ఈ పాట నారదుడు రుక్మిణి పార్వతి మాత సరస్వతి కి పాట వినిపిస్తూ ఉన్నాడు
కాలచక్ర గీతం: కల్కి ఆవిర్భావ సంకేతం
అప్పుడే 'టింగ్ టింగ్' అంటున్న ఒక శబ్దం వినిపిస్తుంది. గాలిలో ఒక అదృశ్య గానం ప్రతిధ్వనిస్తుంది:
"కాల చక్రం తిరుగుతుంటే,
కర్మ ఫలం పండుతుంటే,
కలియుగపు చీకటిలో,
ధర్మ దీపం ఆరుతుంటే...
లక్ష్యమెరిగి, కాలమెరిగి,
కృష్ణుడు వేసిన పంతం,
ప్రతి రక్తపు బొట్టులోనూ,
రాసి ఉంచెను అంతం.
ప్రాణమున్న గుండె అదిగో,
పుట్టలోన వెలిగింది,
విశ్వమంతా ఏకమైతే,
కొత్త ప్రాణం పోసింది.
ఆశయాల ఆత్మ అదిగో,
రూపమెరుగని పిండం,
పంచభూత శక్తులలో,
పడుతుంది కొత్త పిండం.
తల్లుల కడుపున పుట్టని రూపు,
ప్రేమలో విరబూసే,
విధ్వంసానికి నాందిది,
కొత్త సృష్టిని చూపించే.
నరసింహుడి క్రూర రూపం,
ప్రేమతోనే శాంతించు,
ఆత్మలంతా ఏకమైతే,
దివ్య ప్రాణం ఆవరించు!
మానవులారా, మాయ వీడి,
దైవ లీల గమనించు,
అంతమంటే అంతం కాదు,
ఆరంభమని గ్రహించు!"
ఎన్నో యుగాల నుంచి రక్షిస్తూ వస్తున్న ప్రాణాలు ఇప్పుడు మరో ప్రాణానికి పోయడానికి సిద్ధమవుతూ ఉండగా, గాలి ఊపిరిగా మారుతుంది, నేత్రాలు కళ్ళుగా మారతాయి, వీరంగం తొక్కుతున్న నాగు శేషులు, వాసుకిలు కల్కికి రక్తనాళాలుగా మారతారు. బ్రహ్మదేవుడు మెదడులో ఉండగా, శివుడు శరీరంలో ఉండగా, గుండెలో ప్రేమ ఉండగా, యుద్ధ శంఖానాదంతో ప్రారంభమవుతుంది.
ఫలాల ప్రవాహం: భూమి పుట్టుక, సముద్ర గర్భం
ఈ పాట వినిపిస్తున్న సమయంలోనే, పండ్లు 'పటపట' మంటూ పగులుతూ దాంట్లో నుంచి నలుపు, తెలుపు, ఎరుపు - ఇలా మూడు రంగులు గాల్లోకి స్పీడ్‌గా పరిగెత్తడం మొదలుపెట్టాయి. అవి వచ్చే వేగానికి గాలి దుమ్ము దుమారం అవుతుంది. అవి ఆకాశంలోకి స్పీడ్‌గా వెళ్తున్నాయి. ఆకాశంలో వెళ్ళే కొద్దీ గ్రహాలు, చుక్కలు అన్నింటినీ దాటుకొని, చాలా స్పీడ్‌గా అడ్డువచ్చిన రాళ్ళను, స్పేస్ జెట్‌లను అన్నిటినీ తునా తునకలు చేసుకుంటూ ఆకాశంలోకి స్పీడ్‌గా వెళ్ళాయి. ఆకాశంలో మూడు ఒకటయ్యాయి. నలుపు, తెలుపు రంగులు ఒక షీల్డ్ (కవచం) లాగా, అంటే ఒక బాల్‌లా తయారైతే, లోపల రక్తం మెల్లగా కరగడం మొదలుపెట్టింది. అది నీరుగా మారిన తర్వాత, ఎంత స్పీడ్‌గా వెళ్ళాయో అంతకు రెండింతలు, పదింతలు స్పీడ్‌తో 'ధామ్' అంటూ ఆ స్తంభంలోకి దిగిపోతాయి. ఆ దెబ్బకు భూకంపం మొదలైంది, భూమి 'పటపట' మంటూ చీలుతోంది.
