భూముల విలీనం: శకుని విజయం, ప్రజల జ్ఞానోదయం
యుద్ధభూమిలో, భూములన్నీ పూర్తిగా కలిసిపోయే సమయం ఆసన్నమైంది. ఐదు రకాల భూముల మధ్య ఉన్న ఆ నల్లటి బ్లాక్ ఎనర్జీ నెమ్మదిగా అన్నిటినీ ఒక చోటికి చేరుస్తోంది. ఒకరి శరీరంలోకి ఒకరు వెళ్ళినట్టుగా, ఐదు భూములు ఒక్కొక్కటిగా ఒకదాంట్లోకి ఒకటి వెళ్లడం మొదలుపెట్టాయి. ఆ దెబ్బకు భూమి అల్లకల్లోలం అవుతూ, ప్రజలు కళ్ళు తిరిగి పడిపోయే స్థాయికి చేరుకున్నారు. అగ్నిపర్వతాలు ఉప్పొంగి పడిపోతూ ఉండగా, సముద్రాలు పొంగిపోతున్నాయి.
ఒక్కసారిగా ఐదు రకాల భూములు కలిసిపోవడంతో, ప్రజలు ఒక నాయకుడి కోసం ఎదురుచూస్తున్నట్టుగా అందరూ మోకాళ్ల మీద పడ్డారు. పైన ఎగురుతున్న శకుని వాళ్ళందరినీ చూస్తూ, "ఇప్పటికి ఒప్పుకున్నారు! మీ అందరినీ ఒప్పించడానికి నేను ఎన్ని కష్టాలు పడ్డాను! ఇప్పటి నుంచి కలియుగ రాజకీయమంటే ఏంటో చూపిస్తా! చావండి!" అని అంటూ గట్టిగా నవ్వుతున్నాడు.
ఒక్కసారిగా ఏదో జరుగుతుంది. చుట్టూ వెలుగు పరుచుకుంటుంది. వెలుగు పడిన ప్రతిచోట నెగటివ్ ఎనర్జీ దూరంగా పారిపోతుంది. వాటితో పాటు ఏదో పాడిన పాటలా కనిపిస్తుంది. కానీ హీరోలు లేవలేక పోతున్నారు. వాళ్ళు ఎనర్జీ అంతా డ్రైన్ అయిపోయినట్టుగా అందరూ మోకాళ్ళ మీద కూర్చున్నారు. వాళ్ళు కూడా శకునికి లొంగిపోయినట్టుగా కనిపిస్తున్నారు.
ఒక్కసారిగా నీరు, నిప్పు, గాలి మొత్తం పంచభూతాల శక్తులు అల్లకల్లోలం చేస్తున్నాయి. ప్రపంచమంతా ఇప్పుడు ఐదు రకాల ప్రపంచంలోని వాతావరణాలు ఒక్కసారిగా కలిసిపోవడంతో, ప్రకృతి శక్తులకు పిచ్చి లేసినట్టుగా ప్రపంచాన్ని అతలాకుతలం చేస్తున్నాయి. జంతువులు పూర్తిగా చనిపోయే స్థాయికి చేరుకున్నాయి. మహా శక్తివంతమైన గుడులు (దైవశక్తులు) రూపం, రంగుల్లోకి మారిపోతున్నాయి. ఇప్పుడు కల్కి జననం ఎలా ఉందో మనకు తెలుసు. ఇప్పుడు గుడుల శక్తులు కూడా ఒకటేలా కనిపిస్తున్నాయి.
అంతటితో ఆగకుండా ఐదు రకాల భూముల్లో ఉన్న ప్రజలు ఒకరితో ఒకరు కలిసిపోయారు. ఇప్పుడు వాళ్ళందరికీ తెలిసింది ఏంటి? ఇప్పుడు మనకు రాజు కావాలి. కానీ అంతకు ముందు జరిగిందేంటి? విధ్వంసం. అంటే ఇప్పుడు కలియుగం అంతం అని పూర్తిగా అందరూ శకునికి లొంగిపోయారు. అక్కడ హీరోలు ఉన్నారు. హీరోలకు మనుషులు తెలుసు. కానీ ఐదు లోకంలో ఉన్నవారికి ఈ ఐదుగురు హీరోలు తెలుసు. వీళ్ళకు చాలా విచిత్రంగా ఉంది. ఇంతవరకు కనిపించని హీరోలు ఒక్కసారిగా తమ మైండ్‌లో మెదడడం, "వీళ్ళు మనవాళ్ళు" అనిపించడం కానీ ఎప్పుడూ చూడకపోవడం అస్సలు ప్రజలు తికమక పడుతున్నారు. ఇది ఎందుకు జరిగిందో అందరికీ తెలుసు.
