The Zombie Emperor - 13 in Telugu Horror Stories by Ravi chendra Sunnkari books and stories PDF | థ జాంబి ఎంపరర్ - 13

Featured Books
Categories
Share

థ జాంబి ఎంపరర్ - 13

 ఆదిత్య (జాంబీ ఎంపరర్‌గా) ఉన్నంతవరకు పెద్ద సమస్య లేకుండా జాంబీలు కొంత కంట్రోల్‌గా ఉన్నాయి. అయితే, ఒకసారి వాటి ఆకలి పెరిగి, ఆదిత్య కనిపించకపోతే మాత్రం విధ్వంసం తప్పదని అందరికీ తెలుసు.

పూజ ప్రభావం – ఆదిత్య బంధీ, జాంబీల నియంత్రణ కోల్పోవడం

అదే టైంలో, సిద్ధార్థ మహర్షి చేసిన పూజ సక్సెస్ అయ్యింది. కాళీమాత కళ్ళల్లో నుంచి ఒక నల్లటి కాంతి విడుదలవుతూ, ఆదిత్య శరీరంలోకి చేరిపోతుంది (అది జగదీష్ శరీరం కదా). ఆ శరీరంలో నుంచి రెండు ఆత్మలు బయటికి వస్తాయి – ఒకటి నల్లటి ఆత్మ, మరొకటి ఎర్రటి ఆత్మ (ఆదిత్యతో). ఆ నల్లటి ఆత్మ ఎవరిది? అది ఒక్కసారిగా ఎక్కడికో మాయమైపోతుంది.

ఎప్పుడైతే ఆదిత్య, కాళీమాత దగ్గర నుంచి వచ్చిన వెలుగును తాకగానే, ఆదిత్య ఒక బాటిల్‌లో బంధించబడతాడు. అంతే! విధ్వంసం మొదలైంది! జాంబీలు తలలు పట్టుకొని కింద గిలగిలా కొట్టుకుంటూ, ఒక్కసారిగా లేస్తాయి. వాటి కళ్ళు విచిత్రంగా ఉన్నాయి – ఇప్పుడు తెలుపు, ఎరుపు రెండు కలిసిన ఒక విచిత్రమైన రంగులో ఉన్నాయి. అవి విధ్వంసం చేయడం మొదలుపెట్టాయి. ఎక్కడికో వెళ్తున్నాయి. వాటి మనసులో ఒకటే ధ్వని: "గురువుగారి భార్య బిడ్డను కనిపెట్టాలి! వాళ్ళను కాపాడాలి! అలాగే, ఈ ప్రపంచాన్ని నాశనం చేసి, వాళ్ళిద్దర్నీ రాజులుగా నిలబెట్టాలి!" అని ఒక నిశ్శబ్ద, భయంకరమైన ధ్వని జాంబీల తలల్లో వినిపిస్తూ ఉండగా, అన్ని పరిగెత్తడం మొదలుపెట్టాయి. అడ్డం వచ్చిన వాటిని తొక్కుకుంటూ పోతున్నాయి, పరిగెడుతున్నాయి.ద జాంబీ ఎంపైర్ - సుమంత్, అక్షర, మరియు మీనాక్షి

అలా జాంబీలు ప్రతి ఊరును నాశనం చేసుకుంటూ, ఎవరినో వెతుకుతున్నట్టుగా ఇళ్ళు కూలగొడుతూ కొద్ది దూరం వచ్చాయి. ఇప్పుడు అక్కడ కట్ చేస్తే సుమంత్ మరియు తన అమ్మ మీనాక్షి ఉన్న ఇంట్లో కనిపిస్తారు.

సుమంత్ అప్పుడే టీవీ చూస్తూ ఉన్నాడు. అతడు టీవీ చూస్తూ ఉన్నా కానీ, తన మనసులో ఆ వ్యక్తి ఎవరు? ఆ ఖడ్గం ఏంటి? ఈ అసలు ఈ రంగనాథపురం ఏంటి? అసలు మేమందరం ఇక్కడే ఎందుకు ఉన్నాం? అని ఆలోచిస్తూ ఉండగా, వెనకాల నుంచి ఎవరో వచ్చారు. చిన్నగా నెత్తికేసి కొట్టి, "ఏంట్రా! ఆరోజు సర్ప్రైజ్ ఇచ్చి వెళ్లిపోయావు. నన్ను ఒక్కసారి కూడా చూడలేదు, మాట్లాడలేదు! నువ్వు, అత్తమ్మ... అసలు నీకు అత్తమ్మకు ఏమైంది? చెప్పొచ్చు కదా!" అని అంటూ చిన్నగా దగ్గరికి వస్తుంది.

"అవును, నీకు ఒక విషయం చెప్పనా? ఆరోజు నువ్వు అంత దగ్గరగా చూసావు కదా? అప్పుడు నీకు ఏమనిపించింది?" అని చిన్నగా అడుగుతుంది.

అక్షర నుంచి మనసుతిప్పి, తన పక్కనే కూర్చుని ఉన్న అక్షరను చూస్తాడు సుమంత్. "ఏంటే! అలా చూస్తున్నావ్?" అని అడుగుతాడు.

