The Zombie Emperor - 9 in Telugu Horror Stories by Ravi chendra Sunnkari books and stories PDF | థ జాంబి ఎంపరర్ - 9

Featured Books
  • انکہی محبت

    ️ نورِ حیاتحصہ اول: الماس… خاموش محبت کا آئینہکالج کی پہلی ص...

  • شور

    شاعری کا سفر شاعری کے سفر میں شاعر چاند ستاروں سے آگے نکل گی...

  • Murda Khat

    صبح کے پانچ بج رہے تھے۔ سفید دیوار پر لگی گھڑی کی سوئیاں تھک...

  • پاپا کی سیٹی

    پاپا کی سیٹییہ کہانی میں نے اُس لمحے شروع کی تھی،جب ایک ورکش...

  • Khak O Khwab

    خاک و خواب"(خواب جو خاک میں ملے، اور خاک سے جنم لینے والی نئ...

Categories
Share

థ జాంబి ఎంపరర్ - 9

అదంతా చూస్తున్న జగదీష్ 'అక్క మరి?' అని అమాయకంగా నటిస్తూ ఉంటే, వర్మ "అక్క లేదు, తొక్క లేదు! ఆడవాళ్ళని అస్సలు నమ్మకూడదు! ఈ ఆడపిల్లలకు తమ మొగుడు అంటేనే ఇష్టం! వాళ్ళను కన్నా అమ్మానాన్నలు, పెంచిన అన్నయ్య... వీళ్ళెవ్వరూ అవసరం లేదు!" అని చిరాగ్గా, చికాకుగా ప్రాసెస్ పూర్తి చేసి సంతకం పెట్టేసాడు.

అదే టైంలో, జగదీష్ గుండెలు పట్టుకుని కింద పడిపోయాడు. అతడి నోటి నుంచి నురుగు, కాళ్ళు చేతులు పడిపోవడం మొదలుపెట్టాయి. వెంటనే అతడిని హాస్పిటల్‌కి తీసుకువెళ్లారు. ఆపరేషన్ థియేటర్‌లోకి తీసుకువెళ్లి ట్రీట్‌మెంట్ ఇచ్చి, స్కానింగ్‌లు అవీ ఇవీ చెక్ చేసి ఒక రిపోర్ట్ పట్టుకొని నిలబడి ఉన్నాడు డాక్టర్.రాంబాబు జ్ఞాపకాలు – ఫ్లాష్‌బ్యాక్ – రంగనాధపురం – హాస్పిటల్ (కొనసాగింపు)

డాక్టర్ రిపోర్ట్ పట్టుకొని ఇలా చెప్పడం మొదలుపెట్టాడు: "సార్, మీ అబ్బాయికి వచ్చింది రేర్ డిసీజ్! ఇది కేపీడీ అనే ఒక వింతైన వ్యాధి. అసలు దీనికి... ఈ వ్యాధి ఎప్పుడు వచ్చిందో తెలియదు. ఇది ఎవరికో ఒక్కరికి వస్తుంది. అలాంటి వ్యాధి మీ కొడుకుకు వచ్చింది అంటే ఇది చాలా ప్రమాదం. అతను ఎప్పుడు చనిపోతాడో తెలియదు."

"ఇప్పటికీ మేము ఇచ్చిన ట్రీట్‌మెంట్‌ వల్ల అతను మూడు నెలలు ఎటువంటి ఇబ్బంది లేకుండా బ్రతుకుతాడు. మీకు ఒక చిన్న ప్రమాదకరమైన విషయం చెప్పాలి. దీన్ని మీరు సొంతంగా చేసుకుంటానంటే మీకు చెప్తాను. లేదు, మా మీద కేసు పెడతాను లేదా 'మీరు ఇది ఎందుకు చెప్పారు?' అని అనేటట్టయితే మీరు వెళ్లిపోవచ్చు. ఇది ఒక ప్రాణాన్ని కాపాడడానికి... బట్ వందల ప్రాణాలు పోతాయి!" అని చెప్పాడు.