దుర్యోధనుడి దూకుడు: రుద్రుడి వ్యూహం
ఇంకా అక్కడ కట్ చేస్తే, భూమి బద్దలవుతుండడం కట్ అయితే, ఇప్పుడు రుద్ర వైపు చూస్తాడు దుర్యోధనుడు. "ఏంటి! వీణ్ణి చంపడానికి ఇంత భయపడుతున్నారా మామా? నేను ఇప్పుడే వెళ్తాను, సంగతి ఏంటో చూస్తా!" ఇప్పుడు నిరాశలో ఉన్నాడు నువ్వు చెప్పిన శపథాన్ని నెరవేరుస్తాను అని అంటూ ముందుకు దూసుకు వెళ్తున్నాడు. అతడు కూడా సామాన్యంగా కనిపించడం లేదు. అతని ఎదురుగా ఉన్నది ఎవరైనా సరే, తను అంతం చేయాలనుకుంటే అంతం చేసేంతవరకు వదిలేలా కనిపించడం లేదు.
ఇప్పుడు హనుమంతుడు చెబుతాడు, గణేశుడు ఇలా అంటున్నాడు అని తెలుసుకున్న తర్వాత అతనికి మరింత శక్తి వస్తుంది. "అసలు ఏంటి రహస్యం?" అని అడగ్గా, గణేశుడు, కార్తికేయ, హనుమంతుడు చెప్తారు. "అతని జననం కృష్ణుడు కంటే వింతగా కనిపిస్తుంది తెలుసా? అమ్మ కడుపులో ఉండే ద్రవాలు లేవు కానీ, సైన్స్‌తో, చిన్న చిన్న మెడిసిన్‌తో తన సొంత డీఎన్‌ఏతో పుట్టాడు. అలాగే అతని పూర్వ శక్తులు మామూలుగా అయితే అమ్మ కడుపులో నుంచి పుడితే ఏ వింత లేకుండా రావు. కానీ ఇక్కడ ధర్మ చేసిన పని తన డీఎన్‌ఏని పూర్తిగా పొందాడు. అప్పుడు బ్రహ్మ రాసిన రాత వాని తలపై లేదు. అందువల్లనే అతని మనసులో ఎలాంటి బాధ ఉంటే అలా చెలరేగుతాడు. భీముని చూసినప్పుడు అతడు ఎలా చనిపోయాడు, భీముడి చేతిలో ఎంత ఘోరంగా చనిపోయాడు అది గుర్తు తెచ్చుకున్న తర్వాత అతని మెదడులో రాతలు అతనిని తన చావు ఇతని చేతిలోనే అని భయపడడం మొదలుపెట్టాడు. అందుకే అప్పుడు శక్తి లేని వాడిలా మారిపోయాడు. మళ్ళీ భీముడు శక్తి కోల్పోగానే అతనికి మళ్ళీ ప్రాణం మీద ఆశ పుట్టింది, మళ్ళీ అతనికి శక్తులు తిరిగి వచ్చాయి. ఇది అతని జాతకం. ఇప్పుడు రుద్ర ఫోర్స్‌ఫుల్‌గా కనిపించి అతని ఎదిరించినచో మళ్ళీ దుర్యోధనుడు బలహీనపడతాడు, అప్పుడే చంపగలడు రుద్రుడు," అని చెబుతాడు హనుమంతుడు.
