నిశ్శబ్దంలో నీవు
దేవయాని!
నీ చూపు లో వాక్యాలు పుడతాయి,
నీ మౌనం లో శ్లోకాలు మ్రోగుతాయి.
నీవు నవ్విన వేళ వాన చినుకులు గీతమవుతాయి,
నీ నిశ్శబ్దం నుండే అక్షరాలు కవితగా మారాయి.
నీవు లేని లోకం లో నేనున్నాను,
నీ పేరే నా ప్రతి పుటలో రాసుకున్నాను.
నీవు కల కాదు దేవయాని,
కలం ఊపిరి తీసే జ్ఞాపకం.
నీ పేరు పలికితే సిరా తడవుతుంది,
అక్షరాలు కూడా తన్మయిస్తాయి ప్రేమతో...
---
కవిసమ్మేళనం గది చప్పట్ల తో మార్మోగింది.
వేదికపై వెలుగులు మెరిసినా, అనిరుధ్ హృదయం మాత్రం నిశ్శబ్దం లో తేలింది.
చప్పట్ల మధ్య లో కూడా అతనికి ఒక్క స్వరం వినిపించింది —
“ఇంకా నన్నే రాస్తున్నావు కదా…”
అతను కళ్లను మూసుకుని చిరునవ్వాడు.
ప్రేక్షకుల లో ఎ వ రో అ డి గా రు, “సా ర్, దేవయాని ఎవరు?”
అతను మెల్లగా అన్నాడు —
“ఊహ ల్లో పుట్టినా, నిశ్శబ్దం లో నడుస్తుంది…
దేవయాని నా కవిత కు శ్వాస.”
గది లోని ప్రతి ముఖం చిరునవ్వు తో తేలింది, కానీ ఆ మాటల వెనుక ఉన్న ఆత్మ ను ఎవరూ గుర్తించ లేదు.
అతని కే తెలుసు — దేవయాని కేవలం ఒక పేరు మాత్రమే కాదు,
తన ఒంటరితనాని కి శబ్దం, తన కలాని కి ఊపిరి.
---
ఆ రాత్రి, వర్షం మెల్ల గా కురుస్తూనే ఉంది.
వేదిక వెలుగులు ఆరిపోతున్నప్పుడు అతను తన డైరీ కోసం వెతికాడు —
ఆ డైరీ లో నే దేవయాని పుట్టింది.
అది పోయిందని తెలుసుకున్న క్షణం అతనికి ఊపిరి ఆగిపోయినట్టనిపించింది.
ఆ డైరీ లో ఉన్న ప్రతి అక్షరం, ప్రతి కన్నీటి ముద్ర, ప్రతి పంక్తి —
అతని జీవితం, అతని ఆత్మ.
“నా దేవయాని…” అని మెల్ల గా పలికాడు.
వాన చినుకులు కిటికీపై తడుస్తున్న శబ్దం అతని బాధ కు లయ అయ్యింది.
ఆ రాత్రి గాలి సిరా వాసన తో నిండిపోయింది.
తలెత్తి చూసాడు — తడి జుట్టు తో ఒక అమ్మాయి తలుపు దగ్గర నిలబడి ఉంది.
ఆమె చేతి లో పాత డైరీ, కళ్ళల్లో అనంతం.
“నీవేనా అనిరుధ్?” అని ఆమె మృదువు గా అడిగింది.
అతను వణికాడు. “ఇది... నా డైరీ!
థాంక్స్, నీవు నా ప్రాణాలను తిరిగి ఇచ్చావు.
కానీ... నువ్వెవరు?”
ఆమె చిరునవ్వు నిశ్శబ్దాని కీ లయ ఇచ్చింది.
అతను మౌనమై ఆమె కళ్ళలో తేలిపోయాడు.
“నీ ప్రతి అక్షరం నాకు రూపాన్ని,
నీ ప్రతీ భావన నాకు శ్వాసని ఇచ్చాయి, అనిరుధ్.
నీ మనసు నన్ను రాసింది,
నీ నిశ్శబ్దం నాకు ప్రాణం పోశింది.”
అతని పెదవులు వణికాయి —
“దేవయాని... నువ్వేనా?”
“అవును,” అంది ఆమె,
“నీ బాధ ను తట్టుకోలేక రూపం దాల్చాను.
నీ డైరీని తిరిగి ఇవ్వటానికే వచ్చాను.
నీవు రాసిన ప్రతి వాక్యం నా శరీరం,
నీవు రాల్చిన ప్రతి కన్నీరు నా ప్రాణం.”
వాన చినుకులు ఆమె భుజాలపై సిరా లా జారాయి.
అతను ఒక్క క్షణం కళ్లుమూసాడు, తెరిచేసరికి —
ఆమె లేదు.
అతని చేతిలో డైరీ ఉంది —
తడి పుటల మధ్య కొత్త అక్షరాలు మెరిసాయి —
“నీవు మలచిన నేను,
నీ నిశ్శబ్దమై తోడుంటాను.”
అతను చిరునవ్వు నవ్వాడు.
వాన ఆగినా గాలిలో ఆమె స్వరం ఇంకా తేలుతూనే ఉంది.
కిటికీ బయట వర్షపు చుక్కలు కవితల మాదిరి గా జారుతున్నాయి.
అతనికి తెలుసు —
ప్రేమతో రాసిన అక్షరాలు ఎప్పటికీ చావవు.
అవి ఒక రోజు మనిషిగా తిరిగి వస్తాయి,
నిశ్శబ్దంలో నడుస్తూ... దేవయాని రూపంలో.
ముగింపు