Beautiful.. girl. in Telugu Women Focused by PRINCE PREMKUMAR books and stories PDF | అందమే.. ఆడపిల్ల

Featured Books
Categories
Share

అందమే.. ఆడపిల్ల

ఆడపిల్ల అందానికి పోలిక అవసరమా
ఆడపిల్లని చందమామతో ఎందుకు పోలుస్తారు
కేవలం అందం విషయంలోనైనా లేదంటే మరింకేదైనా విషయంలో ఆడపిల్లని చంద్రునితో పోలుస్తారా..
ముఖ్యంగా మన కవులు సినీ గేయ రచయితలు
ఆడపిల్లని చందమామతో పోలుస్తూ ఎన్నో పాటలు
వ్రాశారు.
ఇదంతా కేవలం కల్పన ఏనా 
లేకపోతే దీని వెనక ఏదైనా బలమయిన  
కారణం ఉందా
అని ఆలోచిస్తే...
దీని వెనక ఒక బలమైన కారణం ఉంది.
అమావాస్య నుంచి పౌర్ణమి వరకు చంద్రుని యొక్క చంద్రకళను చంద్రుని హెచ్చుతగ్గులు ఆడవారిలోనీ
మానసిక స్థాయిని నిర్ధారిస్తాయి

వేద జ్యోతిషశాస్త్రం ప్రకారం, చంద్రుడు మనస్సు
మరియు భావోద్వేగాలను నియంత్రిస్తాడు
చంద్రుని గురుత్వాకర్షణ శక్తి ఈస్ట్రోజెన్ మరియు ప్రొజెస్టెరాన్ వంటి హార్మోన్ల విడుదలను ప్రభావితం చేస్తుంది
ఇవి ఋతు చక్రాన్ని నియంత్రించడంలో కీలక పాత్ర
పోషిస్తాయి.
ఋతు చక్రాన్ని చంద్ర చక్రంతో సమలేఖనం చేయడం వల్ల
ఆరోగ్యం, ఆరోగ్యం, సంతానోత్పత్తి మరియు పీరియడ్స్నొ ప్పిని మెరుగ్గా నిర్వహించవచ్చని నమ్ముతారు. 
ఆయుర్వేదం, ప్రాచీన భారతీయ వైద్య విధానం, 
చంద్ర దశలు మరియు స్త్రీ ఋతు చక్రం మధ్య
సమకాలీకరణను కూడా గుర్తిస్తుంది. 
భారతీయ సంస్కృతిలో ఋతుస్రావం అనేది కేవలం
జీవ ప్రక్రియ మాత్రమే కాదు, ఇది  పునరుజ్జీవనానికి
పవిత్రమైన సమయం

చంద్రుని యొక్క మార్పులు కూడా చాలామంది
ఆడవారిలో వారి మూడ్ మారుస్తూ ఉంటాయి.
అమావాస్య దగ్గర పడుతున్న సమయంలో డిప్రెసివ్గా
విపరీతమైన ఆలోచనలతో...
శారీరకంగా కూడా ఇబ్బందిగా ఉంటారు
అదే పౌర్ణమి సమయంలో ఏదో తెలియని కొత్త ఉత్సాహం
కొత్త ఆనందం మనసులో నిండిపోతుంది.
ముఖ్యంగా పౌర్ణమి రోజు గమనించినట్టయితే
శరీరంలో ఉత్సాహమంతమైన భావనలో కొత్త కొత్త
ఆలోచనలు కోరికలు కలుగుతాయి.
చాలామంది ఆడవారిలో పౌర్ణమి సమయాలలో
శృంగారపరమైన కోరికలు కూడా అధికంగానే ఉంటాయి.
మానసిక స్థాయిని కంట్రోల్ చేయడంలో చంద్రుడి పాత్ర ఎక్కువగానే ఉంటుంది.

పున్నమి వెన్నెల జాబిల్లిలా ప్రతి ఆడపిల్ల అందమే కదా..
మళ్లీ చందమామతో పోలిక దేనికి..
కాదంటారా

ఆడపిల్ల అందం ఎక్కడ ఉంటుంది...
నేనైతే ఇలా చెప్తా...
తమకు బాగా ఇష్టమైన వారితోనే భావోద్వేగాలను పంచుకోవడంలో ఉంటుంది...
సుతిమెత్తగా దెప్పిపొడవడంలో ఉంటుంది...
గారంగా నచ్చింది కొనిపించుకోవడంలో ఉంటుంది...
మనసైన వాళ్ళు చేసే తప్పుల్ని ఎత్తిచూపడంలో ఉంటుంది...
జుట్టు ముడి వేసుకోవడంలో ఉంటుంది...
లంగా ఓణీలో ఉంటుంది....
చీరకట్టు పట్టు చీరలో ఉంటుంది.
అదేం మాయనో తెలియదు కానీ 
కొంతమంది కట్టుకుంటే చీరకే అందం వస్తుంది...
జడ ముందుకేసుకోవడంలో ఉంటుంది...
ముక్కు పుడకలో ఉంటుంది...
చెవులకు పెట్టుకునే బుట్టల్లో ఉంటుంది...
కళ్ళ కాటుకలో ఉంటుంది..
కవ్వించే కళ్లల్లో ఉంటుంది...
పంటికింద నలిగే పెదాల్లో ఉంటుంది...
వయసును గుర్తు చేసే నడుము మడతలో ఉంటుంది
మొహం మీదకు వస్తున్న జుట్టు పాయల్ని 
వేళ్ళతో వెనక్కి తోసుకోవడంలో ఉంటుంది....
కోపంలో ఉంటుంది....
సుతిమెత్తగా తిట్టడంలో ఉంటుంది.
వారి ధైర్యంలో ఉంటుంది...
ఇంటిని చక్కబెట్టడంలో ఉంటుంది.
కుటుంబం మీద చూపించే అనురాగంలో ఉంటుంది.
పసిపిల్లలను కంటికి రెప్పలా సాక్కునే ఆప్యాయతలో ఉంటుంది.
ఎదురు చూపులో ఉంటుంది.
నమ్మినవాడు సర్వస్వం అనుకోవడంలో ఉంటుంది...