రుద్రుడి ప్రతీకార వేడి: దుర్యోధనుడి మానసిక దౌర్బల్యం
అలా దుర్యోధనుడి వైపు వెళ్తూ ఉండగానే అతని నీలిరంగు కవచం మరింత గట్టిపడుతుంది. అతని మనసులో ఇప్పుడు రుద్రను చాలా ఈజీగా చంపేయొచ్చు, ఎంత పెద్ద శక్తులు ఉన్నా అతని నిరాశలో ఉన్నాడని గర్వంతో అతను చాలా ధైర్యంగా అన్నాడు. ఆ ధైర్యమే అతనికి శక్తిగా మారుతూ ఉండగా అతను ముందడుగు వేస్తున్నాడు. రుద్రుడి వైపు చూస్తూ, "ఏంట్రా నువ్వు మా మామయ్యని బెదరగొట్టాలని చూస్తున్నావా? ఏంటి పంచ్ డైలాగ్‌లు వేసావు అంట కదా? ఇప్పుడు అదే పంచ్ రా! చూసుకుందాం!" అని అంటూ ఉండగా, రుద్రుడు కోపంగా పైకి చూస్తాడు. అతని మనసులో హనుమంతుడు చెప్పింది గుర్తుకు వస్తుంది: "కోపం వినాశనం. అది మీ వరకే, నీకు మాత్రమే వస్తుంది. కోపం తగ్గించుకో. ఆలోచనతో మాట్లాడు. అతను ఎవరి బలానికి లోబడతాడో? ఏ వస్తువు ఉంది అతని దగ్గర? అతను ఎందులో తక్కువగా ఉన్నాడు?" అన్నదాన్ని ఎక్కువగా దృష్టి పెట్టు అని వినిపించిన మాటలు తన మెదడులో తిరుగుతూ ఉండగా, వెంటనే కోపం తగ్గించుకొని, "ఏంట్రా నువ్వు? మీ మామ కలిసి నన్ను ఏదో చేయాలని, ఏదో చేశారని అనుకుంటున్నారు కదా? ఇప్పుడు నాకు అంతా అర్థం అయింది. మీరు కనిపించింది, సామ్రాట్ మాట్లాడింది అంతా తప్పు కదా? ఇప్పుడు మీకు నేను భయపడతాను అనుకుంటున్నారా? యుద్ధం నేను స్టార్ట్ చేస్తే ఎలా ఉంటుందో ఒక్కసారి ఆ గరుడాసురుడిని అడుగు!" అని గట్టిగా నవ్వుతున్నాడు.
మహాభారత జ్ఞాపకాలు: రుద్రుడి మానసిక దాడి
"అవును, నిన్ను ఎవరో బాగా చంపారంట కదా? మళ్ళీ పుట్టడానికి ఎవరో సహాయం చేశారు అంట కదా?" అని అడగడం మొదలుపెట్టాడు రుద్ర. "ఎవరు చంపారు?" అని వినగానే అతనిలో భయం మొదలైంది. "భీమసేన" అని ఒక నామం అతని మదిలో మెదులుతూ ఉండగా, అతని కవచం రంగు తగ్గడం మొదలుపెట్టింది. వెంటనే అది కనుక్కున్న రుద్ర, "సరే, నిన్ను చంపింది ఎవరు? అర్జునుడా? లేదా భీముడా?" అని సాగదీస్తున్నాడు. "భీముడు" అని ఈ మూడు పదాలు దుర్యోధనుడికి మొత్తం చెడగొట్టినట్టుగా అయిపోయాయి.
ఇప్పుడు అతను మహాభారత యుద్ధంలో భీముడి చేతిలో ఎలా చనిపోయాడో చూపిస్తారు. "భీముడు నిన్ను చావగొట్టాడంట కదా? గదతో నీ రెండు కాళ్ళు విరగ్గొట్టాడంట కదా? నీ రక్తంతో ఎవరికో స్నానం చేయించాడంట కదా? అదే రక్తాన్ని, పేగులను తన మెడలో వేసుకొని నీ చావుని ఎంతో భయంకరంగా చూపించాడు అంట కదా?" అని మానసికంగా శకుని కంటే దారుణంగా భయపెట్టడం మొదలుపెట్టాడు రుద్రుడు దుర్యోధనుడిని.
రుద్రుడు వర్సెస్ దుర్యోధనుడు: గదా యుద్ధం
కానీ దుర్యోధనుడు మళ్ళీ మాట్లాడుతూ, "చూడు, నువ్వు నన్ను చంపగలిగితే యుద్ధం చేసి చంపు. అంతే కానీ మానసికంగా ముసిలే ముసలి వాళ్ళతో మాటల యుద్ధం కాదు. దమ్ముంటే నీ కండల పవర్ ఏంటో చూపించు! ఇందాక ఎన్నో డైమండ్లు నీ చెంతకు వచ్చాయి కదా? వాటిని ఎందుకు ఆపేసావు? నన్ను తట్టుకోలేవని, నా దెబ్బ పడితే నువ్వు బ్రతకలేవని!" అని గట్టిగా నవ్వుతున్నాడు.