అక్షర: "ఆరోజు నేను పడుకొని ఉన్నప్పుడు నువ్వు కూడా అలాగే చూసావు కదా? ఎందుకంత టెన్షన్ పడుతున్నావ్?" అని అంటూ ఇంకా దగ్గరికి వస్తుంటే...

సుమంత్: "దూరం జరుగు! నాకు ఇప్పుడు చిరాకుగా ఉంది!" అని అంటాడు.

అక్షర: "ఏంటి? ఇప్పుడు చిరాగ్గా ఉందా? మాకు లేదులే!" అంటూ పక్కకు తిరిగి కూర్చుంటుంది.

బాధపడుతుందేమో అనుకున్న సుమంత్ చిన్నగా, "సరే, చెప్పు ఏంటి సంగతి?" అని అంటూ ఉండగా, అక్షర మనసులో "నేను ఫీల్ అవుతున్నాను అనుకుంటున్నాడా?" అనుకుంటూ చిన్నగా నవ్వుతూ పక్కకు చూస్తుంది.

అప్పుడే సుమంత్ రిమోట్‌ను పట్టుకొని ఉన్నాడు. అప్పుడే మిర్చిలోని చిన్న సీన్ వస్తుంది. అసిన్ యాజ్ ఇట్ ఈజ్ వర్కౌట్ చేస్తూ ఉండగా, అక్షర చిన్నగా రిమోట్‌పైన ఉన్న సుమంత్ చేతి మీద తన చేయిని పట్టుకొని గట్టిగా పట్టుకుంది. ఎవరైనా చూస్తారేమో అని భయపడి...

సుమంత్: "ఏం చేస్తున్నావ్? వదలవే! ఏం తింటున్నావే? ఇంత గట్టిగా పట్టుకున్నావ్!" అని విడిపించుకోవడానికి ప్రయత్నిస్తూ ఉన్నాడు.

అక్షర ఇంకా కొంచెం దగ్గరికి వచ్చి, "ఏం తింటున్నానా? నీకు కూడా తినిపించనా?" అంటూ బుగ్గల దగ్గరికి వస్తూ ఉండగా, వెనకాల నుంచి మీనాక్షి "ఏం చేస్తున్నారు?!" అని గట్టిగా అరవడంతో, ఇద్దరూ దూరంగా జరిగి ఉంటారు.

అదే టైంలో, "తిట్టి తీస్తా, ఎదవ వేషాలు వేశారంటే!" అని చిన్నగా నవ్వుకుంటూ మీనాక్షి బయటికి వెళ్ళిపోతుంది. "ఇంకా ఇక్కడే ఉంటే ఎక్కడ ఇంకా మీనాక్షి తిడుతుందేమో" అని అక్షర బయటికి వెళ్ళిపోతూ ఉంటే, సుమంత్ గట్టిగా చేయి పట్టుకొని "కూర్చో!" అని అంటూ ఉంటే, "మీ అమ్మ ఇక్కడే ఉంది! చూసిందనుకో, చంపేస్తుంది!" అని విడిపించుకుని బయటికి వెళ్ళిపోతుంది అక్షర.

ద జాంబీ ఎంపైర్ – సుమంత్‌కు ప్రమాదం

అలా కట్ చేస్తే, ఆరోజు నైటు ఆ ఊర్లో పిల్లలందరూ మీనాక్షి చెప్పే ట్యూషన్ కోసం ఎదురుచూస్తున్నారు. అందరూ బయట కూర్చొని చదువు నేర్చుకుంటూ ఉంటే, లోపల టీవీ చూస్తూ ఉన్నారు అక్షర మరియు సుమంత్ ఇద్దరూ.

అలా టీవీ చూస్తూ ఉన్నప్పుడే, ఏదో సంఘటన వచ్చినట్టుగా కొంతమంది రిపోర్టర్లు ఇలా అంటున్నారు: "బ్రేకింగ్ న్యూస్! మరో కొత్త ప్రమాదం! వర్మ ఫ్యామిలీ అంతమైందని అనుకుంటే, ఇప్పుడు ప్రపంచం అంతమయ్యేలా ఉంది! జాంబీలు కలయికతో ప్రపంచాన్ని అతలాకుతలం చేస్తుంది! గవర్నమెంట్ కూడా పారిపోయే పరిస్థితిలో ఉన్నారు! కేవలం రిపోర్టర్లు మాత్రమే చావును తెగించి కోట్లాడుతున్నారు! ఇప్పుడు మీకోసం మీ న్యూస్ కవర్ చేయడానికి మా ప్రాణాలను అడ్డుపెట్టి లైవ్ చేస్తున్నాం! కొత్త కొత్త విషయాల కోసం చూస్తూనే ఉండండి!"

అని అంటూ ఉండగా, ఒక జాంబీ వచ్చి ఆ మహిళా రిపోర్టర్‌ను ఒక్కసారిగా నరకడంతో రక్తం టీవీ మీద పడింది! అంతే! అది చూస్తున్న వాళ్ళు బెదిరి చచ్చిపోయారు. చిన్నగా అరుస్తూ సుమంత్ మీద పడిపోతుంది అక్షర.

