తి రెండు దండలు పట్టుకున్నట్లు స్వాగతం పలుకుతున్నట్టు కనిపిస్తున్నాయి. చుట్టూ అందమైన డెకరేషన్, ప్రేమ గుర్తులు, హార్ట్ సింబల్స్, వధూవరుల ఫోటోలు.
ఆరోజు వచ్చిన ఫోన్ కాల్ తర్వాత మళ్ళీ రాలేదు. ఎందుకని ప్రశ్న ఉన్నా, పెళ్లి పనుల వల్ల పెద్దగా పట్టించుకోలేదు. ఇక పెద్ద మ్యారేజ్ హాల్లో రుద్ర వాళ్ళ తాతయ్య, పేరెంట్స్, శివ వాళ్ళ అన్న, వదిన, నాని, శ్వేతా తప్ప ఇంకా ఎవరూ కనిపించడం లేదు. "ఏంటయ్యా, ఇంత పెద్ద హాల్లో ఎవరు కనిపించడం లేదు?" అని రుద్ర అనుకుంటుండగా, లింగయ్య "వాళ్ళు లేకపోవచ్చు కానీ మనం ఉన్నాం కదా" అని చెబుతాడు.
కానీ అక్షర తన మనసులో చనిపోయిన తన నాన్నగారిని గుర్తు చేసుకుంటుంది. అది అర్థం చేసుకున్న రుద్ర ఒక్క పోర్టల్‌ని ఓపెన్ చేస్తాడు. అక్కడి నుండి వెలుతురు వచ్చి రావడంతోనే తన తాత రాజ్య ప్రజలు అక్కడికి చేరుకున్నారు. వాళ్ళందరూ కలిసి రుద్ర, అక్షరల పెళ్లి చేశారు.
మొదటి రాత్రి & జాన్ ప్రణాళిక
ఆ రోజు రాత్రి, మొదటి రాత్రి కోసం రుద్ర ఉత్సాహంగా తెల్ల చొక్కా, పంచ కట్టుకొని బెడ్ మీద పడుకొని రొమాంటిక్ సీన్ ఊహిస్తూ సిద్ధమవుతున్నాడు. బయట నుంచి రుద్ర వాళ్ళ అమ్మ, అలాగే శివ వాళ్ళ వదిన ఇద్దరూ అక్షరను తీసుకొని వస్తూ చిన్నగా నవ్వుతూ, గుసగుసలాడుతూ, "బెస్ట్ ఆఫ్ లక్" అంటూ రూమ్‌లోకి తోస్తారు. రుద్ర అక్షరను అలా చూస్తూ, "అబ్బ, ఎలా ఉన్నావే! అచ్చం చందమామలా కనిపిస్తున్నావు. ఇన్ని రోజులకు దొరికావు. ఈరోజు మనం పండగే, జాతరే, ఇక జాగారమే!" అని అంటూ ముందుకు వచ్చి అక్షరను పట్టుకొని మంచం దగ్గరికి తీసుకు వెళ్తాడు.
అలా చూస్తున్న రుద్రను చూసిన అక్షర మరింత సిగ్గుపడుతూ, "ఏంటి అలా చూస్తున్నావ్? ఎప్పుడూ చూసేలాగా లేదు. ఈరోజు నీ చూపులో ఏదో ఉంది. నాకు టెన్షన్‌గా ఉంది. నేను వెళ్ళిపోతా!" అని తిరుగుతూ ఉంటే, చెయ్యి పట్టుకుని, "నీ మొహంలాగే కనిపిస్తుంది. నీ కళ్ళలో ఏదో కుట్ర కనిపిస్తుంది. చూడు, నువ్వు అలా చూస్తే ఇది అస్సలు మంచిది కాదు. బాగా అనిపించడం లేదు" అని అంటుంటే, "ఏంటే తింగరి దానా! ఇప్పుడు బాగా ఏంటి? బాగా లేకపోవడం ఏంటి? ఫస్ట్ నైట్ ఈరోజు ఇలాగే ఉండాలి. ఈరోజు ఒకరినొకరు కరుచుకోవాలి!" అని మీదకి రాబోతుండగా, ఒక్కసారిగా ఫోన్ రింగ్ అవుతుంది.
'స్వామి నా స్వామి' అంటూ పుష్ప సినిమాలోని రష్మిక అల్లు అర్జున్ నటించిన పాట రింగ్‌టోన్ వినపడడంతో, "ఎవడు రా ఆ స్వామి వీడు?" అని అనుకుంటూ ఆ ఫోన్ తీయగా, అందులో సుమిత్, "మామా, ఎంజాయ్, పండగో! మాకంటే పండగ లేదు. మీరన్నా చేసుకోండి!" అని అంటూ గట్టిగా నవ్వుతాడు. "రేయ్, ఈ పండగ ఆపేదానికి నువ్వు వచ్చేలా ఉన్నావ్ కుక్క!" అని అంటూ కాల్ కట్ చేస్తాడు. వెంటనే తన ఫోన్లో 'వచ్చిందాయి ఫీలింగ్స్' అనే పాట పెట్టి లైట్ ఆఫ్ చేశాడు. ఆ పాటతో పాటు వాళ్ళ నవ్వులు పువ్వుల్లాగా మారి మంచమంతా కురుస్తూ ఉండగా చీకటిలో సీన్ కట్ అవుతుంది.
