The Endless - 17 in Telugu Mythological Stories by Ravi chendra Sunnkari books and stories PDF | అంతం కాదు - 17

Featured Books
Categories
Share

అంతం కాదు - 17


ఉత్కంఠభరితమైన మలుపులు: జాన్, రుద్ర, మరియు భవిష్యత్ యుద్ధం

జాన్ భయంకరమైన మార్పు

ఆ చీకటి కత్తి ఒక్కసారిగా మాయమై జాన్ చేతుల్లోకి వచ్చింది. వెంటనే జాన్ కూడా చీకటి ప్రపంచంలోకి చిక్కుకున్నట్టు, గట్టిగా నవ్వుతూ "నాది! నాది!" అంటూ అరుస్తూ కనిపించాడు. సీన్ కట్ అయ్యింది.

మళ్ళీ రుద్ర వైపు చూస్తే, అతను హ్యాపీగా ఉన్నాడు. అలా మూడు నెలలు గడిచాయి. ఇక మళ్ళీ కట్ చేసి జాన్ వైపు చూపిస్తారు. అతను ఇప్పుడు జంపక వెంట్రుకలతో, ఎర్రటి కళ్ళతో, తన చేతిలో ఇంజెక్షన్‌తో, చుట్టూ రోబోట్‌లతో, తన పక్కనే ఒక కత్తితో విచిత్రంగా కనిపిస్తూ, క్రూరమైన జంతువుల రాక్షసుడిలా మారిపోయి ఉన్నాడు.

ప్రమాద హెచ్చరిక & లింగయ్య ఆందోళన

వెంటనే ఎక్కడో ఉన్న ఒక పావురం ఒక మెసేజ్ పంపింది. నీలిరంగు డైమండ్లు ఉన్న ప్రదేశంలో కంప్యూటర్లలో "డేంజరస్ కమింగ్! యువర్ డేంజర్! డేంజర్ అలర్ట్!" అని రెడ్ కలర్‌లో భయంకరమైన ఫేస్‌తో ఉన్న జాన్ ఫోటో కనిపించింది. ఇదంతా గమనిస్తున్న లింగయ్య, "ఏంటి ఇంత త్వరగా అయిపోయిందా? ఈ రుద్ర ఏం చేస్తున్నాడు?" అని అనుకుంటూ, వెతుక్కుంటూ సస్పెన్స్‌గా రుద్ర ఉన్న ప్రదేశానికి వెళ్తాడు. అప్పటికి రుద్ర తన కుటుంబంతో హ్యాపీగా ఉన్నాడు. శివ కూడా అక్కడే ఉండి వాళ్ళతో మాట్లాడుకుంటూ హ్యాపీగా ఉన్నాడు.

ప్రపంచమంతా చీకటిలో & రుద్ర నిస్సత్తువ

వెంటనే చుట్టూ ఉన్న ప్రపంచం మీద ఉన్న నెట్‌వర్క్ మొత్తం కట్ అయ్యింది. పవర్ సప్లై కూడా కట్ అయ్యింది. "చీకటి ప్రపంచం! చీకటి ప్రపంచం!" అంటూ విసుగుపడుతున్న శబ్దాలతో ఒక్కసారిగా అందరూ ఉలిక్కిపడి నిద్రలేచారు. ప్రపంచమంతా ఉలిక్కిపడింది. ఒకే ఒక్క అరుపు ప్రపంచానికి అతలాకుతలం చేసింది. ఎక్కడో ఉన్న ముఖ్యమంత్రితో సహా ఎక్కడో ఉన్న పేద ప్రజలందరికీ గుండెల్లో భయమనే ఒక చెట్టు నాటబడింది.

