The Zombie Emperor - 10 in Telugu Horror Stories by Ravi chendra Sunnkari books and stories PDF | థ జాంబి ఎంపరర్ - 10

Featured Books
  • My Secret Wife - 6

    शिवम: ठीक है डैड ।आरोही:जी अंकल।शिवम के डैड: हां ध्यान से कम...

  • काल कोठरी - 9

    काल कोठरी ----------(9)जिंदगी एक सड़क की तरा है... बस चलते जा...

  • वजन घटाने पर फैट कहाँ जाता है !

                                                           वजन घ...

  • Munjiya

    "अगर किसी की असमाप्त मुंडन संस्कार की आत्मा भटकती रहे, तो वह...

  • धोखेबाज़ औरत

    प्रस्तावनातेजपुर शहर की गलियों में जब कोई काजल का नाम लेता,...

Categories
Share

థ జాంబి ఎంపరర్ - 10

నేను నీకు చెప్పలేదు. కేవలం అతనికి తెలియాలి!" అని అంటాడు జగదీష్.వర్మకు ప్రభాకర్ ఇలా అంటున్నాడు: "సార్! మీ అల్లుడు, మీ కూతురు రంగనాథపురం లోనే ఉన్నారంట! తెలిసిందా మీకు?"

"ఏంటి? వాళ్ళు నాకు భయపడకుండా ఎక్కడికో పారిపోయి ఉంటారు అనుకున్నా! వాళ్ళు అంత ధైర్యంగా ఇక్కడే ఉన్నారా? ఎవడు వాడు? వీడికెంత ధైర్యం?" అని అనుకుంటూ వర్మ చిన్నగా పైకి లేచాడు.

ప్రభాకర్: "సార్, నాకు ఎందుకు, నాకు కరెక్ట్‌గా తెలీదు కానీ... అతడి తెలివితేటలు, అతని శక్తి చూస్తుంటే, మీ కొడుకుకు కావాల్సిన డీఎన్‌ఏ అతనిలో ఉండే అవకాశం ఉందనిపిస్తుంది. ఒకసారి అతన్ని పట్టుకొని చూద్దాం! ఉంటే చేసేద్దాం, లేదంటే విడిచిపెడదాం. అది మీ ఇష్టం!"

ప్రభాకర్ మాటలతో వర్మ మెదడులో భయంకరమైన ఆలోచన మెరిసింది. "నాకు అది తెలియదు కానీ, వాడిని పట్టుకొచ్చేయండి! కుదిరితే చంపేయండి! లేదా నిజంగా డీఎన్‌ఏ తీసేటప్పుడు వాడే చచ్చిపోతాడు. కాబట్టి అతనికి ఎటువంటి ఇబ్బంది ఉండదు. అసలు ఏం చేస్తున్నాడు?" అని వర్మ అడిగాడు.

ప్రభాకర్: "సార్, వాడు ఏదో పని కోసం వెతుకుతున్నాడంట!"

వర్మ: "సరే, మన మనుషుల్ని పంపించి అతనికి పని ఇస్తామని చెప్పి, తన ఫ్రెండ్‌ను కూడా పక్కకు తోసేసి, అతనిని మాత్రమే తీసుకువెళ్ళండి! ఎందుకంటే, అతనికి ఎందుకు? మనకెందుకు గొడవ?" అని అన్నాడు.

ర రంగనాథపురం నుండి సముద్ర తీరం వరకు

చెప్పినట్టుగానే ప్రభాకర్ కొంతమంది మనుషుల్ని పనిస్తామని చెప్పి ఊర్లో తిరుగుతూ చివరిగా రంగనాథపురంలో ఉన్న ఆదిత్యను పట్టుకొని తీసుకువెళ్తారు. అదంతా అనుమానంగా చూస్తూ ఉన్న రాము తన వెనకాలే వెళ్తాడు – ఆటో పట్టుకొని ఒకసారి, సైకిల్ తొక్కుతూ మరోసారి, ఎవరికి కనిపించకుండా ఇలా ఒక సముద్ర తీరంకి చేరుకున్నారు.

ఆ సముద్రంలో ఒక పెద్ద పడవ వచ్చింది. ఆదిత్య నిద్రపోయేలా అతని పిచ్చే నీళ్లలోనూ, ఆహారంలోనూ మత్తు మాత్రలు కలిపి నిద్రపుచ్చారు. అతడు రెండు రోజుల తరువాతే నిద్ర లేస్తాడు. ఇప్పుడు వాళ్ళు ఆ బోట్‌లో ఆదిత్యను ఎక్కించి ఎక్కడికో తీసుకెళ్తున్నారు. ఆ బోట్ వెనకాల ఒక చిన్న బోర్డు లాంటిది వేసుకొని వెళ్లిపోతూ ఉన్నాడు రాము.మీనాక్షి వివరణ – సుమంత్ ఇల్లు – ప్రస్తుత సమయం (కొనసాగింపు)

సుమంత్, "సరే అమ్మా, తర్వాత ఏం జరిగింది?" అని అడుగుతూ ఉంటే, మీనాక్షి, "ఏమో... తెలీదు నాన్న!" అని చెబుతుంది.