"సరే, నీ గురించి నాకు ఎటు తెలిసింది కాబట్టి నిన్ను చంపడానికి పెద్ద సమయం పట్టదు. కానీ నీకు భీముడు కాదు, రాబోయే కల్కినే నీకు మరణం చూపిస్తాడు," అని అంటూ యుద్ధం ప్రారంభించారు. ఒకరినొకరు కొట్టుకోవడం మొదలుపెట్టారు. రుద్రుడు గట్టిగా "జై శ్రీరామ్!" అంటూ చేతిని పైకెత్తి పైకి లేస్తాడు. అతని చేతిలోకి ఎక్కడో పడిపోయి ఉన్న లాకెట్ రూపంలో ఉన్న గద 'గుర్రున' తిరుగుతూ రావడం మొదలుపెట్టింది. ఆ వేగానికి మొత్తం అతలాకుతలం అయిపోతూ ఉండగా, హనుమంతుడు "రా నా శిష్యుడా!" అని అంటూ గట్టిగా విజిల్ కొట్టాడు. పై దాడి చేయడం మొదలుపెట్టాడు. దుర్యోధనుడు కూడా ఒక గద తీసుకొని ఇద్దరూ ఒకరినొకరు కొట్టుకోవడం మొదలుపెట్టాడు. రుద్రుడి చేతిలో ఉన్న గదలోకి తన శరీరంలో ఉన్న ఆరు డైమండ్లు బయటికి వచ్చాయి. ఆరు డైమండ్లు ఆ గదకు ఉన్న క్రౌన్ వలె పైన గద ముందు పైన ఆరు డైమండ్లు కూర్చుంటాయి. ఆ దెబ్బకు దాన్ని రుద్రుడు మరియు ఆ గద విచిత్రమైన రంగుతో మెరిసిపోతూ ఉండగా మరోసారి ఢీకొట్టాడు. అంతే దుర్యోధనుడి దగ్గర ఉన్న గద 'ఫటాఫట్' అంటూ 36 ముక్కలైపోయి పగిలిపోయింది.
శకుని హెచ్చరిక: కల్కి జననంపై ఆందోళన
ఆ దెబ్బకు గదే కాదు, దుర్యోధనుడు కూడా తన మామ పక్కకు వెళ్లి పడ్డాడు. తన మామ, "ఏంటి దుర్యోధనా! ఇలా పడిపోయాం? వాడి శక్తి ఏంటో ఇప్పుడుకైనా అర్థమైందా? ప్రతిదానికి నేను వెళ్తా, నేను వెళ్తా అని చిందులు వేస్తావు కదా? ఇప్పుడు అర్థమైందా నేను ఎందుకని సహనంగా ఉన్నాను? ఇక్కడున్న ప్రతి ఒక్కరు చాలా శక్తివంతులే. అందులో ఈ రుద్ర మరి సామ్రాట్ మాత్రమే చాలా బలంగా ఉన్నారు. ఇప్పుడు కొత్తగా మరో శత్రువు (కల్కి స్తంభం) లోకి మనం దగ్గరికి వెళ్లాలంటే నాకు భయంగా ఉంది. కానీ అతనికి జీవశక్తి కావాలంటే ఒక ప్రత్యేకమైన పుట్టుక గలవాడు కావాలి. వింత ఏమిటంటే యుగయుగాల నుంచి ఉన్న వాళ్ళ శక్తులతో పాటు ఆ ప్రత్యేక పుట్టుక ఉన్న వాళ్ళు కూడా అతనికి కావాలి. కాబట్టి నువ్వు ఆ స్తంభానికి ఎంత దూరంగా ఉంటే అంత మంచిది. నీ పుట్టుక గురించి తెలుసు కదా? అమ్మ కడుపులో పుట్టలేదు, అలాగని జీవులకు పుట్టలేదు," అని అంటాడు.
భూమి పరివర్తన: సృష్టికి సంకేతం
అలా వాళ్ళందరి సీన్ కట్ చేస్తే ఇప్పుడు భూమి బద్దలయ్యే స్థాయికి వెళ్తుంది. ఇప్పుడు భూమి 'ఫటాఫట్' అంటూ రెండు ముక్కలుగా చీలి, భూమి లోపల ఉన్న స్వచ్ఛమైన మట్టి బయటికి రావడం మొదలుపెట్టింది. ఆ మట్టి గాలిలో చిమ్ముతూ ఒక వింత రూపాన్ని సందర్శించుకుంటూ ఉంది. అలా ఆ మట్టి గాలిలోకి వెళుతూ స్పీడ్‌గా అడ్డం వచ్చినా భవనాలను, చెట్లను తునా తునకలు చేసుకుంటూ ముందుకు వెళుతుంది. అది కూడా చాలా స్పీడ్‌గా ఆకాశంలోకి వెళ్ళిపోతుంది.