దైవలోకాలలో చర్చ: అంతమా? ఆరంభమా?
పై నుంచి చూస్తున్న హనుమంతుడు, "ఇది అంతమేనా?" అని అంటున్నాడు. అశ్వత్థామ, పరశురాముడు కూడా, "అయితే మా శాపం ఇంకా విముక్తి కాదా?" అని అనుకుంటున్నారు. అందరూ "కాదా? కాదా? కాదా?" అని అనుకుంటున్నారు. కానీ శివుడు, బ్రహ్మదేవుడు మాత్రం "ఇప్పుడే ఆరంభమైంది!" అన్నట్టుగా నిశ్చలంగా చూస్తున్నారు.
పార్వతి మాత ఇలా అంటుంది, "చివరగా ఒక్క ప్రశ్న మహాదేవా! ఈ కల్కి ఇలా ఎప్పుడు వస్తాడు మనకు అర్థం కావడం లేదు. కానీ ఆ పాట పాడే వ్యక్తి ఎవరు?" అని అడుగుతుంది. అప్పుడే అక్కడికి వచ్చిన సరస్వతి దేవి కూడా, "అవును అక్క! అసలు వీళ్ళు చెప్పమంటే మనకు ఏ రహస్యం చెప్పడం లేదు. అందరూ ప్రశాంతమైన చిరునవ్వుతో ధ్యానం చేసుకుంటున్నారు. మనమే తెలుసుకోవాలి!" అని అంటూ ఒక్కసారిగా వైకుంఠానికి వెళ్లడానికి సిద్ధమవుతారు.
వైకుంఠంలో కృష్ణుడి లీల: నారదుడి ప్రవచనం
అప్పుడే వైకుంఠంలో ఉన్న పాలసముద్రం మీద పడుకొని ఉన్న శ్రీకృష్ణుడు తన శరీరంలో నుంచి ఒక ఆత్మలా బయటికి వస్తాడు. అతని చూసిన రుక్మిణి, సత్యభామ ఇద్దరూ, "స్వామి! ఎక్కడికి మీరు వెళ్తున్నారు? మీకు అక్కడ శరీరం లేదు! మీరు ఎలా ఒకటవుతారు శరీరంతో? ఈ కలియుగం అంతా ఎలా చేస్తారు? ఆ శకుని ఇంత దుర్మార్గం పని చేస్తాడని మాకు అస్సలు అనిపించలేదు కానీ, ఇలా మీరే చేయించారని తెలిసాక మాకు అసలు మెదడు పని చేయడం లేదు! మీ లీలలు ఎవరికి అర్థమవుతాయి?" అని అనుకుంటూ ఉండగా, 'థింగ్ థింగ్' అంటూ అక్కడికే నారదుడు వస్తాడు.
ఇప్పుడు వైకుంఠంలో చూపిస్తారు. వెళ్తున్న శ్రీకృష్ణుడు చిన్నగా వెనక్కి తిరిగి, "నేను అదుపు తప్పినప్పుడు మీరు మర్చిపోకండి నారద, పూర్తి విషయం చెప్పు!" అని అంటూ ఒక్క చిటికలో అక్కడి నుంచి మాయమైపోతాడు. ఇప్పుడు నారదుడు తన చేతిలో ఉన్న వస్తువును 'టింగ్ టింగ్' అంటూ శబ్దం చేస్తూ చెప్పడం మొదలుపెట్టాడు.
"ప్రతి యుగంలో కృష్ణుడు పుట్టాడు, అంతం చేశాడు అన్నట్టుగా కాదు. ప్రతి యుగంలో చేసిన యుద్ధానికి మరో కథకు జోడిస్తూ కథను సృష్టించాడు. తలుచుకుంటే అప్పుడే అందరినీ అంతం చేయగలిగే శక్తి ఉన్న కృష్ణుడు ఎందుకు ఇంత చేశాడు? కొంతమంది శత్రువులను అలా వదిలి పెడుతూ వచ్చాడు. ఎందుకంటే కలియుగ చివర్లో ఖచ్చితంగా అతను శత్రువులు అందరూ గట్టిగా నిలబడి తనతో పోరాటం చేస్తారు. ఆ పోరాటంలో కచ్చితంగా ఎలాగూ కృష్ణుడు గెలుస్తాడు. అందరినీ ఒకేసారి అంతం చేయాలని ఆశించిన కృష్ణుడు ఇప్పుడు ఇంతటి పరిస్థితులున్నాడు. మీకు సమాధానం రాదా?" అని అనడంతో సీన్ కట్ అవుతుంది.