మీనాక్షి కొనసాగిస్తుంది: "నీ నాన్నను (ఆదిత్యను) పనికి వెళ్ళాడు. తర్వాత ఎవరు రాలేదు. తర్వాత మన మీద అటాక్ జరిగింది! నేను, రాము వాళ్ళ భార్య తప్పించుకున్నాం. కానీ నేను నిన్ను కన్నాను. అయితే, అక్షరను కనేటప్పుడు రాము వాళ్ళ భార్య చనిపోయింది! మీ ఇద్దరినీ చేతిలో పట్టుకొని, గుట్టుగా దాక్కొని ఇన్నాళ్ళు పెంచాను. ఇప్పటికీ అదే పరిస్థితిలో ఉన్నాను. ఇప్పటికీ పరిస్థితి సద్దుమణిగినా కానీ, ఎందుకో భయంగా ఉంది!"

మీనాక్షి తన నుదుటిపై ఉన్న అర్ధచంద్రకారపు బొట్టును చూపిస్తూ, "ఇది చూశావా? నా అర్ధచంద్రకారపు బొట్టు. 'ఎందుకని అడుగుతావు కదా?' అందుకే! మీ నాన్న చనిపోయాడో లేదో తెలియదు. నా మనసులో ఎప్పుడూ బ్రతికే ఉంటాడు. మీ నాన్నకు ఇలా బొట్టు తీయడం, తాళిబొట్టు తీయడం అస్సలు నచ్చదు. ఎప్పుడూ నన్ను కళకళలాడే లక్ష్మీదేవిలా చూడాలనుకుంటాడు. అందుకే ఇంతవరకు ఇది ఏదీ నేను చేయలేదు!" అని బాధగా అంటుంది.

"ఇప్పటికీ మీ నాన్న ఉన్నాడా లేదా అన్నది నాకు తెలియదు. కానీ ఈ బొట్టు చెరిగిపోలేదు అంటే మీ నాన్న ఇంకా భూమి మీదనే ఉన్నాడు!" అని మీనాక్షి బాధగా అంటుంది.

ఆదిత్య ప్రతీకారం – వర్మ ప్యాలెస్ – ప్రస్తుత సమయం (కొనసాగింపు)

అలా కట్ చేస్తే ఇప్పుడు ఆదిత్య చెబుతాడు. తన చేతిలో వర్మ గిలగిలా కొట్టుకుంటూ ఉంటే కిందికి దించుతాడు.

ఆదిత్య (వర్మతో): "ఏంట్రా! ఇప్పుడే పది నిమిషాలకి అల్లాడిపోయావా? నన్ను వారం రోజులు అలసట అంటే ఏంటో తెలియకుండా ప్రయోగాలు, సూదులు, ఇంజక్షన్లు... ఇన్ని చేసి నన్ను చివరికి ఒక్క ఇంజక్షన్ లో చంపేశారు!"

ఆదిత్య ప్రభాకర్ వైపు చూస్తూ (జాంబీగా ఉన్న ప్రభాకర్): "వీడు వచ్చాక నాకు అంతా అర్థం అయింది. నీకు ఆ ఐడియా ఇవ్వడం... నీ కొడుకుకు ఆ ఐడియా వచ్చేలా చేయడం... ఆస్తి కోసం కుట్రలు చేయడం... అన్నీ నాకు తెలుసు!" అని అంటూ, "సరే, మిగతాది కూడా చూద్దాం!" అని అంటూ మళ్ళీ వర్మ గొంతు పట్టుకొని పైకి లేపుతాడు. అతను గిలగిలా కొట్టుకుంటుంటే క్రూరంగా నవ్వుతూ, "ఎంత బాధగా ఉంది?!" అని వంకరగా నవ్వుతాడు ఆదిత్య.

 ఐలాండ్ – వారం రోజుల తర్వాత

ఇక సముద్రంలో వెళ్తున్న బోర్డు వెనకాలే రాము కూడా వెళ్తున్నాడు. కొద్దిసేపటికి ఒక ఐలాండ్‌లోకి చేరుకుంటాడు. ఐలాండ్‌లో చేరుకున్న తర్వాత అక్కడ కట్ చేసి వారం రోజుల తర్వాత చూపిస్తారు.

వారం రోజులుగా రాము వాళ్లు విడిచిపెట్టిన తిండి తింటూ బ్రతికేస్తున్నాడు. అసలు ఏం చేస్తున్నారో అర్థం కావడం లేదు. అది తింటూ ప్రతిరోజు చూడడం, విడిపించాలి అనుకోవడం, ఎవరో ఒకరు రావడం, మళ్ళీ దాక్కొని ఉండడం... ఇలా వారం రోజులు గడిచాయి.

వారం తర్వాత ఆదిత్యకు చిన్నగా మెలకువ వచ్చింది. అతను ఒక గ్లాస్ బోర్డు లాంటి దాంట్లో ఉన్నాడు. తన పక్కనే ఒక అమ్మాయి ఉంది. ఆ అమ్మాయికి నీలిరంగు పైపులు ఏదో ద్రవం లాంటిది వెళ్తూ, తన శరీరంలోకి చేరుతూ, మరో పక్క నుంచి తెల్లటి ద్రవం బయటికి వస్తూ, మరో పైపులోకి వెళుతుంది. అది తన శరీరంలో జరుగుతూ ఉంది.