ఆ వెంటనే సముద్రంలోనే ఒక ప్రదేశంలో నీరు 'గిరగిరా' తిరగడం మొదలుపెడుతూ స్వచ్ఛమైన నీటిని తీయడం మొదలుపెడుతుంది. అప్పుడెప్పుడో సముద్రాన్ని చిలికి అమృతాన్ని ఎలా బయటకు తీశారో, ఇప్పుడు అలాగే సముద్రంలోని నీరు స్పీడ్‌గా తిరుగుతూ స్వచ్ఛమైన నీటిని సేకరిస్తూ ఉంది. అదే టైంలో అది కూడా ఒక షేప్‌లో ఆకాశంలోకి వెళుతుంది. ఆ రెండు వెళ్ళిన వెంటనే మరోసారి మరో టిప్ సముద్రపు ఉప్పు నీరు బయలుదేరుతుంది. ఆ మూడు - ఉప్పు నీరు, మంచినీరు, అలాగే మట్టి - ఆకాశంలోకి, స్పేస్‌లోకి వెళ్ళిపోతాయి. అవి కూడా ఒక బాల్‌లా తయారవుతాయి. మునుపటిలాగే మరింత వేగంతో వస్తుంది. చుట్టూ గాలి అటూ ఇటూ చల్లాచెదురైపోతూ ఉండగా, భూమి మరోసారి దద్దరిల్లడం మొదలుపెడుతుంది. నీరు మట్టిలో కలిసి ఒక ముద్దలా తయారు చేస్తుంది. ఆ ముద్ద లోపల స్వచ్ఛమైన నీరు నిండి ఉంటుంది.
అంతటితో ఆగనిది, అవి వెళ్లిన స్పీడ్‌కి మరోసారి స్తంభం వణికిపోతూ ఉంది. స్తంభం ఇప్పుడు మట్టి కలర్‌లోకి మారుతూ పారదర్శకంగా మారుతుంది. ఇప్పుడు పూర్తిగా కనిపిస్తుంది - తలకాయ, కాళ్లు, చేతులు పూర్తిగా ఉన్నాయి. అది ఒక మామూలు డబ్బా లాగా కనిపిస్తుంది. దాంట్లో ఏదో మిస్సయింది అని అనుకుంటున్న టైంలో, ఒక మట్టి ముద్ద వచ్చి ఆ డబ్బాలో పడినట్టుగా ఒక్కసారిగా అక్కడ కనిపిస్తున్న శరీరం లాంటి అవయవాలు లేని తోలుబొమ్మ ఉలిక్కిపడుతుంది. తన శరీరంలో పూర్తిగా మట్టి నిండిపోయింది. ఇప్పుడు అది కండరాలుగా కనిపిస్తుంది. అంతటితో ఆగనిది, సముద్రం నుంచి వచ్చిన మంచినీరు కళ్ళ ప్లేస్‌లలో నీలిరంగులో మెరిసిపోతూ ఉన్నాయి. ఆ వెంటనే ఆ మట్టి ముద్దమీదకి అంతకుముందు చేరిన నల్లటి నలుపు పూర్తిగా చేరుతుంది. అది ఇప్పుడు పూర్తి శరీరంగా మారిపోయింది. ఏదో తక్కువ అయింది అని అనుకుంటున్న టైంలో, ఆ మట్టి నిండిన బాక్సు లాంటి దాంట్లో అంటే ఒక శరీరంలో అక్కడక్కడా చిన్నగా నరాలు ఏర్పడడానికి చిన్నగా దోవ చేస్తున్నట్టుగా తన హృదయం కానుంచి కాళ్లు, చేతులు, తలకాయ, మెదడులోకి పూర్తిగా ఒక స్వరంగం లాంటిది ఏర్పడడం మొదలు పెడుతుంది.
ఎలా అనిపించిందో ఇప్పటికైనా చెప్పండి ప్లీజ్ పూర్తిగా చదువుతున్నారా లేదా