సుమంత్ (భయపడి): "టెన్షన్ పడకు!" అని అంటూ, అసలు ఏం జరుగుతుందో అని బయట చూస్తాడు. బయట అంత ప్రశాంతంగా ఉంది, కానీ ఎవరికో ఏదో తెలియని భయం అందరి మనసులో. ఎందుకంటే ఆ ఊరు చాలా ప్రశాంతంగా ఉంది.

ఆశ, నిరాశ – జాంబీలుగా మారిన సామాన్యులు

అప్పుడే బయట నుంచి ఊరిలోకి ఇద్దరు వ్యక్తులు వస్తారు. వాళ్ళ మొహం మీద దెబ్బలు, గాయాలతో విచిత్రంగా కనిపిస్తూ ఉంటే, అక్కడే ఉన్న ఆశ (ఆశాదాయి) మరియు నిరాశ అనే దంపతులు వాళ్ళని చూస్తారు. వాళ్ళల్లో ఆశ పుట్టింది, కానీ వాళ్ళ పేర్లకు తగ్గట్టు తర్వాత నిరాశకు గురవుతారేమో అన్నట్టుగా వాళ్ళ మొహాలు అమాయకంగా ఉన్నాయి. వాళ్లు గాయపడిన వాళ్ళ దగ్గర ఉన్న బంగారం చూసి వీళ్ళు ఆశపడతారు. వాళ్ళ దగ్గరికి వెళ్లి ఇంట్లోకి తీసుకొని వెళ్తారు.

బంగారం తీస్తున్న టైంలో ఏదో జరుగుతుంది. వెంటనే అదంతా చూస్తూ ఉన్న సుమంత్, "ఏం చేస్తున్నారు? కొంచెం కూడా తెలివి ఉన్నట్లు లేదు! ఇప్పుడేమో జాంబీలు వస్తున్నాయని అందరూ భయపడుతూ ఉంటే, గాయపడిన వాళ్ళని ఇంట్లోకి తీసుకెళ్తున్నారు?" అని లోలోపల అనుకుంటూ ఉండగా...

ఆశ, నిరాశల వాళ్ళ ఇంట్లో నుంచి ఒకసారిగా శబ్దాలు వచ్చి ఆగిపోతాయి. ఆ దెబ్బకు మీనాక్షి మరియు అక్షర భయపడి బయటికి వస్తారు.మీనాక్షి (టెన్షన్‌గా): "సుమంత్! ఎక్కడికి వెళ్తున్నావ్ రా? వద్దు! వచ్చేయ్! లోపలికి వెళ్ళిపోదాం!" అని అంటూ ఉంటే...

సుమంత్: "ఆగండి! ఏం జరిగిందో చూస్తా!" అని ఇటు తిరిగేలోపే, లోపల నుంచి (ఆశ, నిరాశల వాళ్ళ ఇంట్లో నుంచి) ఏవో రెండు ఆకారాలు స్పీడ్‌గా వెళ్లిపోయినట్టు కనిపిస్తుంది.

సుమంత్‌పై దాడి

సుమంత్ మెల్లగా ఆ ఇంట్లోకి వెళ్ళడానికి ప్రయత్నిస్తూ, గేట్ తెరుస్తాడు. ఎటువంటి శబ్దం ఉండదు. కేవలం ఫ్యాన్ తిరుగుతున్న శబ్దం మాత్రమే ఉంటుంది. ఇంకొంచెం వెళ్ళగా డోర్ క్లోజ్ అయి ఉంటుంది. "ఆ వెళ్ళిన ఆకారాలు ఎవరు? ఈ డోర్ ఎందుకు క్లోజ్ అయింది?" అని ఆలోచిస్తూ మెల్లగా డోర్ ఓపెన్ చేస్తాడు.

డోర్ ఓపెన్ చేసి లోపల తలపెట్టి ఏం జరుగుతుందని చూద్దామనుకునే లోపే, అలా పట్టుకొని ఎవరో లాగినట్టుగా లోపలికి వెళ్ళిపోతాడు. డోర్ అలాగే క్లోజ్ అవుతూ ఉండగా, వెంటనే తన తలను పట్టుకున్న వ్యక్తులను చూస్తాడు. వాళ్లే ఆశ, నిరాశ – జాంబీలుగా మారిపోయారు!

అంతే! బెదిరిపోయిన సుమంత్ వాళ్ళ చేతుల్ని పట్టుకొని తప్పించుకోవడానికి ప్రయత్నిస్తూ ఉండగా, వాళ్ళ చేతులకు ఉన్న గోర్లు సుమంత్ చేతి మణికట్టు మీద దెబ్బ తగులుతుంది! అంతే! వాళ్ళను విడిపించుకుని పరిగెడుతూ ఉండగా, వాళ్ళు మళ్ళీ సుమంత్ యొక్క కాళ్ళు పట్టుకొని వెనక్కి లాగారు. సుమంత్ తన కాళ్ళతో వాళ్ళ మొహం మీద రెండు పంచులు ఇచ్చి, విదిలించుకుని బయటికి వస్తాడు.