బహుశా....
రోజు ఏదొక బాధని చూసే మనసుకి, ఈ రోజు అన్ని ఆనందాలు కనిపిస్తున్నాయి ఏంటో,
బహుశా సంకెళ్ళను తెంచేసిందేమో,
విన్న ప్రతి పాటలోను, నన్ను నేను చూసుకున్న క్షణాలన్నీ, బుగ్గలు ఎరుపెక్కేలా మురిసిపోయాయి,
బహుశా మురిసిన నా బగ్గుల ఎరుపుని చూసేయామో ,
ఇన్ని రోజులు నా మనసు గూటిలో దాగిన కోరికలన్నీ ఈ రోజు మాయమయ్యాయి,
బహుశా , వాటి గమ్యాన్ని చేరుకున్నాయేమో,
బహుశా, దొరికిందేమో ఇన్ని రోజులు వెతుకుతున్న రూపం,
మనసులో భారం తగ్గిపోతుంది,
బహుశా, భారాన్ని దించే మార్గం, నా ఎదురుగా నిలిచిందేమో,
రోజు కలలో కనిపించే జీవితం ఒక్కసారిగా ఇలలో కనిపించిందేంటో,
బహుశా, మేలుకుందేమో, నా కలల ప్రపంచం.....