"అసలు ఏంటి చెప్పండి డాక్టర్!" అని వర్మ ఆతృతగా అడిగాడు.

డాక్టర్ వివరించాడు: "ఇలాంటి వ్యాధి ఒకప్పుడు వచ్చినప్పుడు ఇలాంటిదే ఒకరు చేశారు. దీన్ని కార్టికల్ యాడాక్స్ డీఎన్‌ఏ అంటారు. అంటే, ఒక మనిషిలోనే, ఒక విచిత్రంగా, ఒక్క మనిషిలోనే ఇది ఉంటుంది. దాన్ని తీసి ఎక్స్‌ట్రాక్ట్ చేసి, వచ్చిన దాన్ని ఫైర్ ఫ్రూజ్‌ చేసి, వచ్చిన డీఎన్‌ఏను ఈ జబ్బు ఉన్న వాళ్ళలో ఎక్కిస్తే జబ్బు తగ్గిపోయే అవకాశం ఉంది. బట్ చాలామంది చనిపోతారు. ఎందుకంటే, ఇది ఎవరిలో కొంతమందిలో మాత్రమే ఉంటుంది. అందులో ముఖ్యంగా, ఈ డీఎన్‌ఏ చిన్న పిల్లలు... అంటే పుట్టి పుట్టకనే వాళ్ళు, లేదా కడుపులో ఉన్న వాళ్ళు మాత్రమే దీన్ని బాగా అబ్జర్వ్ చేసుకుంటారు. ఎందుకంటే, రెండు డీఎన్‌ఏలు కలిసే కాబట్టి వాళ్ళ డీఎన్‌ఏలో ఎక్కువ శాతం ఉంటుంది. బట్ పెద్దాయన తర్వాత అది తగ్గుతూ తగ్గుతూ వస్తుంది. ఇప్పుడు మీ వాడికి జరిగింది కూడా అదే. ఇది చాలా ఎక్కువగా తగ్గడం వల్ల ఇలా జరిగింది!"

"ఇప్పుడు నన్నేం చేయమంటారు?" అని వర్మ డాక్టర్‌ను అడిగాడు.

డాక్టర్ ఒక ఫైల్ ఇస్తూ, "ఇది సూరత్ 12 కి సంబంధించిన సమాచారం. ఇప్పుడు మీరు సూర 13 ల్యాబ్‌ను సృష్టించండి. దాంట్లో ఇలాంటివి ప్రయోగాలు చేయండి. మీకు సైంటిస్టుల్లో మెంబర్లు లేదా ఇన్ఫర్మేషన్ కావాలంటే నేను ఇస్తాను. బట్ ఎవరికి తెలియకూడదు ఇది. గవర్నమెంట్‌కు అస్సలు తెలియకూడదు!" అని అన్నాడు.డాక్టర్ చెప్పింది విన్న తర్వాత వర్మకు బుర్ర తిరిగింది. "ఇది నా కొడుకు కోసం ఎంత పని చేయాలా? ఎంతమందిని చంపాలి? ఇది మంచిదా? చెడ్డదా?" అని ఆలోచిస్తున్నాడు. పూర్తిగా మత్తులో ఉన్న అతను, అతనికి ఏమనిపించిందో తెలీదు. "నాకు వారసుడు లేకపోతే ఎలా? నా కొడుకుని ఎలాగైనా బ్రతికించుకోవాలి! ఏదైనా చేయాలి! ఏం చేయాలి?" అని ఆలోచిస్తూ ఉండగా, అప్పుడే ప్రభాకర్‌కు ఫోన్ చేస్తాడు.