"కలియుగాంతంలో పాపాలను అన్నిటినీ కడిగేయాలని అనుకున్నాడు. కానీ భూమి సంగతి ఆయనకు కూడా తెలుసు కదా! భూమి పాపాలకు నిలయం. పాపం చేసిన వాళ్ళు భూమ్మీదనే ఉంటారు. అందరూ అంటారు కదా నరకంలో శిక్ష అనుభవిస్తారని, కానీ నిజం ఏంటంటే భూమి మీదనే వాళ్ళు మానసికంగా, శారీరకంగా కష్టపడి చనిపోతారు. చివరికి తమ పాపాలు పూర్తిగా కడగడానికి యమలోకంలోకి వెళ్తారు. అందరూ చూపించినట్టుగా అక్కడ ఎంతవరకు పాపాలను కడుగుతారో తెలియదు కానీ, ఒక సముద్రాన్ని ఈదుతారు. అప్పుడు ఆత్మ, 'ఈ జీవితాన్నే ఎంతో సులభంగా ఈదాను, ఈ చెరువు ఎంత?' అని అనుకుంటారు."
రాధాదేవి: ప్రేమ, జ్ఞానం, మరియు మానవత్వపు పాఠం
"అది సరే నారద మహర్షి, రాధా రాధ అంటే ఎవరు? రారు అని అడుగుతారు?" అని అడుగుతారు. వెంటనే నారదుడు చిన్నగా నవ్వుతూ, "రాధాదేవి ఒకప్పుడు కృష్ణుడు ప్రేమించిన అమ్మాయి," అని అనడంతో అందరూ ఒకసారిగా సైలెంట్ అవుతారు. అందరికీ అప్పుడు అర్థమవుతుంది ప్రేమ ఎంత గొప్పదో, అంత క్రూరమైన వాడినైనా మార్చగలిగే శక్తి ప్రేమకు మాత్రమే ఉంది. "మీ అందరూ అనుకుంటారు ఇప్పుడు తను ఎక్కడుందో ఎలా తెలుసుకోవాలి అని?" అందరూ అడుగుతారు. "గంగాదేవితో కలిసి ధ్యానం చేస్తూ ఉంది," అని చిన్నగా నవ్వుతూ అక్కడ సీన్ కట్ అవుతుంది.
ఇప్పుడు భూమ్మీద చూపిస్తారు. ప్రజలు అందరూ మోకాళ్ళ మీద ఉన్నారు కదా. వాళ్ళల్లో ధనవంతులు, డబ్బు లేని వాళ్ళు అంటే పేదవాళ్ళు, కులమత భేదాలు లేకుండా వాళ్ళకు అర్థం అవుతుంది ఏంటంటే చావు అందరికీ ఒకేలా వస్తుంది. ఒకరిని చూసి ఒకరు ఇలా అనుకుంటున్నారు, "వీడు ఎంత బాగా బ్రతికాడో కానీ ఇప్పుడు ఇలా చనిపోతున్నాడు." ఇంకొకరు ఇలా అనుకుంటారు, "నేను ఎంత బాగా బతికాను కానీ వీళ్ళతో కలిసి చనిపోతున్నాను." ఇంకొకరు ఇలా అనుకుంటాడు, "నేను ఎంత దుర్భరంగా బతికాను కానీ నాకంటే ఎంతో బాగా బ్రతికిన వాళ్ళతో చనిపోతున్నాను." ఇప్పుడు అందరికీ అర్థమైంది ఏంటంటే, చావు అందరికీ ఒకటే. చావు బ్రతుకులు అందరికీ ఒకటే. కేవలం ఈ బ్రతికే స్థాయిలో లెవెల్స్ అంటూ, మతాలు, కులాలు అంటూ అందరూ పెట్టుకుని కొట్టుకొని చివరికి ఒకేసారి చనిపోయే స్థితికి వచ్చారు అని ప్రజల్లో తమ మనసుల్లో ఇలా అనుకుంటున్నారు.
మీకు కథ ఎలా అనిపించిందో ఇప్పటికైనా చెప్పండి ఆల్మోస్ట్ కథ పూర్తి అయిపోతుంది మీ నుంచి కనీసం రెస్పాన్స్ కూడా రాలేదు 🥺🧘