మరుసటి ఉదయం & జాన్ కుట్ర
అలా మార్నింగ్ అవుతుంది. అక్షర అసలు స్పృహ లేనంతగా నిద్రపోతుంది. రుద్ర మెల్లగా నిద్రలేస్తాడు. తన పైనున్న అక్షరను పక్కకు జరుపుతాడు. మెల్లగా పైనుంచి కిందకి చూస్తూ ఉండగా అక్షర మెల్లగా కళ్ళు తెరిచింది. "ఇది నీకు ఫస్ట్ టైమ్ ఏనా? ఇంతలా చేశావ్ అస్సలు!" అని అంటూ ఉండగా, "చూడండి మేడం, నేను కూడా కొత్తే కాబట్టి మీరు ఎక్కువ ఆలోచించకండి. నాకు ఎన్నో లవ్‌లు ఉన్నాయి కానీ పువ్వులు మాత్రం నీతోనే వేసాను" అని మాట్లాడడం మొదలుపెడతాడు. "సరే సరే, ఇక దీని గురించి వదిలేద్దాం. ఇంకో రౌండ్ రెడీనా?" అని అంటూ ఉంటే చిన్నగా నవ్వుతూ, "ఛీపో!" అని అంటూ డ్రెస్ సెట్ చేసుకొని బాత్రూమ్లోకి వెళ్తుంది. ఇలా సీన్ కట్ అవుతుంది.
రుద్ర దీని కోసం ఎదురు చూస్తున్నట్టు మంచం మీద అలా కూర్చొని "రా రా" అంటూ పూజలు చేసేవాడిలా కూర్చొని ఉన్నాడు. ఇంతలో డోర్ తెరుచుకుంది. అక్షర టవల్ కట్టుకొని తుడుచుకుంటూ వస్తుంది. మెడ దగ్గర నుండి అక్కడక్కడా పంటి గుర్తులు చూసి, "ఇవి నావే! ఈ పిల్ల నాదే!" అని అంటూ గట్టిగా హత్తుకొని అలా మంచం మీద అటు ఇటు దొర్లుతూ మరోసారి మొదటి రోజును ముగిస్తారు.
అలా ఫ్యామిలీతో, తన నాన్నతో హ్యాపీగా గడిపేస్తారు. ఇక అక్కడ తన ఫ్యామిలీతో హ్యాపీగా ఉన్నారు.
జాన్ ప్రణాళిక
కట్ చేసి మరో పక్క ఒక చిమ్మ చీకటి కమ్ముకుంటున్న వేళ, మెల్లగా గాలి ఒకరకంగా వీస్తూ ఉండగా ఒక చిన్న భవనంలో చిన్నగా వెలుతురు మొదలై ఒక పెద్ద అరుపు. "ఇన్ని రోజుల నా నిరీక్షణకు ఇంకొన్ని రోజుల్లో మొత్తం ఈ ప్రపంచం నా చేతుల్లోకి తెచ్చుకొనే టైం వస్తుంది!" అని అంటూ గట్టిగా నవ్వుతున్నాడు ఒక వ్యక్తి. అతడే జాన్.
తన చుట్టూ ఎన్నో పనికిరాని రోబోటిక్స్, ఒక పెద్ద వెపన్స్ ఉన్నాయి. ఇప్పుడు తన చేతిలో రెడ్ కలర్ లిక్విడ్. మరో పక్క ఆ నల్లటి చీకటి మబ్బులో ఒక కత్తి అలా ఎగురుతూ ఉంది, ఆ చీకటి చుట్టూ తిరుగుతూ ఉంది. అతని కళ్ళు ఇప్పటికే నిద్రలేని కారణంగా ఎర్రగా, గొంతు బిగ్గరగా, చేతులు కఠినంగా కనిపిస్తూ ఒక రాక్షసుడులా కనిపిస్తున్నాడు జాన్.
ఇక అతను ఇంకా మాట్లాడుతూ, "ఈ లిక్విడ్ గురించి నాకు కొంచెం కొంచెం అర్థమవుతుంది. ఇది భూమి మీద ఉన్న మనుషులది కాదు, నాది కాదు, రుద్రది కాదు. ఇది ఒక రాజుది. ఈ రాజు రక్తం చాలా విచిత్రంగా ఉంది. దీన్ని జంతువుల మీద చేసినపుడు ఎంత క్రూరంగా ఉన్నాయో, పవర్ తట్టుకోలేక అంతలా చచ్చిపోయాయి. కానీ ఒక్కడే, ఒకే ఒక్కడు దీన్ని అదుపు చేయగలడు. అది ఎవరో కాదు, కత్తి ఉన్న నేనే. నా చేతిలో కత్తి ఉన్నంతవరకు ఈ లిక్విడ్ ఏం చేయలేదు. ఉన్నంతవరకు నన్ను ఎవరూ అంతం చేయలేరు!" అని అంటూ ఆ లిక్విడ్ గురించి మాట్లాడుతాడు. ఇప్పుడు ఆ లిక్విడ్ పరిస్థితి ఏంటంటే, ఇది ఎవరిదో కాదు, విశ్వది. అదే రుద్ర మనుల రాజ్యంలో ఉన్న రాజుది. ఇంతకుముందు వచ్చినపుడు ఇతనికి ఇచ్చి వెళ్ళిపోయాడు. ఇప్పుడు అది భూమిని అంతం చేయడానికి ఒక రాక్షసుడిని సిద్ధం చేస్తుంది