మురిపెం....
నీ పెదవులు నా పేరు పలికితే విన్న చెవులకి మురిపెం,
నీ ఆనందానికి నా బుగ్గలు మురిపెం,
నీ నవ్వుకి నవ్వుతున్న రూపానికి, నా కనులకు మురిపెం,
నీ ప్రేమకి నా ప్రేమ మురిపెం,
నువ్వు రాసిన ప్రేమలేఖకి, లేఖలో రాసిన అక్షరాలు చదివిన మనసుకి నా సిగ్గు మురిపెం,
నువ్వు తాకితే ఆ స్పర్శ మురిపెం,
మన మధ్య జరిగిన చిన్ని చిన్ని ఆనందాలకు, సాక్షమైన ఈ కాలం మురిపెం,
నువ్వు పెట్టిన ఒట్టు కి నా నమ్మకం మురిపెం,
మన మధ్య ఉన్న స్నేహం మురిపెం,
ఆ స్నేహాన్ని దాటిన ప్రేమ మురిపెం,
మనం కలిసిన ఈ క్షణం కలిగిన భావం మురిపెం,
కలవక ముందు నిన్ను సైగగా చూసి మురిసిన కళ్ళు ఇంకా మురిపెం......