పచ్చల హారంలో
పల్లవించే పడుచుదనం
ప్రణయ రాగంలో
పరిమళించే వెచ్చదనం
పండు వెన్నెల్లో
పరిఢవిల్లే సమ్మోహనం..
పరుల సేవలో
పొందికైన సస్యశ్యామలం..
పరమాత్ముని దీవెనెలో
పదపదములో అరుణోదయం..
పుడమి నవ్వులో
పులకించే నిండుదనం..
పరువాల జగతిలో
పంచి ఇచ్చే ప్రేమామృతం...
ప్రకృతి శిగలో విచ్చుకున్న
పసందైన కన్నె గులాబీల ఘనం
వాడిపోని చెరిగిపోని
తీపి గురుతులే... తియ్యందనాల
నులి వెచ్చని స్పర్శలే...!

-Sameera

Telugu Good Evening by Sameera : 111651397

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now