వర్మ: "ఆ... చెప్పండి సార్! బాగున్నారా? నేను చాలా రోజులుగా అక్కడికి రావడం లేదు కదా? మీరు ముంబైలోనే ఉండమన్నారు. ఇక్కడ ఎవడూ మామూలోడు ఉన్నట్టు కాదు, చావగొడుతున్నాడు!" (ప్రభాకర్ ముందు మాటలు)

వర్మ (ఆగ్రహంగా): "నువ్వు వెంటనే ఇక్కడికి వచ్చేయ్! నువ్వు మంచి ఐలాండ్ చూడు! అక్కడ నేను చెప్పిందాన్ని చెప్పినట్టుగా చెయ్యి! ఎంతమంది కావలో చెప్పు! మొదటిగా కొన్ని డీటెయిల్స్ ఇచ్చి, ఈ సైంటిస్టులు మనకు కావాలి! నువ్వు ముంబైలో ఉన్న వాళ్ళను పట్టుకొచ్చేయ్! ఇక్కడున్న వాళ్ళని పట్టుకొచ్చేయ్! ఎవరైతే మనకేంటి? మన దగ్గర డబ్బు ఉంది, అధికారం ఉంది! ఇది గవర్నమెంట్‌కు తెలియకూడదు!" అని పూర్తిగా చెప్పిన తర్వాత అక్కడ కట్ చేస్తారు. అలాగే సోఫా సీట్‌లోనే నిద్రపోతాడు వర్మ.

సూర 13 ల్యాబ్ – మూడు నెలల తర్వాత

అలా మూడు నెలలు జరుగుతాయి. కానీ ఎటువంటి లాభం లేదు. ఎంతమందిని తెచ్చి ప్రయోగాలు చేసినా కానీ, అంతమంది చనిపోతూనే ఉన్నారు.

రాంబాబు జ్ఞాపకాలు – ఫ్లాష్‌బ్యాక్ – ఆదిత్య నివాసం

అక్కడ కట్ చేసి ఇప్పుడు ఆదిత్య, మీనాక్షిల వైపు చూపిస్తారు. వాళ్ళు ఎంతో ఆనందంగా ఉన్న సమయంలోనే, మీనాక్షికి ప్రెగ్నెన్సీ వస్తుంది. అలాగే రాము చేసుకున్న అమ్మాయికి కూడా ప్రెగ్నెన్సీ రావడంతో వాళ్ళంతా సంతోషపడతారు.

ఇప్పుడు రాము, ఆదిత్యతో తన సంతోషాన్ని పంచుకుంటూ: "మనకు పిల్లలు పుట్టబోతున్నారు! వాళ్ళ కోసం మనం మంచి భవిష్యత్తు చూడాలి. మనం కూడా ఏదైనా పనికి వెళ్ళాలి. ఇలా ఎంత మాంసం అమ్మినా మనం మన పిల్లల కోసం సంపాదించడం కష్టం. తినడానికే కష్టంగా ఉంది బాబు!" అని మాట్లాడుతున్న టైంలోనే అక్కడ కట్ చేస్తారు.

 హాస్పిటల్ (జగదీష్ గది)

ఇప్పుడు హాస్పిటల్‌లో చూపిస్తారు. హాస్పిటల్‌లో ప్రభాకర్, జగదీష్‌తో మాట్లాడుతున్నాడు. "ఏంటి జగదీష్! నీ ప్లాన్ ఫలించినట్టుంది! డబ్బు నీ సొంతమైంది కదా?" అని అంటున్నాడు.

జగదీష్ మెల్లగా, ఊపిరి తీసుకోవడానికి ఉన్న మాస్క్ తీసి ఇలా అన్నాడు: "చూడు... నేను చెప్పింది చెయ్! నాకు కావాల్సింది..." అని నీరసంగా మాట్లాడుతూ, "నా చెల్లికి పెళ్లి చేశాను కదా? ఆదిత్య దగ్గర ఉంది వాడిని పట్టుకొచ్చేయండి! అది నాన్నకు చెప్పండి... 'నాన్నే చేసినట్టు' చెప్పండి! నాకు తెలీదు..