అదే టైంలో రుద్ర కూడా ఉలిక్కిపడి నిద్ర లేస్తాడు. శివ, అక్షర అందరికీ చెమటలు పట్టాయి. "ఏంటిది? చీకటి ప్రపంచం అంటే ఏం జరగబోతుంది?" అని ఒక్కసారిగా రుద్ర పైకి లేచి, "సరే, మీరు జాగ్రత్త!" అని చెప్పి మాయమవుతాడు. మరో పది నిమిషాల తర్వాత మళ్ళీ అక్షర ఉన్న ప్లేస్‌కి వస్తాడు. అక్షర వైపు చూసి, "మీరందరూ జాగ్రత్త!" అంటూ తన చేతిని ముందుకు చాపి ఒక త్రిశూలంను సృష్టించి, "హర హర మహాదేవ్!" అంటూ ఒకసారిగా భూమిలో కుచ్చుతాడు. ఆ ఇంటి మధ్యలో ఆ త్రిశూలం ఒక పెద్ద చెట్టులా మారి, ఆ ఇంటికి రక్షణ కల్పించడం మొదలుపెట్టింది.

అక్షర గర్భం & రుద్ర ఆందోళన

అప్పుడప్పుడే మెల్లగా చీకటి ముసురుకుంటుంది, టైం సాయంత్రం 6 అయింది. ఒక్కసారిగా పెద్ద అరుపు. అక్షర వాంతులు చేసుకుంటుంది. అది గమనించిన తర్వాత అందరూ "ఏమైంది?" అని టెన్షన్ పడుతుంటే, రుద్ర వాళ్ళ అమ్మ, "ఆగు, నేను చూస్తాను" అని చెప్పి దగ్గరికి వెళ్ళింది. చేయి పట్టుకొని నాడి కొట్టుకోవడం చూసి, "ప్రెగ్నెన్సీ వచ్చినట్టుంది. ఇప్పుడే చెక్ చేయాలి" అనగా, మళ్ళీ రుద్ర మాయమవుతాడు. అతని శక్తులని చూస్తున్న రుద్ర వాళ్ళ అమ్మ, నాన్న అందరూ బిత్తరపోతారు. "అసలు ఏం జరుగుతుంది?" అని అడుగుతూ ఉంటే, మళ్ళీ ప్రత్యక్షమైన రుద్ర, "చూడు, ఇప్పుడు అన్నట్లు ఏమీ అర్థం కావడం లేదు, అర్థం కావడం లేదు" అని నీలిరంగు కళ్ళతో పైనుంచి కిందికి అక్షర వైపు చూశాడు. అతనికి అర్థమైపోయింది: తను తండ్రి కాబోతున్నాడు. ఇప్పుడు ఆనందపడాలా? ఈ ప్రమాదంలో ఎలా ఏం చేయాలని ఒక్కసారిగా దిక్కు తెలియని స్టేట్‌కు చేరుకున్నాడు. మెల్లగా మంచం మీద అక్షరాతో పాటు కూర్చున్నాడు.

భయంకరమైన కలనుండి వాస్తవంలోకి

ఇంతలో సెల్‌ఫోన్ నెట్‌వర్క్స్ కట్ అయ్యాయి. మెల్లగా కరెంట్ ఒక్కొక్క ప్లేస్ నుంచి రౌండ్‌గా కట్ అవుతూ వచ్చింది. అరుపులు మొదలయ్యాయి. ఎవరో కొడుతున్నట్టు, ఎవరో కొట్టించుకున్నట్టు, ఎవరో చనిపోతున్నట్టు, రక్తం వాసన మెల్లగా వస్తూ ఉంది.