ఆడవారికందరికీ కలిపి ఒకే సైకాలజీ ఉంటుందా. 
లోకంలో కొన్ని కోట్ల మంది ఆడవారున్నారు.
ఎవరి ప్రత్యేకత వారిదే. ఎవరి మనసు మాట వారిదే
మగవారిలో ఎన్ని రకాలవారున్నారో
ఆడవారిలోనూ అంతే. 
ఆడవారి స్వరం మగవారి స్వరం కంటే మృదువుగా ఉంటుంది. 
వారు ఏ పని చేసినా మృదుత్వం కనిపిస్తుంది.
సహజంగానే ఆడ వారికి బిడియం ఎక్కువ. 

 
ఒక్కమాట లో చెప్పాలంటే ఆడపిల్ల కి 
అణువణువు అందమే.
ఆ అందానికి వయసుతో పనిలేదు శరీర రంగుతో పనిలేదు
ఓంపు సోoపులతో పనిలేదు.
చూసే కళ్ళు ఆస్వాదించమనస్సు ఉంటే అణువణువు అందమే కదా

బహుశా... అందమనే మాట ఆడపిల్లను చూసాకే
పుట్టిందేమో

అందం అంటే ఒంపు సొంపులు ఒంటి రంగు కాదు 
ఒంటి రంగు మాత్రమే అందం అని ఆలోచన కల్పించి ఆ ఆలోచనను ఇష్టంగా మలిచి
అల్ఇష్టాన్ని అవసరం గా మలిచి
ఆ అవసరాన్ని కోరికగా తయారు చేసి...
ఆ కోరికను వ్యాపారంగా మలచింది నేటి సమాజం
సింపుల్ గా చెప్పాలి అంటే...
తెలుపు స్కిన్ టోన్ అంటే అందరికీ ఇష్టo 
ఎందుకంటే అందర్నీ ఆకర్షిస్తుంది అని గట్టి నమ్మకం.
కాకపోతే ఇది పూర్తిగా నిజం కాదు
ఎందుకంటే...
చాలావరకు ఫారన్ కంట్రీ అమ్మాయిలకు బ్రౌన్ కలర్ 
బ్లాక్ కలర్ ఉండే మన ఇండియా అబ్బాయిలు అంటే
చాలా ఇష్టం
తెల్లగా ఉన్నవాళ్లే అందంగా ఉంటారు అనే
జనాల ఈ బలహీనతనే
ప్రతి సంవత్సరం కోట్లల్లో వ్యాపారం చేయిస్తుంది.
మరి లేకపోతే ఏంటి బాబాయ్ ..
నిజంగా ఫెయిర్నెస్ క్రీమ్ వాడితే తెల్లగా అవుతారా
కేవలం తెల్లగా అవుతారు అనే ఒకే ఒక్క అబద్ధంతో 
కోట్లు సంపాదిస్తున్నారు.
తెల్లగా ఉన్న వాళ్లకే ఆత్మవిశ్వాసం ఉంటుందా 
నల్లగా ఉండే వాళ్లకు ఉండదా
మరెందుకు ఈ ఆలోచన

తెల్లగా ఉంటేనే అందంగా ఉంటారు అనే అమాయకపు ఆలోచనని
జనాలపై రుద్దారు అందరూ బాగా నమ్మారు 
కాబట్టి తెల్లగా ఉంటేనే అందంగా ఉంటారు అని 
గట్టిగా ఫిక్స్ అయిపోయారు
ఎంతగా అంటే  నల్లగా ఉన్నవాళ్లు అవమాన పడుతూ కృంగిపోయే అంతగా

మన అందానికి ఎవరో సర్టిఫికేషన్ ఇవ్వడం ఏంటి? 
ఎవరో మెచ్చుకుంటేనే మనం అందంగా ఉండడమేంటి మనం అందంగా ఉన్నామా లేమా అనేది మనకు తెలియదా..

బ్రౌన్ కలర్ ఉండేవాళ్లు చాలా ధైర్యంగా ఉంటరు
ఎందుకంటే వాళ్లు డస్ట్ లో తిరిగిన
ఎండలో తిరిగిన 
చర్మం లో జరిగే మార్పులు పెద్దగా కనిపియ్యవు 
అదే అందం గురించి వాళ్ళ భయపడాల్సిన పనిలేదు
కానీ తెల్లతోలు ఉన్నవాళ్లు మాత్రం
ప్రతిక్షణం భయపడాలి
ఎండకు వెళ్ళలేరు  దుమ్ముకు వెళ్లలేరు
కాస్త వాటర్ మారినా కూడా దాని ప్రభావం ఎక్కువగా చూపిస్తుంది


ఆడపిల్ల అంటేనే అందం అందం అనుమణువులో ఉంటుంది ఒంటి రంగు మాత్రమే అందం కాదు తెల్లగా ఉంటేనే అందం కాదు మనసు అందం మాట అందం మైమరపించే కన్నులు అందం ఆడపిల్ల చూపించే ప్రేమ అందం తను చూపించే కోపం కూడా అందమే అందమే అనువనంలో నింపుకొని పైపై మెరుగులకు భ్రమ పడటం అది అందానికే అవమానం కాదా