ఎంత జరుగుతున్నా, ఆ చీకటి ప్రపంచం విడుదల కాలేదు. అవుతూనే ఉంది. మళ్ళీ రోజు గడిచింది. ఉదయం అయింది కానీ చీకటి వీడలేదు. అక్కడక్కడా పక్షులు ఎగురుతున్నట్టు శబ్దం వస్తుందా, వీళ్ళకు అర్థం కావడం లేదు. "ఏంటిది?" చుట్టూ ఎవరో రోబోట్లు వచ్చి ఒక్కసారిగా గుండెలు అదిరేలా ఢీకొట్టి చంపేస్తున్నాయనట్టు ఉంది. అక్షరను పట్టుకున్నాడు. కానీ అక్షర కూడా చనిపోయే స్థితికి చేరుకుంది. అమ్మా, నాన్నలు అందరూ చనిపోయారు. రుద్ర ఒక్కసారిగా గిరగిరా తిరుగుతూ కింద పడుతున్నాడు. కానీ ఎందుకు, ఏమిటి అర్థం కావడం లేదు. "ఎవరో ఓడిపోయావు రుద్ర! నిన్ను మళ్ళీ ఓడించారు! ప్రతి ఒక్కరు ఓడించారు! ఇప్పుడు నేను కూడా ఓడిస్తున్నాను!" అని శబ్దాలు రుద్రకు అనుమానం కలిగించాయి. ఒక్కసారిగా గుండెల మీద గట్టిగా కొట్టుకున్నాడు. ఒక్కసారిగా ఉలిక్కిపడి లేచాడు. తన మీద ఎవరూ కూర్చుని గుండెలకేసి గుద్దుతున్నట్లు లేరు. "ఎవరు?" అని చూశాడు. అక్షర తెల్లారిందని అనుమానంగా అనుకుంటున్నాడు.

"ఏంటిది?" అని అడిగిన తర్వాత రుద్ర ఒక్కసారిగా నిస్సత్తువగా మారాడు. అప్పటిదాకా ఉన్న శక్తి పూర్తిగా తగ్గిపోయింది. తను ఏం చేయాలో అర్థం కాలేదు. చిన్నప్పుడు జరిగిన సంఘటనలు పదే పదే గుర్తుకొస్తున్నాయి, కానీ అవి ఎందుకు గుర్తుకొస్తున్నాయో అతనికి అర్థం కావడం లేదు.

యుద్ధానికి సన్నాహాలు

ఇంతలో లింగయ్య అక్కడికి వచ్చాడు. "ఏంటి రాత్రి ఫోన్ చేస్తే ఎవరూ ఎత్తలేదు? ఏం చేస్తున్నారు? మాట్లాడుకుంటున్నారు? ప్రమాదం రాబోతోంది. అస్తమించే సమయానికి అంతం చేయాలి," అని చెప్పడం మొదలుపెట్టాడు లింగయ్య.

రుద్ర, అక్షర వైపు చూశాడు. అక్షర సిగ్గుతో, కొంచెం భయంతో దగ్గరికి వచ్చి చెవిలో ఏదో చెప్పింది. ఆ మాట వినగానే రుద్ర గుండెల్లో చాలా గుబులు పుట్టింది. ఎందుకంటే, రాత్రి వచ్చిన కలలో అక్షర ఎలా గర్భవతి అయిందో, రాత్రి నిజంగా అలాగే జరిగింది. కానీ తను పూర్తిగా నిద్రలో మునిగిపోయాడు. ఇప్పుడు తాతయ్య రావడం, టెన్షన్ పడటం, అలాగే అక్షరకు గర్భం రావడం – ఇవన్నీ రుద్రలో గందరగోళాన్ని సృష్టించాయి.

"ఆగండి! మీరు రక్షణగా ఉండాలంటే నేను చెప్పిన పని చేయాలి," అని చెప్పి, ఒక పది నిమిషాలు మాట్లాడిన తర్వాత, ఒక పెద్ద వెలుగు వచ్చింది. ఆ తర్వాత అందరూ మామూలుగానే ఉన్నారు. ఇక యుద్ధానికి సిద్ధమయ్యారు.

జాన్ ఎదురుచూపు & సైన్యం కదలిక

మరోపక్క బయటికి వచ్చిన జాన్, "నాకు ఈ వెలుగు నచ్చడం లేదు మిత్రమా," అన్నాడు. అతని చేతిలోని కత్తి గిరగిరా తిరుగుతోంది, దాని చుట్టూ కాంతి పుంజాలు వెలువడుతున్నాయి. కానీ ఆ కాంతి పుంజాలు సూర్యుడి ముందు పని చేయడం లేదు. "అయితే రాత్రి దాకా వేచి ఉండాలా?" అని అడిగాడు. కత్తి ఒక్కసారిగా ఏదో సిగ్నల్ ఇచ్చినట్టుగా కదిలింది. మరోసారి పావురం వచ్చి కొంత సమాచారం ఇచ్చింది.

ఇక రుద్రతో, శివతో మాట్లాడుతున్న లింగయ్య, "చూడండి, ఇక మా సైన్యం బయల్దేరుతోంది. మాతో పాటు వస్తారా, లేదా ఇక్కడే ఉంటారా?" అని అడిగాడు.

రుద్ర ఏమాత్రం ఆలోచించకుండా, "వెళ్దాం!" అన్నాడు. శివ కూడా "సరే!" అన్నాడు. శివలో కూడా ఏదో శక్తి ఉంది, అది డైమండ్ శక్తి అని అందరూ అనుకునేలా ఉంటుంది. అందరూ ఫ్లైట్ ఎక్కారు. అది పర్వత ప్రాంతానికి చేరుకుంది. పర్వత ప్రాంతం నిశ్శబ్దంగా ఉంది. చిన్న శబ్దం కూడా లేదు. చుట్టూ ఏదో తెలియని ప్రతికూల శక్తి ఆ ప్రదేశంలో నిండి ఉంది.

ఆ ప్రదేశంలో ఒక్కసారిగా లింగయ్య విజిల్ వేశాడు. కొంతమంది చిన్న చిన్న బండ్లతో ఆ పర్వత ప్రాంతం నుంచి బయటికి వచ్చారు. వాళ్ళందరూ చూడటానికి అచ్చం లింగయ్యలాగే దుస్తులు వేసుకున్నారు. వారి దుస్తులపై నీలం రంగు డిజైన్ ఉంది. ప్రతి ఒక్కరి చేతుల్లో వింత వింత ఆయుధాలు ఉన్నాయి. ఇక శివ తన సూట్‌ను కూడా యాక్టివేట్ చేశాడు. నీలం రంగు సూట్‌లో బంగారు రంగు డిజైన్ యాక్టివేట్ చేసుకున్నాడు. వెంటనే రుద్ర కూడా తన పవర్‌ను యాక్టివేట్ చేయబోయాడు, కానీ లింగయ్య "నీకు ఇప్పుడే అవసరం లేదు. మేమున్నాం కదా, చూస్తూ ఉండు" అన్నాడు.

రుద్ర కూడా ఏమీ మాట్లాడకుండా నిశ్శబ్దంగా ఉన్నాడు. మరోపక్క, జాన్ రోబోలతో బయటికి రాకుండా, కేవలం కత్తిని లోపల, ఆ గుహలోనే పెట్టి బయటకు వచ్చాడు. చుట్టూ వందలకొద్దీ, వేలకొద్దీ రోబోలు వస్తూనే ఉన్నాయి. "ఈ ప్రపంచాన్ని ఆపడానికి, అంతం చేయడానికి లేదా నా సొంతం చేసుకోవడానికి ఇవి చాలు!" అంటూ జాన్ ముందుకు సాగుతున్నాడు.

కనెక్ట్ అయిన జాన్ రోబోలతో, "చూడండి, మీరు సాయంత్రం దాకా వేచి ఉండండి. మీ అందరినీ ఇప్పుడే నేను యాక్టివేట్ చేశాను కాబట్టి మీరు చాలా పవర్‌ఫుల్‌గా ఉండాలి. సాయంత్రం దాకా అంటే ఇంకా 18 గంటలు పోరాడాలి. తర్వాత నేను చూసుకుంటాను," అన్నాడు. అతను అడుగు పెట్టేకొద్దీ, చుట్టూ ఉన్న చెట్లు మాడిపోతున్నాయి, పక్షులు బెదిరిపోతున్నాయి, జంతువులు ఉలిక్కిపడుతున్నాయి.

రోబోలన్నీ తమ చేతిని గుండె మీద పెట్టుకుని, అవునన్నట్టు చిన్నగా సిగ్నల్ ఇచ్చాయి. జాన్ ముందుకు సాగుతుండగా, చీకటి ముసురుకుంటున్నట్టుగా మెల్లగా వస్తోంది, కానీ అది పూర్తిగా అలుముకోలేదు.